గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణ.. ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ: పొంగులేటి

Eenadu icon
By Telangana News Team Published : 17 Jun 2026 20:57 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హైదరాబాద్‌: గుడిసెలు లేని రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా గుడిసెలను గుర్తించేందుకు సమగ్ర సర్వే చేయాలని అధికారులను ఆదేశించారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు ప్రక్రియపై అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమంలో సుమారు 75 వేల మంది తాము గుడిసెల్లో నివసిస్తున్నామని దరఖాస్తు చేసుకున్నారని.. క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హుల జాబితాను సిద్ధం చేయాలన్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు ఇప్పుడు కూడా స్థానిక ఎంపీడీవో కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. 

కులం, మతం, పార్టీ అనే తేడా లేకుండా అర్హులను గుర్తించాలని మంత్రి దిశానిర్దేశం చేశారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న పేదలకే మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపారు. నియోజకవర్గానికి రెండు వేల చొప్పున, రాష్ట్రవ్యాప్తంగా రెండున్నర లక్షల ఇళ్లు మంజూరు చేసినందున.. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తి చేయాలని ఆదేశించారు. పేదల నివాస భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం రూఫ్ రీప్లేస్‌మెంట్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. అసెంబ్లీ నియోజకవర్గానికి 500 చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 50 వేల ఇళ్లను ఈ పథకం కింద ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. గోడలు, పునాదులు బలంగా ఉన్నప్పటికీ పైకప్పులు టార్పాలిన్ షీట్లు, రేకులు, నాపరాళ్లతో పాటు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న వాటిని గుర్తించి స్లాబ్ నిర్మాణం కోసం రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందించనున్నట్లు మంత్రి చెప్పారు.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • నకిలీ గుర్తింపుతో పాస్‌పోర్టులు.. వీసాకు ప్రయత్నించి అరెస్టు వేర్వేరు పేర్లు, పుట్టిన తేదీలతో బహుళ పాస్‌పోర్టులు తీసుకొని అమెరికా వీసా పొందేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
  • చికిత్స పొందుతూ టీజీ20 లీగ్‌ యువ క్రికెటర్‌ మృతి వ‌రంగ‌ల్ జిల్లా క‌రీమాబాద్‌కు చెందిన యువ క్రికెట‌ర్ విశ్వనాథ్ వైష్ణవ్ (21) మృతి చెందారు.
  • రేవంత్‌వి అసత్యాలు.. నిరుద్యోగులే గుణపాఠం చెబుతారు: హరీశ్‌రావు సంగారెడ్డి సభలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంపై బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు.
  • గింజ... ఒంటికి పట్టాలంటే! శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాలు కావాలి. ఆ పోషకాలు ఎండు గింజల్లో (డ్రైనట్స్‌) పుష్కలం. అందుకే చాలామంది రోజూ డ్రైనట్స్‌ను తీసుకుంటూ ఉంటారు.
  • ‘రూ.వెయ్యి కోట్లు ఇచ్చినా అలాంటి నేత దొరకరు..’: సీఎం రేవంత్ రెడ్డి కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సంగారెడ్డిలో సీఎం రేవంత్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
  • భాజపా, బీఆర్‌ఎస్‌ ఒకే నాణేనికి బొమ్మా బొరుసు: సీఎం రేవంత్‌ భాజపా, బీఆర్‌ఎస్‌ పార్టీలు నాణేనికి బొమ్మా బొరుసుల్లాంటివని సీఎం రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఏనాడైనా పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన చేశాయా? అని ప్రశ్నించారు.
  • అర్హులందరికీ రేషన్‌ కార్డులిస్తాం: మంత్రి ఉత్తమ్‌ రాష్ట్రంలోని అర్హత కలిగిన అందరికీ రేషన్‌కార్డులను మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు.
  • వరంగల్‌-హైదరాబాద్‌ హైవేపై ప్రమాదం: బాలిక మృతి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌లో హైదరాబాద్‌ - వరంగల్‌ జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొంది.
