జులై మూడో వారంలో‘తల్లికి వందనం’

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 17 Jun 2026 05:38 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, అమరావతి: ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చదివే అర్హులైన ప్రతి విద్యార్థికీ ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సాయం అందించేందుకు అన్ని చర్యలూ తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల, ఉన్నత విద్య అధికారులతో మంగళవారం సమీక్షించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్‌ పరిశీలన ప్రక్రియ త్వరలో పూర్తవుతుందని, జులై మూడో వారంలో వారి బ్యాంకు ఖాతాల్లో నిధుల జమకు అన్ని చర్యలూ తీసుకుంటున్నామని ఈ సందర్భంగా అధికారులు మంత్రికి వివరించారు. పది, ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులతో ఈ నెల 29న షైనింగ్‌ స్టార్స్‌ కార్యక్రమం, జులై మూడో వారంలో తల్లిదండ్రులు-టీచర్ల సమావేశం, మిగులు ఉపాధ్యాయుల సర్దుబాటు తదితర అంశాలపై అధికారులతో మంత్రి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ‘ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు పెంచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. ఎప్‌సెట్, పాలిసెట్, ఆర్‌సెట్‌ లాంటి 12 రకాల ప్రవేశాల కౌన్సెలింగ్‌ జాప్యం లేకుండా నిర్ణీత సమయంలో జరిగేలా చర్యలు తీసుకోవాలి. విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా కౌన్సెలింగ్‌ తేదీలను ఖరారు చేయాలి. ప్రభుత్వ ఇంజినీరింగ్, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో సీట్లను పెంచేందుకు పరిశీలించాలి’ అని సూచించారు.  

‘జాతీయ, అంతర్జాతీయ విద్యాసంస్థలు థాపర్‌ ఇన్‌స్టిట్యూట్, జేమ్స్‌ కుక్, మెల్‌బోర్న్, మేధావి స్కిల్‌ యూనివర్సిటీలు, జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, రీసెర్చ్‌ లాంటివి తమ విద్యా సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. జీఎంఆర్‌ మాన్సాస్‌ ఏవియేషన్‌ యూనివర్సిటీ ఏర్పాటును వేగవంతం చేయాలి. యువతకు మరింత సైనిక శిక్షణ, ప్రోత్సాహం అందించేందుకు రాష్ట్రానికి కేంద్రం మంజూరు చేసిన ఎన్‌సీసీ డైరెక్టరేట్‌ ఉపయోగపడుతుంది’ అని లోకేశ్‌ పేర్కొన్నారు. పాలిటెక్నిక్‌ కళాశాలల్లో మెకానికల్, సివిల్‌ విభాగాల సీట్లకు డిమాండ్‌ ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ సమీక్షలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, ఉన్నత విద్య కమిషనర్‌ నారాయణ భరత్‌గుప్తా, సమగ్ర శిక్షా అభియాన్‌ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆహార వ్యర్థాలను.. ఆర్గానిక్‌గా మార్చేద్దాం! వంట గదిలో వ్యర్థాల నిర్వహణ పెద్ద సమస్యే. ఆహార పదార్థాలతో పాటు కూరగాయల వ్యర్థాలు ఎక్కువగానే మిగిలిపోతుంటాయి.
  • పాద ముద్రలతో చెప్పేయొచ్చు మనుషుల వేలిముద్రలు ఎలా కచ్చితమైన సమాచారాన్నిస్తాయో... అడవుల్లో వన్యప్రాణుల పాదముద్రలు(పగ్‌ మార్క్స్‌) వాటి ఉనికిని స్పష్టంగా బయటపెడతాయి.
  • 85 వేల మొక్కల్లో వందేమాతరం స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 150 ఏళ్ల వందేమాతర స్ఫూర్తిని నేటి తరాలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మొక్కలతో ప్రత్యేకంగా దాని ఆకృతిని తీర్చిదిద్దారు తూర్పుగోదావరి జిల్లా కడియం నర్సరీ రైతులు.
  • రూపాయికే బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌ సీజీఎం శేషాచలం వెల్లడి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బి.ఎస్‌.ఎన్‌.ఎల్‌. ఏపీ సర్కిల్‌ వినియోగదారుల కోసం ఫ్రీడం 2.0 మొబైల్‌ పేరుతో రూపాయికే సిమ్‌ అందిస్తోందని ఆ సంస్థ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం వెల్లడించారు.
  • ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్న నలుగురు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌ రాజకీయ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నారనే కారణంతో వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయులను, అనంతపురం జిల్లాలో ఒకరిని ఆ జిల్లాల విధ్యాశాఖాధికారులు సస్పెండ్‌ చేశారు.
