ఒకటి కాదు.. రెండు ప్రమాదాలు

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 10 Jun 2026 04:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, విశాఖపట్నం: విశాఖ ఉక్కు కర్మాగారంలో సోమవారం ఒక ప్రమాదం కాదు.. ఒకేలాంటి రెండు ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు తేలింది. స్టీల్‌ మెల్ట్‌ షాప్‌ (ఎస్‌ఎంఎస్‌-1)లో పెను ప్రమాదం జరగడానికి ముందే ఎస్‌ఎంఎస్‌-2లోనూ దుర్ఘటన జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. సోమవారం సాయంత్రం 3.57 గంటలకు లాడిల్‌లో పేలుడు సంభవించి సుమారు 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయింది. కన్వర్టర్‌ నుంచి సెకండరీ మెటలర్జీకి లాడర్‌ వచ్చేటప్పుడు కార్‌ నిలిపి క్రేన్‌తో ఎత్తే సమయంలో ఈ బ్లాస్టింగ్‌ జరిగినట్లు గుర్తించారు. శాశ్వత ఉద్యోగులు నలుగురు, ఇన్‌ఛార్జులు ఇద్దరు, పది మంది కళాసీలు మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ప్రమాదం గురించి తెలిసి తోటి ఉద్యోగులు ఫోన్లు చేయగా, యోగక్షేమాలు చెబుతూ.. ‘మృత్యుంజయులం’ అంటూ వాట్సప్‌ గ్రూప్‌లలో మెసేజ్‌లు పెట్టారు. ఆ తర్వాత కొద్దిసేపటికే 4.25 గంటలకు ఎస్‌ఎంఎస్‌-1లో భారీ పేలుడు సంభవించి 8 మంది అక్కడికక్కడే మరణించారు. ఎస్‌ఎంఎస్‌-2లో మొదట సెకండరీ మెటలర్జీ వద్ద లాడల్‌లో పేలుడు జరిగింది. ఎస్‌ఎంఎస్‌-1లో కంటిన్యూ క్యాస్టింగ్‌ డిపార్ట్‌మెంట్‌ (సీసీడీ) నుంచి మిషన్‌-2కు పంపుతుండగా బ్లాస్టింగ్‌ చోటుచేసుకుంది. ‘నా 30 ఏళ్ల అనుభవంలో ఒకే రకమైన ప్రమాదం    ఒకే డిపార్ట్‌మెంట్‌ అయిన ఎస్‌ఎంఎస్‌-1, 2లలో చూడటం ఇదే మొదటిసారి’ అని ఐఎన్‌టీయూసీ కార్యదర్శి కోరాడ వెంకట్రావు తెలిపారు. 

6 నెలల కిందటే భద్రతపై ఫిర్యాదు

‘విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ యాజమాన్యం భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇండస్ట్రియల్‌ డిస్ప్యూట్‌ అండర్‌ సెక్షన్‌ 2(కే) ప్రకారం భద్రతా నిబంధనల ఉల్లంఘన, పునరావృతం అవుతున్న ప్రమాదాలపై చర్యలు తీసుకోండి’ అంటూ ఏఐటీయూసీ యూనియన్‌ కేంద్ర రీజియన్‌ డిసెంబరు 9న లేబర్‌ కమిషనర్‌కు లేఖ రాసింది. 2024 జనవరి నుంచి 20 మంది మరణించారని, 200 మందికిపైగా క్షతగాత్రులయ్యారని అయితే ప్రమాదాలపై విచారణ నివేదికలూ విడుదల చేయలేదని లేఖలో పేర్కొన్నారు. గతేడాది జరిగిన ప్రమాదాల వివరాలతో ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్‌ ఆఫ్‌ ఫ్యాక్టరీస్‌కు సైతం ఫిర్యాదుచేశారు.

