ప్రముఖ దర్శకుడు భారతీరాజా కన్నుమూత

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ దర్శకుడు భారతీరాజా (84) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న ఆయన నేడు చెన్నైలో కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నారు.
1941 జులై 17న జన్మించిన భారతీరాజా (Bharathiraja) 1977లో వచ్చిన తమిళ మూవీ ‘16 వయథినిలే’ (తెలుగులో పదహారేళ్ల వయసు) తో దర్శకుడిగా మారారు. ‘కొత్త జీవితాలు’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తెలుగులోనూ పలు క్లాసిక్ సినిమాలను తెరకెక్కించి లెజెండరీ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన సీతాకోకచిలుక, ఆరాధన, జమదగ్ని సినిమాలు ఇండస్ట్రీలో బ్లాక్ బస్టర్‌లుగా నిలిచాయి. ఆరు జాతీయ అవార్డులు, నాలుగు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్నారు. ‘సీతాకోకచిలుక’కు నేషనల్ అవార్డుతో పాటు, ఉత్తమ దర్శకుడిగా నంది పురస్కారాన్ని అందుకున్నారు. ‘మంగమ్మగారి మనవడు’కు కథను, ‘పల్నాటి పౌరుషం’ చిత్రానికి స్క్రీన్‌ప్లేను అందించారు. ఇటీవల మోహన్‌లాల్ నటించిన ‘తుడురమ్’ సినిమాలో భారతీరాజా చివరిసారిగా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించారు. ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2004లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. (Bharathiraja Passed Away)
కుంగదీసిన కుమారుడి మరణం
గతేడాదిలో ఆయన తనయుడు, నటుడు మనోజ్ భారతీరాజా (48) గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఆయన కుంగిపోయారు. ఈ విషాదం తర్వాత చాలామంది ప్రముఖులు ఆయనను కలిసి పరామర్శించారు. ఇటీవల నటి రాధిక కూడా ఆయన్ని కలవగా.. ఆమె నటించిన ‘తాయ్‌కిళవి’కి నేషనల్ అవార్డు వస్తుందని ప్రోత్సహించారు. ‘వస్తే మీ పాదాల దగ్గర పెడతాను’ అని ఆమె అన్నారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 08:02 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నాని చిత్రంలో రుక్మిణి? ‘సప్త సాగరాలు దాటి’, ‘కాంతార 2’ లాంటి విజయవంతమైన చిత్రాలతో దక్షిణాదిలోనే కాక ఉత్తరాదిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి రుక్మిణీ వసంత్. ప్రస్తుతం ఆమె చేతుల్లో యశ్ ‘టాక్సిక్’, ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లాంటి భారీ చిత్రాలున్న సంగతి తెలిసిందే.
- చాలా జాగ్రత్తగా ఉండాల్సింది అప్పుడే! ‘‘నేను ఎప్పుడూ నా సామర్థ్యానికి మించిన స్థాయిలోనే పనిచేశా. కానీ ఒకానొక సమయంలో అవకాశాల కోసం ఎదురుచూడాల్సి వచ్చింద’’ని అంటోంది బాలీవుడ్ కథానాయిక కంగనా రనౌత్. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా కూడా సత్తా చాటుతోంది. ఇటీవల ‘భారత్ భాగ్య విధాత’లో నటించింది.
- అస్సాం అమ్మాయిని కదా అందుకే సవాల్ ‘‘బలమైన భావోద్వేగాలతో నిండిన చక్కటి కుటుంబ కథా చిత్రం ‘కొత్త మలుపు’’ అంది కథానాయిక భైరవి. ఈ టైటిల్‌కి తగ్గట్లుగానే ఈ సినిమా తన సినీ ప్రయాణానికి ఓ కొత్త మలుపులా నిలుస్తుందని నమ్మకంతో చెబుతోంది.
- అలా అంటే కుర్చీలోనే కూర్చునేవాణ్ని ! ‘‘ఈతరం ప్రేక్షకులకు సింగీతం శ్రీనివాసరావు అందిస్తున్న కానుక ‘సింగ్ గీతం’’ అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇలాంటి చిత్రం ఇంత వరకు రాలేదని.. మరో 10ఏళ్ల తర్వాత కూడా దీని గురించి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో ఈ సినిమాని చేశామని తెలిపారు.
- బంగారం.. రాకకు సిద్ధం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమవుతోంది నటి సమంత. ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని నందినీ రెడ్డి తెరకెక్కించారు. ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై రాజ్ నిడిమోరు, సమంత, హిమాంక్ దువ్వూరు నిర్మించారు.
- మనల్ని ప్రేమలో పడేలా చేసే జంట హృదయాల్లోకి చొచ్చుకెళ్లే ఓ మంచి ప్రేమకథతో ‘దీవాన’ తెరకెక్కిందన్నారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఆయనతోపాటు కథానాయకుడు విష్వక్‌సేన్, నిర్మాత ధీరజ్ మొగిలినేని ముఖ్య అతిథులుగా గురువారం హైదరాబాద్‌లో ‘దీవాన’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక జరిగింది.
