భారత ఎన్నికల వ్యవస్థకు ట్రంప్ కితాబు

- A
- A+
- A++
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలకు గాను గట్టి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..భారత్‌లోని ఓటరు గుర్తింపు కార్డుల విధానాన్ని ప్రశంసించారు. తమ దేశంలోనూ దీనిని అమలుచేయాల్సిన అవసరం ఉందని ‘ట్రూత్ సోషల్’ ద్వారా వెల్లడించారు. భారత్‌లో 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, వీరిలో పోస్టల్ బ్యాలెట్‌ను వినియోగించుకున్న వారు మొత్తం ఓటర్లలో ఒక్క శాతం కన్నా తక్కువేనని ట్రంప్ పేర్కొన్నారు. భారత ఓటర్లు అందరికీ ఫొటో గుర్తింపు కార్డులున్నాయని తెలిపారు. ఇటీవల తమ దేశ పర్యటనకు వచ్చిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్..‘ఓటరు గుర్తింపు కార్డుల్లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని మా అధికారుల వద్ద ఆశ్చర్యపోయారు’ అని ట్రంప్ వెల్లడించారు. అమెరికా ఓటర్లు పౌరసత్వాన్ని ఆధారంగా చూపడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలన్న తన వాదనను సమర్థించుకుంటూ ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు.
మన ఎన్నికల యంత్రాంగానికి అంతర్జాతీయ గుర్తింపు
దిల్లీ: భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, బలానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది. భారతదేశ ఓటరు గుర్తింపు కార్డు తరహాలో తమ దేశంలోనూ ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణను చేయాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ శాఖ స్పందించింది. మరోవైపు.. దేశంలో దాదాపు 100 కోట్ల మందికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పేర్కొంది. ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి ఓటర్లు తమ ఫొటో గుర్తింపు కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది.
భారత ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. ‘‘డియర్ డొనాల్డ్ ట్రంప్.. దయచేసి మా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అమెరికా తీసుకెళ్లండి. మా ఈవీఎంలను కూడా మరో విమానంలో పంపిస్తాం. మీరు మాకు చేసిన అవమానాలు, వేధింపులకు బదులుగా మేము చేయగలిగిన కనీస సహాయం ఇది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మహా శక్తిగా కాదు.. విశ్వ గురువుగా సేవ చేశాం ప్రపంచానికి భారత్ ‘విశ్వ గురువు’గా సేవ చేసిందే తప్ప, ‘మహా శక్తి’గా కాదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) అధినేత మోహన్ భాగవత్ అన్నారు.
- యుద్ధవిరమణ వైపు కదలండి రష్యా-ఉక్రెయిన్ మధ్య సాగుతున్న అంతులేని పోరుకు తెరపడాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శాంతియుత పరిష్కారమే యావత్తు మానవాళి ప్రాధాన్యమని చెప్పారు.
- జీవిత భాగస్వామికిచ్చే హెచ్4 వీసాలు ఇక ఉండవా? అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై దృష్టిపెట్టిన ట్రంప్ సర్కారు.. హెచ్-4 వీసాలకు సంబంధించి ఓ గట్టి షాక్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- పాక్‌లో వందేళ్ల పురాతన ఆలయం కూల్చివేత పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో దాదాపు 100 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కూల్చివేశారు.
- మంచు, రాళ్ల విస్ఫోటమే! మంచు, రాళ్ల విస్ఫోటమే నేపాల్‌లో వరద పోటెత్తడానికి కారణమని, భూకంపంగానీ, హిమనీనదం కరిగి వరద రావడంగానీ కారణం కాదని తాజా అధ్యయనం తేల్చింది.
- గుర్తించలేక.. ఖననం మృతదేహాలు బయటపడుతున్నాయ్.. కట్టెలు కాలుతున్నాయ్.. సామూహికంగా సమాధి అవుతున్నాయ్.. అవి ఎవరివో.. ఎందుకు నేపాల్ వచ్చారో.. లేదంటే స్థానికంగా ఉంటున్న వారివైనా.. గుర్తించడానికి బంధువులెవరూ మిగిలి లేరో.. కానీ నేపాల్‌లో అత్యంత హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.
English Translation
Trump book for Indian electoral system

- A
- A+
- A++
Washington: The president of the country, Donald Trump, who says that there is a need to bring strong laws for major reforms in the electoral system of the United States, praised the system of voter identification cards in India. It has been revealed through 'Truth Social' that there is a need to implement this in their country as well. Trump claimed that 64.6 crore voters participated in the 2024 general elections in India, of which less than one percent of the total voters used postal ballots. He said that all Indian voters have photo identity cards. The Chief Commissioner of Election Commission of India, Gyanesh Kumar, who recently visited his country, said, "We were surprised at how our officials are able to conduct elections in the United States without voter identification cards." Trump mentioned this while justifying his argument to introduce a law mandating American voters to show citizenship.
International recognition for our electoral system
Delhi: The Ministry of External Affairs has revealed that the credibility and strength of the Indian electoral system has received international recognition. The department responded in the wake of US President Trump's comment that citizenship verification should be done for voters in their country on the lines of India's voter identity card. On the other hand.. The Central Election Commission (EC) has said that nearly 100 crore voters have been issued voter ID cards in the country. Voters can download their photo identity cards from the Election Commission's website.
The Congress party reacted sarcastically to US President Trump's comments praising India's election system. Dear Donald Trump, please take our CEC Gyanesh Kumar to America. We will also send our EVMs in another flight. This is the least help we can do instead of the insults and harassment you have done to us," Congress spokesperson Pawan Kheda posted on X.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. Correspondence has no place in this matter.
More
- Not as a superpower.. We served as a universal teacher Rashtriya Swayamsevak Sangh (RSS) chief Mohan Bhagwat said that India has served the world as a 'universal teacher' and not as a 'great power'.
- Move towards cessation of hostilities. Indian Prime Minister Narendra Modi wished to end the endless war between Russia and Ukraine. He said that a peaceful solution is the priority of all humanity.
- Should there be more H4 visas for spouses? The Trump administration, which is focused on tightening the US visa regulations, is likely to give a strong shock regarding H-4 visas.
- Demolition of a hundred year old temple in Pakistan A nearly 100-year-old temple was demolished in Pakistan's Punjab province.
- Snow and rocks erupted! A recent study has concluded that the eruption of snow and rocks is the cause of the flood in Nepal, and neither the earthquake nor the melting of the glacier is the cause of the flood. Dead bodies are being exhumed.. Firewood is being burnt.. Mass graves.. Who are they.. Why did they come to Nepal.. Or are they local people.. There are no relatives left to identify.. But the most heartbreaking scenes are happening in Nepal.