  • నేను గర్వంగా ఫీలవుతున్నా.. బెయిల్‌పై విడుదలయ్యాక సీదిరి అప్పలరాజు ‘నేను చాలా గర్వంగా ఫీల్‌ అవుతున్నా. ఒక సాధారణమైన ప్రమాదాన్ని నేరపూరిత హత్య అంటూ జైలుకు పంపించారు.
  • అగ్నిమాపక శాఖకు అధునాతన వాహనాలు అగ్ని ప్రమాదాలు, విపత్తుల సమయంలో ప్రజల ప్రాణాలు, ఆస్తులు కాపాడేందుకు అగ్నిమాపక శాఖను మరింత ఆధునికంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
  • నవ్యాంధ్ర రాజధానిలో చరిత్రాత్మక ఘట్టం ప్రజా రాజధాని అమరావతిలో తొలిసారి నిర్వహించే రాష్ట్రస్థాయి స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • సాంకేతికత ఓ సాధనం మాత్రమే.. కృత్రిమ మేధ (ఏఐ) యుగంలో న్యాయవాదులు సృజనాత్మకతతో ఆలోచించడం మరిచిపోవద్దని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ లిసా గిల్‌ పేర్కొన్నారు.
  • ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యమం తాత్కాలిక వాయిదా విద్యుత్‌ బస్సులు సహా ఉద్యోగులకు చెందిన వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ ఆర్టీసీ ఉద్యోగ సంఘాల ఐకాస చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా వాయిదా పడింది.
  • పదోన్నతులపై నిషేధాన్ని ఎత్తివేయాలి రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలు కోసం ఉద్యోగుల పదోన్నతులపై పెట్టిన నిషేధాన్ని తొలగించాలని ఉపాధ్యాయ సంఘాల నేతలు డిమాండ్‌ చేశారు.
  • చెరువులను ఆక్రమిస్తే జీవాలకు మేత ఎలా? గొర్రెలు, పశువులు, మేకల మేతకు అనుకూలంగా ఉన్న చెరువు భూములను కొంత మంది ఆక్రమించుకొని పంటల సాగు చేయడంతో మూగజీవాలను ఎక్కడ మేపుకోవాలని గొర్రెల కాపర్లు తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గొర్రెల మందలతో నిరసనకు దిగారు.
  • అసెంబ్లీ సమావేశాలకు భద్రతలో రాజీ పడొద్దు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భధ్రత ఏర్పాటుచేయాలని, సభ్యులకు అసౌకర్యం కలగకుండా చూడాలని శాసనమండలి ఛైర్మన్‌ కొయ్యే మోషేనురాజు, శాసనసభాపతి చింతకాయల అయ్యన్నపాత్రుడు పోలీసు అధికారులను ఆదేశించారు.
  • మూడేళ్ల బుడతడు.. రాకెట్‌లా దూసుకెళ్లాడు 79 కి.మీ. స్కేటింగ్‌ పూర్తి చేసి ఔరా అనిపించాడు మూడేళ్ల బుడతడు దక్షిత్‌(3).
  • ఆలయాల్లో ఉప ముఖ్యమంత్రి సతీమణి పూజలు ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ సతీమణి అన్నా కొణిదెల కాకినాడ జిల్లాలోని ప్రముఖ ఆలయాలను సందర్శించారు.
  • ఎస్‌.కోటలో రూ.200 కోట్లతో హిలోరా రిసార్ట్‌ రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిచ్చేలా మరో భారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.
  • అందంతో కట్టిపడేసే ఫ్లెమింగో పక్షులు పొడవాటి ముక్కు, ఎత్తయిన కాళ్లతో చూడటానికి అందంగా కనిపిస్తున్న ఇవి ఫ్లెమింగో పక్షులు.
  • తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు..! నాకేం తెలీదు.. గుర్తులేదు.. సంబంధం లేదు.. ఇవి పోలీసుల కస్టడీలో ఉన్న వైకాపా నేత చింతాడ రవికుమార్‌ చెబుతున్న సమాధానాలు. వైకాపా అధ్యక్షుడు జగన్‌ గత నెల 30న శ్రీకాకుళం జిల్లాకు వచ్చినప్పుడు.. బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా ఎస్సై పట్ల దౌర్జన్యంగా ప్రవర్తించిన కేసులో చింతాడ రవి రిమాండ్‌ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.
  • ‘భోగాపురం.. ఆహా’రం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే ప్రయాణికులకు విమానాల్లో అందించే ఆహారం(ఇన్‌ఫ్లైట్‌ క్యాటరింగ్‌) తయారీకి ఎన్‌కామ్‌ స్కై ప్లేట్స్‌ సంస్థ ఇక్కడే వంటశాల భవనాన్ని ఏర్పాటు చేసింది.
  • ఏడుగురు రాష్ట్ర పోలీసులకు శౌర్య పతకాలు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొత్తం 23 మంది పోలీసు అధికారులకు కేంద్ర హోంశాఖ పతకాలు ప్రకటించింది.