కథల్ని అలా చెప్పడమే నా శైలి!

- A
- A+
- A++

‘‘శబరిమలకు వెళ్లి ఇరుముడిని ఎలాగైతే విప్పుతామో, అలా ఈ సినిమా ముడులన్నీ థియేటర్లలోనే విప్పబోతున్నాం. అవి ప్రేక్షకులకు ఓ థ్రిల్లింగ్ అనుభూతిని పంచుతాయి’’ అన్నారు శివ నిర్వాణ. ఆయన దర్శకత్వంలో... రవితేజ కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘ఇరుముడి’. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించారు. ఈ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.
మూడు ముడులతో కూడిన కథ ‘ఇరుముడి’ అన్నారు. ఇలా ఓ కథలో మూడు పార్శ్వాల్ని మేళవించాలన్న ఆలోచన ఎలా వచ్చింది?
మొదట గ్రామీణ ప్రాంతానికి చెందిన మట్టి కథ చెప్పాలన్నదే ఆలోచన. అప్పుడు ఒక తాగుబోతు తండ్రి నేపథ్యంలో ఆ కథ చెప్పాలనుకున్నా. అయితే మా ఇంటి పక్కనే 500 మీటర్ల దూరంలో అయ్యప్పస్వామి గుడి ఉంటుంది. కార్తీక మాసమంతా అయ్యప్ప భజనలు, గీతాలు మా జీవితాలకి ఓ నేపథ్య సంగీతంలా ఉంటాయి. మా కథలోని తాగుబోతు నాన్న అయ్యప్ప మాల వేస్తే?గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మాల వేసుకున్నప్పుడు వెంటాడితే ఆ సంఘర్షణ ఎలా ఉంటుందన్న ప్రశ్నల నుంచి సిద్ధమైన ముడులే ఇవన్నీ. పలు పార్శ్వాలున్న కథ అని ప్రేక్షకుల్ని ముందే సిద్ధం చేశాం. ట్రైలర్‌తోనూ అదే స్పష్టం చేశాం. తండ్రీకూతుళ్ల బంధం, నేర నేపథ్యం, అయ్యప్ప స్వామి మాల ధారణ, భక్తి... ఇలా అంశాల మేళవింపే ప్రేక్షకుల్లో మరింతగా ఉత్సుకతని రేకెత్తించాయి.
రవితేజ కోసమే ఈ కథని సిద్ధం చేశారా?
ముందు నేను కథనే సిద్ధం చేస్తాను. ఆ తర్వాతే హీరోల గురించి ఆలోచిస్తా. కథంతా పూర్తయ్యాక... ఎవరూ పెద్దగా స్పృశించని ఈ నేపథ్యానికి ఎవరైతే బాగుంటుందని ఆలోచించినప్పుడు రవితేజ పేరు తెరపైకొచ్చింది. ఇలాంటి కథని స్టార్ ఇమేజ్ ఉన్న ఓ నటుడు చేస్తే ఎక్కువమందికి చేరువవుతుందని మా నమ్మకం. రవన్నకు మాస్, మహిళలు, చిన్నారులు... ఇలా అందరూ అభిమానులే. ఆయనతో ఈ సినిమా చేస్తే ఇంటింటికీ, మూలమూలలకీ చేరువవుతుందని బలంగా నమ్మాం.
ఇందులో రవితేజ పాత్ర ఎలా ఉంటుంది? ఈ ప్రయాణంలో ఆయనతో మీకు ఏర్పడిన అనుబంధం, ఎదురైన అనుభవాలు ఎలాంటివి?