  • కాంగ్రెస్‌ది తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం: కేంద్రమంత్రి బండి సంజయ్‌ పాతబస్తీ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద లక్షలాది మందితో సామూహిక వందేమాతరం గీతాలాపన చేయిస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు.
  • రాష్ట్ర నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదు: రేవంత్‌రెడ్డి తెలంగాణ నీటి హక్కుల విషయంలో రాజీ పడేది లేదని, పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.
  • ఊరూరా జెండా పండుగ.. తెలంగాణలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు తెలంగాణ వ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రతి వీధిలో మువ్వన్నెల జెండా రెపరెపలాడుతోంది. పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వీధుల్లో ప్రజాప్రతినిధులు,  విద్యార్థులు జెండాను ఎగురవేశారు. దీంతో ఎక్కడ చూసినా సందడి వాతావారణం నెలకొంది. 
  • 89 మిల్లుల్లో రూ.927 కోట్ల ధాన్యం మాయం! రాష్ట్రంలో కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుండటంతో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
  • స్వాతంత్య్రోద్యమ దీపధారులకు జేజేలు స్వాతంత్య్ర దినోత్సవ శుభ సందర్భంగా, ప్రతి భారతవాసికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ ప్రచారంలో భాగంగా ఈ నెల 9న అండమాన్, నికోబార్‌ దీవుల పర్యటనలో మన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించాను.
  • నాలుగున్నరేళ్లకే ఫీజు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్‌ కోర్సుల్లో చేరే విద్యార్థులు నాలుగున్నర సంవత్సరాల కాలానికి మాత్రమే ఫీజులు చెల్లిస్తే సరిపోతుందని రాష్ట్ర ప్రవేశాలు, రుసుముల నియంత్రణ సంస్థ(టీఏఎఫ్‌ఆర్‌సీ) శుక్రవారం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
  • పత్తి.. బంగారమే భారత్‌లో పత్తి... బంగారంగా మారుతోందని, దేశీయ వినియోగం పెరగడంతో పాటు ఎగుమతులు వృద్ధి చెందుతున్నాయని కాటన్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ లలిత్‌కుమార్‌ గుప్తా చెప్పారు.
  • ప్రతి విద్యార్థికీ సంపూర్ణంగాఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ డబ్బులు సంపూర్ణంగా ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. ఏటా రూ.2,400 కోట్లు ముందస్తుగా బ్యాంకు ఖాతాల్లో వేసేందుకు సిద్ధం చేసుకున్నామన్నారు.
  • పైన రేకులు... చుట్టూ బహిరంగం! చుట్టూ ప్రశాంతమైన వాతావరణంలో టీచర్‌ బోర్డుపై రాస్తూ పాఠాలు చెబుతున్నప్పుడే విద్యార్థులు ఏకాగ్రతతో వింటుంటారు. కానీ ఇక్కడి పిల్లలకు అటువంటి సదుపాయాలేమీ లేవు.
  • గెలలొచ్చే.. గలగల తెచ్చే రెండు నెలలుగా గెలల రాక లేక బోసిపోయిన ఆయిల్‌పాం కర్మాగారాలు ఒక్కసారిగా కళకళలాడుతున్నాయి.
  • దేశ ప్రగతిని విపక్షాలు అడ్డుకుంటున్నాయి విదేశీ శక్తులతోపాటు స్వదేశంలోనే కొందరు భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని, దేశ ప్రగతిని అడ్డుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నారని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి ఆరోపించారు.
  • ‘బయో ఎనర్జీ’పై కర్ణాటకతో కలిసి పనిచేస్తాం జీవ ఇంధన (బయో ఎనర్జీ) రంగంలో కర్ణాటకతో కలిసి పనిచేయడానికి, రాబోయే రోజుల్లో మరింత పెట్టుబడులను ఆకర్షించేందుకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.