ఈదురుగాలులతో భారీ వర్షం.. కారుపై ప్రహరీ గోడ కూలి ఇద్దరి మృతి

- A
- A+
- A++

దేవరకద్ర గ్రామీణం: మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్రలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించి ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. కారుపై ప్రహరీగోడ కూలడంతో జగన్నాథరెడ్డి, సంతోష్ మృతిచెందారు.
ఎస్సై భాస్కర్‌రెడ్డి, స్థానికులు తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి. దేవరకద్ర మండలంలోని చౌదర్‌పల్లి, బల్సుపల్లి, దేవరకద్ర, పెద్దగోప్లాపూర్ గ్రామాల్లో భారత్‌మాల రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈ పనుల నిమిత్తం తిరుపతి నుంచి జగన్నాథరెడ్డి (40), పశ్చిమబెంగాల్ నుంచి సంతోష్(35) వచ్చి కాంట్రాక్టర్ కింద పనిచేస్తున్నారు. జగన్నాథరెడ్డి అకౌంటెంట్‌గా, సంతోష్ డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బుధవారం సాయంత్రం ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురవడంతో పనిముగించుకొని అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు చేరుకున్నారు.
భారీగా వర్షం కురుస్తుండటంతో ఇద్దరూ కారులోనే కూర్చొని ఉన్నారు. అదే సమయంలో భారీగా ఈదురుగాలులు వీయడంతో పక్కనే ఉన్న ప్రహారీ గోడ కూలి కారుపై పడింది. దీంతో కారు పూర్తిగా ధ్వంసమైంది. అందులో జగన్నాథరెడ్డి, సంతోష్ ఇరుక్కుపోయారు. గమనించిన స్థానికులు.. వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో జిల్లా ఆస్పత్రికి తరలించారు. మార్గంమధ్యలోనే వారు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. ఘటనాస్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి పరిశీలించారు.
► Read latest Mahbubnagar Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పోరాట ఫలం.. ప్రగతే లక్ష్యం [ 16-08-2026] స్వాతంత్య్రం ఒక్క రోజులో లభించింది కాదు.. ఎందరో మహనీయుల పోరాటాలు, త్యాగాలు, బలిదానాల ఫలితంగా సిద్ధించింది.
- ప్రజలకు ససేమిరా.. అక్రమార్కులు హద్దుమీరి [ 16-08-2026] జడ్చర్ల నియోజకవర్గంలో ఇసుక మాఫియాకు అడ్డూఆపూ లేకుండా పోతోంది.. తమను అడ్డుకునే వారు లేరంటూ దర్జాగా ట్రాక్టర్లతో పగలు, రాత్రి తేడా లేకుండా వాగు నుంచి ఇసుకను తరలిస్తున్నారు.
- గురువుల చేతికి ఏఐ అస్త్రం [ 16-08-2026] సర్కారు బడుల్లో వెనకబడిన పిల్లలవిద్యా సామర్థ్యాల పెంపునకు మరో ముందడుగు పడింది. ఇందుకు సాంకేతిక సాయాన్ని వినియోగించుకోనుంది.
- తూర్పున మల్లన్న.. పశ్చిమాన వెంకన్న.. [ 16-08-2026] నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండల కేంద్రంలో ఎన్నో గుట్టలున్నాయి. ఇక్కడ గుట్టగుట్టకూ ఓ పేరుంది. లింగాలకు తూర్పున మల్లయ్య గుట్ట, ఆగ్నేయాన ఈదమ్మ గుట్ట, పడమర తిరుమలయ్య గుట్ట ఉన్నాయి.
- పోస్టులు ఖాళీ.. వైద్యం గాలికి [ 16-08-2026] జడ్చర్లలో 167వ జాతీయ రహదారి పక్కనున్న ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రి భవనం చూస్తే ఎంతో మెరుగైన సేవలు అందిస్తున్నారనుకుంటారు.