త్రినాథ్ అనే ఒక అత్యంత సామాన్యుడిగా కనిపిస్తారు రవితేజ. ఆయనలో భయంకరమైన నేటివిటీ కనిపిస్తుంటుంది. ఒక బాబాయ్, ఒక మామయ్యని గుర్తు చేసుకున్నట్టుగా ఉంటుంది ఆయన్ని చూస్తే! ఆ నేటివిటీనే ఈ సినిమాకి ప్రాణం. ఆయనకి కూతురుగా నటించిన నక్షత్ర కూడా మన ఇంట్లో పాపలాగే కనిపిస్తుంది. ఇన్‌స్టాలో వెతుకుతుంటే ఈ బంగారు తల్లి కనిపించింది. చాలా బాగా నటించింది. నేటివిటీలో భాగంగానే కథానాయిక ప్రియ భవానీ శంకర్, గురుస్వామి పాత్రలో సాయికుమార్ ఎంపిక కూడా! ఇక రవితేజతో అనుభవం అంటే... ఆయన ఒక్కసారి కథ విని, దర్శకుణ్ని నమ్మాక ఏమాత్రం ఆలోచించరు. ఎవ్వరిపైనా ఒత్తిడి పెట్టరు, ఒత్తిడికి గురికారు. జీవితంలో సినిమా ఒక భాగం మాత్రమే అని నమ్మే వ్యక్తి.
సీలేరు నేపథ్యాన్ని ఎంచుకున్నారు. చిత్రీకరణ పరంగా ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?
‘రంగస్థలం’ సినిమాతో దర్శకుడు సుకుమార్ మారేడుమిల్లి వరకూ వెళ్లారు. మేం మారేడుమిల్లి దాటి ఇంకో రెండున్నర గంటలు ప్రయాణం చేసి, ఒడిశా సరిహద్దులకు వెళ్లాం. అక్కడి సీలేరు డ్యామ్ దగ్గరున్న ఓ గ్రామాన్ని ఎంచుకుని చిత్రీకరణ చేశాం. చుట్టూ అడవులు, కొండలు, డ్యామ్‌లే. త్రినాథ్లాంటి ఓ అమాయకుడు అలాంటి ప్రాంతంలో ఉంటేనే సరైందనిపించి ఆ నేపథ్యాన్ని ఎంచుకున్నాం. ఆ ప్రాంతంలోని జనం కూడా ఎంతో అమాయకులు. వాళ్లు చిత్రీకరణకి గొప్ప సహకారం అందించారు. నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ 250 మందితో కూడిన బృందం కోసం పక్కాగా ఏర్పాట్లు చేసి సహకారం అందించారు. చిన్న చిన్న ఇళ్లల్లోనే ఉంటూ చిత్రీకరణ పూర్తి చేశాం. విష్ణు విజువల్స్, జి.వి.ప్రకాశ్ సంగీతం చిత్రానికి ప్రధానబలం. మల్లెపూల పల్లకి... పాట, అందులో రవన్న వేసిన డాన్స్ థియేటర్లలో ప్రేక్షకులకు ఓ పూనకంలాంటి అనుభూతిని పంచుతుంది.
మీ సినిమాల్లో భావోద్వేగాలకే అగ్ర తాంబూలం. కథలు చెప్పే విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి?
గాఢమైన ప్రభావం చూపించేలా కథల్ని చెప్పడమే నా శైలి. థియేటర్ నుంచి బయటికి రాగానే మరిచిపోయేలా, పైపైనే కథని చెప్పడం నాకు ఇష్టం ఉండదు. మనం సినిమా పరిశ్రమ నుంచి వెళ్లిపోయినా మన కథలు, మన పాత్రలు నిలిచిపోయేలా ఉండాలనే తపనతోనే పనిచేస్తుంటా. అయితే ప్రేమకథల్లో కొంతవరకే గాఢతని చూపించగలుగుతాం. దానికి నేర నేపథ్యం, బలమైన భావోద్వేగాలు తోడైతే సినిమా మరోస్థాయిలోకి వెళుతుందని ‘ఇరుముడి’తో ఇంకా బాగా అర్థమైంది.
మొదట్లో ఈ సినిమా ఓ రీమేక్ అనే ప్రచారం జరిగింది. అది మీ వరకూ వచ్చిందా?
