మీనాక్షీ నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ.. ఇంతకీ ఆ కేసు ఏమిటంటే..

Eenadu icon
By Telangana News Desk Updated : 10 Jun 2026 05:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, హైదరాబాద్‌: ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మీనాక్షీ నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆ వ్యవహారం తెలంగాణతో ముడిపడి ఉండటంతో అసలు కేసు ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. వాస్తవంగా న్యాయస్థానంలో దాఖలైన ఓ పిటిషన్‌కు సంబంధించి ఆమెకు సమన్లు మాత్రమే జారీ అయ్యాయి. ఇవీ ఆ కేసు పూర్వాపరాలు... ఓ మహిళను లైంగిక వేధింపులకు గురిచేయడంతోపాటు చంపుతానని బెదిరించిన వ్యవహారంలో నారాయణపేట కాంగ్రెస్‌ నాయకుడు కుంభం శివకుమార్‌రెడ్డిపై పోలీసు కేసు నమోదైంది. ఆ కేసు ఆధారంగా.. ఆయనపై పార్టీపరంగా చర్యలు తీసుకునేందుకు నిరాకరించిన మీనాక్షీ నటరాజన్‌తోపాటు కుంభం శివకుమార్‌రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్నికరెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్, మంత్రి వాకిటి శ్రీహరి, నారాయణపేట డీసీసీ అధ్యక్షుడు కె.ప్రశాంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ నాయకుడు చిట్టెం అభిజయ్‌రెడ్డి తదితరులపై చర్యలు తీసుకోవాలని, నష్టపరిహారం కింద రూ.10 కోట్లు చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ గత ఏడాది ఆగస్టు 28న తార్నాకకు చెందిన ఎ.శ్రీలత హైదరాబాద్‌ నాలుగో అదనపు ఛీప్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు.

‘తనను వేధించిన కుంభం శివకుమార్‌రెడ్డిపై 2022, మే నెల 7న పంజాగుట్ట, 2023 జూన్‌ 28న బెంగళూరులోని కుబ్బన్‌ పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. అతడిని అరెస్టు చేయాలంటూ పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ వద్ద నేను నిరసనకు దిగడంతో నారాయణ్‌పేట జిల్లా కమిటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్ఠానానికి అనేకమార్లు పిర్యాదు చేసినా పట్టించుకోలేదు. మీనాక్షీ నటరాజన్‌ దృష్టికి తీసుకెళ్లగా..శివకుమార్‌రెడ్డిని పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్‌ చేశామని చెప్పారు. సస్పెన్షన్‌కు సంబంధించిన ధ్రువపత్రం ఇవ్వమని అడిగితే ఆమె స్పందించలేదు. నమోదైన కేసుకు సంబంధించి ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ తిరస్కరణకు గురైన తర్వాత కూడా కాంగ్రెస్‌ పార్టీ ఆయన్ను ఎన్నికల కౌంటింగ్‌ ఏజెంట్‌గా నియమించింది. నారాయణపేట ఎమ్మెల్యే పర్నికరెడ్డి, ఆయన ఒకే వేదికపై ఆశీనులయ్యారు’ అని ఆమె ఆ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని మీనాక్షీ నజరాజన్‌కు ముందు ఏఐసీసీ రాష్ట్ర బాధ్యతలు చూస్తున్న దీపాదాస్‌ మున్షీ దృష్టికి కూడా తీసుకెళ్లానని...ఆమె పర్నికరెడ్డి, శివకుమార్‌రెడ్డిలను గాంధీభవన్‌కు పిలిపించారని, అప్పుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ కూడా ఉన్నారని పిటిషన్‌లో వివరించారు. శివకుమార్‌రెడ్డి స్థానంలో డీసీపీ అధ్యక్షులుగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత మంత్రి అయిన వాకిటి శ్రీహరి కూడా తనకు న్యాయం చేయలేదని, కాబట్టి వీరందరిపై చర్యలు తీసుకొని నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని పిటిషన్‌లో కోరారు. ఆ పిటిషన్‌ను పరిశీలించిన న్యాయస్థానం మీనాక్షీ నటరాజన్‌ సహా పలువురికి సమన్లు జారీ చేసింది. రాజ్యసభ నామినేషన్‌ పత్రాల్లో ఈ విషయాన్ని పేర్కొనలేదనే కారణంగా ఎన్నికల కమిషన్‌ ఆమె నామినేషన్‌ను తిరస్కరించింది.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 04:36 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ‘పెద్దవాగు’పై చిన్నచూపు తెలంగాణ, ఏపీ సరిహద్దుల్లో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టుపై రెండు రాష్ట్రాలు చిన్నచూపు చూస్తున్నాయి.
  • ప్రజాప్రతినిధుల కోర్టుకు వెళ్లండి! మీనాక్షి నటరాజన్‌పై నాంపల్లి కోర్టులో దాఖలైన పిటిషన్‌కు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. 
  • ఐసెట్‌లో 46,654 మంది పాస్‌ ఐసెట్‌లో 91.22 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 56,206 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 51,146 మంది పరీక్ష రాశారు.