ఈ అంశాలపైనా ప్రత్యేకంగా దృష్టి

ఉత్పత్తి లక్ష్యం నిర్దేశించి, సమయం ఇవ్వకుండా ఒత్తిడి పెట్టడంతో ప్రొటోకాల్స్‌ అమలు కావట్లేదన్న ఆరోపణలున్నాయి. ద్రవపు ఉక్కులో గ్యాస్‌ పూర్తిగా తొలగించకుండానే ముందుకు పంపారని, అందువల్లే లాడిల్‌లో పేలుడు సంభవించిందనే విమర్శలొస్తున్నాయి. ఉక్కు తయారీలో వాడే ఫెర్రో అల్లాయ్స్‌ బయట నుంచి కొంటారు. ఇవి కొన్నాళ్లుగా నాసిరకంగా ఉంటున్నాయనే ఆరోపణలున్నాయి.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • సంక్షిప్త వార్తలు (9) తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావు మంగళవారం దర్శించుకున్నారు.
  • డీఎస్సీలో అవకతవకలు జరిగితే 39 పోస్టుల్ని ఎందుకు ఖాళీగా ఉంచుతారు? డీఎస్సీ క్రీడా కోటా నియామకాల్లో అవకతవకలు జరిగితే 39 పోస్టుల్ని భర్తీ చేయకుండా ఎందుకు ఖాళీగా ఉంచుతారని వైకాపా నేతల్ని తెదేపా ఎమ్మెల్సీలు కంచర్ల శ్రీకాంత్, భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి ప్రశ్నించారు.
  • బరువు మోయలేక.. బాధ ఓర్వలేక! నడవలేని స్థితిలో అమ్మఒడిలో చంటిబిడ్డలా ఉన్న 33 ఏళ్ల ఈ యువతి పేరు పద్మావతి. విజయవాడకు చెందిన కిలాని తులసీరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె ఆమె. పుట్టినప్పటి నుంచి నరాల బలహీనతతో శరీరంలోని అవయవాలు పనిచేయక మంచానికే పరిమితమైంది.
  • ఆర్టీసీలో విద్యుత్తు బస్సులను ప్రైవేటుకు అప్పగించాలనే నిర్ణయాన్ని విరమించాలి ఏపీఎస్‌ఆర్టీసీలో విద్యుత్‌ బస్సులను ప్రైవేటు ఆపరేటర్లకు అప్పగించే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోకపోతే దశల వారీగా ఉద్యమ బాట పడతామని ఆర్టీసీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు హెచ్చరించారు.
  • పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం ఆంధ్రప్రదేశ్‌-మలేసియా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, వ్యాపార సహకారాన్ని విస్తరించే అవకాశాలపై మలేసియా ప్రతినిధి బృందంతో ఏపీ ఛాంబర్స్‌ ప్రతినిధులు సమావేశమయ్యారు. సోమవారం విజయవాడలోని ఏపీ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఇండస్ట్రీ ఫెడరేషన్‌ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.
  • తెదేపా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్‌ తెదేపా తరఫున రాజ్యసభ అభ్యర్థులుగా సానా సతీష్, భాష్యం రామకృష్ణ, చింతకాయల విజయ్‌ సోమవారం నామినేషన్లు దాఖలు చేశారు. శాసనసభ కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వనితారాణికి నామినేషన్‌ పత్రాలు సమర్పించారు.
  • సమస్య మూలాలు తెలుసుకొని పరిష్కరించండి సమస్యల మూలాలు తెలుసుకుని పరిష్కరించేందుకు చొరవ చూపించాలని, జిల్లాస్థాయిలో సాధ్యం కానివి ఉంటే తనకు నోట్‌ పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ అధికారులను ఆదేశించారు.
  • అడిలైడ్‌లో మినీమహానాడు ఆస్ట్రేలియాలోని అడిలైడ్‌ నగరంలో మినీమహానాడు ఘనంగా నిర్వహించారు. స్థానిక తెదేపా ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. కేకు కోసి శుభాకాంక్షలు తెలిపారు.
  • రామోజీరావు మానవతావాది రామోజీరావు మానవతావాది అని, సమాజం ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి కోట్ల రూపాయల విరాళాలు అందజేశారని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు.
  • అమరావతిలో రామోజీ స్మృతివనం ఏర్పాటు చేయాలి తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు రామోజీరావు పేరుతో రాజధాని అమరావతిలో స్మృతి వనం ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్‌ ఉపాధ్యక్షుడు, అమరావతి అభివృద్ధి కమిటీ ఛైర్మన్‌ జాస్తి వీరాంజనేయులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
  • పంచ్‌ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలి ఆర్యవైశ్య సమాజాన్ని, ఆ సామాజికవర్గ నాయకులను సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకొని పంచ్‌ ప్రభాకర్‌ అనే వ్యక్తి అసత్య, అవమానకర, విద్వేషపూరిత దూషణలు చేస్తున్నారంటూ శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన ఆ సంఘం నాయకులు సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
  • స్థానిక సంస్థల బలోపేతానికి రాజ్యాంగ సవరణ చేయాలి స్థానిక సంస్థలను పూర్తిస్థాయి స్థానిక ప్రభుత్వాలుగా మార్చేందుకు 73, 74వ రాజ్యాంగ సవరణలకు మరోసారి చట్ట సవరణ చేయాలని పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ జాతీయ అధ్యక్షుడు వై.వి.బి.రాజేంద్రప్రసాద్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
  • రీ సర్వేతో భూ సమస్యలకు మోక్షం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చేపట్టిన రీ సర్వే ద్వారా తమ భూ సమస్యలకు పరిష్కారం లభించిందంటూ పలువురు రైతులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి పొలాలను సందర్శించి రైతులతో ముఖాముఖిలో పాల్గొన్నారు.
  • గాబరా వద్దు!.. ముఖ్యమంత్రి సహాయ నిధి ఉంది! తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కొత్తపల్లి అగ్రహారానికి చెందిన కుప్పాల తేజశ్రీ నాగప్రసాద్‌(6) (కళ్లజోడు ధరించిన బాలుడు) కుడికన్నుకు ప్లాస్టిక్‌ గొట్టం తగిలి గాయమైంది.
  • చంద్రన్న పలకరించె... అభిమాని పులకరించె ‘సత్యనారాయణ గారూ... సిద్ధాంతంలో కలుద్దాం’  అని పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం కామధేనువులంకకు చెందిన సానబోయిన సత్యనారాయణకు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఇచ్చిన హామీ ప్రకారం ఆ పెద్దాయనను కలిశారు.
  • అగ్నిమాపకశాఖకు మరిన్ని వాహనాలు అగ్నిమాపక శాఖకు సేవలందించేందుకు అత్యాధునిక సామర్థ్యాలతో కూడిన శక్తిమంతమైన వాహనాలను ప్రభుత్వం తీసుకువస్తోంది.
  • వారాంతపు సెలవులో డ్యూటీకెళ్లి అగనంపూడి పరిధి డొంకాడ పునరావాస కాలనీకి చెందిన నక్కరాజు అప్పలరాజు (40) ఎస్‌ఎంఎస్‌-1 విభాగంలో ఒప్పంద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. సోమవారం ఆయనది వారాంతపు సెలవు.
  • విశాఖ ఉక్కు కర్మాగారంలో పేలుడుకు కారణమేంటి? విశాఖ ఉక్కు కర్మాగారం ఎస్‌ఎంఎస్‌-1లో భారీ పేలుడు సంభవించడంతో 70-80 అడుగుల పరిధిలో ఉక్కు ద్రవం చిమ్మినట్లు ఎగసిపడింది. పేలుడుకు దారి తీసిన కారణాలపై పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు. - సోమవారం సాయంత్రం కన్వర్టర్‌ నుంచి బయలుదేరిన లాడిల్‌-19ను క్యాస్టింగ్‌ మెషీన్‌-2లో పోసేందుకు షిఫ్ట్‌ ఇన్‌ఛార్జి అనుమతించారు.
  • కళ్లెదుటే ఘోరం.. కాపాడలేని దైన్యం ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఒప్పంద కార్మికుడు జి.సూరిబాబు.. వేడిని తట్టుకోలేక ఎస్‌ఎంఎస్‌-1లోని సీసీడీ వాష్‌ రూంకెళ్లి నీటి కుళాయి కింద ఒళ్లు తడుపుకొన్నారు. అది చూసిన సహచర కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
  • తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ సలహా కమిటీకి ముగ్గురు సభ్యుల నియామకం తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా విద్యావేత్తలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

