

అనిశా చరిత్రలో అతి పెద్ద తిమింగలం

- A
- A+
- A++
ఈనాడు, హైదరాబాద్, నిజామాబాద్: మిలమిల మెరుస్తున్న బంగారు బిస్కెట్లు.. కళ్లు చెదిరేలా బ్యాంకు బ్యాలెన్స్.. కట్టలుకట్టలుగా కరెన్సీ నోట్లు.. గుట్టలుగుట్టలుగా అక్రమాస్తుల దస్త్రాలు.. గలగలలాడే విదేశీ మద్యం సీసాలు.. తెల్లవారుతుండగానే ఓ ప్రభుత్వ అధికారి ఇంటి తలుపు తట్టిన అవినీతి నిరోధక శాఖ(అనిశా-ఏసీబీ) బృందాల కంట పడిన దృశ్యాలివి. వెరసి ఏసీబీ చరిత్రలోనే అత్యంత ‘ఖరీదైన’ తిమింగలం చిక్కినట్లయింది. రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ మోహన్‌నాయక్ జర్పుల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అడ్డంగా దొరికిపోయారు. ఏసీబీ బృందాలు మంగళవారం ఏకకాలంలో 16 ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో మోహన్‌నాయక్ అవినీతి విశ్వరూపం బహిర్గతమైంది. మొత్తంగా రూ.17.94 కోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల్ని గుర్తించిన అనిశా.. మోహన్‌నాయక్‌ను అరెస్ట్ చేసింది. అయితే, బహిరంగ మార్కెట్‌లో ఈ ఆస్తుల విలువ మరెన్నో రెట్లు అధికంగా ఉంటుందని భావిస్తున్నారు. ఏకంగా రూ.150 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
రూ.కోట్ల పనుల్లో చేతివాటం..
నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం ముల్లంగి పంచాయతీ కులాస్‌పూర్ తండాకు చెందిన మోహన్‌నాయక్ 29 ఏళ్ల క్రితం ప్రభుత్వ కొలువులో చేరి రోడ్లు, భవనాల శాఖలో కీలక స్థానాల్లో కొనసాగారు. నల్గొండ, నిజామాబాద్‌లలో ఎస్‌ఈగా పనిచేయడంతోపాటు హైదరాబాద్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టీజీఎంఎస్‌ఐడీసీలోనూ బాధ్యతలు నిర్వర్తించారు. సీఈగా ఉంటూ గతేడాది ఆగస్టులో తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా నియమితులై.. మరో నెల తర్వాత ఈఎన్సీగా అత్యున్నత స్థానానికి చేరారు. ఈ క్రమంలో రూ.కోట్లలో చేపట్టిన పనుల్లో వాటాలు దండుకోవడంలో ఆరితేరినట్లు చర్చ జరుగుతోంది. ఆర్‌అండ్‌బీ శాఖలో టెండర్ల కేటాయింపు మొదలు బిల్లుల మంజూరు వరకు కమీషన్లు లేనిదే పనులు ముందుకు సాగవన్న ఆరోపణల నేపథ్యంలో మోహన్‌నాయక్ ఉదంతం ఇందుకు బలం చేకూరుస్తోంది. ప్రధానంగా కొందరు గుత్తేదారులు ఈఎన్సీ కార్యాలయం కేంద్రంగా పైరవీలు చేస్తూ పనులను చక్కబెడుతున్నారనే ప్రచారం నెలకొంది. మోహన్‌నాయక్ బడా గుత్తేదారులతో తరచూ రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తూ.. చిన్న గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్నారనేది బహిరంగ రహస్యంగా మారింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 230 రహదారులు, వంతెనలు, కల్వర్టుల వంటి పనులకు అనుమతులు వచ్చాయి. రూ.6,445 కోట్లతో 1,806 కిలోమీటర్ల మేర పనులు చేపడుతున్నారు. వీటితోపాటు మరమ్మతులు, ప్యాచ్‌వర్క్‌లకు భారీగానే నిధులు ఖర్చు చేస్తున్నారు. కీలకస్థానంలో ఉండటంతో వీటి బిల్లుల మంజూరులో మోహన్‌నాయక్ చేతివాటం ప్రదర్శించి ఉంటారనే ప్రచారం నెలకొంది. మరోవైపు బడా గుత్తేదారుల నుంచి కమీషన్ల రూపంలో వచ్చిన అక్రమార్జన పంపకాల్లోనూ మోహన్‌నాయక్‌దే కీలకపాత్ర అన్న ఆరోపణలున్నాయి. వాటాలు ఇవ్వకుంటే గుత్తేదారులను ఇబ్బందులకు గురిచేయడంలోనూ ఆయన ఆరితేరారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆయనపై ఇలాంటి ఆరోపణలున్నా ఉన్నతాధికారులు అదనపు బాధ్యతలను అప్పగించడం గమనార్హం. ఇటీవల జరిగిన హ్యామ్ రోడ్ల టెండర్లలో ఓ ఉమ్మడి జిల్లా పరిధిలో ఒక సంస్థకు పలు ప్యాకేజీలు దక్కేలా తెర వెనుక చక్రం తిప్పినట్లు ఆయనపై విమర్శలు ఉన్నాయి. వాస్తవానికి హ్యామ్ రహదారులతో ఆయనకు సంబంధం లేకున్నా కొన్ని ప్యాకేజీల్లో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది.