  • ఈ బడుల్ని ఎప్పుడు బాగుచేస్తారు? సూర్యాపేట జిల్లా నూతనకల్‌ మండలం దిర్శనపల్లి మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల భవనం పరిస్థితి ఇది. ఏళ్ల కిందట నిర్మించిన భవనం గోడలు నెర్రెలిచ్చాయి.
  • చిన్నారికి అరుదైన వ్యాధి.. ఆదుకుంటామని సీఎం రేవంత్‌రెడ్డి భరోసా జన్యుపరమైన ఎస్‌ఎంఏ టైప్‌-2 అరుదైన వ్యాధితో బాధపడుతున్న చిన్నారి ఆర్యాన్ష్‌ చికిత్సకు సంబంధించి సీఎం రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు.
  • పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయం పదవీ విరమణ వయసు పెంపు ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో కోర్టులు జోక్యం చేసుకోలేవని హైకోర్టు తేల్చి చెప్పింది.
  • ఆదాయపు పన్ను నోటీసుల కొట్టివేత మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 271డి కింద ఆదాయపు పన్ను శాఖ ఇచ్చిన నోటీసులను హైకోర్టు శుక్రవారం కొట్టివేసింది.
  • గ్రేడ్‌-2 ఈవోలకు గ్రేడ్‌-1గా పదోన్నతులు దేవాదాయ శాఖలో గ్రేడ్‌-2 కార్యనిర్వహణ అధికారులు(ఈవో)గా పనిచేస్తున్న 26 మందికి గ్రేడ్‌-1 ఈవోలుగా పదోన్నతి కల్పించారు.
  • వ్యవసాయ అంకురాలకు ప్రోత్సాహం వ్యవసాయ అంకురాలను ప్రోత్సహించడానికి బయోనెస్ట్‌ కో ఇంక్యుబేషన్‌ కార్యక్రమం కింద హైదరాబాద్‌లోని జాతీయ వ్యవసాయ పరిశోధన నిర్వహణ సంస్థ(నార్మ్‌)లో మూడు సంస్థలు మధ్య శుక్రవారం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.
  • ‘ఆత్మనిర్భరత’తోనే దేశానికి రక్షణ ఆయుధాల కోసం వేరే దేశాలపై ఆధారపడటం ప్రమాదకరమని ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు నిరూపించాయని భారత వాయుసేన అధిపతి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌సింగ్‌ అన్నారు.
  • ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూసేకరణ ల్యాండ్‌ పూలింగ్‌ విధానంలో భూసేకరణపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆదాయ వనరుల పెంపునకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.
  • సింగరేణిలో 335 మందికి కారుణ్య నియామక పత్రాలు సింగరేణిలో కారుణ్య నియామకాలకు అర్హత సాధించిన 335 మందికి శనివారం మంచిర్యాలలో ఉద్యోగ నియామక పత్రాలను అందజేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు.
  • ఓట్ల వేటలో కేంద్రం దొంగదారి కాంగ్రెస్‌ బలంగా ఉన్న రాష్ట్రాల్లో ఓట్లతోపాటు సీట్లనూ కేంద్ర ప్రభుత్వం కొల్లగొడుతోందని, అందులో భాగమే కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్థి మీనాక్షి నటరాజన్‌ నామినేషన్‌ తిరస్కరణ అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
  • సమ్మక్క బ్యారేజీకి ఎన్వోసీ ఇవ్వండి గోదావరిపై నిర్మిస్తున్న సమ్మక్క బ్యారేజీ అనుమతుల సాధనలో మరో ముందడుగు పడిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు.
  • వచ్చే మార్చి నాటికి బీబీనగర్‌ ఎయిమ్స్‌ అందుబాటులోకి.. బీబీనగర్‌లో నిర్మిస్తున్న ఎయిమ్స్‌ ఆసుపత్రిని వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి వెల్లడించారు.
  • అటు వానలు.. ఇటు వడగాలులు రాష్ట్రంలో ఒకవైపు నైరుతి రుతుపవనాలు విస్తరిస్తుండగా...ఇంకోవైపు వేడిగాలులు భయపెడుతున్నాయి. 16 జిల్లాల పరిధి 63 మండలాల్లో శుక్రవారం వడగాలులు వీచాయి.
  • ప్రియాంక గాంధీని కలిసిన మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ శుక్రవారం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని కలిశారు.
  • పశువుల కొట్టాలుగా రెండు పడకల ఇళ్లు గత ప్రభుత్వ హయాంలో పేదల కోసం చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల సముదాయాలు చాలాచోట్ల అసంపూర్తిగా మిగిలిపోయాయి.
  • రహదారుణాలు రోడ్డు ప్రమాదాలు రాష్ట్రంలో ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నట్ల్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ(మోర్త్‌) తాజా నివేదిక స్పష్టం చేసింది.
  • కమీషన్ల కోసమే సౌర విద్యుత్‌ ప్రాజెక్టులు సింగరేణిలో సౌర విద్యుత్తు ప్రాజెక్టుల పనులు కేవలం కాంగ్రెస్‌ పార్టీ నాయకుల కమీషన్ల కోసమే చేపట్టారని శాసనసభలో భారాస పక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.