అమరావతి ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్‌లో అడ్డగోలు కోతలు

- A
- A+
- A++

ఈనాడు, అమరావతి: రాజధాని ప్రాంతానికి కీలకమైన అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) ప్రాజెక్ట్‌కు త్వరలో కేంద్రం ఆమోదం తెలిపి.. భూసేకరణ, టెండర్ల ప్రక్రియ మొదలవుతుందని ఎదురుచూస్తున్న తరుణంలో.. షాకింగ్ నిర్ణయాలు వెలుగులోకి వచ్చాయి. ఓఆర్‌ఆర్‌లో తెనాలి నుంచి రాజధాని ప్రాంతానికి అనుసంధానం చేసేలా కాజ వరకు నిర్మించతలపెట్టిన స్పర్ (లింక్) రోడ్డు ప్రతిపాదనను పక్కనపెట్టారు. రింగ్‌రోడ్డుకు ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మించేలా ప్రతిపాదించగా.. అందులో బయటివైపు సర్వీస్ రోడ్లు అవసరం లేదంటూ నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్ట్ వ్యయం తగ్గింపు పేరుతో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) దిల్లీ అధికారులు తీసుకున్న.. అడ్డగోలు నిర్ణయాలతో ఈ ప్రాజెక్ట్‌కు తీవ్ర అన్యాయం జరిగేలా ఉంది. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకోకుండా ఏకపక్షంగా ప్రాజెక్ట్‌లో కోతలు పెట్టారు. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి, కేంద్రంపై ఒత్తిడి తీసుకురాకపోతే తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉంది.
రూ.38,450 కోట్లతో వెళ్లిన ప్రతిపాదన
- 189.4 కిలోమీటర్ల మేర ఆరు వరుసల ఔటర్ రింగ్ రోడ్డు, దానికి ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్లతో ప్రతిపాదనలు పంపారు.
- ఓఆర్‌ఆర్ నుంచి రాజధానికి సులువుగా చేరుకునేందుకు వీలుగా తెనాలి సమీపంలో ఓఆర్‌ఆర్ నుంచి కాజ వద్ద చెన్నై-కోల్‌కతా హైవే వరకు 17.5 కి.మీ. మేర ఆరు వరుసలతో స్పర్ రోడ్డును ప్రతిపాదించారు.
- ఓఆర్‌ఆర్‌లో నారాకోడూరు నుంచి గుంటూరు శివారులోని బుడంపాడు వద్ద చెన్నై-కోల్‌కతా హైవే వరకు 5.2 కిలోమీటర్లతో నాలుగు వరుసలతో మరో స్పర్ రోడ్డును ప్రతిపాదించారు.
- మొత్తంగా భూసేకరణ, సివిల్ పనులు, ఇతర అనుమతులు తదితరాలు అన్నింటికి కలిపి ఈ ప్రాజెక్ట్‌కు రూ.38,450 కోట్లు వ్యయమవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు ఎన్‌హెచ్‌ఏఐ ఏపీ అధికారులు.. దిల్లీకి ప్రతిపాదనలు పంపారు.
ప్రాజెక్ట్ వ్యయం ఎక్కువగా ఉందంటూ..
- ప్రాజెక్ట్ వ్యయం ఎక్కువగా ఉందంటూ.. ఏపీ నుంచి వెళ్లిన ప్రతిపాదనల్లో కొన్నింటిని తొలగిస్తూ ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
- ఇందులో ఓఆర్‌ఆర్‌లో తెనాలి నుంచి కాజ వరకు నిర్మించాలనుకున్న స్పర్ రోడ్డును పూర్తిగా పక్కనపెట్టారు.
- ఓఆర్‌ఆర్‌కు కేవలం లోపలివైపు మాత్రమే సర్వీస్ రోడ్లు చాలంటూ, బయటివైపు సర్వీస్ రోడ్ల నిర్మాణ ప్రతిపాదనను తొలగించారు.
- వీటివల్ల ప్రాజెక్ట్ వ్యయం దాదాపు రూ.6,500 కోట్లు తగ్గించి, రూ.32 వేల కోట్లకు పరిమితం చేశారు.
