


మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం

- A
- A+
- A++
ఈనాడు, విశాఖపట్నం: ప్రస్తుత పరిస్థితుల ఆధారంగా చూస్తే విశాఖ స్టీల్‌ప్లాంటును ఆధునికీకరించాల్సిన అవసరం కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. విశాఖ ఉక్కు దుర్ఘటన బాధితులను పరామర్శించేందుకు మంగళవారం విశాఖ వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10 లక్షలను ప్రభుత్వం పరిహారంగా అందిస్తుందన్నారు. మృతిచెందిన ఒక్కో రెగ్యులర్ ఉద్యోగి కుటుంబానికి అన్నిరకాల ప్రయోజనాలు కలుపుకొని రూ.1.72 కోట్లు, ఒప్పంద ఉద్యోగికి రూ.45 లక్షల పరిహారం అందుతుందని పవన్ పేర్కొన్నారు. ‘‘ప్లాంట్‌లో భద్రతాపరమైన చర్యలు ఎంతవరకు పాటిస్తున్నారో, ప్రధాన సమస్యలు ఏమున్నాయో, గనులు ఏ స్థాయిలో అవసరమో చూడాలి. త్రిసభ్య కమిటీ పరిశీలన అనంతరం.. అన్ని కోణాల్లో అధ్యయనం చేసి, కార్మికుల అభిప్రాయాలు తీసుకొని దీనిపై ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది’’ అని పవన్ కల్యాణ్ అన్నారు. కార్మికులతో త్వరలో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుంటానని చెప్పారు. రాష్ట్రంలో స్టీల్‌ప్లాంటు ప్రైవేటుపరం కాకుండా కాపాడాలని చూసిన వారిలో తానొకడినని, ప్రధాని మోదీ నాయకత్వంలో దీన్ని అలానే కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు.
భద్రత చర్యలు ముఖ్యం
‘‘స్టీల్‌ప్లాంటులో జరిగిన ప్రమాద సంఘటన ఇంకెక్కడైనా జరిగిందా అని వాకబు చేస్తే.. గత 36 ఏళ్లలో ఇదే మొదటిసారి అంటున్నారు. ఇదే తరహా ప్లాంట్ భిలాయ్‌లో ఉంది. మిగిలిన చోట్ల ఉన్నవి కాస్త ఆధునికమైనవి. చైనా, ఫ్రాన్స్‌లో కొన్ని సంఘటనలు జరిగినా ఉక్కు ద్రవం మోసే బకెట్ పేలలేదని యంత్రాంగం చెబుతోంది. యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండి.. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలి. విశాఖ, అనకాపల్లి, పరవాడ ప్రాంతాల్లోని కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు జరుగుతుండడం ఆందోళనకరంగా ఉంది. యాజమాన్యాలు ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ నిర్వహించుకునేలా అధికార యంత్రాంగం చూడాలి. స్టీల్ప్ల్‌ాంట్‌లోనూ కొన్ని భద్రతాపరమైన ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని కొందరు అంటున్నారు. అవన్నీ కమిటీ దృష్టికి వెళ్తాయి. ముఖ్యంగా రసాయన పరిశ్రమల యాజమాన్యాలు ఒకటికి పదిసార్లు భద్రతాపరమైన తనిఖీలు నిర్వహించుకోవడం మేలు’’ అని పవన్‌కల్యాణ్ సూచించారు.
విలేకరుల సమావేశానికి ముందు పవన్‌కల్యాణ్ కిమ్స్, ఎంజీఎం హెల్త్‌కేర్ ఆసుపత్రుల్లోని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కిమ్స్‌లో కింద కూర్చొని ఓ క్షత్రగాత్రుని ఆవేదన విన్నారు. అనంతరం స్టీల్‌ప్లాంటులోని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి.. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు.
అగనంపూడి, న్యూస్‌టుడే: ఉక్కు ప్రమాద మృతులకు మంగళవారం సాయంత్రం ఉక్కు యాజమాన్యం పరిహారం అందజేసింది. అగనంపూడికి చెందిన నక్కరాజు అప్పలరాజు, గొంతిన భానుకుమార్ కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికీ రూ.25 లక్షల చొప్పున చెక్కులను అందజేసింది. మిగతా హామీలను త్వరలోనే అమలు చేస్తామని యాజమాన్య ప్రతినిధులు తెలిపారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 04:29 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మన ప్రయాణం.. భావితరాల కోసమే ‘రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రయాణం కౌన్సిలర్‌గానే ప్రారంభమైంది. జాతీయ నాయకత్వం పల్లెల నుంచే రావాలి. మహిళలు, యువత గ్రామస్థాయి నాయకత్వాన్ని అందిపుచ్చుకోవాలి. సమాజంలో వ్యవస్థాగత విశ్వాసాన్ని మేం తిరిగి నిర్మిస్తున్నాం.
