తెలుగులో టైమ్‌లెస్ క్లాసిక్స్.. కేరాఫ్ భారతీ రాజా

- A
- A+
- A++

‘సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే..’, ‘మాటే మంత్రము, మనసే బంధము’, ‘అరె ఏమైందీ.. ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..’ ఈ పాటలన్నీ వింటుంటే మనకు ఇళయరాజా గుర్తొస్తారు. కానీ, ఇలాంటి క్లాసిక్ సాంగ్స్ ఇవ్వాలంటే, ప్రకృతి అంత రమణీయమైన మనసు.. ప్రేమపై ‘ఆరాధన’ భావం.. వాటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించేతత్వం కలిగిన దర్శకుడికే అది సాధ్యం. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులకు వాటిని అందించిన సృజనాత్మక దర్శకుడు భారతీరాజా. తమిళంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. తెలుగులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రేక్షకులకు మర్చిపోలేని క్లాసిక్స్‌ను అందించారు.
హరి ప్రసాద్, సుహాసిని కీలక పాత్రల్లో ‘కొత్త జీవితాలు’ మూవీతో తెలుగులో మెగాఫోన్ పట్టిన ఆయన.. సుహాసినిని ఇక్కడి చిత్రసీమకు పరిచయం చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘పుదియ వార్పుగళ్’కు ఇది రీమేక్. ఇక ఆ తర్వాత ఆయన తీసిన ‘సీతాకోక చిలుక’ ఎవర్‌గ్రీన్. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే క్లాసిక్. మాస్ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ‘ఆరాధన’ తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు.
ఎప్పటికీ గుర్తుండే క్లాసిక్ ‘సీతాకోక చిలుక’
80వ దశకంలో సినీ సంగీత ప్రియులను ఓ ఊపు ఊపేసిన సినిమాల్లో ‘సీతాకోక చిలుక’ స్పెషల్. కార్తిక్, అరుణ, శరత్‌బాబు, సిల్క్ స్మిత కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకు, కులం, మతం అడ్డుకావని చెబుతూ నాటి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు దాటి ఓ ప్రేమ జంట ఎలాంటి నిర్ణయం తీసుకున్నదన్నది ఈ చిత్రం. జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా పాటలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

సినిమాకు కథ, కథనాలు ఎంత ముఖ్యమో ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలన్న విజన్ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు ప్రతిభ బయటపడేది ఇక్కడే. ప్రతి చిత్రం పైనా తనదైన ముద్ర వేసే భారతీరాజా ‘సీతాకోక చిలుక’లోని ఒక షాట్ ఎంతో ప్రత్యేకం. ట్రాలీ షాట్స్ ఎప్పటి నుంచో ఉన్నా, రౌండ్ ట్రాలీ అనేది తర్వాత వచ్చింది. అది లేని రోజుల్లోనే భారతీరాజా తీసిన షాట్ ఒకటి ప్రత్యేకం. రఘు(కార్తిక్), కరుణ (అరుణ) తమ పేర్లు ఉన్న చెట్టు దగ్గర కలుస్తారు. ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా..’ సాంగ్ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఆ షాట్ తీసేటప్పుడు లొకేషన్‌లో కెమెరామెన్, హీరో, హీరోయిన్ తప్ప ఎవరినీ ఉండనీయలేదు. దుప్పటిపై కెమెరామెన్‌ను పడుకోబెట్టి, నలుగురు బలమైన వ్యక్తులతో అతడిని పైకి లేపి, హీరో, హీరోయిన్ చుట్టూ తిరుగుతూ షాట్ తీయించారు. ఇలాంటి ప్రయోగాలు భారతీరాజా కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి.
ఈ రీమేక్‌లన్నీ హిట్టే..
- ‘16 వయతినిలే’ తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్రమోహన్, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. కమల్, శ్రీదేవి నటించిన ‘సిగప్పు రోజక్కల్’, ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమై, ఇక్కడా విజయం సాధించింది.
- తమిళంలో భారతీరాజా తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్ అయి, హిట్ కొట్టాయి. ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా తీశారు. శివాజీగణేశన్, రాధతో రూపొందించిన ‘ముదల్ మారియాదై’ తెలుగులో ‘ఆత్మబంధువు’గా అలరించింది.
- ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా కోడిరామకృష్ణ తీసిన ‘మంగమ్మగారి మనవడు’గా, శిష్యుడు భాగ్యరాజ్ అందించిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ కథను తెలుగులో కమల్ ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించాయి. ఇదే కథను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘ఆఖరీ రాస్తా’గా తీసి, విజయం సాధించారు.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 13:23 IST
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- అందుకే ‘ఛావా’ను తిరస్కరించిన రణ్‌దీప్ హుడా ‘ఛావా’లో సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని నటుడు రణ్‌దీప్ హుడా తెలిపారు.
- ప్రశాంత్ నీల్ ‘ఫ్యామిలీ స్టోరీ’.. అందుకే ఆగిపోయింది! తాను రాసుకున్న ఫ్యామిలీ స్టోరీని ఎందుకు పట్టాలెక్కించలేదన్నది దర్శకుడు ప్రశాంత్ నీల్ వివరించారు.
- టైటిల్ మార్చమన్న హీరోలు.. వెంకటేశ్‌కు దక్కిన హిట్: 30 ఏళ్ల ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ వెంకటేశ్, సౌందర్య, వినీత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రానికి 30 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలివీ..
- డ్యాన్స్ నచ్చింది.. బంగారు గాజులు ఇచ్చింది.. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో నటించి మెప్పించారు టబు. నటిగా మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తన మంచి మనసును చాటుకున్నారట.
- ‘గ్యాంగ్‌లీడర్’కు 35ఏళ్లు.. అసలు కథ అదికాదు.. ‘చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్ఫాడించేస్తా’ అనే మాస్ డైలాగ్‌లతో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘గ్యాంగ్ లీడర్’ (Gang Leader). విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
- ‘పోకిరి’కి 20ఏళ్లు.. తరానికో పండుగాడు.. అందుకే అంత ఫేమస్ అయ్యాడు! మహేశ్‌బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘పోకిరి’ విడుదలై 20ఏళ్లుపూర్తి చేసుకుంది.
- పవన్‌కల్యాణ్ ‘జానీ’కి 23ఏళ్లు.. సినిమా హిట్ అయి ఉంటే.. తొలి ప్రేమ.. తమ్ముడు.. బద్రి.. ఖుషి.. చిరంజీవి సోదరుడిగా పవన్‌కల్యాణ్ వెండితెరకు పరిచయమైనా మిలీనియంలో వరుస హిట్‌లతో దూసుకుపోయారు.
- అలా శింబు స్థానంలో జీవా... కెరీర్‌ను మార్చేసిన ‘రంగం’ వెనుక కథ ఇది.. ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇది తరచూ జరిగేదే. సినిమా మొదలై షూటింగ్ కొంత పూర్తయిన తర్వాత మారిపోయిన నటీనటులు ఎందరో. అలాంటి చిత్రమే ‘కో’.
- ‘అంకుశం’లో చార్మినార్ వద్ద ఫైట్.. రెండు రోజులు కనిపించకుండా పోయిన రామిరెడ్డి అనుకోకుండా వచ్చే అవకాశాలే కొందరి దశను మార్చేస్తాయి. తమ నటనతో వెండితెరపై చెరగని ముద్రవేసిన వాళ్లలో నటుడు రామిరెడ్డి (Rami Reddy) ఒకరు.
- నా షరతులతోనే ‘బద్రి’లో నటించా.. ‘జానీ’లో ఇలా: రేణూ దేశాయ్ తాను నటించిన ‘బద్రి’, ‘జానీ’ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నటి రేణూ దేశాయ్.
- ‘జురాసిక్’ పార్క్ మూవీని రిజెక్ట్ చేసిన శ్రీదేవి.. కారణం అదే! హాలీవుడ్ సినిమాల్లో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? డబ్బుకు డబ్బు.. కావాల్సినంత ప్రచారం రెండూ ఒకేసారి వచ్చి పడతాయి. అందులోనూ స్టీవెన్ స్పీల్‌బర్గ్ మూవీ అంటే కథేంటో కూడా అడగకుండా ఒప్పుకొంటారు.
- క్లైమాక్స్ చెబితేనే చేస్తానన్న నాగార్జున.. 40వేల నుంచి 2 లక్షలకు పెరిగిన భక్తులు.. ‘శ్రీరామదాసు’కు 20ఏళ్లు తెలుగు సినీ చరిత్రలో భక్తిరస చిత్రాలకు కొదవేమీ లేదు. అయితే, కొన్ని చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్ అలాంటి వాటిలో ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) ఒకటి.
- ఆ కథ వద్దని.. ‘ఆది’తో రికార్డులు నెలకొల్పిన ఎన్టీఆర్ ఎన్టీఆర్ హీరోగా వినాయక్ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆది’. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలివీ..