తూర్పు బైపాస్ స్థానంలో స్పర్ రోడ్డు తెచ్చినా..
విజయవాడకు పశ్చిమం వైపు 47.8 కిలోమీటర్ల మేర బైపాస్ ఉండటంతో, తూర్పు వైపున కూడా 49 కిలోమీటర్ల మేర బైపాస్ నిర్మించేలా గతంలో ప్రతిపాదించారు. దీనికి డీపీఆర్ కూడా సిద్ధమైంది. అయితే ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ మంజూరు చేసే సమయంలో.. దానికి సమీపం నుంచే విజయవాడ తూర్పు బైపాస్ వెళుతుండడంతో, ఈ బైపాస్ ప్రతిపాదనను ఎన్‌హెచ్‌ఏఐ ఉపసంహరించింది. దాని స్థానంలో ఓఆర్‌ఆర్‌లో తెనాలి సమీపం నుంచి కాజ వరకు స్పర్ రోడ్డును ప్రతిపాదించింది. దీనివల్ల రాజధాని అమరావతి ప్రాంతం నుంచి ఓఆర్‌ఆర్‌కు సులువుగా అనుసంధానం ఏర్పడుతుందని అంతా భావించారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈ స్పర్ రోడ్డు ప్రతిపాదనను తొలగించారు.
పట్టుబట్టి సర్వీస్ రోడ్లు సాధించినా..
తొలుత ఓఆర్‌ఆర్‌కు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్) అలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ 2024, డిసెంబరు 20న ఆమోదం తెలిపినప్పుడు.. సర్వీస్ రోడ్లు వద్దని అందులో పేర్కొంది. అవసరమైతే ఓఆర్‌ఆర్ లోపలివైపు సర్వీస్ రోడ్డు ప్రతిపాదనను పరిశీలించాలని సూచించింది. అయితే దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి.. ఓఆర్‌ఆర్‌కు ఇరువైపులా సర్వీస్ రోడ్లు ఉండాల్సిందేనని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీతో పలు దఫాలు దీనిపై చర్చించారు. దీంతో ఇరువైపులా రెండేసి వరుసలతో సర్వీస్ రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదన పంపాలంటూ ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు ఇక్కడి అధికారులు డీపీఆర్‌లో వాటిని పొందుపరిచి పంపారు. తాజాగా ఓఆర్‌ఆర్ బయటివైపు సర్వీస్ రోడ్ల ప్రతిపాదనను పక్కనపెట్టారు.
అమరావతి-ఓఆర్‌ఆర్ మధ్య దగ్గర దారి ఏదీ?
ఎన్‌హెచ్‌ఏఐ తాజా నిర్ణయంతో.. రాజధాని ప్రాంతంతోపాటు, తాడేపల్లి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన వారికి ఓఆర్‌ఆర్ దూరం కానుంది. కాజ నుంచి తెనాలి వద్ద ఓఆర్‌ఆర్ వరకు స్పర్ రోడ్డు ఉంటే.. అది దగ్గర మార్గంగా ఉండేది. ఇప్పుడు ఆ ప్రతిపాదనను తొలగించడంతో.. వారంతా గుంటూరు శివారులోని చెన్నై-కోల్‌కతా హైవేలో బుడంపాడు వరకు వెళ్లి అక్కడి నుంచి స్పర్ రోడ్డులో ప్రయాణించి నారాకోడూరు వద్ద ఓఆర్‌ఆర్‌లోకి చేరుకోవాల్సి ఉంటుంది.
