తెలుగులో టైమ్‌లెస్ క్లాసిక్స్‌.. కేరాఫ్‌ భారతీ రాజా

Eenadu icon
By Entertainment Team Updated : 10 Jun 2026 13:37 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

‘సాగర సంగమమే.. ప్రణయ సాగర సంగమమే..’, ‘మాటే మంత్రము, మనసే బంధము’, ‘అరె ఏమైందీ.. ఒక మనసుకి రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది..’ ఈ పాటలన్నీ వింటుంటే మనకు ఇళయరాజా గుర్తొస్తారు. కానీ, ఇలాంటి క్లాసిక్‌ సాంగ్స్‌ ఇవ్వాలంటే, ప్రకృతి అంత రమణీయమైన మనసు.. ప్రేమపై ‘ఆరాధన’ భావం.. వాటిని తెరపై అద్భుతంగా ఆవిష్కరించేతత్వం కలిగిన దర్శకుడికే అది సాధ్యం. అటు తమిళ, ఇటు తెలుగు ప్రేక్షకులకు వాటిని అందించిన సృజనాత్మక దర్శకుడు భారతీరాజా. తమిళంలో అద్భుతమైన సినిమాలు తీసిన ఆయన.. తెలుగులోనూ తనదైన ముద్ర వేశారు. ప్రేక్షకులకు మర్చిపోలేని క్లాసిక్స్‌ను అందించారు.

హరి ప్రసాద్‌, సుహాసిని కీలక పాత్రల్లో ‘కొత్త జీవితాలు’ మూవీతో తెలుగులో మెగాఫోన్‌ పట్టిన ఆయన.. సుహాసినిని ఇక్కడి చిత్రసీమకు పరిచయం చేశారు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘పుదియ వార్పుగళ్’కు ఇది రీమేక్‌. ఇక ఆ తర్వాత ఆయన తీసిన ‘సీతాకోక చిలుక’ ఎవర్‌గ్రీన్‌. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే క్లాసిక్‌. మాస్‌ హీరోగా దూసుకెళ్తున్న చిరంజీవితో ‘ఆరాధన’ తీసి ఆయనలోని ఓ కొత్త నటుడిని వెండితెరపై ఆవిష్కరించారు. సీనియర్‌ నటుడు కృష్ణతో ‘జమదగ్ని’ తీశారు.

ఎప్పటికీ గుర్తుండే క్లాసిక్‌ ‘సీతాకోక చిలుక’

80వ దశకంలో సినీ సంగీత ప్రియులను ఓ ఊపు ఊపేసిన సినిమాల్లో ‘సీతాకోక చిలుక’ స్పెషల్‌. కార్తిక్‌, అరుణ, శరత్‌బాబు, సిల్క్‌ స్మిత కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ ప్రేమకు సరికొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. స్వచ్ఛమైన ప్రేమకు, కులం, మతం అడ్డుకావని చెబుతూ నాటి సామాజిక పరిస్థితులు, కట్టుబాట్లు దాటి ఓ ప్రేమ జంట ఎలాంటి నిర్ణయం తీసుకున్నదన్నది ఈ చిత్రం. జంధ్యాల సంభాషణలు, ఇళయరాజా పాటలు సినిమాను మరోస్థాయికి తీసుకెళ్లాయి. తెలుగులో భారీ విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ అవార్డులను సైతం సొంతం చేసుకుంది.