- బాగున్నాయను‘కోనేరు’ [ 16-08-2026] పవిత్ర కోనేర్లు కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. నిర్వహణ లేక మురుగు, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వెదజల్లుతున్నాయి. గోడలు శిథిలావస్థకు చేరాయి.
- పతకాల ‘పంచ్’ [ 16-08-2026] ఒకవైపు చదువులోనూ, మరోవైపు ఆటల్లోనూ రాణిస్తున్నారు. ప్రతిభ చూపి స్వర్ణ, రజత పతకాలు సాధించి ఆదర్శంగా నిలుస్తున్నారు. చిన్న వయసులోనే జిల్లా, రాష్ట్రస్థాయిల్లో తలపడుతున్నారు.
- లారీ ఢీకొని మహిళ దుర్మరణం [ 16-08-2026] లారీ డ్రైవర్ నిర్లక్ష్యం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందారు.
- బియ్యం.. అందక దైన్యం [ 16-08-2026] పేదలకు ప్రతి నెల రేషన్ బియ్యం అందించాల్సిన ప్రజా పంపిణీ వ్యవస్థ జిల్లాలో అస్తవ్యస్తంగా తయారైంది. ప్రతి నెల 1-15వ తేదీ వరకు కార్డుదారులకు రేషన్ బియ్యం అందించాలనే నిబంధనలున్నాయి.
- వేగ నిరోధకాలు లేక ప్రమాదాలు [ 16-08-2026] నాగర్‌కర్నూల్ పట్టణంలోని పలు ప్రధాన రహదారులపై వేగనిరోధకాలు లేక వాహనచోదకులు ప్రమాదాలకు గురవుతున్నారు. రోడ్లపై నిత్యం వాహనాల రద్దీ ఎక్కువగా ఉండటం, కొందరు అతి వేగంగా వెళ్తూ జనాలకు ఇబ్బందులు కలిగిస్తున్నారు.
- మాటేస్తారు.. కాజేస్తారు [ 16-08-2026] వృద్ధులు, అమాయకులు వారి లక్ష్యం.. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాలు, జన సమూహం ఉన్న చోటే వారి మకాం. అదును చూసి నగదు దోచేస్తారు.. జనం తేరుకునే లోపు పరారవుతారు.. వారే దొంగలు.
- అర్హతకు మించి వైద్యం.. వికటిస్తే బేరం [ 16-08-2026] జిల్లాలో కొందరు పారామెడికల్ కోర్సు చేయకుండా.. చికిత్స అందించడంలో ఎక్కడా శిక్షణ పొందకుండా.. అనుమతి లేకుండా ఆస్పత్రులు పెట్టి వైద్యుల అవతారం ఎత్తి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
- పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే లక్ష్యం : మంత్రి వాకిటి శ్రీహరి [ 15-08-2026] పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, పేదలకు నాణ్యమైన సన్నబియ్యం అందించడమే ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యం అని మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.
- ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేత [ 15-08-2026] జిల్లా కేంద్రంలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవాల్లో గట్టు ఎస్సై శేఖర్ గౌడ్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కంప్యూటర్ ఆపరేటర్ నాగార్జున విశిష్ట సేవా పురస్కారాలు అందుకున్నారు.
- పర్యావరణ పరిరక్షణకు చేయూతనివ్వండి [ 15-08-2026] జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోయిల్ దిన్నె గ్రామంలోని చిరంజీవి యువత ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.
- విద్యార్థులకు ప్యాడ్లు వితరణ [ 15-08-2026] 80వ స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ‘ధర్మజ్ క్రాప్ గార్డ్ లిమిటెడ్’పురుగు మందుల కంపెనీ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు, పెన్నులు పంపిణీ చేశారు.
- రెపరెపలాడిన మువ్వన్నెల జెండా [ 15-08-2026] స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ జెండాను ఎగరవేశారు.