- అందుకే ‘జెంటిల్‌మేన్’లో నటించలేకపోయా: రాజశేఖర్ ‘జెంటిల్‌మేన్’ సినిమాలో తానెందుకు నటించలేకపోయారో రాజశేఖర్ తెలిపారు.
- ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఆ రోల్ మిస్ అయిన రాజశేఖర్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఓ పాత్ర మిస్ అయినట్లు రాజశేఖర్ తెలిపారు.
- భారీ బడ్జెట్.. థియేటర్ల వద్ద 144 సెక్షన్.. ఫస్ట్ 70MM ‘సింహాసనం’ @ 40ఏళ్లు తొలి తెలుగు 70MM 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘సింహాసనం’. 21, మార్చి 1986లో విడుదలైన ఈ మూవీ నేటితో నలభై వసంతాలు పూర్తి చేసుకుంది.
- ఆ హీరోతో తీయాలనుకున్నారు.. NTR జీతం ₹250.. ‘పాతాళభైరవి’కి 75 వసంతాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి.. ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రాలు ఇంకొన్ని ఉంటాయి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మళ్లీ తీయలేని సినిమాలు మరికొన్ని ఉంటాయి.. అలాంటిదే ‘పాతాళ భైరవి’.
- ‘ఆస్కార్’ ఎంట్రీ.. నేషనల్ అవార్డు.. 40 ఏళ్ల ‘స్వాతిముత్యం’ విశేషాలివి..! కమల్ హాసన్, రాధిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు కె.విశ్వనాథ్ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’. 40 ఏళ్ల ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలివీ..
- 50 ఏళ్ల ‘ఆరాధన’.. ఎన్టీఆర్ ఎవర్‌గ్రీన్ మూవీ విశేషాలు తెలుసా? ఎన్టీఆర్ నటించిన ‘ఆరాధన’ సినిమాకి 50 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని సంగతులివీ..
- చిరంజీవి సినిమాకు పోటీగా ‘మనీ’ విడుదల చేసిన ఆర్జీవీ జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ, పరేశ్ రావల్ కీలక పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్ ‘మనీ’ (Money). దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Ramgopal Varma) ఈ సినిమాను నిర్మించారు.
English Translation
Timeless Classics in Telugu..Keraf Bharti Raja

- A
- A+
- A++

‘Sagara Sangamme.. Pranaya Sagara Sangamme..’, 'Mate Mantra, Manase Bandhamu', 'Are Emaindi.. One mind took wings and flew somewhere..' When we listen to all these songs, we remember Ilayaraja. But, to give classic songs like this, a mind as beautiful as nature.. a sense of 'adoration' for love.. it is possible only for a director who has the ability to discover them on screen. Bharathiraja is the creative director who presented them to both Tamil and Telugu audiences. He has made excellent films in Tamil.. He has left his mark in Telugu as well. He gave unforgettable classics to the audience.
Hari Prasad and Suhasini in the lead roles, he grabbed the megaphone in Telugu with the movie 'Kotta Jivatalu'.. Suhasini was introduced to the cinema here. It is a remake of 'Pudiya Varpugal' which was a huge success in Tamil. After that, the 'butterfly' he drew was Evergreen. Then, Now, a classic that has always mesmerized Telugu audiences. Chiranjeevi, who is emerging as a mass hero, took 'Aradhana' and unveiled a new actor in him on the silver screen. He shot 'Jamadagni' with senior actor Krishna.
The ever-remembered classic 'Sitakoka Chiluka'
'Sitakoka Chiluka' is a special movie in the 80s that made a big splash among movie music lovers. Starring Karthik, Aruna, Sarathbabu and Silk Smitha in pivotal roles, this movie gave a new definition to love. This film is about what kind of decision a loving couple made beyond the social conditions and commitments of the time, saying that caste and religion do not stand in the way of pure love. Jandhya's dialogues and Ilayaraja's songs took the movie to another level. This movie was a huge success in Telugu and won national awards as the best regional film.

The vision of how to shoot a scene is as important as the story and narratives of a movie. This is where the talent of the director emerges. One shot in Bharathiraja's 'Sitakoka Chiluka', which leaves its mark on every film, is very special. While trolley shots have been around since time immemorial, the round trolley came later. One of the shots taken by Bhartiraja in the days without it is special. Raghu(Karthik) and Karuna(Aruna) meet near the tree bearing their names. The song 'Minneti Sooridu Panimanamma..' is heard in the background. While taking that shot, no one was allowed to be in the location except the cameraman, hero and heroine. The cameraman was made to lie on a blanket, four strong men lifted him up, and the hero and heroine went around and took the shot. There are many such experiments in Bharathiraja's career.