వెంటనే మేల్కొనకపోతే.. పూడ్చలేని నష్టం
ఓఆర్‌ఆర్ డీపీఆర్ ఆమోదం తెలిపే ప్రతిపాదన కేంద్రంలోని ఎన్‌హెచ్‌ఏఐ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ముందుకు వెళ్లనుంది. అక్కడ ఆమోదం లభించాక, కేంద్ర మంత్రిమండలి భేటీలో తుది నిర్ణయం తీసుకుంటారు. ఈలోపు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు మేల్కొనకపోతే ఓఆర్‌ఆర్ ప్రాజెక్ట్‌కు తీవ్రనష్టం జరుగుతుంది. రాజధాని అమరావతిని ఓఆర్‌ఆర్‌తో అనుసంధానం చేసే తెనాలి-కాజ స్పర్ రోడ్డు ఉండాల్సిందేనని, ఓఆర్‌ఆర్‌కు బయటివైపు కూడా సర్వీస్ రోడ్డు ఎట్టిపరిస్థితుల్లో నిర్మించాల్సిందేనని తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకురావాలి. నిర్మాణానికి వినియోగించే కంకర, గ్రావెల్ వంటి ఖనిజాలకు చెందిన సీనరేజ్ ఫీజు నుంచి మినహాయింపు, సిమెంట్, స్టీల్ తదితరాలన్నింటికి రాష్ట్ర జీఎస్టీ మినహాయింపు.. కలిపి దాదాపు రూ.1,200 కోట్లు భరించేందుకు రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. భూసేకరణ వ్యయంలో కూడా రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తామని చెప్పింది. అయినాసరే ఇప్పుడు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని? కేంద్రాన్ని ప్రశ్నించాలి. ఇక్కడి నుంచి వెళ్లిన ఓఆర్‌ఆర్ పూర్తిస్థాయి ప్రతిపాదనకు ఆమోదం తెలపాలని, ఎటువంటి మార్పులు, కోతలు ఉండకూడదని గట్టిగా పట్టుబట్టాలి.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 17 Jun 2026 05:47 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఈ మాజీ జవాన్.. ఓ ‘రుధీరుడు’! అత్యవసర సమయాల్లో రక్తం అవసరమైన వారి పాలిట అపద్బాంధవుడిలా నిలుస్తున్నారు వైఎస్సార్ కడప జిల్లా కొండాపురానికి చెందిన ఐటీబీపీ మాజీ కమాండో హాజీవలి.
- క్లస్టర్ ఉపాధ్యాయులకు ఎంత కష్టం.. ఎంత నష్టం! ప్రభుత్వ పాఠశాలల్లో మిగులుగా తేలిన క్లస్టర్ ఉపాధ్యాయుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. విద్యార్థులు, ఉపాధ్యాయ నిష్పత్తి ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 4 వేలకు పైగా ఉపాధ్యాయులు మిగులుగా తేలారు.
- క్యాన్సర్ కట్టడికి ‘బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్’ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. బాధితుల్లో 70% మంది 40-69 ఏళ్ల వయసువారు ఉంటున్నారు. 2020-25 మధ్య క్యాన్సర్ కొత్త కేసుల్లో జాతీయ సగటు పెరుగుదల 12.8% ఉంటే, రాష్ట్రంలో 39.5% ఉంది.
- పట్టణాభివృద్ధికి రూ.5,940 కోట్లు పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) కోసం రెండో విడతగా రూ.5,940 కోట్ల ప్రాజెక్టులను ప్రభుత్వం ప్రతిపాదించింది.
- వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్! రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో ప్రవేశపెట్టిన ఏఐ ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో డేటా విశ్లేషణ, పన్నుల రిటర్నుల పరిశీలన, ఆడిట్, తనిఖీలు సులభమయ్యాయి.
- తితిదేకు రూ.కోటి విరాళం తితిదే శ్రీవేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు హైదరాబాద్‌కు చెందిన రక్షిత్ ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్ సీహెచ్‌పీ రామేశ్వరరావు, శ్రీసాయిచందన ఏపీఐ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్ ఉద్దగిరి తాతారావులు రూ.50 లక్షల చొప్పున రూ.కోటి విరాళం అందించారు.
- శ్రీవారి సర్వదర్శనానికి పోటెత్తిన భక్తులు శ్రీవారి సర్వదర్శనానికి శనివారం భక్తులు పోటెత్తారు. వారాంతంలో వరుస సెలవులు రావడంతో తిరుమలకు క్యూకట్టారు.