అరుదైన నేపథ్యంలో సాగే కథ కావడంతోనే ఆ ప్రచారం జరిగింది. ఇరుముడితోపాటు, పాపని ఎత్తుకుని కనిపించే రవితేజ లుక్ విడుదల చేయడంతోనే ఇది ‘మాలికాపురం’ రీమేక్ అనుకున్నారంతా. అయ్యప్ప స్వామి నేపథ్యంలో ఈమధ్యకాలంలో సినిమాలు రాలేదు కదా. ఆ నేపథ్యంలో వచ్చిన ఆ ఒక్క సినిమాని తీసుకొచ్చి పోల్చారు. అదే హీరో డాక్టర్, ఇంజినీర్, పోలీసు అధికారిలాగో కనిపించి ఉంటే ఎవ్వరూ అడగరు. నా సినిమాలో కంటెంట్ ఏమిటనేది నాకు తెలుసు కదా, అందుకే ఎలాంటి ప్రచారం జరిగినా నేను కంగారు పడలేదు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 19 Aug 2026 03:28 ISTగమనిక:ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఆ సవాలుతో తీర్చిదిద్దుతున్న చిత్రమే వారణాసి సినీప్రియులు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’.
- అప్పటివరకూ నా సినిమాలకు టికెట్ ధర పెంచనవసరం లేదు: విజయ్ దేవరకొండ తన సినిమాలకు టికెట్ ధరల పెంపు అవసరం లేదని కథానాయకుడు విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) అన్నారు. ఈ వ్యవహారం తన పరిధిలో ఉన్నంత వరకూ పెంపు లేకుండా చూస్తానని తెలిపారు.
- శ్రీకాంత్ ఓదెల నన్ను మోసం చేశాడు: మోహన్‌బాబు నాని (Nani) కథానాయకుడిగా శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) తెరకెక్కించిన చిత్రం ‘ప్యారడైజ్’ (The Paradise). ప్రముఖ నటుడు మోహన్‌బాబు (Mohan Babu) ఇందులో శిఖంజా మాలిక్‌గా ప్రతినాయకుడి పాత్రలో నటించారు.
- నాన్న చైల్డ్ ఆర్టిస్ట్ ఛాన్స్ ఇస్తే రెమ్యునరేషన్ అడిగా: వెంకటేశ్ వెంకటేశ్ (Venkatesh) కథానాయకుడిగా త్రివిక్రమ్ (Trivikram) తెరకెక్కిస్తు్న్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం - హౌస్ నెం.47’ (Aadarsha Kutumbam house no 47). శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. అక్టోబరు 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
- పెద్దల కోసం తీసిన పిల్లల సినిమా ‘‘సినిమాల్ని విస్తృత స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయడానికి తెలుగు చిత్రసీమ విశేషంగా కృషి చేస్తోంది. గత ఐదారేళ్ల కాలాన్ని పరిశీలిస్తే ఆ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. సరైన ప్రణాళికతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోవచ్చని తెలుగు పరిశ్రమ నిరూపించింది.
- సుబ్బలక్ష్మి సర్ప్రైజ్లకు మైండ్ బ్లాంక్ అవుతుంది: కయాదు లోహర్ సుబ్బలక్ష్మి ‘ది ప్యారడైజ్’ కథను మలుపు తిప్పుతుందని థియేటర్లో తన పాత్ర ఇచ్చే సర్ప్రైజ్లకు ప్రేక్షకుల మైండ్ బ్లాంక్ అవుతుందని అంటోంది కయాదు లోహర్.
- ‘ది ప్యారడైజ్’లో డూప్ షాట్స్ లేవు.. 36 గంటల పాటు ఏకధాటిగా షూటింగ్: నాని తనకు ఏ స్టార్డమ్ ట్యాగ్లు, బాక్సాఫీస్ రికార్డులతో పనిలేదని తెలుగు ప్రేక్షకులు గర్వంగా చూపించుకునేలా తిరుగులేని చిత్రాలు తన నట జాబితాలో ఉండాలని అంటున్నారు నాని.
- ‘ది ప్యారడైజ్’ సింగిల్ బుల్లెట్.. సీక్వెల్‌పై దర్శకుడు శ్రీకాంత్ క్లారిటీ ‘‘ప్యారడైజ్’ రెండు పార్ట్లు.. సీక్వెల్స్ లేవు. ఇది ఒకే ఒక్క బుల్లెట్’’ అంటున్నారు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. (the paradise director) ఆయన దర్శకత్వంలో నాని కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’.
