బీసీలకు తెదేపా కోటా 40 శాతం!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 12 Oct 2026 04:45 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ పరంగా బీసీలకు 40 శాతం వరకూ రిజర్వేషన్లు కల్పించేలా కసరత్తు చేస్తున్నామని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం చేసిన మంచి తెలిసేలా ‘జయహో బీసీ.. జనాభాలో సగం-కూటమి ఇచ్చింది బలం’ నినాదంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల కంటే ఈసారి ఎక్కువ శాతం ఓట్లు పడాలని, ఇదే నేతల పనితీరుకు కొలమానమని పేర్కొన్నారు. దీన్నిబట్టే నేతలకు రేటింగ్స్‌ ఇస్తామని తెలిపారు. స్థానిక ఎన్నికల సన్నద్ధతపై మంత్రులు, తెదేపా ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు, ఇన్‌ఛార్జులు, నియోజకవర్గ పరిశీలకులు, ముఖ్యనేతలతో ఆదివారం చంద్రబాబు వర్చువల్‌గా మాట్లాడారు. స్థానిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచారం, కూటమి పార్టీలతో సమన్వయం, ప్రత్యర్థి పార్టీల దుష్ప్రచారాల్ని తిప్పికొట్టడంపై వారికి దిశానిర్దేశం చేశారు.

‘మనం కూటమిలో ఉన్నాం. మిత్రధర్మం చాలా ముఖ్యం. కూటమి పార్టీల మధ్య పైస్థాయిలో ఎలాంటి సమన్వయం ఉందో.. క్షేత్రస్థాయిలోనూ అలాగే ఉండాలి. విభేదాలు, అపోహలకు తావివ్వొద్దు. నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో మూడు పార్టీలు కలిసి సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి. మిత్రపక్షాలతో కలిసి ఎన్నికల ప్రచారం చేయాలి. తటస్థుల్ని పార్టీ సానుభూతిపరులుగా మార్చాలి. ప్రత్యర్థి పార్టీల వారిని తటస్థుల్ని చేయాలి. రాబోయే 50 రోజులు ఎవరికీ మినహాయింపు లేదు. కూటమి అభ్యర్థుల గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ పని చేయాలి. గెలుపు, నిజాయతీ, సమర్థత, సోషల్‌ రీ-ఇంజినీరింగ్‌ వంటి అంశాల్ని బేరీజు వేసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తాం. గొడ్డలి పార్టీ మూతపడేలా ఈ ఎన్నికల్లో కూటమి గెలుపు ఉండాలి. ఎమ్మెల్యేలంతా కార్యకర్తల మనోభావాల్ని బట్టి నడుచుకోవాలి’ అని చంద్రబాబు పేర్కొన్నారు.

డ్రామాలాడేవారిని ఉపేక్షించం..

నిజాయతీగా పనిచేయకుండా.. డ్రామాలాడేవారిని ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరించారు. ‘స్థానిక ఎన్నికల్ని ఆషామాషీగా తీసుకోవద్దు. కూటమి బలం మరింత పెరగాలంటే ఈ ఎన్నికలు కీలకం. ఇప్పటివరకూ సంక్షేమం కోసం రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు చేశాం. చెత్త పన్ను రద్దు చేశాం. చక్కటి రోడ్లు వేశాం. ఇరిగేషన్‌కు పూర్వ వైభవం తెచ్చాం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పూర్తి చేశాం. పల్లె పండుగకు రూ.11 వేల కోట్లు, జేజేఎం పనులకు రూ.30 వేల కోట్లతో శంకుస్థాపన చేశాం. 5 లక్షల ఇళ్లల్లో సామూహిక గృహప్రవేశాలు చేపట్టాం. మరో 3 లక్షల ఇళ్లకు భూమిపూజ చేశాం. పుర, నగరపాలికల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.11,359 కోట్ల విలువైన పనులు చేపట్టాం. 16.48 లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించాం. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని చంద్రబాబుపేర్కొన్నారు. ఓటరు జాబితా సిద్ధం చేసుకోవాలని, వాటిని క్లస్టర్‌ల వరకూ అందేలా చూడాలన్నారు.

వైకాపాతో బీసీలకు అన్యాయం

‘బీసీలకు రిజర్వేషన్లు దక్కకూడదని, స్థానిక ఎన్నికలు జరగకూడదని గొడ్డలి పార్టీ న్యాయస్థానాలకు వెళ్లింది. రాష్ట్ర జనాభాలో 50 శాతం ఉన్న వెనుకబడిన వర్గాలకు అన్యాయం చేయాలని చూసింది. జగన్‌ అధికారంలో ఉన్నప్పుడు.. 34 శాతంగా ఉన్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి కుదించారు. వారికి న్యాయం చేయాలని ఏనాడూ భావించలేదు’ అని సీఎం దుయ్యబట్టారు. రాజీవ్‌రంజన్‌ మిశ్రా కమిటీ సిఫార్సులు ఆమోదించి, బీసీలకు వీలైనంత ఎక్కువ మేలు చేస్తున్నామని, ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు భంగం కలిగించకుండా బీసీలకు న్యాయం చేస్తున్నామని తెలిపారు. 

