AI డేటా సెంటర్.. చేతులు కలిపిన మెటా, రిలయన్స్

- A
- A+
- A++

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే డేటాను నిల్వ చేయడం, వినియోగదారులకు చేర్చడంలో డేటా సెంటర్లు కీలకం. ఇప్పుడు ఇలాంటి డేటా సెంటర్ (Data Centre) ఏర్పాటు కోసం రిలయన్స్ (Reliance Industries), సోషల్ మీడియా దిగ్గజం మెటా చేతులు కలిపాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 168 మెగావాట్ల డేటా సెంటర్‌ను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. రెండేళ్లలో ఇది అందుబాటులోకి రానుంది. ఈమేరకు బుధవారం రెండు సంస్థలు ఓ సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
మెటా (Meta) ప్రపంచవ్యాప్త మౌలిక సదుపాయాలకు ఈ డేటా సెంటర్ సేవలందిస్తూ.. దాని వ్యాపార, ఏఐ కంప్యూటింగ్ అవసరాలనూ తీర్చనుంది. 1GW పునరుత్పాదక శక్తి విషయంలో క్లీన్‌మ్యాక్స్, ఫోర్త్ పార్ట్‌నర్ ఎనర్జీలతో భాగస్వామ్యంపై మెటా ప్రకటన చేసింది. కాగా, మెటా, రిలయన్స్ కొన్నేళ్లుగా కలిసి పనిచేస్తున్నాయి. 2020లో జియో ప్లాట్‌ఫామ్స్‌లో మార్క్ జుకర్ బర్గ్ సంస్థ 9.99 శాతం వాటాను కొనుగోలు చేసింది. అలాగే రెండూ కలిసి 100 మిలియన్ డాలర్లతో జాయింట్ వెంచర్‌ను ఏర్పాటుచేశాయి. దేశీయ, అంతర్జాతీయ సంస్థల కోసం ఏఐ సొల్యూషన్లను అభివృద్ధి చేయనున్నాయి.
- భారత్‌లో స్టార్‌లింక్‌కు అనుమతులు ఫ్రీజ్ వార్తలు.. స్పందించిన మస్క్ సంస్థ
2శాతం పెరిగిన రిలయన్స్ షేర్లు..
మెటాతో పార్ట్‌నర్‌షిప్‌పై ప్రకటన రాగానే రిలయన్స్ షేర్లు రెండు శాతం మేర పెరిగాయి. బుధవారం ఉదయం బీఎస్‌ఈలో ఈ స్టాక్ విలువ 2.39 శాతం పెరిగి రూ.1300కు చేరింది.
► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- మార్కెట్లకు ట్రంప్ ‘డీల్’ జోష్.. సెన్సెక్స్ 1000+ Stock Market: దేశీయ మార్కెట్లు నేడు లాభాల్లో ప్రారంభమయ్యాయి.
- మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు Gold Rates: అంతర్జాతీయ పరిణామాలతో ఇటీవల కాస్త దిగొచ్చిన బంగారం, వెండి ధరలు శుక్రవారం మళ్లీ పెరిగాయి.
- ఫారం-16 చేతికొచ్చిందా? ఉద్యోగులకు యాజమాన్యాలు ఫారం-16 జారీ చేసే ప్రక్రియ మొదలైంది. చేతికి ఫారం-16 రాగానే వెంటనే రిటర్నులు దాఖలు చేయాలని తొందరపడకూడదు. అందులోని వివరాలను, ఇతర పన్ను సంబంధిత పత్రాలతో నిశితంగా సరిపోల్చుకొని, ఏమైనా పొరపాట్లు ఉంటే రిటర్నులు దాఖలు చేయడానికి ముందే సరిదిద్దుకోవడం అవసరం.
- గృహరుణం ఈఎంఐ రూ.1,000 పెంచితే సొంతింటి కలను నిజం చేసుకునేందుకు గృహరుణం ఎంతో సాయం చేస్తుంది. కానీ, ఇది దీర్ఘకాలిక రుణం కావడం వల్ల అసలు కన్నా వడ్డీ రూపంలోనే మనం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది.
- ‘ఏఐ’తో మరిన్ని ఉద్యోగాలు కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికత వల్ల ఐటీ రంగంలో పోతున్న ఉద్యోగాలకు మించి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు వస్తాయని మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ (ఐడీసీ) ఎండీ, అధ్యక్షుడు రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
- సూపర్ టాపప్ రూ.5 కోట్ల వరకూ.. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో ఉంచుకొని, సూపర్ టాపప్ పాలసీ ఎంచుకోవాలనుకునే వారికోసం టాటా ఏఐజీ జనరల్ ఇన్సూరెన్స్ ‘మెడికేర్ రిజర్వ్’ పేరుతో కొత్త పాలసీని తీసుకొచ్చింది.
- ప్రవాసులకు కాసుల వర్షం భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తీసుకున్న నిర్ణయం ప్రవాసుల(ఎన్‌ఆర్‌ఐ)కు తీపి కబురు అందించింది. ఎఫ్‌సీఎన్‌ఆర్(బి) (ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్-బ్యాంక్) డిపాజిట్లపై ఇకపై బ్యాంకులు అధిక వడ్డీ రేటును అందించను న్నాయి.