- జగన్ పేరులో జీ అంటే జెన్ జీ కాదు.. గొడ్డలి రాష్ట్రంలో రెండేళ్లుగా సుపరిపాలన అందిస్తున్నామని తెదేపా కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులున్నా దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలోనే అమలు చేస్తున్నామని వివరించారు.
- సంక్షిప్త వార్తలు (11) ‘ఈ రెండేళ్లూ సాగింది ప్రజా పాలన కాదు, రాజకీయ కక్ష సాధింపులు, అరాచకాలు, రెడ్ బుక్ రాజ్యాంగంతో సాగిన భయానక పాలన’ అని ముఖ్యమంత్రి చంద్రబాబుపై మాజీ సీఎం జగన్ ‘ఎక్స్’ వేదికగా విమర్శలు గుప్పించారు.
- గుట్టు పసిగట్టే ‘కిట్’కు ఒకప్పుడు ఏ చిన్న పరీక్ష చేయించాలన్నా.. రక్త నమూనా ఇచ్చి, ప్రయోగశాల చుట్టూ తిరిగి, రిపోర్టు కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది.
- ఉపాధ్యాయులపై గొడ్డలివేటు వేస్తారా? మెగా డీఎస్సీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ.. ఉపాధ్యాయులపై వైకాపా అధినేత జగన్ గొడ్డలివేటు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ ధ్వజమెత్తారు.
- గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహకారంతో ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా ఎక్స్‌పో- 2026’ను విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం ప్రారంభించారు.
- రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్లు ‘ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజనరీ లీడర్లు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.
- చిన్నారి కోసం ఆరు రోజులుగా గాలింపు ఆ చిన్నారి వయసు రెండేళ్లు. ఆరు రోజుల క్రితం.. గత శనివారమే ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియట్లేదు. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క బుధవారమే ఇంటికి చేరినా..
- ‘ఉక్కు’ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని లేఖ రాయలేదా జగన్? విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన వేల ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్ రెండు లేఖలు రాశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
- రాజ్యసభకు తెదేపా, జనసేన అభ్యర్థుల ఏకగ్రీవ ఎంపిక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నలుగురు కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా తరఫున ఎన్నికైన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లు గురువారం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఆర్.వనితారాణి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
- రాజమహేంద్రవరంలో పైలట్ శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద రూ.100 కోట్లతో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో) ఏర్పాటుకు గురువారం ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. జార్విస్ ఏవియేషన్ ఎకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రానికి ఎంపీ భూమిపూజ చేసి, విలేకర్లతో మాట్లాడారు.
- డ్రోన్ దాడి జరిగినా.. ప్రాణాలు కాపాడుకుంటారనుకున్నా ‘మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ... ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నాను. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా. ఆయనకు ఆ అనుభవం ఉంది.
- గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నవారికీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు వైకాపా హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉత్సవాల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి, పాఠశాల స్థాయి క్రీడల్లో ఆడినవారికి కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో క్రీడా కోటాలో ఉద్యోగాలిచ్చారని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు.
- డెన్మార్క్‌లో మినీ మహానాడు వేడుకలు డెన్మార్క్‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎన్నారై విభాగం యూరప్ సమన్వయకర్త అమర్‌నాథ్ పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు తరలివచ్చారు.
- మద్యం రవాణాలోనూ మహా దోపిడీ! మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా.. అందులోనే కాకుండా మద్యం రవాణా కాంట్రాక్టులోనూ దోపిడీకి తెగబడింది. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారాలను జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల నుంచి తప్పించి...
- విశాఖ ఉక్కులో మళ్లీ ప్రమాదాలు విశాఖ ఉక్కు కర్మాగారం స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్‌ఎంఎస్)లో వరుస ప్రమాదాలతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం ఎస్‌ఎంఎస్-1లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతిచెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే.
- ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టేవారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టేవారి ఎస్సీ హోదాను పరిశీలించాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కోరారు. ఇలాంటి కేసుల్లో ఫిర్యాదుదారుడి ఎస్సీ హోదాను పోలీసులు ధ్రువీకరించుకోవాలని పేర్కొన్నారు.
- దేవాదాయశాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను.. దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలనే బ్రాహ్మణుల డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చింది.
- విజయవాడలో కుంభవృష్టి విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరం జలమయమైంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. సెల్లార్లతో పాటు ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
- రహదారుల నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ఏడాదిపాటు అద్దె రాజధాని అమరావతిలో రహదారుల నిర్మాణం సందర్భంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు ఏడాది పాటు రూ.10 వేల చొప్పున అద్దె చెల్లించాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.