English Translation
class="mt-4 mb-2">Not one.. Two dangers
Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 10 Jun 2026 04:03 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

Today, Visakhapatnam: It turned out that there was not one accident at Visakhapatnam steel plant on Monday.. Two identical accidents took place. Before the big accident happened in Steel Melt Shop (SMS-1), it came to light that there was an accident in SMS-2 as well. Around 60 tonnes of steel liquid was spilled when the ladle exploded at 3.57 pm on Monday. It was found that this blasting happened when the car was stopped and lifted with a crane while the ladder was coming from the converter to the secondary metallurgy. Four permanent employees, two in-charges and ten college students escaped from this accident in total 16 people. When fellow employees came to know about the accident, they called and sent messages in WhatsApp groups saying 'Mrityunjayulam', saying 'Mrityunjayulam'. Shortly after that, at 4.25 a.m., a huge explosion occurred in SMS-1, killing 8 people on the spot. In SMS-2 there was an explosion in a ladle at secondary metallurgy first. The blasting took place while SMS-1 was being sent from the Continuous Casting Department (CCD) to Mission-2. 'In my 30 years of experience, this is the first time that I have seen the same type of accident in the same department, SMS-1 and 2,' said INTUC Secretary Korada Venkatarao. 

Complaint on safety less than 6 months ago

'Fatal accidents are happening due to the neglect of safety rules by the management of Visakha Steel Plant. On December 9, the AITUC union wrote a letter to the Labor Commissioner, Central Region, saying, "Take action against repeated accidents and violation of safety rules under Section 2(k) of the Industrial Dispute." The letter stated that since January 2024, 20 people have died and more than 200 people have been injured, but no investigation reports have been released on the accidents. They also complained to the Director of Factories in March of this year with the details of the accidents that happened last year.

