పాలనకు కాదు.. ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్న మోదీ: కాంగ్రెస్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: ఎన్డీయే ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో.. ఎన్నికైన ప్రధానుల్లో నిరంతరాయంగా సుదీర్ఘకాలం కొనసాగిన నేతగా మోదీ (PM Narendra Modi) రికార్డు సృష్టించారు. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ ( Congress) స్పందిస్తూ మోదీపై విమర్శలు గుప్పించింది. ఆయన స్వయంప్రకటిత మైలురాయిని దాటారేమో కానీ, దేశానికి పెద్ద సమస్యగా పరిణమించారని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పేర్కొన్నారు. మోదీ పాలనకు కాకుండా దేశంలో ప్రజాస్వామ్య హత్యకు సారథ్యం వహిస్తున్నారని అన్నారు.
1947 ఆగస్టు 15న జవహర్‌లాల్ నెహ్రూ (Nehru) ఒక అద్భుతమైన మంత్రివర్గానికి అధ్యక్షత వహించి.. భారత ప్రధాని అయ్యారని జైరాం రమేశ్ (Jairam Ramesh) పేర్కొన్నారు. ప్రపంచంలోనే అరుదైన ఆ మంత్రివర్గం పాలనలో ఐదేళ్లలోనే ఆధునిక భారతం ఆవిర్భవించిందన్నారు. 560కి పైగా రాచరిక రాష్ట్రాలను శాంతియుతంగా భారత యూనియన్‌లో విలీనం చేశారని.. భారత రాజ్యాంగాన్ని ఆమోదించారని అన్నారు. దేశంలోని జమీందారీ వ్యవస్థ రద్దు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు, నీటిపారుదల ప్రాజెక్ట్‌లు వంటి నిర్ణయాలతో దేశం ప్రపంచ వ్యవహారాల్లో ఒక శక్తిగా ఆవిర్భవించిందన్నారు. 1947-52 మధ్య నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు దేశం నెలకొల్పిన రికార్డులను మోదీ చరిత్ర నుంచి చెరిపేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.
- నేడు ఎన్డీయే భేటీ
1952, 1957, 1962 ఎన్నికల్లో నెహ్రూ భారీ మెజారిటీతో విజయం సాధించగా.. 2024లో మోదీకి కనీస మెజారిటీ కూడా రాలేదని జైరాం రమేశ్ ఎద్దేవా చేశారు. ప్రధాని కావడానికి ఎన్డీఏ నేతలకు తాయిళాలు ఇచ్చి మద్దతు కూడగట్టుకోవాల్సి వచ్చిందన్నారు. మోదీ పరిపాలనలో స్వతంత్ర ఎన్నికల సంఘం, పవిత్రమైన ఓటర్ల జాబితా వంటి ప్రజాస్వామ్య వ్యవస్థలు ముప్పులో పడ్డాయన్నారు. పేపర్ లీక్‌ల కుంభకోణాలతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ప్రైవేటీకరణ పేరుతో ఎన్నో ప్రభుత్వ ఆస్తులను కొందరు ధనవంతుల పరం చేస్తున్నారని దుయ్యబట్టారు. షెడ్యూల్డ్ కులాలు, తెగలు ఇతర వెనకబడిన తరగతులకు (OBC) కల్పించిన రిజర్వేషన్లను బలహీనపరుస్తున్నారని విమర్శించారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
- వరుస అగ్నిప్రమాదాలు.. దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం Delhi: వరుస అగ్నిప్రమాదాల నేపథ్యంలో తక్కువ ఎత్తున్న నివాస భవనాలలో కూడా అగ్నిమాపక భద్రతా చర్యలను తప్పనిసరి చేసేలా చట్టాలను తేవాలని దిల్లీ ప్రభుత్వం యోచిస్తోంది.
- పెట్రోల్ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్ Petrol: పశ్చిమాసియా పరిణామాలతో ముడిచమురు రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- మా ఆవిడ కుట్లు, అల్లికలతో రూ.కోట్లు సంపాదించింది మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ ప్రభుత్వ ఉద్యోగి నివాసంలో లోకాయుక్త పోలీసులు జరిపిన సోదాల సందర్భంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
- అనిశ్చితిలోనూ పరుగు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితి, అస్థిరత నెలకొన్నా అభివృద్ధి పథంలో భారత్ దూసుకెళ్తోందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
- ఇక్కడ పిటిషన్.. అక్కడ ఏకగ్రీవం మధ్యప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికలు గురువారం కీలకమలుపు తిరిగాయి. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
- అభిషేక్ వల్లే పార్టీ సర్వనాశనం తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో అసమ్మతి సెగలు చల్లారడం లేదు. ముఖ్యంగా మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ పనితీరుపై ఆగ్రహంగా ఉన్న నేతలు ఒక్కొక్కరు తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు.