రౌడీలు, రప్పా రప్పా టీంలకు బుద్ధి చెప్పాలి

‘ఎన్నికలు దగ్గర పడుతుండటం, ఇమేజ్‌ పడిపోవడంతో గొడ్డలి పార్టీ ఫేక్‌ ప్రచారాల్ని ముమ్మరం చేస్తోంది. ఈ ఎన్నికలతో ఆ పార్టీకి, అభివృద్ధి నిరోధకులకు, రౌడీలు, రప్పా రప్పా టీంలకు బుద్ధి చెప్పాలి. అక్రమంగా ఆస్తులు సంపాదించిన జగన్‌ మనపై ఆరోపణలు చేస్తున్నారు. వివేకానందరెడ్డి హత్య కేసులో అంతిమ లబ్ధిదారయిన జగన్‌.. ఆ విషయంలో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారు. ఈడీని మనమే పంపామని ఆరోపణలు చేస్తున్నారు’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పవన్‌కల్యాణ్‌ నిర్ణయం అభినందనీయం: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ‘గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలు, పుణ్యక్షేత్రాలకు రహదారి సౌకర్యాలను మెరుగుపరచాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ నిర్ణయం అభినందనీయం.
  • కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి పచ్చజెండా కుప్పం, శ్రీకాకుళం విమానాశ్రయాల నిర్మాణానికి పౌరవిమానయాన మంత్రిత్వశాఖ(మోకా) ‘సైట్‌ క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌’ జారీచేసింది. వీటి డీపీఆర్‌ల తయారీకి అనుమతులిచ్చింది.
  • ఎన్నికల రిజర్వేషన్ల లోపాలపై ఆగ్రహం కృష్ణా జడ్పీ సీఈవో జె.అరుణను ప్రభుత్వం బదిలీ చేసింది. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచుల స్థానాలకు రిజర్వేషన్ల ఖరారులో జరిగిన కొన్ని తప్పిదాలను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
  • రాష్ట్రంలో 19 వరకు వర్షాలు ఈశాన్య రుతు పవనాల రాకతో ఈ నెల 19 వరకు రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బుధవారం ప్రకటించింది.
  • 1.96 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చంద్రబాబు ఘనత రాష్ట్రంలో 14 డీఎస్సీలు నిర్వహించి 1,96,619 లక్షలకు పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేసిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందని తెదేపా నేతలు పేర్కొన్నారు.
  • 30న సర్‌ ఓటర్ల తుది జాబితా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ గడువును రాష్ట్రంలో రెండు వారాలపాటు పొడిగిస్తూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) బుధవారం ఆదేశాలు జారీచేసింది.
  • నైపుణ్య పరీక్ష నిర్వహించేలాక్రీడా విధానానికి కీలక సవరణ ప్రభుత్వ ఉద్యోగాలు, వివిధ విద్యా సంస్థల్లో క్రీడా కోటా ప్రవేశాల భర్తీకి నైపుణ్య పరీక్ష (స్కిల్‌ టెస్టు)ను రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం క్రీడా విధానానికి (పాలసీ) కీలక సవరణ చేయనుంది.
  • మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
  • ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్‌ లాస్‌ (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌ 2021ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
  • కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
  • చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
  • జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
  • దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
  • 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
  • మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
  • జగన్‌ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
  • సంక్షిప్త వార్తలు (15) జగన్‌ పాలనలో రాష్ట్రానికి జరిగిన నష్టాన్ని ప్రజలు మర్చిపోలేదని మంత్రి కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
  • చీలిక పెదవి.. చింతను తగ్గించొచ్చు! ఆరోగ్యాన్నే కాకుండా, ఆత్మవిశ్వాసాన్నీ దెబ్బతీసే సమస్య గ్రహణ మొర్రి. దీనిపై అనేక మూఢనమ్మకాలూ ఉన్నాయి.
  • ద్విచక్ర వాహనమూ స్మార్ట్‌ అవుతోంది ఒకప్పుడు కార్లకే పరిమితమైన ఆధునిక ఫీచర్లు, సాంకేతికతలు ఇప్పుడు ద్విచక్ర వాహనాల్లోకీ వచ్చేశాయి. కార్లతో పోటీగా ధీటైన సౌకర్యాలతో మార్కెట్లోకి వస్తున్నాయి.
  • అక్కడ బంగారం దొరుకుతుంది.. సైలెంట్‌గా తెచ్చేద్దాం! యూట్యూబ్‌లో రీల్స్‌ చూసి యాభై ఏళ్ల వయసున్న ఓ వ్యక్తి బంగారం వేట కోసం వచ్చి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.