Special focus on these issues

There are allegations that the protocols were not implemented as production targets were set and pressured without giving time. It is criticized that the gas in the liquid steel was sent forward without removing it completely, hence the explosion occurred in the ladle. Ferro alloys used in steel making are bought from outside. There are allegations that these have been in poor condition for years.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. No correspondence in this matter.

More

  • News in Brief (9) AP High Court Judge Justice V. Gopalakrishna Rao visited Tirumala Srivari on Tuesday.
  • If there are irregularities in DSC, why are 39 posts vacant? TDP MLCs Kancharla Srikanth and Bhumi Reddy Ramgopal Reddy questioned the leaders of Vaikapa that if there were irregularities in the DSC sports quota appointments, why would they leave 39 posts vacant without filling them? Padmavati is the name of this 33-year-old young woman who is unable to walk like a baby in her mother's lap. She is the daughter of Kilani Tulsi Rao and Nagalakshmi from Vijayawada. Due to neurological weakness since birth, body organs are not functioning and confined to bed.
  • Decision to hand over electric buses to private sector in RTC should be reversed. JAC leaders of RTC unions have warned that if the government does not reverse the decision to hand over electric buses to private operators in APSRTC, they will face a phased movement.
  • State favors investment. Representatives of AP Chambers met with the Malaysian delegation on the possibilities of expanding bilateral trade, investment and business cooperation between Andhra Pradesh and Malaysia. The meeting was held at the AP Chamber of Commerce Industry Federation office in Vijayawada on Monday.
  • Nomination of TDP Rajya Sabha candidates Sana Satish, Bhashyam Ramakrishna and Chintakayala Vijay filed nominations as Rajya Sabha candidates on behalf of TDP on Monday. Nomination papers are submitted to the Returning Officer Vanitarani at the Legislative Assembly Office.
  • Find out the root cause and solve the problem. Chief Secretary Sai Prasad directed the officials to take initiative to find out the root of the problems and to solve them and if there are any which are not possible at the district level, to send him a note.
  • Mini Mahanadu in Adelaide Mini Mahanadu was celebrated in the city of Adelaide, Australia. The program was held under the auspices of the local TDP NRI section. First they paid tribute to NTR's picture by placing flowers. Keku Kosi congratulated.
  • Ramoji Rao was a humanitarian Vizianagaram MP Kalishetti Appalanayudu said that Ramoji Rao was a humanitarian and whenever the society was in trouble, he donated crores of rupees. Akhil Bharat Panchayat Parishad Vice President and Amaravati Development Committee Chairman Jasti Veeranjaneyu appealed to the state government to set up a memorial forest in the capital Amaravati in the name of the proud name of Telugu nation Ramoji Rao.
  • Action should be taken against Panch Prabhakar. On Monday, the leaders of the Arya Vaishya community and the leaders of that community have complained to the local police station that a person named Panch Prabhakar is making false, insulting and hateful insults on the social media. YVB Rajendra Prasad, National President of Panchayati Raj Chamber asked the central government to amend the 73rd and 74th constitutional amendments to convert the local bodies into full-fledged local governments. Many farmers expressed their gratitude to CM Chandrababu saying that their land problems have been resolved through the re-survey undertaken after the alliance government came to power. The Chief Minister visited the farms and had an interview with the farmers. Kuppala Tejashree Nagaprasad (6) of Kothapalli Agrahara, Peravali Mandal, East Godavari District (a boy wearing spectacles) was injured by a plastic pipe on his right eye. Chief Minister Chandrababu Chandrababu assured Satyanarayana, a well-known person from Kamadhenuvulanka of Achanta Constituency of West Godavari District, saying, ``Satyanarayana, we will meet in theory.'' The government is bringing powerful vehicles with state-of-the-art capabilities to serve the fire department. Nakaraju Appalaraju (40) of Aganampudi Paridhi Donkada Rehabilitation Colony works as a contract laborer in the SMS-1 department. Monday is his weekend off.
  • What caused the explosion in Visakhapatnam Steel Factory? A huge explosion occurred in Visakhapatnam steel plant SMS-1, which caused a 70-80 feet blast of liquid steel. The reasons that led to the explosion are not fully clear. - The shift in-charge allowed the ladle-19 that left the converter to be poured into the casting machine-2 on Monday evening. Contract worker G. Suribabu, who was seriously injured in the accident, could not bear the heat and ran the CCD wash in SMS-1 and washed himself under the water tap. The fellow workers were shocked to see it.
  • Appointment of three members to Tirupati Economic Region Advisory Committee. The government has issued an order appointing academicians as members of the Tirupati Economic Region Advisory Committee.