ఉక్కు వార్షిక ఉత్పత్తి 60.4 కోట్ల టన్నులకు!

- A
- A+
- A++

దిల్లీ: దేశ ముడి ఉక్కు వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని 2047 నాటికి 604 మిలియన్ టన్నుల (60.4 కోట్ల టన్నుల)కు పెంచడమే లక్ష్యంగా కొత్త ఉక్కు విధానాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. అంతర్జాతీయ విపణిలో పోటీ ఇవ్వడంతో పాటు దిగుమతుల పరంగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో నూతన నిబంధనలు ప్రతిపాదించింది.
దేశీయ గిరాకీ 505 మి.టన్నులకు
దేశంలో 2047 నాటికి ఫినిష్డ్ స్టీల్‌కు గిరాకీ 505 మి.టన్నులకు చేరనుందని అంచనా. అప్పటికి మనదేశం నుంచి ఉక్కు ఎగుమతులు 45 మి.టన్నులకు పెరగనున్నాయి. 2025-26లో 116 కిలోలుగా ఉన్న మనదేశ తలసరి ఉక్కు వినియోగం.. 2047 నాటికి మూడు రెట్ల వరకు పెరిగి 302 కిలోలకు చేరొచ్చని ఉక్కు విధానం అంచనా వేసింది. దేశంలో దాదాపు 2550 యూనిట్లతో, మొత్తం ముడి ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంలో 47% వాటా ఉన్న ‘సెకండరీ స్టీల్ రంగానికి’ ముడి పదార్థాల లభ్యత, సాంకేతికత ఆధునికీకరణ, నైపుణ్యాభివృద్ధి, భద్రతా పరంగా ప్రభుత్వం మద్దతు అందించనుంది.
స్వయంసమృద్ధి- దిగుమతుల తగ్గింపుపై దృష్టి:ఉక్కు తయారీ వ్యయాల్లో ముడిపదార్థాల వాటా 65-70% ఉంటుంది. మనదేశంలో ఇనుప ఖనిజం పుష్కలంగా ఉన్నా, అవసరమైన కోకింగ్ కోల్లో దాదాపు 92 శాతాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు, స్వదేశీ గనుల వృద్ధి, వాషరీల విస్తరణ, విదేశాల్లో గనుల కొనుగోలు, దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాలతో పాటు ఇంధనం కోసం బొగ్గు మిశ్రమాల నిర్వహణకు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను వినియోగించాలని ఉక్కు విధానం ప్రతిపాదించింది. మాంగనీస్, సున్నపురాయి వంటి కీలక ఖనిజాల స్థిరమైన లభ్యతపైనా ప్రభుత్వం దృష్టి సారించనుంది.
కర్బన ఉద్గారాలు తగ్గించేందుకు:మనదేశ మొత్తం కర్బన ఉద్గారాల్లో ఉక్కు రంగ వాటా 10-12%. ప్రతి టన్ను ముడి ఉక్కు తయారీకి అంతర్జాతీయంగా సగటున 1.92 టన్నుల కర్బన ఉద్గారాలు వెలువడుతుండగా, భారత్‌లో ఇది సగటున 2.54 టన్నులుగా ఉంది. పర్యావరణంపై ఇందువల్ల కలుగుతున్న ప్రతికూల ప్రభావాన్ని తగ్గించేందుకు దశలవారీగా చర్యలు తీసుకోనున్నారు. సామర్థ్యాలను పెంచడం, పునరుత్పాదక విద్యుత్, గ్రీన్ హైడ్రోజన్ వినియోగం, పాత ఉక్కు రీసైక్లింగ్ ద్వారా 2070 నాటికి ఈ రంగం సున్నా ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవాలని నిర్దేశించింది.
అధునాతన సాంకేతికతల వినియోగం:తయారీ ప్రక్రియల్లో ఏఐ, మెషీన్ లెర్నింగ్, డిజిటల్ డేటా ప్రమాణాలు, అటానమస్ ప్రొడక్షన్ వ్యవస్థలను వేగంగా అమలు చేయనున్నారు. విదేశాల నుంచి చౌక ఉత్పత్తులను అడ్డుకునేందుకు ఏఐ ఆధారిత దిగుమతుల పర్యవేక్షణా వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు, బీఐఎస్ ప్రమాణాలను మరింత కఠినతరం చేయనున్నారు.

గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఫెయిర్‌ఫాక్స్ చేతికి ఐడీబీఐ బ్యాంక్ ఐడీబీఐ బ్యాంక్‌లో 60.72% వాటాను కెనడాకు చెందిన ఫెయిర్‌ఫాక్స్ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ కొనుగోలు చేయనుంది. ఇందు కోసం 5.5 బిలియన్ డాలర్లు (రూ.53,000 కోట్లు) వెచ్చించనుంది.
- 21-23 తేదీల్లో జియో ఐపీఓ రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన డిజిటల్, టెలికాం విభాగం జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (జేపీఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ఈనెల 21న ప్రారంభమై, 23న ముగియనుంది.
- స్కైరూట్ విక్రమ్ రాకెట్లతో రెండు ప్రయోగాలు అమెరికాకు చెందిన రిఫ్లెక్ట్ ఆర్బిటల్.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్తో ‘రెండు ప్రత్యేక రాకెట్ ప్రయోగాల కోసం’ ఒప్పందం కుదుర్చుకుంది.
- 2029 ఏప్రిల్ నుంచి బీఎస్-7 కార్లు, ఎస్‌యూవీలు మన దేశంలో కొత్త కార్లు, స్పోర్ట్స్ వినియోగ వాహనాల (ఎస్యూవీ) కోసం అత్యంత కఠినమైన బీఎస్-7 (భారత్ స్టేజ్-7) ఉద్గార ప్రమాణాలను 2029 ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాలని ప్రతిపాదిస్తూ, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది.
- కలవరపెట్టిన ద్రవ్యోల్బణం సెప్టెంబరులో రిటెయిల్, టోకు ద్రవ్యోల్బణం పెరగడంతో, బుధవారం దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. ముడిచమురు అధిక ధరలూ మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి 19 పైసలు బలపడి 95.17 వద్ద ముగిసింది.
- మరింత ముదిరిన టాటా ట్రస్ట్స్ వివాదం టాటా గ్రూప్‌లో రగులుతున్న అంతర్గత విభేదాలు, న్యాయస్థానాలకు చేరుతున్నాయి. తాజాగా టాటా ట్రస్ట్స్ ట్రస్టీలు వేణు శ్రీనివాసన్, విజయ్ సింగ్ లేవనెత్తిన ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో బాంబే హైకోర్టుతో పాటు ముంబయి సిటీ సివిల్ కోర్టులో టాటా ట్రస్ట్స్ ఛైర్మన్ నోయల్ టాటా, ఆయన కుమారుడు నెవిల్లే టాటా కేవియట్ పిటిషన్లు దాఖలు చేశారు.
- మస్క్ స్టార్‌లింక్ కంటే వన్‌వెబ్ రేసులో ముందుంది దేశీయంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవల కోసం, అమెరికా కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కంటే తమ యూటెల్‌శాట్ వన్‌వెబ్ సంస్థే రేసులో ముందుందని భారతీ ఎయిర్టెల్ ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ బుధవారం బ్లూమ్‌బెర్గ్ న్యూ ఎకానమీ ఫోరమ్ 2026లో వెల్లడించారు.
- టోకు ద్రవ్యోల్బణం 11.39 శాతానికి దేశీయంగా టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబరులో 11.39 శాతానికి చేరింది. ఆహారం, తయారీ వస్తువులు, ఇంధనం, విద్యుత్ ధరలు పెరగడం ఇందుకు కారణం.
- మేలిమి వెండి సులభ దిగుమతికి వీలు కొన్ని రకాల వెండి వస్తువుల దిగుమతికి అనుమతులను వేగంగా జారీ చేసేందుకు, స్వీయ ప్రకటన ఆధారిత సరళీకృత విధానాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది.
- పొగాకు రంగంలో ఎఫ్‌డీఐ నిబంధనలు మరింత కఠినతరం! పొగాకు రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను మరింత కఠినం చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రంగంలో ఫ్రాంఛైజీలు, ట్రేడ్‌మార్క్‌లు, బ్రాండు పేర్లు, నిర్వహణ ఒప్పందాల కోసం లైసెన్సింగ్‌లో ఎఫ్‌డీఐని నిషేధించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- ఫారెక్స్ విపణిలో స్థిరత్వం తీసుకొస్తాం! ఫారెక్స్ (విదేశీ మారకపు ద్రవ్య) విపణిలో స్థిరత్వం తీసుకురావడానికి, రూపాయి విలువపై ఊహాజనిత కార్యకలాపాలు నిరోధించడానికి చర్యలు తీసుకున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ సంజయ్ మల్హోత్రా బుధవారం వెల్లడించారు.
