పోలీసులపై గంజాయి స్మగ్లర్ల రాళ్ల దాడి.. గాల్లోకి కాల్పులు

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Updated : 10 Jun 2026 16:52 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

చింతపల్లి: అల్లూరి జిల్లాలో అంతర్జాతీయ గంజాయి ముఠా రెచ్చిపోయింది. తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులపై రాళ్ల దాడికి దిగింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. చింతపల్లి మండలం అన్నవరం స్టేషన్ పరిధిలోని లోతుగెడ్డ సమీపంలో ముందస్తు సమాచారంతో ఇవాళ తెల్లవారుజామున పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయితో వస్తున్న కారును తనిఖీ చేస్తుండగా.. అందులో ఉన్న ముఠా సభ్యులు.. హెడ్‌ కానిస్టేబుల్‌ కాలర్‌ పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా పోలీసులపై రాళ్లతో దాడికి దిగారు. దీంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరపడంతో.. నిందితులు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఆంధ్రా, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌కు చెందిన వారిగా గుర్తించారు. కారులో ఉన్న 290 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.

► Read latest Alluri sitharama raju Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 11:04 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అందరూ కదిలారు.. అదరగొట్టారు [ 12-06-2026] ఉపాధి హామీ పథకం ద్వారా ప్రజా భాగస్వామ్యంతో గతేడాది చేపట్టిన జల సంరక్షణ పనుల్లో దేశవ్యాప్తంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. జిల్లాలో గూడెంకొత్తవీధి మండలం మొదటి స్థానం దక్కించుకుంది.
  • వన్‌ధన్‌.. దగాధన్‌ [ 12-06-2026] అటవీ ఉత్పత్తులకు అదనపు విలువలు జోడించడం ద్వారా మార్కెట్‌లో అధిక ధర లభించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన వన్‌ధన్‌ (వీడీవీకే-వన్‌ధన్‌ వికాస్‌ కేంద్రం) పథకాన్ని అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది నీరుగార్చారు.
  • హంగులు హరీ! [ 12-06-2026] ఆంధ్రాఊటీ అరకులోయ సందర్శకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా పద్మాపురం ఉద్యానాన్ని తీర్చిదిద్దారు. గతేడాది డిసెంబరులో సుమారు రూ. 2 కోట్లు వెచ్చించి దీన్ని ఆధునికీకరించారు.
  • నవ్య విశాఖ.. భవ్య ప్రణాళిక!! [ 12-06-2026] భోగాపురంలో ఏరో సిటీ.. వైజాగ్‌లో బే సిటీ..వీటికి జతగా ఇంటిగ్రేటెడ్‌ సిటీ... ఇదీ విశాఖ, పరిసరాల్లో భవిష్యత్తు రూపం. విశాఖ నగరాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో మరింత ఆధునికంగా నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది.
  • అంతా కాదు.. కొంతే!! [ 12-06-2026] పంచగ్రామాల భూసమస్య కారణంగా ఇళ్లకు మరమ్మతులు చేసుకోలేక అవస్థలు పడుతున్న బాధితులకు ‘సింహాచలం’ అధికారులు శుభవార్త చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొన్ని మార్గదర్శకాలను అనుసరించి స్వల్ప మరమ్మతులు చేసుకోవడానికి అనుమతించనున్నట్లు ఈవో వెంకటరావు తెలిపారు.
  • అందిపుచ్చుకుంటే అద్బుతం [ 12-06-2026] పారిశ్రామికాభివృద్ధిని విస్తరించి యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం వినూత్న కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) పార్కులను ఏర్పాటు చేసి పరిశ్రమల స్థాపనకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు ముందుకొచ్చింది.
  • గుడిలోవ దేవస్థానం ప్రధానార్చకుడి ఆత్మహత్య [ 12-06-2026] గుడిలోవ శ్రీ రంగనాథస్వామి దేవస్థానం ప్రధాన అర్చకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆనందపురం సీఐ వాసునాయుడు గురువారం తెలిపారు.
