ప్రభుత్వ శాఖల్లో 10,060 పోస్టుల భర్తీ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 19 Aug 2026 04:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, అమరావతి: వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2026-27 జాబ్‌ క్యాలెండర్‌లో భాగంగా వీటిని భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో రూ.2.08 లక్షల కోట్లతో చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని ప్రాంతంలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రైల్వే లైన్ల నిమిత్తం మోతడక గ్రామంలో 2,344 ఎకరాల్ని భూసమీకరణ విధానంలో తీసుకునే ప్రతిపాదనకు ఆమోదముద్ర వేసింది.

2026-27 జాబ్‌ క్యాలెండర్‌ కింద వివిధ ప్రభుత్వశాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 ఖాళీల భర్తీకి పచ్చజెండా ఊపింది. పట్టణ స్థానిక సంస్థల్లో హైబ్రిడ్‌ యాన్యుటీ మోడల్‌ (హ్యామ్‌) కింద రహదారులు, కాల్వలు, విద్యుత్తు, పార్కుల అభివృద్ధి పనులకు రూ.7,469.46 కోట్లకు పరిపాలన ఆమోదం తెలియజేసింది. హంద్రీ నీవా సుజల స్రవంతి (హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌) ఫేజ్‌-2 పనులకు రూ.1,323.75 కోట్లకు పరిపాలన అనుమతి ఇచ్చింది. శ్రీసత్యసాయి జిల్లాలో మెయిన్‌ కెనాల్‌ సీసీ లైనింగ్‌ పనులకు (400.50 కి.మీ నుంచి 485.300/490 కి.మీ వరకు) రూ.750.07 కోట్లు.. అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మెయిన్‌ కెనాల్‌ పనులకు రూ.573.68 కోట్లు కేటాయించింది. 

మంత్రివర్గ నిర్ణయాలు ఇవి.. 

  • విశాఖపట్నం జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం వద్ద 486 మెగావాట్ల సామర్థ్యంతో హైపర్‌ స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు నిమిత్తం డేటా సెంటర్‌ హోల్డింగ్స్‌ ఇండియా సంస్థకు 200 ఎకరాల భూమి కేటాయింపు, టైలర్‌ మేడ్‌ ప్రోత్సాహకాలకు ఆమోదం
  • తిరుపతిలో మునోత్‌ లిథియం బ్యాటరీ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసే లిథియం అయాన్‌ సెల్‌ తయారీ ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం.
  • ఏఐఎల్‌ డిక్సన్‌ టెక్నాలజీస్‌ ఆధ్వర్యంలో రూ.450 కోట్ల పెట్టుబడి, 7 వేల మందికి ఉపాధి లక్ష్యంగా.. వైఎస్సార్‌ ఈఎంసీ కొప్పర్తిలో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు
  • రూ.85,200 కోట్ల పెట్టుబడి, 1,880 మందికి ఉద్యోగ కల్పన లక్ష్యంగా అనకాపల్లి జిల్లా మాకవరపాలెం వద్ద 1,000 మెగావాట్ల హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ ఏర్పాటు నిమిత్తం రెన్యూ ఏపీ గ్రీన్‌ డేటా సెంటర్‌ లిమిటెడ్‌కు 433.30 ఎకరాల భూమి కేటాయింపు, ప్రోత్సాహకాల మంజూరుకు ఆమోదం.
  • రూ.31,387 కోట్ల పెట్టుబడి, 1,000 మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం మండలం అమనం వద్ద 512 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐ డేటాసెంటర్‌ ఏర్పాటు నిమిత్తం ఏఎం ఇంటెలిజెన్స్‌ ల్యాబ్స్‌కు ఆర్థిక, ఆర్థికేతర ప్రోత్సాహకాల మంజూరు.
  • కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం గుట్టపాడు వద్ద అగస్త్య గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో 12 గిగావాట్ల ఇంటిగ్రేటెడ్‌ ఫెసిలిటీతో ఎస్‌ఐ ఇంగోట్‌ అండ్‌ వేఫర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ ప్లాంట్‌ ఏర్పాటు. దీనికి ఎకరా రూ.10 లక్షల చొప్పున 143.26 ఎకరాల భూమి కేటాయింపు.
  • విశాఖపట్నం పరవాడ పారిశ్రామికవాడ వద్ద అక్షత్‌ గ్రీన్‌టెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ 3.6 గిగావాట్లతో టాప్‌ కాన్‌ సోలార్‌ సెల్, మాడ్యూల్‌ ఉత్పత్తి ప్లాంట్‌ ఏర్పాటుకు ఆమోదం
  • చిత్తూరు జిల్లా కుప్పం మండలం ఏకర్లపల్లి వద్ద అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్‌ ప్రాజెక్టు విస్తరణకు హిందాల్కో ఇండస్ట్రీస్‌కు 60 ఎకరాల కేటాయింపు

రాజధానిలో ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, అమరావతి రైల్వేలైన్‌కు 

  • రాజధాని అమరావతిలో ఎర్రుబాలెం-నంబూరు నూతన బ్రాడ్‌గేజ్‌ రైల్వేలైన్‌ నిర్మాణం (ఇరువైపులా 50 మీటర్ల బఫర్‌తో మొత్తం 100 మీటర్లు), ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌ నిర్మాణాల నిమిత్తం.. భూసమీకరణ విధానం కింద గుంటూరు జిల్లా తాడికొండ మండలం మోతడకలో 2344.12 ఎకరాలు తీసుకునేందుకు సీఆర్‌డీఏ కమిషనర్‌కు అధికారాలు కల్పిస్తూ మంత్రివర్గ తీర్మానం
  • రెండో విడత భూసమీకరణ పథకంలో భాగంగా.. గుంటూరు జిల్లా వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లోని దేవాదాయ భూముల వివాదాల పరిష్కారానికి సంబంధించి దేవాదాయ శాఖకు రూ.159.45 కోట్ల పరిహారం చెల్లింపు.. రైత్వారీ పట్టాలు కలిగిన రైతులకు భూసమీకరణ ప్రయోజనాలు కల్పించే ప్రతిపాదనకు ఆమోదం.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • మోగింది నగారా రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. 13 నగరపాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో ఎన్నికలకు బుధవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కూడా తక్షణమే అమల్లోకి వచ్చింది.
  • ఆ 23 చోట్ల ఎన్నికలపై స్టే ఇవ్వలేం రాష్ట్రంలోని 23 నగరపాలక, పురపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో సమీప గ్రామాలను చేరుస్తూ 2021లో వైకాపా ప్రభుత్వం చేసిన ఏపీ మున్సిపల్‌ లాస్‌ (ఎమెండ్‌మెంట్‌) యాక్ట్‌ 2021ను సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లలో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులిచ్చింది.
  • చర్చలు సఫలం.. కలిసే పోటీ ‘స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు సఫలమయ్యాయి. మా మధ్య ఎలాంటి పొరపొచ్చాలూ లేవు.
  • కూటమి పక్షాల చర్చలు కొలిక్కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు దాదాపు కొలిక్కి వచ్చింది. నాలుగు నగరపాలక సంస్థలు, 20 నుంచి 24 పురపాలక సంఘాలు, మూడు నుంచి నాలుగు నగర పంచాయతీల్లో జనసేన పోటీ చేసే అవకాశం ఉంది.
  • జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ విజయవాడ మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ జనసేనలో చేరారు. ఇప్పటివరకు తెదేపాలో ఉన్న ఆయన మిత్రపక్షం గూటికి చేరారు.
  • దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే నో డ్యూస్, కుల ధ్రువపత్రాలు పరిపాలనాపరంగా ఇబ్బందులు ఉండకూడదనే ఉద్దేశంతో స్థానిక సంస్థలకు ఒకేసారి షెడ్యూల్‌ ఇచ్చి ఎన్నికలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా స్పష్టం చేశారు.
  • 13 నగర పాలక సంస్థలు.. 87 పురపాలికల్లో ఎన్నికలు రాష్ట్రంలో 13 నగర పాలక సంస్థలు, 87 పురపాలక సంఘాల్లో... మొత్తం 3,942 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. మేయర్లు, ఛైర్‌పర్సన్లు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల భవితవ్యాన్ని పట్టణ స్థానిక సంస్థల్లోని 1.03 కోట్ల మంది ఓటర్లు నిర్ణయించనున్నారు.
  • మహాచండీ దేవిని దర్శించుకున్న రాష్ట్రపతి విజయవాడ ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న శరన్నవరాత్రి ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము బుధవారం పాల్గొన్నారు. మహాచండీదేవి రూపంలోని దుర్గమ్మను దర్శించుకున్నారు.
  • జగన్‌ కేసుల్లో ఇక రోజువారీ విచారణ వైకాపా అధినేత జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ కోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నమోదు చేసిన కేసుల్లోనూ రోజువారీ విచారణ చేపట్టాలని సీబీఐ కోర్టు నిర్ణయించింది.
  • మద్యం కుంభకోణం కేసులో ఈడీ విచారణకు రజత్‌భార్గవ వైకాపా ప్రభుత్వ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి రజత్‌ భార్గవ బుధవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణకు హాజరయ్యారు.
  • ప్రత్యేక నామినేషన్‌ కేంద్రం ఏర్పాటు పిటిషన్‌పై వాదనలు పూర్తి జడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపాలిటీల ఎన్నికల సందర్భంగా నామినేషన్లు దాఖలు చేసేందుకు సాధారణ నామినేషన్‌ కేంద్రాలకు అదనంగా ప్రతి జిల్లాలో జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఓ ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీచేయాలంటూ వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వేసిన వ్యాజ్యంపై బుధవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి.
  • మహాచండీదేవిగా జగన్మాత దుర్గమ్మ దసరా శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా నాలుగో రోజు బుధవారం విజయవాడ ఇంద్రకీలాద్రిపై జగన్మాత దుర్గమ్మ.. మహాచండీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • కూష్మాండదుర్గగా శ్రీశైల భ్రామరి నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. బుధవారం భ్రమరాంబాదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు.
  • సీతా స్వయంవర అలంకారంలో శ్రీవారు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడో రోజు బుధవారం రాత్రి ముత్యపుపందిరి వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారు దర్శనమిచ్చారు.
  • న్యాయవాద వృత్తిలో నిరంతర అధ్యయనం అవసరం కోర్టులో జరిగే విచారణలను సూక్ష్మ దృష్టితో పరిశీలిస్తుండాలని యువ న్యాయవాదులకు హైకోర్టు న్యాయమూర్తులు సూచించారు. కోర్టులో ఎలా వ్యవహరించాలి, వాదనలు ఎలా చెప్పాలనే విషయాన్ని సీనియర్ల నుంచి నేర్చుకోవాలన్నారు.
  • ఓఎంసీ కేసులో విశ్రాంత ఐఏఎస్‌ శ్రీలక్ష్మిపై అభియోగాల నమోదు ఓబుళాపురం మైనింగ్‌ (ఓఎంసీ) కేసులో 6వ నిందితురాలైన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, నాటి పరిశ్రమల శాఖ కార్యదర్శి వై.శ్రీలక్ష్మిపై సీబీఐ కోర్టు బుధవారం అభియోగాలను నమోదు చేసింది.
  • ‘పోలవరం’ పనులను పరిశీలించిన విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం బుధవారం సందర్శించింది.  ప్రాజెక్టును ఈ బృందం సందర్శించడం ఇది ఎనిమిదోసారి. బృంద సభ్యులు రిచర్డ్‌ డొన్నెల్లీ, డేవిడ్‌ పాల్, డి సిస్కో, హించ్‌బెర్గర్‌లతో తొలుత పోలవరం అధికారులు, అథారిటీ అధికారులు సమావేశమయ్యారు.
  • పరిశ్రమల అవసరాలకు శిక్షణ.. ఉపాధికి చేయూత: మంత్రి లోకేశ్‌ రాష్ట్ర యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేలా నైపుణ్యాలు పెంపొందించడమే తమ ప్రాధాన్యమని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు.
  • ఎర్రబస్సు రాదన్నారు.. అదే విమానాశ్రయంలో దిగారు ఎర్రబస్సు రాని భోగాపురానికి ఎయిర్‌బస్‌ ఎలా వస్తుందని మాజీ ముఖ్యమంత్రి జగన్‌ గతంలో మాట్లాడారని అదే విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు స్వాగతం పలుకుతున్నామని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
  • జడ్పీ ఛైర్మన్‌ రేసులో పరిటాల శ్రీరామ్‌ శ్రీసత్యసాయి జిల్లా పరిషత్‌ ఛైర్మన్‌ కూటమి అభ్యర్థిగా పరిటాల శ్రీరామ్‌ పేరు తెరపైకి వచ్చింది. జడ్పీ ఛైర్మన్‌ స్థానం జనరల్‌కు కేటాయించడంతో ఆయనను బరిలో నిలపాలని తెదేపా అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.

English Translation

Filling of 10,060 posts in government departments

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 19 Aug 2026 04:17 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

Today, Amaravati: Various Govt. The state cabinet has waved the green flag for filling up 10,060 vacant posts in departments. These will be replaced as part of the 2026-27 job calendar. The State Investment Promotion Board (SIPB) approved the decisions taken in the meeting regarding the various projects to be undertaken in the state with a cost of Rs.2.08 lakh crore. A number of key decisions were taken in the Cabinet meeting held at the Secretariat under the chairmanship of Chief Minister Chandrababu Babu. It approved the proposal to acquire 2,344 acres of land in Motadaka village for the purpose of inner ring road and railway lines in the capital region.

The green flag has been waved to fill 10,060 vacancies in various government departments under the 2026-27 job calendar. The administration has approved Rs 7,469.46 crore for the development of roads, canals, electricity and parks under the Hybrid Annuity Model (HAM) in urban local bodies. The administration has sanctioned Rs 1,323.75 crore for the Phase-II works of Handri Neeva Sujala Sravanti (HNSS). Rs.750.07 crores for main canal CC lining works (from 400.50 km to 485.300/490 km) in Sri Satyasai district. An amount of Rs.573.68 crore has been allocated for the main canal works in Annamaiya, Tirupati and Chittoor districts. 

These are the decisions of the Cabinet..

  • Allotment of 200 acres of land to Data Center Holdings India for setting up a hyperscale data center with a capacity of 486 MW at Jagannathapuram, Anandapuram mandal, Visakhapatnam district, for tailor-made incentives. Approval
  • Approval for setting up a lithium ion cell manufacturing plant in Tirupati under the direction of Munoth Lithium Battery Pvt Ltd with an investment of Rs.500 crore.
  • An investment of Rs.450 crore under the direction of AIL Dixon Technologies, the aim is to employ 7 thousand people..Electronic manufacturing unit at YSR EMC Kopparthi Establishment
  • Investment of Rs.85,200 crores, 433.30 acres of land allocated to Renew AP Green Data Center Ltd. for setting up of 1,000 megawatt hyperscale data center at Makavarapalem, Anakapalli district, with the aim of creating employment for 1,880 people.
  • Investment of Rs.31,387 crores, Grant of financial and non-financial incentives to AM Intelligence Labs for setting up an AI data center with a capacity of 512 MW at Amanam, Bhimunipatnam mandal, Visakhapatnam district with the aim of creating employment for 1,000 people. Establishment of SI Ingot and Wafer Manufacturing Plant with gigawatt integrated facility. Allotment of 143.26 acres of land for this at Rs.10 lakh per acre.
  • Akshat Greentech Pvt Ltd 3.6 gigawatts at Visakhapatnam Paravada Industrial Wada approved for setting up of Topcon Solar Cell and Module Production Plant
  • For expansion of aluminum extrusion project at Akarlapalli, Kuppam Mandal, Chittoor District. Allotment of 60 Acres to Hindalco Industries