మోహన్‌నాయక్ అవినీతి విశ్వరూపమిలా..
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మోహన్‌నాయక్‌కు సంబంధించి హైదరాబాద్, నిజామాబాద్‌లలోని ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లతోపాటు ఈఎన్సీ కార్యాలయంలోనూ ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. ఈ సందర్భంగా అధికారులు పలు స్థిరాస్తులకు సంబంధించిన పత్రాల్ని స్వాధీనం చేసుకున్నారు. వీటికి రిజిస్ట్రేషన్ రుసుం ప్రకారమే విలువ కట్టారు. అయితే, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు పది రెట్ల వరకు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
- నిజామాబాద్ జిల్లా ముల్లంగిలో రూ.82.89 లక్షల విలువ చేసే 19 ఎకరాల 38 గుంటల వ్యవసాయ భూములు
- హైదరాబాద్ గచ్చిబౌలిలో 4.. కొంపల్లిలో 3 ఫ్లాట్లు. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వీటికి రూ.7.34 కోట్లుగా లెక్కగట్టారు.
- మియాపూర్‌లో రూ.2.5 కోట్ల విలువైన ట్రిప్లెక్స్ విల్లా
- కూకట్‌పల్లిలో ఇటీవలే నిర్మించిన రూ.62.14 లక్షల విలువైన ఇల్లు
- నిజామాబాద్‌లో నిర్మాణంలో ఉన్న విల్లాకు అడ్వాన్సుగా రూ.కోటి చెల్లించినట్లు గుర్తింపు
- దాదాపు 60 విదేశీ, స్వదేశీ మద్యం బాటిళ్లు లభించడంతో ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చారు.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అప్పుడు ‘క్యూనెట్’.. ఇప్పుడు ‘ఇగ్నైట్’! మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసంతో లక్షల మందిని మోసగించిన క్యూనెట్ (విహాన్ డైరెక్ట్ సెల్లింగ్) సంస్థ ‘ఇగ్నైట్’ పేరుతో మళ్లీ కొత్త దందా ప్రారంభించింది. హైదరాబాద్‌లో చాపకింద నీరులా మొదలైన సంస్థ మోసాలను సీసీఎస్ పోలీసులు ఆదిలోనే అడ్డుకొని ఆరుగురిని అరెస్టు చేశారు.
- లారీ డ్రైవర్ సజీవ దహనం ఆదిలాబాద్-నిర్మల్ 44వ జాతీయ రహదారిలో నిర్మల్ గ్రామీణ మండలం మేడిపల్లి వద్ద గురువారం వేకువజామున 3 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
- ఇలా వచ్చి.. అలా ఎత్తుకెళ్లారు! ఖమ్మంలోని సోనోవిజన్ షోరూం నుంచి గురువారం తెల్లవారుజామున నిమిషాల వ్యవధిలోనే రూ.67 లక్షల విలువైన 160 ఫోన్లను దుండగులు దోచుకెళ్లారు. నిందితులను పట్టుకునేందుకు సిబ్బంది యత్నించగా సినీ ఫక్కీలో తప్పించుకున్నారు.
- సైబర్ మోసగాళ్ల వలలో పంజాగుట్ట ఏఎస్సై సైబర్ మోసగాళ్లు ఓ ఏఎస్సైకి ఏపీకే ఫైల్ పంపి.. రూ.49,149 కాజేశారు. హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీసుస్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న నరసయ్య సెల్‌ఫోన్‌కు ఆర్టీఏ చలాన్ పేరిట సైబర్ నేరగాళ్లు ఏపీకే ఫైల్ పంపగా..
- హెలికాప్టర్ బుకింగ్‌కు నకిలీ వెబ్‌సైట్లు అధీకృత తీర్థయాత్రల ప్రయాణ సేవల సంస్థల పేరుతో హెలికాప్టర్ బుకింగ్‌కు నకిలీ వెబ్‌సైట్లు నడిపి దేశవ్యాప్తంగా పర్యాటకులను మోసం చేశారనే ఆరోపణలపై దిల్లీలో ముగ్గురు అరెస్టయ్యారు.
- గంజాయి స్మగ్లర్ పరారీ అల్లూరి సీతారామరాజు జిల్లాలో పోలీసులు అతి కష్టమ్మీద పట్టుకున్న ఓ గంజాయి స్మగ్లర్ పారిపోయాడు. చింతపల్లి మండలం అన్నవరం ప్రాంతంలో బుధవారం పోలీసులు జరిపిన తనిఖీల్లో నలుగురు అంతర్రాష్ట్ర స్మగ్లర్లు పట్టుబడ్డారు.
- ఆసుపత్రి నుంచి తిరిగొస్తూ జీవిత ఖైదీ పరారీ ఆసుపత్రి నుంచి తిరిగొస్తూ జీవిత ఖైదీ పరారైన ఘటన గూడూరు రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకుంది. జైలు అధికారుల వివరాల మేరకు.. నంద్యాల జిల్లాకు చెందిన సాకే రాజ్‌కుమార్‌కు పోక్సో కేసులో కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2025 సెప్టెంబరులో అతడిని కడప కేంద్ర కారాగారానికి తరలించారు.