- కడలినే శాసించేవాడు.. విశాల్ కథానాయకుడిగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. ఆర్బీ చౌదరి నిర్మాత. దుషార విజయన్, అంజలి కథానాయికలు. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
- టెన్షన్ ఔట్.. నవ్వులకు ‘వెల్‌కమ్’ అడవిలో ఒక నకిలీ సినిమాను తన తోటి నటులతో కలిసి చిత్రీకరిస్తున్నారు అక్షయ్ కుమార్. మొదట్లో వారంతా తన సహ నటులే అని భావించినప్పటికీ.. తర్వాత వారంతా బందిపోట్లని తెలుస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అనేది తెలుసుకోవాలంటే ‘వెల్‌కమ్ టు ది జంగిల్’ సినిమా చూడాల్సిందే.
- ‘జైలర్ 2’లో అతిథిగా హృతిక్ రోషన్? టైగర్ కా హుకూం.. అంటూ ‘జైలర్’ చిత్రంతో తనదైన స్టైల్‌లో అలరించారు రజనీకాంత్. దీనికి సీక్వెల్‌గా ‘జైలర్ 2’ రూపొందుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించింది చిత్రబృందం.
- సంక్షిప్త వార్తలు (3) పవన్ మహావీర్ కథానాయకుడిగా... శివాల ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అమ్మా... నాకు ఆ అబ్బాయి కావాలి’. వర్షిక, సుహానా కథానాయికలు. సుమన్, రావు రమేశ్, రాజీవ్ కనకాల, సత్యకృష్ణ, సుజాత కీలక పాత్రధారులు.
- పవన్‌కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘ఓజీ2’ అప్‌డేట్..! పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా సుజీత్‌దర్శకత్వంలో వచ్చిన గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘ఓజీ’ (They Call Him OG).
- అప్పుడు హీరోయిన్.. ఇప్పుడు హీరోయిన్ తల్లి.. నవ్వులు పంచిన అక్షయ్ వెండితెరపై బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ (Akshay Kumar) యాక్షన్‌తో ఎంత మెప్పిస్తారో, కామెడీతోనూ అంతే నవ్వులు పంచుతారు.
- తెలుగు సినిమా పరిశ్రమకు ఆయన భీష్మాచార్యుడు: సింగ్ గీతంపై చిరు పోస్ట్ తెలుగు సినిమా పరిశ్రమకు సింగీతం శ్రీనివాసరావు భీష్మాచార్యుడని అగ్ర కథానాయకుడు చిరంజీవి అన్నారు.
- సింగర్ జిమ్ లక్ష్యంగా బిష్ణోయ్ గ్యాంగ్ కాల్పులు దిల్లీలోని పశ్చిమ్ విహార్‌లో 24హెచ్‌ఎస్ ఫిట్‌నెస్ వద్ద కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
- ‘ధురంధర్’లో ఆ అంశాలు నచ్చాయి: పవన్ కల్యాణ్ ప్రశంసలు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీలో సూపర్ హిట్ అందుకున్న చిత్రం ‘ధురంధర్’.
- దిగ్గజ దర్శకుడు భారతీరాజాకు ప్రధాని మోదీ నివాళి దర్శకుడు భారతీరాజా మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.
- డబ్బులు తీసుకొని ప్రచారం చేయట్లేదు.. ఆరోపణలపై నటి స్పందన నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై దర్శకుడు సంజీవ్ మేగోటి ఇటీవల చేసిన ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీసిన విషయం తెలిసిందే.
- భారతీరాజా మీరే నా సర్వస్వం.. ఈ బాధ ఎలా తట్టుకోవాలి: రాధిక భావోద్వేగం దిగ్గజ దర్శకుడు భారతీరాజా తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయనతో నటి రాధికకు (Radika) విడదీయరాని అనుబంధం ఉంది. భారతీరాజాను తన గురువుగా భావించే రాధిక సందర్భం వచ్చినప్పుడల్లా ఆయనపై ఉన్న అభిమానాన్ని వెల్లడిస్తూనే ఉంటారు.
- దివికేగిన దర్శక దిగ్గజం వెండితెరపై పల్లెటూరి అందాలను, సామాన్య ప్రజల భావోద్వేగాలను ఎంతో సహజంగా, హృద్యంగా ఆవిష్కరించి ఓ కొత్త ఒరవడి సృష్టించిన దిగ్గజ దర్శకుడు భారతీరాజా (84) ఇకలేరు.
- తెలుగు సినిమాకు ‘ఆత్మబంధువు’ భారతీరాజా చిత్రం అంటే... పల్లెటూరు పంచే మమకారం... పొలం గట్టుపై విహారం. ఆయన సినిమా అంటే... మట్టి గుబాళింపు, సహజమైన సౌందర్యం, సంఘర్షణలకు చిరునామా, పాటలు చెక్కుచెదరకుండా కట్టుకున్న అందమైన పొదరిల్లు.