- ఈశాన్యంలో సాయుధ బలగాల చట్టం తొలగిస్తాం: అమిత్ షా ఒకట్రెండు రాష్ట్రాలు మినహా మిగిలిన ఈశాన్య ప్రాంతం మొత్తం నుంచి వచ్చే ఏడాది సాయుధ బలగాల ప్రత్యేక అధికారాల చట్టం (ఏఎఫ్‌ఎస్‌పీఏ) ఉపసంహరిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురువారం ప్రకటించారు.
- గృహిణులు జాతి నిర్మాతలు కుటుంబానికే పరిమితమైనట్లుగా కనిపించే గృహిణుల సేవలు వాస్తవానికి దేశ నిర్మాణానికీ ఎంతగానో దోహదపడతాయని సుప్రీంకోర్టు పేర్కొంది.
- మణిపుర్‌లో ఆగని హింసాకాండ మణిపుర్‌లో గిరిజన తెగల మధ్య హింస ఆరని కుంపటిలా రగులుతోంది.
- నౌకలో చిక్కుకున్న క్షిపణి వార్‌హెడ్ వెలికితీత ముడిచమురు రవాణా నౌకలో పేలని స్థితిలో ఉన్న క్షిపణి వార్‌హెడ్‌ను భారత నౌకాదళం విజయవంతంగా వెలికితీసి, సురక్షితంగా నిర్వీర్యం చేసింది.
- విద్యుత్తు కోసం ప్రధానికి 48 గ్రామాల రుధిర లేఖలు ఛత్తీస్‌గఢ్‌లోని ఉదంతీ - సీతానదీ పులుల అభయారణ్యం పరిధిలో గల 48 గ్రామాల ప్రజలు లైన్లు లాగి విద్యుత్తు సదుపాయం కల్పించాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి 700కు పైగా లేఖలను రక్తంతో రాసి, స్పీడ్‌పోస్టులో పంపారు.
- కలిసిన మనసుల ‘ఇష్టపది..’ ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థల చేయూతతో యువ దివ్యాంగులకు ఓ జీవనమార్గం దొరికినా.. ఆ దారిలో కడదాకా నడిచేందుకు కుటుంబ మద్దతు ఎంతో అవసరం.
- సీబీఎస్‌ఈ లోపాలు బయటపెట్టిన నిసర్గను ఇంజినీర్‌గా నియమించుకున్న ఐఐటీ కాన్పూర్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఈ ఏడాది ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్‌ఎం) మూల్యాంకన ప్రక్రియలో లోపాల్ని బయటపెట్టిన నిసర్గ అధికారి(19)ని ఐఐటీ కాన్పుర్ విధుల్లో నియమించుకుంది.
- దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమం ఆర్థిక సంక్షోభం, నిత్యావసరాల ధరల పెరుగుదల, నిరుద్యోగం, పరీక్ష పేపర్ల లీక్‌లవంటి సమస్యలపై దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమం చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
- చిన్నారుల మానసిక పరీక్షకు ఆషామాషీగా అనుమతివ్వరాదు భార్యాభర్తల వివాదాల కేసుల్లో వారి పిల్లలను కేవలం సాక్ష్యాధార వస్తువులుగా పరిగణించరాదని, ఆషామాషీగా వారి మానసిక పరీక్షకు ఆదేశించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
- 90 నిమిషాలు ఇలా చేసి చూడండి ఒక ముఖ్యమైన పనిని ఎంచుకోండి. దానికి 90 నిమిషాల సమయాన్ని కేటాయించండి.
- ఇటు నిఫా.. అటు షిగెల్లా ఒకపక్క నిఫా, మరోవైపు షిగెల్లా బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ కేసులు కేరళలో పెరుగుతున్నాయి.
- ప్రమాదంలో అచేతనుడైన ఆటోడ్రైవర్‌కు అండగా నిలిచిన సుప్రీంకోర్టు భారీవర్షంలో చెట్టు కొమ్మ విరిగిపడటం వల్ల అచేతనుడైన ఆటోడ్రైవర్‌కు మద్దతుగా సుప్రీంకోర్టు తనకున్న విశేష అధికారాలను ఉపయోగించి అసాధారణ నిర్ణయం తీసుకుంది.
- అయోధ్య విరాళాల వివాదంపై నిష్పక్షపాత విచారణ కోరిన మహంత్ అయోధ్య రామ మందిర విరాళాలు, కానుకల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలని రామ మందిర ట్రస్టు అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ వారసుడు మహంత్ కమల్ నయన్ గురువారం కోరారు.