భారత ఎన్నికల వ్యవస్థకు ట్రంప్‌ కితాబు

Eenadu icon
By International News Desk Published : 19 Aug 2026 06:11 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

వాషింగ్టన్‌: అమెరికా ఎన్నికల వ్యవస్థలో భారీ సంస్కరణలకు గాను గట్టి చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని చెబుతున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..భారత్‌లోని ఓటరు గుర్తింపు కార్డుల విధానాన్ని ప్రశంసించారు. తమ దేశంలోనూ దీనిని అమలుచేయాల్సిన అవసరం ఉందని ‘ట్రూత్‌ సోషల్‌’ ద్వారా వెల్లడించారు. భారత్‌లో 2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో 64.6 కోట్ల మంది ఓటర్లు పాల్గొన్నారని, వీరిలో పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకున్న వారు మొత్తం ఓటర్లలో ఒక్క శాతం కన్నా తక్కువేనని ట్రంప్‌ పేర్కొన్నారు. భారత ఓటర్లు అందరికీ ఫొటో గుర్తింపు కార్డులున్నాయని తెలిపారు. ఇటీవల తమ దేశ పర్యటనకు వచ్చిన భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌..‘ఓటరు గుర్తింపు కార్డుల్లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహించగలుగుతున్నారని మా అధికారుల వద్ద ఆశ్చర్యపోయారు’ అని ట్రంప్‌ వెల్లడించారు. అమెరికా ఓటర్లు   పౌరసత్వాన్ని ఆధారంగా చూపడాన్ని తప్పనిసరి చేస్తూ చట్టం తీసుకురావాలన్న తన వాదనను సమర్థించుకుంటూ ట్రంప్‌ ఈ విషయాన్ని ప్రస్తావించారు. 

మన ఎన్నికల యంత్రాంగానికి అంతర్జాతీయ గుర్తింపు

దిల్లీ: భారత ఎన్నికల యంత్రాంగం విశ్వసనీయత, బలానికి అంతర్జాతీయ గుర్తింపు లభించిందని విదేశీ వ్యవహారాలశాఖ వెల్లడించింది. భారతదేశ ఓటరు గుర్తింపు కార్డు తరహాలో తమ దేశంలోనూ ఓటర్లకు పౌరసత్వ ధ్రువీకరణను చేయాల్సి ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఆ శాఖ స్పందించింది. మరోవైపు.. దేశంలో దాదాపు 100 కోట్ల మందికి ఓటరు గుర్తింపు కార్డులు జారీ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) పేర్కొంది.  ఎన్నికల సంఘం వెబ్‌సైట్‌ నుంచి ఓటర్లు తమ ఫొటో గుర్తింపు కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని తెలిపింది.

భారత ఎన్నికల వ్యవస్థను ప్రశంసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. ‘‘డియర్‌ డొనాల్డ్‌ ట్రంప్‌.. దయచేసి మా సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను అమెరికా తీసుకెళ్లండి. మా ఈవీఎంలను కూడా  మరో విమానంలో పంపిస్తాం. మీరు మాకు చేసిన అవమానాలు, వేధింపులకు బదులుగా మేము చేయగలిగిన కనీస సహాయం ఇది’’ అని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి పవన్‌ ఖేడా ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మహా శక్తిగా కాదు.. విశ్వ గురువుగా సేవ చేశాం ప్రపంచానికి భారత్‌ ‘విశ్వ గురువు’గా సేవ చేసిందే తప్ప, ‘మహా శక్తి’గా కాదని రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌) అధినేత మోహన్‌ భాగవత్‌ అన్నారు.
  • యుద్ధవిరమణ వైపు కదలండి రష్యా-ఉక్రెయిన్‌ మధ్య సాగుతున్న అంతులేని పోరుకు తెరపడాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఆకాంక్షించారు. శాంతియుత పరిష్కారమే యావత్తు మానవాళి ప్రాధాన్యమని చెప్పారు.
  • జీవిత భాగస్వామికిచ్చే హెచ్‌4 వీసాలు ఇక ఉండవా? అమెరికా వీసా నిబంధనలను కఠినతరం చేయడంపై దృష్టిపెట్టిన ట్రంప్‌ సర్కారు.. హెచ్‌-4 వీసాలకు సంబంధించి ఓ గట్టి షాక్‌ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
  • పాక్‌లో వందేళ్ల పురాతన ఆలయం కూల్చివేత పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌లో దాదాపు 100 సంవత్సరాల పురాతన ఆలయాన్ని కూల్చివేశారు.
  • మంచు, రాళ్ల విస్ఫోటమే! మంచు, రాళ్ల విస్ఫోటమే నేపాల్‌లో వరద పోటెత్తడానికి కారణమని, భూకంపంగానీ, హిమనీనదం కరిగి వరద రావడంగానీ కారణం కాదని తాజా అధ్యయనం తేల్చింది.
  • గుర్తించలేక.. ఖననం మృతదేహాలు బయటపడుతున్నాయ్‌.. కట్టెలు కాలుతున్నాయ్‌.. సామూహికంగా సమాధి అవుతున్నాయ్‌.. అవి ఎవరివో.. ఎందుకు నేపాల్‌ వచ్చారో.. లేదంటే స్థానికంగా ఉంటున్న వారివైనా.. గుర్తించడానికి బంధువులెవరూ మిగిలి లేరో.. కానీ నేపాల్‌లో అత్యంత హృదయవిదారక దృశ్యాలు కలచివేస్తున్నాయి.