- ఆ పాట వచ్చాక లక్ష జడలు అమ్మారు.. అలా అడిగితే అస్సలు చేయను: నాని ఇప్పటివరకూ ‘ప్యారడైజ్’ అంటే బిర్యానీ లేదా హైదరాబాద్‌లో ఒక ప్లేస్ గుర్తొచ్చేదని, ఇక నుంచి ఈ పేరు చెబితే తమ సినిమానే గుర్తొస్తుందని అంటున్నారు నాని.
- అవును! ‘ది ప్యారడైజ్’ ట్రైలర్ లేదు.. స్పష్టం చేసిన నాని ‘ది ప్యారడైజ్’ (The Paradise) మూవీకి ట్రైలర్ లేదని ఆ చిత్ర కథానాయకుడు నాని (Nani) స్పష్టం చేశారు. విడుదల తేదీకి తక్కువ సమయం ఉండటంతో ట్రైలర్ ఇవ్వడం సాధ్యం కాదన్నారు.
- అందుకే చాలా వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టా: సమంత నటి, నిర్మాతగానే కాకుండా చాలా వ్యాపారాల్లోనూ పెట్టుబడులు పెట్టి వ్యాపారవేత్తగానూ ముందుకు సాగుతున్నారు సమంత (Samantha).
- పవన్‌కల్యాణ్ వారాహి మా సినిమాకు అలా ఉపయోగపడింది: సుమంత్ ‘మహేంద్రిగిరి వారాహి’ (mahendragiri varahi) ప్రేక్షకుడికి మంచి థియేట్రికల్ అనుభూతిని ఇస్తుందని అన్నారు కథానాయకుడు సుమంత్.
- అదే చేయాలనుకుంటే నేను ఐటీ ఉద్యోగంలోనే ఉండిపోయేవాణ్ని! జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు తమిళ కథానాయకుడు కార్తి. అదే ఆయన్ని తెలుగు సినీప్రియులకు దగ్గరయ్యేలా చేసింది.
- బతికితే చాలనుకున్నా.. ఇంకోసారి ఇలాంటి సినిమా చేయను: సుహాస్ టాలీవుడ్ హీరో సుహాస్, తమిళ నటుడు సూరి ప్రధాన పాత్రల్లో నటించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా చిత్రం ‘మండాడి’
- కళలు లేకపోతే నా జీవితమే లేదు! ‘‘అందరికంటే... అన్నిటికంటే సినిమాకి కథే ముఖ్యమని నమ్ముతాను. అందుకే కథని దృష్టిలో ఉంచుకునే సినిమాల ఎంపికపై నిర్ణయాలు తీసుకుంటా’’ అంటున్నారు అనంతిక సనీల్‌కుమార్.
- పుట్టబోయే బిడ్డకు ఏం పేరు పెడతారు?.. సమంత ఏమన్నారంటే.. ప్రస్తుతం సమంత తల్లికాబోతున్న ఆనందంలో ఉన్నారు. ఒకవైపు బేబీమూన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తోన్న సామ్..
- వాళ్లతో ఉన్నప్పుడే వాస్తవ జీవితం: కథానాయిక నయనతార ‘‘భాషల సరిహద్దులు దాటి ఎన్నో చిత్రాల్లో నటించినా ‘నేను నిజంగా ఇది చేయగలనా?’ అని ఆశ్చర్యపరిచేంత వైవిధ్యమైన పాత్ర కోసం నేనింకా ఎదురుచూస్తున్నాను.. అలాంటి అవకాశాలే నన్ను ఎక్కువగా ఉత్తేజపరుస్తాయ’’ని అంటోంది అగ్ర కథానాయిక నయనతార.
- అనుపమ కామెంట్స్‌తో తెరపైకి ధ్రువ్ విక్రమ్ పేరు.. తాజాగా క్లారిటీ ఇచ్చిన హీరో ధ్రువ్ విక్రమ్ తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం, ఎదురవుతోన్న విమర్శలపై స్పందించారు.
English Translation
Translation pending...