- ఎస్ఎంఈ ఐపీఓలకు కొత్త నిబంధనలు! చిన్న, మధ్య స్థాయి సంస్థల (ఎస్ఎంఈల) ఐపీఓలకు దరఖాస్తు చేసుకునే మదుపర్ల నిధులకు మరింత రక్షణ కల్పించేందుకు, నియంత్రణ విధానాలను బలోపేతం చేయడానికి మార్కెట్ల నియంత్రణాధికార సంస్థ సెబీ బుధవారం సమగ్ర మార్పులను ప్రతిపాదించింది.
- కెనరా బ్యాంకు లాభం రూ.5,175 కోట్లు ప్రభుత్వ రంగ కెనరా బ్యాంకు సెప్టెంబరు త్రైమాసికంలో రూ.5,175 కోట్ల నికర లాభం నమోదు చేసింది. 2025-26 ఇదే కాల లాభం రూ.4,774 కోట్లతో పోలిస్తే ఇది 8.4% అధికం. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.38,598 కోట్ల నుంచి రూ.40,931 కోట్లకు పెరిగింది.
- సంక్షిప్త వార్తలు(4) రెడీ టూ డ్రింక్ డెయిరీ విభాగంలోకి రిలయన్స్ కన్జూమర్ ప్రోడక్ట్స్ అడుగుపెట్టింది. జాయ్‌ల్యాండ్ బ్రాండ్ పేరిట ప్యాకేజ్డ్ ఫ్లేవర్డ్ మిల్క్‌ను విడుదల చేసింది. స్ట్రాబెర్రీ, వెనిలా ఫ్లేవర్లతో తమిళనాడు మార్కెట్లో తొలుత విడుదల చేయగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.
- చైనాతో వాణిజ్య సంబంధాల పునరుద్ధరణకు యత్నం చైనాతో వాణిజ్య సంబంధాలను పునరుద్ధరించడానికి మనదేశం కృషి చేస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. సహేతుక ఒప్పందం లభించే పక్షంలో, ఏ దేశంతో నైనా ఉమ్మడి వ్యాపార భాగస్వామ్యాలకు భారత్ సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు.
- ఏఐని నెమ్మదింపజేయలేం కృత్రిమ మేధ (ఏఐ) వేగాన్ని నెమ్మదింపజేయడానికి చేపట్టే ఏ చర్య అయినా ఫలించక పోవచ్చని సిస్కో ఛైర్మన్, సీఈఓ చుక్ రాబిన్స్ అభిప్రాయపడ్డారు. అందుకు బదులుగా భద్రత, రక్షణ కవచాలను బలోపేతం చేసే సాంకేతికతపై దృష్టి పెట్టడం మంచిదని సూచించారు.
- రూ.2,000 మించిన యూపీఐ వాణిజ్య లావాదేవీలపై ఎండీఆర్ వాయిదా రూ.2,000కు మించిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వాణిజ్య లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపు నిర్ణయాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) వాయిదా వేసింది.
- మూలధన లాభాల పన్నుపై చర్చకు సిద్ధం స్వల్ప-దీర్ఘకాల మూలధన లాభాలపై విధిస్తున్న పన్ను తొలగింపునకు సంబంధించి, రాబోయే బడ్జెట్ సంప్రదింపుల్లో సలహాలు వినేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
- బలంగా పుంజుకున్న సూచీలు ఐటీ షేర్లు పరుగులు తీయడంతో, సోమవారం చవిచూసిన భారీ నష్టాల నుంచి సూచీలు మంగళవారం బలంగా పుంజుకున్నాయి. ఐటీ, ఆర్థిక, ఎఫ్ఎమ్సీజీ షేర్లు కొనుగోళ్లతో కళకళలాడాయి. రూపాయి కోలుకోవడం, మూలధన లాభాల పన్నుపై సూచనలు పరిశీలిస్తామంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలు సానుకూల ప్రభావం చూపాయి.
- చిప్ సరఫరాలో కీలకం అవుతాం మనదేశ భవిష్యత్తుకు సెమీకండక్టర్లు కీలకం కానున్నాయని.. దేశంలో ప్రతిభావంతుల లభ్యత, భారీ దేశీయ మార్కెట్, అంతర్జాతీయ భాగస్వామ్యాల రీత్యా ప్రపంచ సరఫరా వ్యవస్థలో ముఖ్య కేంద్రంగా మన దేశం అవతరిస్తుందని టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తెలిపారు.