
పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం

- A
- A+
- A++

ఈనాడు-విశాఖపట్నం, కూర్మన్నపాలెం, ఉక్కునగరం: ‘స్టీలుప్లాంటు ప్రమాద బాధిత కుటుంబాలకు శాశ్వతంగా అండగా నిలబడతాం. పరిహారం ప్రకటించి చేతులు దులిపేసుకోం. మృతిచెందినవారు ఒప్పంద ఉద్యోగులైనా, శాశ్వత ఉద్యోగులైనా కుటుంబసభ్యుల్లో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తాం. ఈ విషయాన్ని అవసరమైతే కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకెళ్లి ఒప్పిస్తానని ఉక్కుమంత్రి కుమారస్వామి ప్రకటించారు. అసలు ప్యాకేజీ ఇవ్వకుంటే ప్లాంటు తెరుచుకునేది కాదని, ఈ ప్రమాదం జరిగి ఉండేది కాదని కార్మిక నేతలు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా ఆలోచించాలి’ అని మంత్రి నారా లోకేశ్ అన్నారు. స్టీలుప్లాంటు ప్రమాదంలో తీవ్రగాయాలతో కిమ్స్, సెవెన్ హిల్స్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంగళవారం ఆయన పరామర్శించారు. అనంతరం కేజీహెచ్‌లో మృతుల కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ.. ఉక్కు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు, క్షతగాత్రులకు రూ.10లక్షల పరిహారం మంగళవారం రాత్రికే అందిస్తామన్నారు. ప్లాంట్ ద్వారా మృతుల కుటుంబాలకు రావాల్సిన ఎక్స్‌గ్రేషియా, పీఎఫ్ నగదు, తదితరాలు లెక్కించి ఆయా కుటుంబాల ఖాతాల్లో జమచేయించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. ‘విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ కాకుండా కాపాడుకున్నాం. రూ.15వేల కోట్ల ప్యాకేజీ తెచ్చాం. తిరిగి ఉత్పత్తి ప్రారంభించాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రమాదం జరగడం బాధాకరం. నిర్వహణలో, భద్రతలో ఎక్కడా లోపం లేదు. ప్రమాదంపై నిజనిర్ధారణకు కమిటీని నియమించాం. ఏ విషయమైనా కమిటీ పరిశీలనతోనే తెలుస్తుంది’ అని లోకేశ్ తెలిపారు.
స్లరీ పైప్‌లైన్ తీసుకొస్తాం
విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు లేకపోవడంతో నష్టాల్లో ఉందని మీడియా అడిగిన ప్రశ్నకు లోకేశ్ స్పందించారు. ‘దేశంలో చాలా ఉక్కు కర్మాగారాలకు గనుల్లేవు. అన్నిచోట్లా స్లరీ పైప్‌లైన్ వేసి ముడి సరకును తీసుకొస్తున్నారు. విశాఖ ఉక్కుకు స్లరీ పైప్‌లైన్‌ను తీసుకొచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది’ అని లోకేశ్ అన్నారు. కేంద్ర ఉక్కుశాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్రమంత్రులు అనిత, సంధ్యారాణి, సుభాష్, ఎంపీ శ్రీభరత్, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రమాదబాధిత కుటుంబాలను మంత్రి లోకేశ్ కేజీహెచ్‌లో పరామర్శించిప్పుడు మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ఇవ్వాలంటూ అక్కడున్న వామపక్ష పార్టీల నేతలు డిమాండ్ చేశారు. తాము పరిహారం ఇచ్చి చేతులు దులిపేసుకోవడానికి రాలేదని, బాధితులకు అండగా ఉండేందుకు వచ్చామని లోకేశ్ అన్నారు. ఒత్తిడి పెరగడం, నిర్వహణ లేకపోవడంతోనే ప్లాంటులో ప్రమాదాలు జరుగుతున్నాయని, దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు వీవీ శ్రీనివాసరావు, లోక్‌నాథం, ఏవీ నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణమూర్తి, ఇతర కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రాష్ట్రప్రభుత్వమే రక్షించిందని లోకేశ్ చెబుతుండగా, అందుకే అంతమంది చనిపోయారంటూ వెనుక నుంచి ఒకరు వ్యాఖ్యానించారు. దీనిపై లోకేశ్ తీవ్రంగా స్పందించారు. ‘కేంద్ర, రాష్ట్రమంత్రులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కూడా బాధితుల పరామర్శకు వస్తున్నారు. బాధిత కుటుంబాలతో మాట్లాడుతున్నప్పుడు అడ్డుతగిలితే ఎలా? మీరు కర్మాగారంలో పనిచేయడం లేదు, మీ కుటుంబాల్లో ఎవరూ చనిపోలేదు. ప్లాంటు సమస్యలపై కావాలంటే మళ్లీ మాట్లాడదాం. ఇక్కడ రాజకీయం చేయాలంటే బయటకు వెళ్లొచ్చు’ అన్నారు. కార్మికుల పక్షాన పోరాటాలు చేస్తుంటే ఉలికిపాటు ఎందుకని వామపక్ష నేతలు అన్నారు.