- పదవీ విరమణ.. ‘ఉండాలి ప్లాన్ బి’ విశ్రాంత జీవితం మనం ఊహించినట్లుగానే, ప్రశాంతంగా గడిచిపోతుందని చెప్పలేం. వయసు పైబడినప్పుడు అనూహ్యంగా వచ్చే ఆరోగ్య సమస్యలు, కుటుంబ అవసరాలు మన పొదుపును హరించివేసే ప్రమాదం ఉంది. కాబట్టి, ఆకస్మిక పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనేందుకు మన ప్రణాళికలో సరళత్వం ఉండాలి.
- అమెరికా గొప్ప వలసదారుల్లో 27 మంది భారతీయులు అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో.. ఆ దేశంలో జీవించి ఉన్న అతిగొప్ప వలసదార్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. 250 మందితో కూడిన ఈ జాబితాలో 27 మంది భారత సంతతి వ్యక్తులు కావడం విశేషం.
- చమురు నిల్వలు మరింత పెంచుకుందాం! దేశంలో ముడి చమురు నిల్వ సామర్థ్యాన్ని మరింత పెంచుకోవాలని ప్రభుత్వ రంగ చమురు కంపెనీ (ఓఎమ్‌సీ)లను కేంద్రప్రభుత్వం కోరే అవకాశం కనిపిస్తోంది.
- రూ.15,000 కోట్ల విప్రో బైబ్యాక్ ప్రారంభం ఐటీ దిగ్గజం విప్రో, రూ.15,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. దీని ద్వారా అర్హులైన వాటాదార్లు ఒక్కో షేరును రూ.250 చొప్పున విక్రయించే అవకాశం కలుగుతుంది.
- ఒడుదొడుకుల్లో సూచీలకు నష్టాలు ఆద్యంతం ఒడుదొడుకుల మధ్య సాగిన ట్రేడింగ్‌లో, దేశీయ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత కొనసాగించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి 60 పైసలు తగ్గి 95.85 వద్ద ముగిసింది.
- ఆంథ్రోపిక్‌తో టీసీఎస్ జట్టు కృత్రిమ మేధ(ఏఐ) దిగ్గజం ఆంథ్రోపిక్‌తో అంతర్జాతీయ భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు ఐటీ సేవల కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రకటించింది. తన వినియోగదార్లకు ఎంటర్‌ప్రైజ్ ఏఐని మరింత మెరుగ్గా అందించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
- ఎరువుల సబ్సిడీని మళ్లీ లెక్కించాలి ఖరీఫ్ సీజన్ అవసరాలకు సరిపడా ఎరువుల నిల్వలు దేశంలో ఉన్నాయని ప్రభుత్వం గురువారం స్పష్టం చేసింది. పశ్చిమాసియా సంక్షోభ పరిణామాల్లో ఎరువుల ధరలు అంతర్జాతీయంగా పెరిగాయి.
- ఆ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం పడదు ఇథనాల్‌ను అధికంగా కలిపి విక్రయించే పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని మినహాయిస్తున్నట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. ఇ 22 (ఇథనాల్ 22%), ఇ 25, ఇ 27, ఇ 30 రకం పెట్రోల్‌కు ఇది వర్తించనుంది.
- 2025-26లో 13,223 మందికి బ్యాంక్ ఉద్యోగాలు గత ఆర్థిక సంవత్సరం (2025-26)లో దేశంలోని 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో, 8 బ్యాంకులు 13,223 మంది ఉద్యోగులను నియమించుకున్నాయి.
- పలు ఎక్స్ఛేంజీల్లో నమోదైన షేర్ల కోసం ధరల స్థిరీకరణ విధానం ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ఛేంజీల్లో నమోదైన షేర్ల ధరల్లో వచ్చే వ్యత్యాసాలను అరికట్టడానికి కొత్తగా ధరల స్థిరీకరణ విధానాన్ని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ప్రతిపాదించింది.
- హోటళ్లలో త్వరగా చెక్ ఇన్.. ఆలస్యంగా చెక్ అవుట్ హోటల్ గదిని అద్దెకు తీసుకునేందుకు చెక్-ఇన్, చెక్-అవుట్ సమయాలుంటాయి. వేరే ప్రాంతం నుంచి రోడ్డు-రైలు-విమాన మార్గాల్లో వచ్చిన వారు, హోటల్‌కు ముందే వచ్చినా చెక్-ఇన్ సమయంలోనే గది కేటాయిస్తుంటారు.
- వేదాంతా విభజిత కంపెనీల షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈల్లో 15న నమోదు వేదాంతా గ్రూప్‌నకు చెందిన విభజిత నాలుగు కంపెనీల షేర్లు సోమవారం (ఈనెల 15న) బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో నమోదవుతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- సంక్షిప్త వార్తలు (4) వ్యక్తిగత ఆరోగ్య సంరక్షణ రంగంలోని హైదరాబాద్ సంస్థ ఈబీజీ గ్రూపు, ఆస్ట్రేలియా కేంద్రంగా ఉన్న యూనివర్సల్ ఫిట్‌నెస్ గ్రూపుతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.