- గొంతు కోసుకుని వ్యక్తి ఆత్మహత్య యత్నం [ 15-08-2026] నాగర్ కర్నూల్ జిల్లా ఊర్కొండ మండల కేంద్రంలో కాళిదాసు అనే వ్యక్తి రహదారిపై బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు.
- పాలమూరు.. ప్రగతి సెలయేరు [ 15-08-2026] పాలమూరు.. తెలంగాణలో వెనకబడిన జిల్లాగా.. పంటల్లేక, ఉపాధి దొరక్క వలసల జిల్లాగా.. గుక్కెడు నీటి కోసం మైళ్ల దూరం నడిచిన ప్రాంతాలు.. ఇవన్నీ ఒకప్పటి దుర్భర పరిస్థితులు.
- రైళ్లు ఇక రయ్‌రయ్! [ 15-08-2026] గద్వాల నుంచి కర్నూలుకు 52 కి.మీ. విస్తీర్ణంలో రెండో రైల్వేలైన్ ఏర్పాటుకు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రైల్వేలైన్ సమీప భూముల్లో హద్దుల ఏర్పాటు కొనసాగుతోంది.
- పల్లెదారులు.. పట్టించుకోరు పాలకులు [ 15-08-2026] జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల పరిస్థితి అధ్వానంగా మారింది. బీటీ రోడ్లకు నిర్వహణ లేకపోవడంతో పలుచోట్ల గుంతలమయంగా తయారయ్యాయి.
- మభ్యపెట్టి.. ముట్టజెప్పి [ 15-08-2026] దోచుకోగలిగిన వారికి దోచుకున్నంత అన్న పెద్దల మాట ఇసుక అక్రమార్కులకు సరిపోలుతుంది. టీజీఎండీసీ పేరిట ఒక వైపు, ఆన్‌లైన్ ఇసుక పేరిట మరో వైపు అనుమతులు.. ఇవన్నీ కేవలం కొందరు వ్యక్తులకు మాత్రమే లభిస్తాయి.
- చిన్నారుల్లో పెరుగుతున్న దేశభక్తి [ 15-08-2026] చిన్నారులకు చిన్నప్పటి నుంచే దేశంపై ప్రేమ, దేశభక్తి కలిగి ఉండేలా వారికి అవగాహన కల్పించాలి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందుకు తగు చొరవ చూపాలి.
- వైద్యుల కొరత.. రోగుల కలత [ 15-08-2026] అత్యవసర విభాగాలు.. శస్త్ర చికిత్సలు.. డయాలసిస్ సేవలు.. రేడియాలజీ కేంద్రం ఇలా.. అన్నీ ఉన్నాయి. కానీ, చికిత్స అందించే వైద్యులే సరిపడా లేరు.
- కూచూరు.. సైనికుల ఊరు [ 15-08-2026] నవాబ్‌పేట మండలం కూచూరు.. దీనిని ఆర్మీ గ్రామంగా పిలుస్తుంటారు. ఇక్కడ 400కు పైగా కుటుంబాలు, దాదాపు 2 వేల జనాభా ఉంది.
- డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం [ 15-08-2026] మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్ పట్టణంలోని 44వ జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని ప్రయాణికులు తెలిపారు.
- పోలీసుల అదుపులో ద్విచక్ర వాహనాల చోరీ నిందితుడు [ 15-08-2026] తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీ చేస్తూ వాటిని విక్రయించి సొమ్ము చేసుకుంటున్న నలుగురు నిందితులను పెబ్బేరు పోలీసులు అరెస్టు చేశారు.
- మానవ అక్రమ రవాణా.. ఇద్దరి అరెస్టు [ 15-08-2026] ఏపీ నుంచి కూలీలను తరలించి వారితో చేపలవేట చేయిస్తూ... కూలి చెల్లించకుండా వెట్టిచాకిరీ చేయిస్తున్నారని ఇద్దరు చేపల వ్యాపారులను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.