ప్రపంచ డ్రోన్‌హబ్‌గా కర్నూలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 19 Aug 2026 03:59 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, కర్నూలు: కర్నూలు డ్రోన్‌సిటీ ప్రపంచానికే డ్రోన్‌ హబ్‌గా మారుతుందని పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు మండలంలో 600 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న డ్రోన్‌సిటీలో పెట్టుబడులు పెట్టడానికి చాలా సంస్థలు ముందుకొస్తున్నాయని, రాబోయే సంవత్సరాల్లో రూ.5 వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని అన్నారు. డ్రోన్ల పరిశోధన, ఆవిష్కరణ, తయారీ, పరీక్షల నిర్వహణ, ధ్రువీకరణ తదితర అన్ని విభాగాలు ఇక్కడే అందుబాటులో ఉంటాయన్నారు. డ్రోన్‌ సిటీలో మంగళవారం వివిధ డ్రోన్ల కంపెనీల సీఈవోలతో నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ఇక్కడ నిర్మిస్తున్న డ్రోన్‌ సిటీ దేశంలోనే మొట్టమొదటిదన్నారు. సమావేశంలో వివిధ సంస్థల సీఈవోలు చేసిన సూచనల అధ్యయనానికి ఒక కమిటీ వేస్తామని చెప్పారు. డ్రోన్‌ సంస్థలకు వేగవంతమైన సేవలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. 

‘రెండేళ్ల కిందట అమరావతిలో డ్రోన్‌ సమిట్‌ నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పటికప్పుడు డ్రోన్‌సిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగానే కర్నూలులో డ్రోన్‌ సిటీ ఏర్పాటైంది. రాళ్లతో నిండిన ఈ ప్రాంతమే రేపు డ్రోన్ల   తయారీ సంస్థలకు నిలయంగా మారుతుంది. పౌర విమానయాన మంత్రిత్వశాఖ, క్యూసీఐ, డీజీసీఏ సంస్థల ప్రతినిధులందరూ ఇక్కడే ఉండి ఆయా సంస్థలకు అవసరమైన సేవలు అందిస్తారు. టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటుచేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి డ్రోన్‌ సిటీ అభివృద్ధిని సమీక్షిస్తాం. దేశంలో ఆరు లక్షలకు పైగా గ్రామాలు ఉన్నాయని, భవిష్యత్తులో ఊరికొక డ్రోన్‌ అయినా అవసరం అవుతుంది. ప్రస్తుతం దేశంలో 40 వేల డ్రోన్లు మాత్రమే ఉన్నాయి’ అని మంత్రి చెప్పారు. 

  • రూ.500 కోట్ల వ్యయంతో డ్రోన్ల రంగాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌ ఎండీ గీతాంజలిశర్మ చెప్పారు. కర్నూలు డ్రోన్‌ సిటీని ప్రస్తుతం 120 ఎకరాల్లో అభివృద్ధి చేశామని, రెండో దశలో 480 ఎకరాల్లో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఏపీఐఐసీ ఈడీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి తెలిపారు. 
  • డ్రోన్‌ల తయారీ సంస్థల ప్రతినిధులు ప్రదర్శించిన డ్రోన్లను రామ్మోహన్‌నాయుడు పరిశీలించారు. సమావేశంలో  సీఈవోలు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం, కర్నూలు ట్రిపుల్‌ఐటీ డీఎం, హైదరాబాద్‌కు చెందిన తిహాన్, కర్నూలులోని పుల్లారెడ్డి ఇంజినీరింగ్‌ కళాశాలల ప్రతినిధులు ఏపీ డ్రోన్స్‌ కార్పొరేషన్‌తో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తొలుత ఓర్వకల్లు విమానాశ్రయంలో జేఎస్‌డబ్ల్యూ డిఫెన్స్‌ సంస్థ ఏర్పాటు చేసిన అన్‌మ్యాన్డ్‌ ఏరియల్‌ వెహికల్‌ను కేంద్రమంత్రి పరిశీలించి ఆ సంస్థ ప్రతినిధులతో మాట్లాడారు. కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు. దాదాపు 150 డ్రోన్‌ సంస్థల సీఈవోలు, ప్రతినిధులు హాజరయ్యారు.

బెంగళూరులోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) విద్యార్థులు, ఆచార్యులు సంయుక్తంగా ‘యుబిక్స్‌ కన్సోల్‌’ పేరిట ఆవిష్కరించిన డ్రోన్‌ వ్యవస్థ ఇది. మంగళవారం కర్నూలు డ్రోన్‌సిటీలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశం సందర్భంగా దీన్ని ప్రదర్శించారు. దీంతో ఒకేసారి 12 డ్రోన్లను వినియోగించుకోవచ్చు. వీటిని వినియోగించడానికి మనుషులు అక్కర్లేదు. కన్సోల్‌లో ఇచ్చిన ప్రోగ్రామ్‌కు అనుగుణంగా ఆయా డ్రోన్లు వాటంతటవే నిర్ణీత సమయంపాటు పనిచేస్తాయి. ఒకదానికొకటి ఢీకొట్టడం ఉండదు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వయసుకు తగినట్లు ఎదగాలి కన్నా.. ఎదగాలి! రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో వయసుకు తగ్గ అభివృద్ధిలో తీవ్రమైన లోపం ఉన్న వారు 87,448  (4.83%) మంది ఉన్నట్లు బయటపడింది.
  • రెండేళ్లుగా కాలయాపన.. పుష్కరాల వేళ హైరానా గోదావరి పుష్కరాలకు మరికొన్ని నెలలే సమయం ఉండటంతో ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది.
  • మారిన పళ్లెం.. నేర్పుతోంది సమానత్వ పాఠం అందరూ సమానమే.. అనే భావన పిల్లల్లో చిన్నప్పటి నుంచే కలగాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
  • విజయవాడలో 72 అడుగుల మహాగణపతి విజయవాడకు చెందిన డూండీ గణేశ్‌ సేవా సమితి ఆధ్వర్యంలో   లేబరుకాలనీ మైదానంలో 72 అడుగుల పర్యావరణహిత ‘శ్రీపంచముఖ వరసిద్ధి మహాగణపతి’ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 14 నుంచి 24వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నారు.
  • వేంకటాద్రికి బ్రహ్మోత్సవ శోభ! తిరుమల శ్రీవేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం అంకురార్పణ క్రతువును తితిదే నిర్వహించనుంది.
  • ఎల్‌నినో తీవ్రం.. పైర్లలో పోతున్న జీవం ఎల్‌నినో ప్రభావం రోజు రోజుకు తీవ్రమవుతోంది. అల్పపీడనంతో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తున్నా.. రాష్ట్రంలోని అత్యధిక ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులే ఉన్నాయి.
  • సామాన్య భక్తుడే వీఐపీ ఈ నెల 15 నుంచి 23 వరకు జరగనున్న శ్రీ వేంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలకు తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. సాధారణ భక్తులకే ప్రాధాన్యమివ్వనుంది. బ్రహ్మోత్సవాలు జరిగే రోజుల్లో అన్ని రకాల ప్రివిలేజ్డ్‌ దర్శనాలతోపాటు శ్రీవాణి టికెట్లను రద్దుచేసింది.
  • చిరు వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు! రోడ్లపై తోపుడు బళ్లు, దుకాణాలు పెట్టుకుని పళ్లు, కూరగాయలు తదితర వ్యాపారాలు చేసే చిరు వ్యాపారులకూ బ్యాంకులు క్రెడిట్‌ కార్డులు జారీ చేయనున్నాయి.