అంతకుముందు.. మృతదేహాలను ఉక్కు జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చినప్పుడు అక్కడ వైకాపా జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఇతర నాయకులు ఉన్నారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం చెల్లించాలని వారు కార్యకర్తలతో కలిసి నినాదాలు చేసి, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- గుట్టు పసిగట్టే ‘కిట్’కు ఒకప్పుడు ఏ చిన్న పరీక్ష చేయించాలన్నా.. రక్త నమూనా ఇచ్చి, ప్రయోగశాల చుట్టూ తిరిగి, రిపోర్టు కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది.
- ఉపాధ్యాయులపై గొడ్డలివేటు వేస్తారా? మెగా డీఎస్సీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ.. ఉపాధ్యాయులపై వైకాపా అధినేత జగన్ గొడ్డలివేటు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ ధ్వజమెత్తారు.
- గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహకారంతో ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా ఎక్స్‌పో- 2026’ను విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం ప్రారంభించారు.
- రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్లు ‘ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజనరీ లీడర్లు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.
- చిన్నారి కోసం ఆరు రోజులుగా గాలింపు ఆ చిన్నారి వయసు రెండేళ్లు. ఆరు రోజుల క్రితం.. గత శనివారమే ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియట్లేదు. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క బుధవారమే ఇంటికి చేరినా..
- ‘ఉక్కు’ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని లేఖ రాయలేదా జగన్? విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన వేల ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్ రెండు లేఖలు రాశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.
- రాజ్యసభకు తెదేపా, జనసేన అభ్యర్థుల ఏకగ్రీవ ఎంపిక రాష్ట్రం నుంచి రాజ్యసభకు నలుగురు కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెదేపా తరఫున ఎన్నికైన భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌లు గురువారం అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారిణి ఆర్.వనితారాణి నుంచి ధ్రువీకరణ పత్రాలు అందుకున్నారు.
- రాజమహేంద్రవరంలో పైలట్ శిక్షణ కేంద్రం రాజమహేంద్రవరం విమానాశ్రయం వద్ద రూ.100 కోట్లతో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (ఎఫ్‌టీవో) ఏర్పాటుకు గురువారం ఎంపీ పురందేశ్వరి శంకుస్థాపన చేశారు. జార్విస్ ఏవియేషన్ ఎకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న ఈ కేంద్రానికి ఎంపీ భూమిపూజ చేసి, విలేకర్లతో మాట్లాడారు.
- డ్రోన్ దాడి జరిగినా.. ప్రాణాలు కాపాడుకుంటారనుకున్నా ‘మా ఆయన గల్లంతైన సమాచారం అందినప్పటికీ... ఆయన బతికే ఉంటారని భరోసాతో ఉన్నాను. దాడి జరిగినప్పుడు సముద్రంలోకి దూకి ప్రాణాలు కాపాడుకొని ఉంటారని అనుకున్నా. ఆయనకు ఆ అనుభవం ఉంది.
- గ్రామీణ క్రీడల్లో పాల్గొన్నవారికీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు వైకాపా హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో మహిళా ఉత్సవాల్లో నిర్వహించిన క్రీడా పోటీల్లో పాల్గొన్నవారికి, పాఠశాల స్థాయి క్రీడల్లో ఆడినవారికి కూడా గ్రామ, వార్డు సచివాలయాల్లో క్రీడా కోటాలో ఉద్యోగాలిచ్చారని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ చెప్పారు.
- డెన్మార్క్‌లో మినీ మహానాడు వేడుకలు డెన్మార్క్‌లో మినీ మహానాడు, ఎన్టీఆర్ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎన్నారై విభాగం యూరప్ సమన్వయకర్త అమర్‌నాథ్ పొట్లూరి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ప్రవాసాంధ్రులు తరలివచ్చారు.
- మద్యం రవాణాలోనూ మహా దోపిడీ! మద్యం కుంభకోణంలో రూ.వేల కోట్లు కొల్లగొట్టిన వైకాపా ముఠా.. అందులోనే కాకుండా మద్యం రవాణా కాంట్రాక్టులోనూ దోపిడీకి తెగబడింది. బెవరేజెస్ కార్పొరేషన్ డిపోల నుంచి దుకాణాలకు మద్యం సరఫరా చేసే రవాణా కాంట్రాక్టు ఖరారు చేసే అధికారాలను జిల్లాస్థాయిలో జాయింట్ కలెక్టర్ల నేతృత్వంలోని కమిటీల నుంచి తప్పించి...
- విశాఖ ఉక్కులో మళ్లీ ప్రమాదాలు విశాఖ ఉక్కు కర్మాగారం స్టీల్ మెల్టింగ్ షాప్(ఎస్‌ఎంఎస్)లో వరుస ప్రమాదాలతో ఉద్యోగులు భయభ్రాంతులకు గురవుతున్నారు. సోమవారం ఎస్‌ఎంఎస్-1లో భారీ పేలుడు సంభవించి 9 మంది మృతిచెందగా, మరికొందరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న విషయం విదితమే.
- ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు పెట్టేవారి ఎస్సీ హోదాను ధ్రువీకరించాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు పెట్టేవారి ఎస్సీ హోదాను పరిశీలించాలని ఉప సభాపతి రఘురామకృష్ణరాజు కోరారు. ఇలాంటి కేసుల్లో ఫిర్యాదుదారుడి ఎస్సీ హోదాను పోలీసులు ధ్రువీకరించుకోవాలని పేర్కొన్నారు.
- దేవాదాయశాఖ పరిధిలోకి బ్రాహ్మణ కార్పొరేషన్ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల సంక్షేమశాఖ పరిధిలో ఉన్న బ్రాహ్మణ కార్పొరేషన్‌ను.. దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకురావాలనే బ్రాహ్మణుల డిమాండ్‌ను ప్రభుత్వం నెరవేర్చింది.
- విజయవాడలో కుంభవృష్టి విజయవాడలో గురువారం తెల్లవారుజామున భారీ వర్షం కురిసింది. దీంతో నగరం జలమయమైంది. పలు ప్రాంతాలు నీటమునిగాయి. సెల్లార్లతో పాటు ఇళ్లలోకి భారీగా నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు.
- రహదారుల నిర్మాణంలో ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న వారికి ఏడాదిపాటు అద్దె రాజధాని అమరావతిలో రహదారుల నిర్మాణం సందర్భంగా ఇళ్లు, స్థలాలు కోల్పోతున్న బాధితులకు ఏడాది పాటు రూ.10 వేల చొప్పున అద్దె చెల్లించాలని త్రిసభ్య కమిటీ నిర్ణయించింది.
- డిపాజిటర్లు, అగ్రిగోల్డ్ కేసుల విచారణకు.. ప్రత్యేక కోర్టు ఏర్పాటులో ముందడుగు రాష్ట్రవ్యాప్తంగా ఏపీ డిపాజిటర్ల రక్షణ చట్టం (ఏపీ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ట్) కింద నమోదైన కేసులతో పాటు అగ్రిగోల్డ్ కేసులను విచారించేందుకు విజయవాడ కేంద్రంగా ప్రత్యేక కోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది.
- రాజ్యసభ సీటుపై మీకెందుకు అసహనం? రాజ్యసభ సీటు మాట ఇచ్చిన వాళ్లకు, మాట తీసుకున్న వాళ్లకు సంబంధించిన విషయమని, మధ్యలో మీ అసహనం ఏమిటని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల భాజపా నేతలను ప్రశ్నించారు.
- విద్యుత్తు బస్సులను ఆర్టీసీనే కొనుగోలు చేయాలి ‘ప్రైవేటు ఆపరేటర్ల ద్వారా విద్యుత్తు బస్సులు నడిపే టెండరును రద్దు చేయాలి. ఆర్టీసీనే వాటిని సొంతంగా కొనుగోలు చేసి నడపాలి’ అని ఏపీపీటీడీ (ఆర్టీసీ) ఉద్యోగ సంఘాల ఐకాస డిమాండ్ చేసింది.