  • యోగాతో ఆరోగ్యకర సమాజం [ 12-06-2026] యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని కలెక్టర్‌ నిశాంతి పేర్కొన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల క్రీడా మైదానంలో ఐటీడీఏ పీఓ, ఏపీఓ పర్యవేక్షణలో సుమారు 500 మందితో గురువారం ‘థీÇమెటిక్‌ గిరిజన యోగా’ కార్యక్రమం నిర్వహించారు.
  • విద్యాశాఖలో ఏం జరుగుతోంది? [ 12-06-2026] జిల్లా విద్యాశాఖాధికారి ఆకస్మికంగా దీర్ఘకాలిక సెలవుపై వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. డీఈఓగా డాక్టర్‌ రామకృష్ణారావు గతేడాది డిసెంబర్‌ చివరిలో బాధ్యతలు స్వీకరించారు.
  • కోర్టుకు తరలిస్తుండగా.. నిందితుడు పరారి [ 11-06-2026] గంజాయి తరలిస్తుండగా పట్టుబడిన నలుగురు నిందితులను పాడేరు నుంచి కోర్టుకు తరలిస్తుండగా.. ఒక నిందితుడు పారారయ్యాడు.
  • కట్టు తప్పుతున్నా.. పట్టు బిగించరేం! [ 11-06-2026] గంజాయి పంటకు ఒకప్పుడు మన్యం పేరొందింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దీనిపై ఉక్కుపాదం మోపడంతో దాదాపుగా సాగును కట్టడి చేయగలిగారు.
  • ఒడిశా 21.96 టీఎంసీల అదనపు నీటి వాడకం [ 11-06-2026] వర్షాకాలంలో వచ్చే నీటిని జలాశయాల్లో నిల్వ చేసుకుని రాబోయే రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు వాడుకోవాలని ఆంధ్రా- ఒడిశా అధికారులు నిర్ణయించుకున్నారు. బలిమెల జలాశయం నిర్వహణ, నీటి వాడకంపై ఆంధ్రా, ఒడిశా అధికారులు బుధవారం చిత్రకొండ ఓహెచ్‌పీసీ అతిథిగృహంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.
  • పోలీసులపై రాళ్లురువ్విన గంజాయి స్మగ్లర్లు [ 11-06-2026] జిల్లాలో గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోయారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఓ స్మగ్లర్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ కాలర్‌ పట్టుకున్నారు. ఇంతలో ఎస్సై స్పందించి స్మగ్లర్లు లొంగిపోవాలంటూ తుపాకీతో గాల్లో కాల్పులు జరిపారు.
  • రక్తం కరవై.. జీవితం బరువై! [ 11-06-2026] మన్యం ప్రాంతంలో రక్తహీనతతో బాధ పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. క్షేత్ర స్థాయిలో 10 నుంచి 18 ఏళ్ల వయసున్న వారిలో రక్తహీనత సమస్య ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ సర్వేల్లో వెల్లడవుతోంది.
  • పిల్లలకు మోత.. పెద్దలకు వాత! [ 11-06-2026] ప్రైవేటు విద్యాసంస్థల్లో పాఠ్య, నోటు పుస్తకాల తల్లిదండ్రులు, పిల్లలకు మోయలేని భారమవుతోంది. ప్రైమరీ నుంచి ఏడో తరగతి వరకు కేవలం పుస్తకాలు, విద్యా సామగ్రికి రూ.4 వేల నుంచి రూ.10 వేలు, 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.15- రూ.18వేలు ఖర్చవుతోంది.
  • వైకాపా మినహా రాష్ట్ర అభివృద్ధికి అన్ని పార్టీల సహకారం [ 11-06-2026] రాష్ట్ర అభివృద్ధికి వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు సహకరిస్తున్నాయని అసెంబ్లీ స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవాలయాన్ని బుధవారం అయ్యన్నపాత్రుడు,..
  • భర్త వేధింపులతో భార్య బలవన్మరణం [ 11-06-2026] భర్త హింసిస్తున్నాడని మనస్తాపానికి గురై భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన పెదబయలు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం..
  • పాడేరు ఆసుపత్రిలో మృత శిశువు జననం [ 11-06-2026] పాడేరు జిల్లా ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే బిడ్డ మృతి చెందిందని ఆరోపిస్తూ ఆసుపత్రి ఎదుట బంధువులు ఆందోళన చేపట్టారు.