

ఒకటి కాదు.. రెండు ప్రమాదాలు

- A
- A+
- A++
ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు.. ఒకేలాంటి రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తేలింది. స్టీల్ మెల్ట్ షాప్ (ఎస్‌ఎంఎస్-1)లో పెను ప్రమాదం జరగడానికి ముందే ఎస్‌ఎంఎస్-2లోనూ దుర్ఘటన జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 3.57 గంటలకు లాడిల్‌లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. కన్వర్టర్ నుంచి సెకండరీ మెటలర్జీకి లాడర్ వచ్చేటప్పుడు కార్ నిలిపి క్రేన్‌తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్ జరిగినట్లు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు నలుగురు, ఇన్‌ఛార్జులు ఇద్దరు, పది మంది కళాసీలు మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా, యోగక్షేమాలు చెబుతూ.. ‘మృత్యుంజయులం’ అంటూ వాట్సప్ గ్రూప్‌లలో మెసేజ్‌లు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4.25 గంటలకు ఎస్‌ఎంఎస్-1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఎస్‌ఎంఎస్-2లో మొదట సెకండరీ మెటలర్జీ వద్ద లాడల్‌లో పేలుడు జరిగింది. ఎస్‌ఎంఎస్-1లో కంటిన్యూ క్యాస్టింగ్ డిపార్ట్‌మెంట్ (సీసీడీ) నుంచి మిషన్-2కు పంపుతుండగా బ్లాస్టింగ్ చోటుచేసుకుంది. ‘నా 30 ఏళ్ల అనుభవంలో ఒకే రకమైన ప్రమాదం ఒకే డిపార్ట్‌మెంట్ అయిన ఎస్‌ఎంఎస్-1, 2లలో చూడటం ఇదే మొదటిసారి’ అని ఐఎన్‌టీయూసీ కార్యదర్శి కోరాడ వెంకట్రావు తెలిపారు.
6 నెలల కిందటే భద్రతపై ఫిర్యాదు
‘విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ అండర్ సెక్షన్ 2(కే) ప్రకారం భద్రతా నిబంధనల ఉల్లంఘన, పునరావృతం అవుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోండి’ అంటూ ఏఐటీయూసీ యూనియన్ కేంద్ర రీజియన్ డిసెంబరు 9న లేబర్ కమిషనర్‌కు లేఖ రాసింది. 2024 జనవరి నుంచి 20 మంది మరణించారని, 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారని అయితే ప్రమాదాలపై విచారణ నివేదికలూ విడుదల చేయలేదని లేఖలో పేర్కొన్నారు. గతేడాది జరిగిన ప్రమాదాల వివరాలతో ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు సైతం ఫిర్యాదుచేశారు.
ఈ అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి
ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించి, సమయం ఇవ్వకుండా ఒత్తిడి పెట్టడంతో ప్రొటోకాల్స్ అమలు కావట్లేదన్న ఆరోపణలున్నాయి. ద్రవపు ఉక్కులో గ్యాస్ పూర్తిగా తొలగించకుండానే ముందుకు పంపారని, అందువల్లే లాడిల్‌లో పేలుడు సంభవించిందనే విమర్శలొస్తున్నాయి. ఉక్కు తయారీలో వాడే ఫెర్రో అల్లాయ్స్ బయట నుంచి కొంటారు. ఇవి కొన్నాళ్లుగా నాసిరకంగా ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సంక్షిప్త వార్తలు (9) తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు మంగళవారం దర్శించుకున్నారు.
- డీఎస్సీలో అవకతవకలు జరిగితే 39 పోస్టుల్ని ఎందుకు ఖాళీగా ఉంచుతారు? డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అవకతవకలు జరిగితే 39 పోస్టుల్ని భర్తీ చేయకుండా ఎందుకు ఖాళీగా ఉంచుతారని వైకాపా నేతల్ని తెదేపా ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
- బరువు మోయలేక.. బాధ ఓర్వలేక! నడవలేని స్థితిలో అమ్మఒడిలో చంటిబిడ్డలా ఉన్న 33 ఏళ్ల ఈ యువతి పేరు పద్మావతి. విజయవాడకు చెందిన కిలాని తులసీరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ఆమె. పుట్టినప్పటి నుంచి నరాల బలహీనతతో శరీరంలోని అవయవాలు పనిచేయక మంచానికే పరిమితమైంది.
- ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ప్రైవేటుకు అప్పగించాలనే నిర్ణయాన్ని విరమించాలి ఏపీఎస్‌ఆర్టీసీలో విద్యుత్ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే దశల వారీగా ఉద్యమ బాట పడతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
- పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం ఆంధ్రప్రదేశ్-మలేసియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని విస్తరించే అవకాశాలపై మలేసియా ప్రతినిధి బృందంతో ఏపీ ఛాంబర్స్ ప్రతినిధులు సమావేశమయ్యారు. సోమవారం విజయవాడలోని ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
- తెదేపా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
- సమస్య మూలాలు తెలుసుకొని పరిష్కరించండి సమస్యల మూలాలు తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపించాలని, జిల్లాస్థాయిలో సాధ్యం కానివి ఉంటే తనకు నోట్ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ అధికారులను ఆదేశించారు.
- అడిలైడ్‌లో మినీమహానాడు ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో మినీమహానాడు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు.
- రామోజీరావు మానవతావాది రామోజీరావు మానవతావాది అని, సమాజం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి కోట్ల రూపాయల విరాళాలు అందజేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
- అమరావతిలో రామోజీ స్మృతివనం ఏర్పాటు చేయాలి తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు పేరుతో రాజధాని అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు, అమరావతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
- పంచ్ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలి ఆర్యవైశ్య సమాజాన్ని, ఆ సామాజికవర్గ నాయకులను సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి అసత్య, అవమానకర, విద్వేషపూరిత దూషణలు చేస్తున్నారంటూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన ఆ సంఘం నాయకులు సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
- స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగ సవరణ చేయాలి స్థానిక సంస్థలను పూర్తిస్థాయి స్థానిక ప్రభుత్వాలుగా మార్చేందుకు 73, 74వ రాజ్యాంగ సవరణలకు మరోసారి చట్ట సవరణ చేయాలని పంచాయతీరాజ్ ఛాంబర్ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
- రీ సర్వేతో భూ సమస్యలకు మోక్షం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన రీ సర్వే ద్వారా తమ భూ సమస్యలకు పరిష్కారం లభించిందంటూ పలువురు రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి పొలాలను సందర్శించి రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
- గాబరా వద్దు!.. ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంది! తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారానికి చెందిన కుప్పాల తేజశ్రీ నాగప్రసాద్(6) (కళ్లజోడు ధరించిన బాలుడు) కుడికన్నుకు ప్లాస్టిక్ గొట్టం తగిలి గాయమైంది.
- చంద్రన్న పలకరించె... అభిమాని పులకరించె ‘సత్యనారాయణ గారూ... సిద్ధాంతంలో కలుద్దాం’ అని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంకకు చెందిన సానబోయిన సత్యనారాయణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇచ్చిన హామీ ప్రకారం ఆ పెద్దాయనను కలిశారు.
- అగ్నిమాపకశాఖకు మరిన్ని వాహనాలు అగ్నిమాపక శాఖకు సేవలందించేందుకు అత్యాధునిక సామర్థ్యాలతో కూడిన శక్తిమంతమైన వాహనాలను ప్రభుత్వం తీసుకువస్తోంది.
- వారాంతపు సెలవులో డ్యూటీకెళ్లి అగనంపూడి పరిధి డొంకాడ పునరావాస కాలనీకి చెందిన నక్కరాజు అప్పలరాజు (40) ఎస్‌ఎంఎస్-1 విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయనది వారాంతపు సెలవు.
- విశాఖ ఉక్కు కర్మాగారంలో పేలుడుకు కారణమేంటి? విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్-1లో భారీ పేలుడు సంభవించడంతో 70-80 అడుగుల పరిధిలో ఉక్కు ద్రవం చిమ్మినట్లు ఎగసిపడింది. పేలుడుకు దారి తీసిన కారణాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. - సోమవారం సాయంత్రం కన్వర్టర్ నుంచి బయలుదేరిన లాడిల్-19ను క్యాస్టింగ్ మెషీన్-2లో పోసేందుకు షిఫ్ట్ ఇన్‌ఛార్జి అనుమతించారు.
- కళ్లెదుటే ఘోరం.. కాపాడలేని దైన్యం ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒప్పంద కార్మికుడు జి.సూరిబాబు.. వేడిని తట్టుకోలేక ఎస్‌ఎంఎస్-1లోని సీసీడీ వాష్ రూంకెళ్లి నీటి కుళాయి కింద ఒళ్లు తడుపుకొన్నారు. అది చూసిన సహచర కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
- తిరుపతి ఎకనమిక్ రీజియన్ సలహా కమిటీకి ముగ్గురు సభ్యుల నియామకం తిరుపతి ఎకనమిక్ రీజియన్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా విద్యావేత్తలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.