  • అన్ని వర్గాల్ని ఒకచోట చేర్చే గొప్ప సామాజిక పండుగ వినాయక చవితి ఊళ్లు, కాలనీలు, పట్టణాలు, నగరాలనే తేడా లేకుండా వాడవాడలా అన్నివర్గాలూ ఎంతో ఘనంగా చేసుకొనే పండుగ వినాయక చవితి అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రజలకు వినాయకచవితి శుభాకాంక్షలు తెలిపారు.
  • ఎస్కేయూ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో 1988-91 మధ్య ఎల్‌ఎల్‌బీ (న్యాయవిద్య) పూర్తి చేసిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం అనంతపురంలో జరిగింది.
  • తిరుమలకు ప్రైవేట్‌ వాహనాలపై ఆంక్షల్లేవు తిరుమలకు వచ్చే ప్రైవేట్‌ వాహనాలపై ఆంక్షలు విధిస్తున్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని తితిదే ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
  • మీ కష్టపడేతత్వమే విద్యావ్యవస్థ భవిష్యత్తు టెట్‌-2026లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఇన్‌ సర్వీస్‌ టీచర్లకు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఎక్స్‌ వేదికగా ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు.
  • చీకటి గోపి మృతిపై సిట్‌ వేయాలి గుంటూరు జిల్లా తాడికొండ మండలం పొన్నెకల్లు గ్రామానికి చెందిన దళిత యువకుడు చీకటి గోపి పోలీసుల అక్రమ నిర్బంధం, చిత్రహింసల కారణంగానే మృతి చెందాడని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు.
  • క్యూలైన్లలో వైకుంఠ వైభవం! తిరుమల శ్రీవారి దర్శనానికి గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల నిరీక్షణ సమయాన్ని వృథా పోనివ్వకుండా, వారిలో ఆధ్యాత్మిక చింతనను, ప్రశాంతతను కలిగించేందుకు తితిదే వినూత్న అడుగువేసింది.
  • డీఎస్సీపై జగన్‌ తీరు.. దిగజారుడు రాజకీయం మెగా డీఎస్సీలో 16 వేల ఉపాధ్యాయ పోస్టుల్ని వంద శాతం పారదర్శకతతో భర్తీ చేసినట్టు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. డీఎస్సీపై వైకాపా అధినేత జగన్, ఆ పార్టీ నాయకుల విమర్శలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని దుయ్యబట్టారు.
  • హెల్త్‌కార్డులున్నా అందని నగదు రహిత వైద్యం హెల్త్‌కార్డుల పేరుతో భరోసా ఇచ్చి, వైద్యం విషయంలో చేతులు ఎత్తేయడం సరికాదని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎం.రఘునాథరెడ్డి, లంకపల్లి సాయిశ్రీనివాస్‌ అన్నారు.
  • పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌లో.. మహాత్మునికి అయ్యన్నపాత్రుడి నివాళి దక్షిణాఫ్రికాలోని చారిత్రక పీటర్‌ మారిట్జ్‌బర్గ్‌ రైల్వేస్టేషన్‌ను శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు సందర్శించారు. జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు.
  • అంటువ్యాధుల కేసుల రిపోర్టింగ్‌ వ్యవస్థను పటిష్ఠం చేయాలి వర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని అధికారుల్ని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఆదేశించారు.
  • 150 వైద్య శిబిరాలు.. 22 వేల మందికి సేవలు ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపాలిటీ ఏర్పడి ఈ నెల 30వ తేదీకి 150 సంవత్సరాలు పూర్తికానుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరంతోపాటు కొత్తపట్నం మండలంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం 150 ఉచిత మెగా వైద్య శిబిరాలు నిర్వహించారు.
  • బ్రిక్స్‌ సదస్సు.. దేశానికి గర్వకారణం బ్రిక్స్‌ శిఖరాగ్ర సదస్సు విజయవంతంగా ముగియడం దేశానికి గర్వకారణమని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ఈ ఘనత సాధ్యమైందని ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు.