బీటీలాగే కోటింగ్‌... ఆకట్టుకునే ప్యాకింగ్‌

Eenadu icon
By Telangana News Desk Published : 17 Jun 2026 04:35 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు-సూర్యాపేట, వరంగల్, మహబూబ్‌నగర్, ఖమ్మం; ఈటీవీ, ఆదిలాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న వానలకు కొన్నిచోట్ల పత్తి విత్తనాల విత్తే పనులు ప్రారంభమయ్యాయి. ఇదే అదునుగా నకిలీ విత్తనాల వ్యాపారం పల్లెల్లో జోరుగా సాగుతోంది. జిన్నింగ్‌ మిల్లుల నుంచి తీసుకొచ్చి అచ్చం బీటీలాగే కోటింగ్‌ ఇచ్చిన విత్తనాలను బ్రాండెడ్‌ మాదిరిగానే ఆకర్షించేలా... నకిలీ ప్యాకింగ్‌లతో రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తమ విత్తనాలు నాటితే గడ్డి మొలవదని, కలుపు నివారణ ఖర్చులు మిగులుతాయని.. దిగుబడి సైతం అధికంగా ఉంటుందని నమ్మబలుకుతున్నారు. పోలీసులు ఇప్పటికే కొన్నిచోట్ల ఇలాంటి వారి ఆటకట్టించారు. అయినా నకిలీల బెడద ముగిసిపోవడం లేదు. 

ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొస్తూ...

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 45 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పత్తి సాగవుతుందని అధికారుల అంచనా. ఎకరాకు 475 గ్రాముల విత్తన ప్యాకెట్‌లు 2 నుంచి 3 అవసరమవుతాయి. ఈసారి ఎల్‌నినో ప్రభావంతో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ పదేపదే చెబుతోంది. దీన్ని అవకాశంగా మలచుకున్న దళారులు... ఈ సంవత్సరం విత్తనాలను వ్యాపారులు భారీగా విక్రయించబోరని ప్రచారం చేస్తూ ‘నకిలీ’ వ్యాపారానికి తెరలేపారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా జిల్లాలు, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలు, ఏపీలోని గుంటూరు నుంచి నకిలీ పత్తి విత్తనాలను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దళారులు ప్రధానంగా గ్రామాల్లో పరిచయస్తులను అడ్డాగా చేసుకొంటారు. వారు స్థానికంగా చిన్న వ్యాపారులుగా ఉంటారు. వారి ద్వారా చిన్న కమతాలు కలిగిన రైతులను లక్ష్యంగా చేసుకొని అంటగడుతుంటారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, బైంసా, ఉట్నూరు సహా ఏజెన్సీల్లో నకిలీ విత్తనాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఈ రెండు నెలల వ్యవధిలోనే రూ.లక్షల విలువ చేసే సుమారు 20 క్వింటాళ్ల విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకొని అమ్మకందారులపై కేసులు నమోదు చేశారు. ఇంకా రూ.6 లక్షలు విలువ చేసే గడువు తీరిన విత్తనాలను సైతం స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి జిల్లా మోటకొండూరు మండలం సికిందర్‌నగర్‌లో నకిలీ విత్తనాలను స్వాధీనం చేసుకోగా కేసు నమోదైన వ్యక్తిపై గతంలోనూ నకిలీ విత్తనాల కేసు ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రముఖ కంపెనీ పేరుతో విత్తన ప్యాకెట్లను మధ్యవర్తులు రైతులకు ఇచ్చినట్లు సమాచారంతో కర్నూలుకు చెందిన ఆ కంపెనీ ప్రతినిధులు గ్రామాల్లో విచారణ చేపట్టారు. తాము మధ్యవర్తులకు ఎలాంటి విత్తనాలను ఇవ్వలేదని తేల్చారు. ఎవరు ఇచ్చారనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

అధీకృత దుకాణాల్లోనే కొనాలి.. 

మార్కెట్లో సర్టిఫైడ్‌ విత్తన కంపెనీలకు చెందిన విత్తనాలు వ్యాపారుల వద్ద సరిపడా ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. ‘ప్రభుత్వ అనుమతి ఉన్న అధీకృత దుకాణాల్లోనే విత్తనాలు కొనాలి. తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలి. నకిలీ విత్తనాలని అనుమానం వచ్చిన వెంటనే వ్యవసాయాధికారులకు ఫిర్యాదు చేయాలి’ అని అధికారులు సూచిస్తున్నారు. 

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆర్థికం.. అతలాకుతలం తెలంగాణపై ఉన్న మొత్తం రుణ భారం 2024-25 నాటికి   రూ.6,89,021 కోట్లని కాగ్‌ తేల్చింది. ప్రభుత్వేతర రుణాలకు అత్యధిక గ్యారంటీలు ఇచ్చిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిందని చెప్పింది.
  • నేటి నుంచి ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి కౌన్సెలింగ్‌ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. విద్యార్థులు ఈ నెల 19వ తేదీ నుంచి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు.
  • మెట్రో రెండో దశ అంచనాలు పైపైకి మెట్రో రైలు రెండో దశ అంచనా వ్యయం గతేడాది అంచనాలతో పోలిస్తే రూ.1,915 కోట్లు పెరిగింది. ప్రాజెక్టుకు అనుమతులు రావడం జాప్యమయ్యేకొద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
  • ఉదారతలో శిబి చక్రవర్తిని మించిపోయారు! బ్యాంకు అధికారులు వితరణలో శిబి చక్రవర్తిని మించిపోయారని హైకోర్టు గురువారం వ్యాఖ్యానించింది. ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటామన్న భూమిపై హైకోర్టు స్టే ఉండగా, అదే భూమిని తాకట్టు పెట్టుకుని రుణం ఎలా మంజూరు చేస్తారంటూ ఎస్‌బీఐని నిలదీసింది.
  • కోకాపేటలో ‘బుల్లెట్‌’ రైలు స్టేషన్‌ కష్టమేనా? బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణలో ప్రతిపాదిత స్టేషన్లపై నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఎన్‌హెచ్‌ఎస్‌ఆర్‌సీఎల్‌)కు కీలక మార్పులను సూచించాలని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది.
  • సంక్షిప్త వార్తలు (17) పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికి గుర్తింపు తప్పకుండా ఉంటుందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. గతంలో డీసీసీ అధ్యక్షులుగా పనిచేసిన వారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయ్యారని గుర్తుచేశారు.
  • పిల్లలకు మంచి మాటలు చెప్పడం రాదా..? ‘ఆరుట్లలో పాఠశాల ప్రారంభోత్సవంలో నాపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా.
  • కిషన్‌రెడ్డిపై సీఎం తప్పుడు ప్రచారం: రామచందర్‌రావు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు ఆరోపించారు.
  • కోతులు బెదిరి.. అడవి పందులు అదిరి..! ఒకప్పుడు.. కోతులు, అడవి పందులు ఆ రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసేవి.
  • ‘ఇప్పొల్‌ ఎంగనేయుంది?.. నిమ్మదు కర్ణాటకా?’ ప్రాణాపాయస్థితిలో ఆసుపత్రి గడప తొక్కిన వారికి చికిత్సతోపాటు ఓదార్పూ ముఖ్యం.
  • ఈ దారుల్లో ప్రయాణం ప్రమాదం రాష్ట్రంలోని జాతీయ రహదారులపై ఉన్న బ్లాక్‌స్పాట్ల (ప్రమాదకర ప్రదేశాలు) వద్ద ప్రమాదాల నివారణ కోసం నిర్మించ తలపెట్టిన వంతెనలు, అండర్‌పాస్‌ల ప్రతిపాదనలు ప్రణాళికలకే పరిమితమవుతున్నాయి.
  • ఏఐజీలో ‘పల్స్డ్‌ ఫీల్డ్‌ అబ్లేషన్‌’ చికిత్స అందుబాటులోకి మారిన జీవనశైలి, ఒత్తిడి కారణంగా గుండె లయ తప్పి ప్రాణాంతకంగా మారే ‘ఏట్రియల్‌ ఫిబ్రిలేషన్‌’ అనే సమస్యకు ఏఐజీలో సరికొత్త చికిత్స అందుబాటులోకి వచ్చింది.
  • టీజీఎంఎస్‌ఐడీసీ టెండర్లలో పారదర్శకతకు విధివిధానాలు తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ(టీజీఎంఎస్‌ఐడీసీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంట్రల్‌ మెడిసిన్‌ స్టోర్‌ కేంద్రాలకు 15 శాశ్వత భవనాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ ఆదేశించారు.
  • మీ ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తాం! సంక్షేమశాఖలలో సామగ్రి కొనుగోళ్ల విషయంలో రూ.2 వేల కోట్ల కుంభకోణం జరిగిందని మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన ఆరోపణలను ఆధారాలతో నిరూపిస్తే పదవులకు రాజీనామా చేస్తామని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌లు సవాల్‌ విసిరారు.
  • 3,39,96,239.. రేషన్‌ లబ్ధిదారుల సంఖ్య ఇది రాష్ట్రంలో ఆహారభద్రత భారీగా విస్తరిస్తోంది. ప్రభుత్వం కొత్తగా అర్హత పొందిన కుటుంబాలకురేషన్‌ కార్డులు జారీ చేయడంతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లో అవసరం మేరకు చేర్పులు చేస్తోంది.
  • మీనం దక్కాలంటే.. తాళం తప్పదు ఇంటికి తాళం వేస్తాం.. బైక్‌ తాళం వేస్తాం.. కానీ ఇక్కడ చేపలకు తాళం వేస్తున్నారు.
  • కాళేశ్వరంలో దర్శనాలు ఇకపై బాలాలయంలో... దక్షిణ కాశీగా పేరొందిన కాళేశ్వర క్షేత్రంలో బుధవారం సాయంత్రం నుంచి పూజలు, భక్తుల ప్రవేశాలు నిలిపివేశారు.
  • కీటకాల వేటగాడు... కవ్వాల్‌లో దిగాడు! గోరింక పరిమాణంలో ఉండే చిన్న గుడ్లగూబ ఇది. ఆకురాల్చే అరణ్యాలు, టేకుచెట్లతో కూడిన మిశ్రమ అడవుల్లో ఆవాసాలు ఏర్పరుచుకునే ఈ పక్షి జాతి...
  • మేలుజాతి సన్నరకాలకు ప్రోత్సాహం వ్యవసాయం లాభదాయకం కావాలని.. రైతులు ఆర్థికంగా ఎదగాలని.. పేదలు సన్నబియ్యం తినాలని.. జాతీయంగా, అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్న 7 మేలుజాతి సన్న రకాల సాగును ప్రజాప్రభుత్వం ప్రోత్సహిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
  • ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఐఎస్‌వో గుర్తింపు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌ నాలుగు విభాగాల్లో అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ(ఐఎస్‌ఓ) గుర్తింపు ఇచ్చింది.