Inner Ring Road in Capital, for Amaravati Railway Line

  • Construction of Errubalem-Namburu New Broad Gauge Railway Line in Capital Amaravati (Total with 50 meter buffer on both sides) 100 meters), for the construction of inner ring road.. Cabinet resolution authorizing CRDA commissioner to take 2344.12 acres in Motadaka of Tadikonda mandal of Guntur district under the land acquisition system
  • As part of the second phase of land acquisition scheme. Payment of compensation of Rs.159.45 crores to the Debt Department for settlement of debt land disputes.. Approval of the proposal to provide benefits of land acquisition to farmers with Raithwari titles.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on reader preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR ERRORS OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Mogindi Nagara The city has rang for local body elections in the state. Notification for elections in 13 municipal bodies and 87 municipal societies was released on Wednesday. Election code of conduct also came into effect immediately.
  • Elections cannot be stayed in those 23 places. The Supreme Court has issued a notice to the state government in the petitions filed challenging the AP Municipal Laws (Amendment) Act 2021 made by the Vaikapa government in 2021, including the nearby villages in the 23 municipal, municipal bodies and city panchayats of the state. "Discussions between Telugu Desam and Janasena in local body elections have been successful. There are no mistakes between us The adjustment of seats between the coalition parties in the local body elections is almost over. Janasena is likely to contest in four municipal bodies, 20 to 24 municipal societies and three to four city panchayats.
  • Vangaveeti Radhakrishna joins Janasena. Former Vijayawada MLA Vangaveeti Radhakrishna has joined Janasena. He, who was in TEDP till now, joined the alliance.
  • No Deuce, caste certificates within 24 hours of application. State Election Commissioner Anilchandra Punetha has made it clear that with the intention of not having administrative difficulties, elections are being held simultaneously with the local bodies.
  • 13 city governing bodies.. Elections in 87 municipalities Elections will be held for a total of 3,942 wards in 13 city governing bodies and 87 municipal societies in the state. The fate of mayors, chairpersons, corporators and ward members will be decided by 1.03 crore voters in urban local bodies.
  • President visits Mahachandi Devi President Draupadimurmu on Wednesday participated in the Sharannavaratri celebrations at Vijayawada Indrakiladri. Visited Durgamma in the form of Mahachandi Devi.
  • Daily investigation in Jagan cases. A crucial development has taken place in the CBI court in the illegal assets case of Vaikapa chief Jagan. The CBI court has decided to conduct daily investigation in the cases registered by the Enforcement Directorate (ED) regarding Jagan's illegal assets. Retired IAS officer Rajat Bhargava attended the Enforcement Directorate (ED) hearing on Wednesday in connection with the Rs 1,000-crore liquor scam case during the Vaikapa government. Arguments ended in the High Court on Wednesday on the lawsuit filed by Vaikapa State General Secretary Lella Appireddy to issue instructions to set up a special center at the District Election Officer in each district in addition to the normal nomination centers to file nominations during the elections of ZPTC, MPTC and Municipalities.
  • Jaganmata Durgamma as Mahachandi Devi. As part of the Dussehra Sharannavaratri celebrations, Jaganmata Durgamma appeared to the devotees in the form of Mahachandi Devi on the Indrakiladri of Vijayawada on Wednesday on the fourth day. Devi Sarannavaratri festival is being held in Srishaila Mahakshetra of Nandyala district with grandeur. On Wednesday, Bhramaramba Devi appeared to the devotees in Kushmanda Durga Alankaram. As part of the Tirumala Srivari Navratri Brahmotsavam, Srimalayappa Swami along with Sridevi and Bhudevi appeared on the Mutyapupandiri vehicle on the third day on Wednesday night as part of Tirumala Srivari Navratri Brahmotsavam. High Court Judges advised the young lawyers to observe the proceedings in the court with a close eye. They want to learn from seniors how to behave in court and how to present arguments.
  • Retired IAS Srilakshmi has been charged in the OMC case. The CBI court on Wednesday filed charges against the 6th accused in the Obulapuram Mining (OMC) case, retired IAS officer Y. Sreelakshmi, Secretary of the Industries Department. A team of foreign experts visited the Polavaram project on Wednesday.  This is the eighth time the team is visiting the project. Team members Richard Donnelly, David Paul, D Cisco, Hinchberger first met Polavaram officials and authority officials.
  • Training for the needs of industries.. Help for employment: Minister Lokesh Education and IT Minister Lokesh said in a statement that their priority is to develop skills to provide job opportunities to the youth of the state. Landed at the same airport Vizianagaram MP Kalishetti Appalanayudu stated that former Chief Minister Jagan had previously talked about how Airbus would come to Bhogapuram where there was no red bus, and he was welcomed by a special flight to the same airport. Paritala Sriram's name came to the fore as the candidate of the Sri Sathya Sai Zilla Parishad Chairman alliance. There is a strong campaign in the political circles that TDP leadership wants to keep the post of ZP chairman to General.