- వ్యర్థం.. అయ్యింది చక్కటి రూపం! సాధారణంగా పంట కాలువలు, చెరువుల్లో గుర్రపు డెక్క పెరుగుతూ ప్రవాహానికి అడ్డుగా మారుతుంటుంది. ఏటా వాటిని తొలగించేందుకు రైతులు పడే ప్రయాస అంతాఇంతా కాదు.
- ఇలపై వివాహం.. నింగిలో విహారం హెలికాప్టర్‌లో ఒక్కసారైనా తిరగాలని కలలుకన్న ఆ యువకుడు.. దాన్ని తన వివాహం రోజు నిజం చేసుకున్నాడు. గుంటూరు గ్రామీణ మండలం లాలుపురానికి చెందిన ప్రత్తిపాటి సాయికుమార్ డప్పు కళాకారుడు.
- దానయ్య కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసిన తెదేపా దానయ్య కుటుంబానికి రూ.5 లక్షలు అందజేసిన తెదేపా
- తెదేపా కేంద్ర కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో స్వాతంత్య్రదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండా ఎగరేశారు.
- హస్త కళాకారులకు అందుబాటులో వుడ్ బ్యాంకులు హస్తకళల పరిరక్షణ, ఆయా రంగాలపై ఆధారపడ్డ కళాకారులకు ముడి సరకు కొరత లేకుండా చేయడమే లక్ష్యంగా.. రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం వద్ద అటవీశాఖ ఏర్పాటుచేసిన సెంట్రల్ క్రాఫ్ట్ వుడ్ బ్యాంకును ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ ప్రారంభించారు.
- క్వార్టర్‌కు అదనంగా రూ.10 పిండుకుందాం! మద్యం దుకాణాల లీజు గడువు మరో రెండు నెలల్లో ముగియనుండటంతో ఎమ్మార్పీ కంటే అధిక ధర వసూళ్లకు యజమానులు తెరలేపారు. చివర్లో అందిన కాడికి దండుకుందామన్నట్లు కూడబలుక్కుని ఒక్కో సీసాపై రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు.
- ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడికి రంగం సిద్ధం ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్‌లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్, వేఫర్ తదితర ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
- చరిత్ర ఘనం.. సేవలు మరువం ఈ చిత్రంలో కనిపిస్తున్న వింటేజ్ వాహనం పేరు ‘ఎలన్ మెమోరియల్ బ్లూ వ్యాన్’. వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని గ్రామీణ ప్రజలకు ‘క్యాంబెల్ ఆసుపత్రి’ తరఫున వైద్య సేవలు అందించేందుకు 1958-60 ప్రాంతంలో ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చారు.
- భలే ఉంది.. బుల్లి గేదె! చూడటానికి చిన్నగా, చూడముచ్చటగా ఉన్న ఈ గేదె ముర్రా జాతికి చెందినది.
- విశిష్ట సేవలందించిన అధికారులకు పతకాలు పోలీసు, జైళ్ల శాఖలో విశిష్ట సేవలు అందించినందుకు గాను పలువురు అధికారులకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గతంలో ప్రకటించిన పతకాలను ఆయా అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం ప్రదానం చేశారు.
- ప్రగతి నిరోధక మానసిక తీవ్రవాది జగన్: మంత్రి సత్యకుమార్ ఎంత అభివృద్ధి చేసినా ఏమీ జరగలేదంటూ ప్రజల్లో నిరాశ, నిస్పృహలు నింపే ప్రగతి వ్యతిరేక మానసిక తీవ్రవాదుల పట్ల అప్రమత్తంగా ఉండాలని దేశ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారని, మన రాష్ట్రంలోనూ ఆ కోవకు చెందిన వ్యక్తులు ఉన్నారని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు.
- జెండా ఎగరేయడానికి తీరిక లేదా జగన్? ‘‘గంజాయి బ్యాచ్‌లను పరామర్శించేందుకు ఉన్న తీరిక జాతీయ జెండా ఎగరేయడానికి లేదా? రోడ్లపై అరాచకాలు సృష్టించి సామాన్యుల ప్రాణాలు తీసేందుకు..
- స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్‌పై 18న అసెంబ్లీలో చర్చ స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపై ఈ నెల 18న శాసనసభలో చర్చించనున్నారు.