All these remakes were hits..
- '16 Vayathinile' has been remade in Telugu with the title 'Padarellla Awadh'. Under the direction of Raghavendra Rao, Sridevi, Chandramohan and Mohanbabu acted in key roles. Kamal and Sridevi's 'Sigappu Rojakkal', translated as 'Red Roses', became a success here. 'Kilakke Pogum Rail' was made in Telugu as 'Eastern Train' directed by Bapu. 'Mudal Mariadai' with Sivajiganesan and Radha entertained as 'Atmabandhu' in Telugu.
- 'Mann Vasanai' movie in Telugu as 'Mangammagari Navadu' with Kodi Ramakrishna as Balakrishna's hero, and Kamal's 'Oru Khaidean Diary' presented by Shisyudu Bhagyaraj as 'Khaidi Veta' in Telugu. The same story was made in Hindi as 'Aakhari Raasta' with Amitabh Bachchan as the hero and became a success.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 13:23 IST
Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.
More
- That is why Randeep Hooda rejected 'Chava'. Actor Randeep Hooda said the reason for not acting in the movie in 'Chava'.
- Prasanth Neel's 'Family Story'. Director Prashanth Neel explained why the family story he had written was not taken into consideration.
- The title of Marchamanna Herolu.. Venkatesh's hit: 30-year-old family entertainer The movie 'Intlo Illalu Vantintlo Priyurau' starring Venkatesh, Soundarya and Vineetha in lead roles is 30 years old. Some special features on this occasion..
- He liked the dance.. He gave gold bangles.. Tabu acted in many languages including Telugu and Hindi. Not only as an actress but also in philanthropy.
- Gang Leader is 35 years old... That is not the original story. The film directed by Vijaya Bapinidu was a huge success at the box office.
- 'Pokiri' is 20 years old. The action entertainer 'Pokiri' directed by Puri Jagannath starring Mahesh Babu has completed 20 years since its release.
- Pawan Kalyan's 'Johnny' is 23 years old. They hit with a series of hits.
- Jiva replaced Simbu... This is the story behind 'Rangam' who changed his career.. It is said that the name of the eater is written on each grain. This happens often in the film industry. There are many actors who changed after the shooting of the movie started. One such film is 'Ko'.
- In 'Ankusam', fight at Charminar.. Ramireddy who was missing for two days. Unexpected opportunities change the course of some. Actor Rami Reddy is one of those who left an indelible mark on the silver screen with his performance.
- I acted in 'Badri' on my terms. Actress Renu Desai said interesting things about the movies 'Badri' and 'Johnny' in which she acted.
- Sridevi who rejected the movie 'Jurassic' Park. Who would give up an opportunity in Hollywood films? Money for money.. Adequate publicity both come and go at the same time. In that too, Steven Spielberg's movie is a story and they agree without even asking.
- Nagarjuna said he would do it only if he told the climax.. Devotees increased from 40 thousand to 2 lakh.. 'Sri Ramadasu' is 20 years old. Bhaktirasa films have nothing to do with the history of Telugu cinema. However, some films are evergreen and 'Sri Ramadasu' is one of them. Vinayak's first film as NTR's hero is 'Aadi'. Some special things about this movie..
- That's why he couldn't act in 'Gentleman': Rajasekhar Rajasekhar said why he could not act in the movie 'Gentleman'. Rajasekhar said that there was a character missing in 'Seethamma Vakitlo Sirimalle Chettu'.
- Huge budget.. 144 sections at theatres.. First 70MM 'Simhasanam' @ 40 years 'Simhasanam' is the first Telugu 70MM 6 track stereo phonic sound directed by Krishna. Released on 21, March 1986, this movie completed 40 years today.
- They wanted to make it with that hero.. NTR's salary was ₹250.. 75 years for 'Patalabhairavi' There are some movies that you want to watch again and again. Still, there are some films that can never be made again.. Such is 'Patala Bhairavi'. Kamal Haasan and Radhika are in the lead roles in the film 'Swathimutyam' directed by K. Vishwanath. There are many interesting things about this 40-year-old movie..
- 50-year-old 'Aaradhana'.. Do you know the features of NTR's evergreen movie? NTR starrer 'Aaradhana' is 50 years old. Here are some facts about this film. 'Money' is a comedy thriller directed by Siva Nageswara Rao starring JD Chakraborty, Chinna, Jayasudha and Paresh Rawal in key roles. Director Ramgopal Varma (Ramgopal Varma) has produced this movie.