అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు

- A
- A+
- A++

దిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రాజెక్టు ప్రకటించింది. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి సంబంధించి సీపీడబ్ల్యూడీ ప్రతిపాదనలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీంతో అమరావతిలో రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ కోసం రూ.1,299.08 కోట్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాస సముదాయాలకు రూ.1,234.91 కోట్లు వెచ్చించనుంది. కామన్‌సెంట్రల్ సెక్రటేరియట్‌లో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువుదీరనున్నాయి. అమరావతి కేంద్రంగా పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మల్టీస్టోరీడ్ నివాసాలు ఏర్పాటు చేయనున్నారు. సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం కోసం ఇప్పటికే సీఆర్‌డీఏ 22.53 ఎకరాలు కేటాయించింది. ఇందులో 5.53 ఎకరాల్లో సెక్రటేరియట్, 17 ఎకరాల్లో నివాస సముదాయం నిర్మాణం చేపట్టనున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 14:12 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- వివాహేతర సంబంధం.. డ్రైవర్‌ను చంపిన యజమాని వైఎస్‌ఆర్ కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని అటవీ ప్రాంతంలో యువకుడి మృతదేహం లభ్యం కావడం కలకలం రేపింది.
- తిరుపతి ఎస్వీయూలో చిరుత కలకలం తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో చిరుత సంచారం కలకలం రేపింది.
- సురేశ్ కుటుంబానికి సాయమందించండి.. సీఎం చంద్రబాబు ఆదేశం ఇటీవల ఒమన్ తీరంలో నౌకపై అమెరికా చేసిన దాడిలో విశాఖ వాసి సురేశ్ పట్నాల మృతి చెందిన విషయం తెలిసిందే.
- దారుణం.. కళాశాల సిబ్బందిపై మాజీ ప్రిన్సిపల్ కుమారుడు కత్తులతో దాడి బాపట్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. చీరాల మండలం ఈపురుపాలెంలో ఓ ఐటీఐ కళాశాలలో ఘర్షణ జరిగింది.
- వెంటిలేటర్‌పై ఉన్న రాష్ట్రానికి కేంద్రం ఆక్సిజన్ ఇచ్చింది: సీఎం చంద్రబాబు సంపద సృష్టిస్తేనే సంక్షేమం గురించి చెప్పాలి.. ఆదాయాన్ని పెంచేవాళ్లకే సంక్షేమం పంచే అధికారం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
- చారిత్రక విజయానికి కారణమైన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు: డిప్యూటీ సీఎం పవన్ ప్రజలు కేవలం ఓటే కాదు.. చరిత్ర రాస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
- రప్పా..రప్పా అంటే చూస్తూ ఊరుకునేది లేదు: మంత్రి లోకేశ్ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనలోనే ప్రజలకు స్వేచ్ఛ లభించిందని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
- పెద్దారెడ్డిని అరెస్టు చేయాలని జేసీ ఆందోళన.. తాడిపత్రిలో ఉద్రిక్తత తాడిపత్రిలో రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
- ఏపీలో పాఠశాలలు పునఃప్రారంభం.. విద్యార్థుల సందడి వేసవి సెలవుల అనంతరం.. ఏపీలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలకు హాజరయ్యారు. వారికి ఉపాధ్యాయులు స్వాగతం పలికారు. దీంతో ఆయా పాఠశాలల వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఆ ఫొటోలు..
- ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరుస్తూ రాష్ట్ర భవిష్యత్‌కు బాటలు వేస్తున్నాం: చంద్రబాబు ఐదు కోట్ల మంది ప్రజల అపార నమ్మకంతో ప్రజా ప్రభుత్వం బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
- MIM-Tech ప్రవేశ పరీక్షలో విజయనగరం యువతి సత్తా.. ఏంటీ కోర్సు? ప్రస్తుత పోటీ ప్రపంచంలో వ్యాపార రంగంలో రాణించాలంటే కేవలం వ్యాపార సూత్రాలు తెలిస్తే సరిపోదు.
- చిన్నారి కోసం కొనసాగుతున్న సెర్చ్ ఆపరేషన్.. కుక్క కదలికలపై ఆరా సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
- కుటుంబంతో శ్రీవారిని దర్శించుకున్న ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.
- వేసవి సెలవుల అనంతరం ఏపీలో తెరచుకున్న పాఠశాలలు ఏపీ వ్యాప్తంగా వేసవి సెలవుల అనంతరం 45వేల ప్రభుత్వ, 44వేల ప్రైవేటు పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయి.
- గుట్టు పసిగట్టే ‘కిట్’కు ఒకప్పుడు ఏ చిన్న పరీక్ష చేయించాలన్నా.. రక్త నమూనా ఇచ్చి, ప్రయోగశాల చుట్టూ తిరిగి, రిపోర్టు కోసం రోజుల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు కాలం మారింది. సాంకేతికత అరచేతిలోకి వచ్చేసింది.
- ఉపాధ్యాయులపై గొడ్డలివేటు వేస్తారా? మెగా డీఎస్సీ గురించి అసత్యాలు ప్రచారం చేస్తూ.. ఉపాధ్యాయులపై వైకాపా అధినేత జగన్ గొడ్డలివేటు వేస్తున్నారని తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డి, కంచర్ల శ్రీకాంత్ ధ్వజమెత్తారు.
- గ్రీన్ ఎనర్జీలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఎదిగే సామర్థ్యం రాష్ట్రానికి ఉందని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు పేర్కొన్నారు. ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ ఫెడరేషన్ సహకారంతో ఎగ్జిబిషన్ క్యాటలిస్ట్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ‘గ్రీన్ ఇండియా ఎక్స్‌పో- 2026’ను విజయవాడలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ హాల్‌లో గురువారం ప్రారంభించారు.
- రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్లు ‘ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు విజనరీ లీడర్లు. ఏ రాష్ట్రంలో లేని విధంగా రెండేళ్లలో కేంద్రం నుంచి రూ.14 లక్షల కోట్ల నిధులు ఏపీకి వచ్చాయి. అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రం దూసుకెళ్తోంది.
- చిన్నారి కోసం ఆరు రోజులుగా గాలింపు ఆ చిన్నారి వయసు రెండేళ్లు. ఆరు రోజుల క్రితం.. గత శనివారమే ఇంటి నుంచి ఎటో వెళ్లిపోయింది. ఇంతవరకు ఆచూకీ తెలియట్లేదు. ఆమెతో పాటు వెళ్లిన పెంపుడు కుక్క బుధవారమే ఇంటికి చేరినా..
- ‘ఉక్కు’ భూముల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని లేఖ రాయలేదా జగన్? విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన వేల ఎకరాల్లో ప్లాట్లు వేసి అమ్మేయాలని గతంలో కేంద్ర ప్రభుత్వానికి జగన్ రెండు లేఖలు రాశారని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ విమర్శించారు.