సినిమాకు కథ, కథనాలు ఎంత ముఖ్యమో ఏ సన్నివేశాన్ని ఎలా తీయాలన్న విజన్‌ కూడా అంతే ముఖ్యం. దర్శకుడు ప్రతిభ బయటపడేది ఇక్కడే. ప్రతి చిత్రం పైనా తనదైన ముద్ర వేసే భారతీరాజా ‘సీతాకోక చిలుక’లోని ఒక షాట్‌ ఎంతో ప్రత్యేకం. ట్రాలీ షాట్స్‌ ఎప్పటి నుంచో ఉన్నా, రౌండ్‌ ట్రాలీ అనేది తర్వాత వచ్చింది. అది లేని రోజుల్లోనే భారతీరాజా తీసిన షాట్‌ ఒకటి ప్రత్యేకం. రఘు(కార్తిక్‌), కరుణ (అరుణ) తమ పేర్లు ఉన్న చెట్టు దగ్గర కలుస్తారు. ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మా..’ సాంగ్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపిస్తుంది. ఆ షాట్‌ తీసేటప్పుడు లొకేషన్‌లో కెమెరామెన్‌, హీరో, హీరోయిన్‌ తప్ప ఎవరినీ ఉండనీయలేదు. దుప్పటిపై కెమెరామెన్‌ను పడుకోబెట్టి, నలుగురు బలమైన వ్యక్తులతో అతడిని పైకి లేపి, హీరో, హీరోయిన్‌ చుట్టూ తిరుగుతూ షాట్‌ తీయించారు. ఇలాంటి ప్రయోగాలు భారతీరాజా కెరీర్‌లో ఎన్నో ఉన్నాయి.

ఈ రీమేక్‌లన్నీ హిట్టే..

  • ‘16 వయతినిలే’ తెలుగులో ‘పదహారేళ్ల వయసు’ పేరుతో రీమేక్‌ అయ్యింది. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి, చంద్రమోహన్‌, మోహన్‌బాబు కీలక పాత్రల్లో నటించారు. కమల్, శ్రీదేవి నటించిన  ‘సిగప్పు రోజక్కల్‌’, ‘ఎర్ర గులాబీలు’గా అనువాదమై, ఇక్కడా విజయం సాధించింది.
  • తమిళంలో భారతీరాజా తీసిన ఎన్నో సినిమాలు తెలుగులో రీమేక్‌ అయి, హిట్‌ కొట్టాయి. ‘కిళక్కే పోగుం రైల్’ను తెలుగులో బాపు దర్శకత్వంలో ‘తూర్పు వెళ్ళే రైలు’గా తీశారు. శివాజీగణేశన్, రాధతో రూపొందించిన ‘ముదల్ మారియాదై’ తెలుగులో ‘ఆత్మబంధువు’గా అలరించింది.
  • ‘మన్ వాసనై’ చిత్రం తెలుగులో బాలకృష్ణ హీరోగా కోడిరామకృష్ణ తీసిన ‘మంగమ్మగారి మనవడు’గా, శిష్యుడు భాగ్యరాజ్ అందించిన ‘ఒరు ఖైదియన్ డైరీ’ కథను తెలుగులో కమల్ ‘ఖైదీ వేట’గా వచ్చి అలరించాయి. ఇదే కథను హిందీలో అమితాబ్ బచ్చన్ హీరోగా ‘ఆఖరీ రాస్తా’గా తీసి, విజయం సాధించారు.


► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 10 Jun 2026 13:23 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • అందుకే ‘ఛావా’ను తిరస్కరించిన రణ్‌దీప్‌ హుడా ‘ఛావా’లో సినిమాలో నటించకపోవడానికి గల కారణాన్ని నటుడు రణ్‌దీప్‌ హుడా తెలిపారు.
  • ప్రశాంత్‌ నీల్‌ ‘ఫ్యామిలీ స్టోరీ’.. అందుకే ఆగిపోయింది! తాను రాసుకున్న ఫ్యామిలీ స్టోరీని ఎందుకు పట్టాలెక్కించలేదన్నది దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ వివరించారు.
  • టైటిల్‌ మార్చమన్న హీరోలు.. వెంకటేశ్‌కు దక్కిన హిట్‌: 30 ఏళ్ల ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ వెంకటేశ్‌, సౌందర్య, వినీత ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ చిత్రానికి 30 ఏళ్లు. ఈ సందర్భంగా కొన్ని విశేషాలివీ..
  • డ్యాన్స్‌ నచ్చింది.. బంగారు గాజులు ఇచ్చింది.. తెలుగు, హిందీ సహా పలు భాషల్లో నటించి మెప్పించారు టబు. నటిగా మాత్రమే కాదు, దాతృత్వంలోనూ తన మంచి మనసును చాటుకున్నారట.
  • ‘గ్యాంగ్‌లీడర్‌’కు 35ఏళ్లు.. అసలు కథ అదికాదు.. ‘చేయి చూశావా ఎంత రఫ్‌గా ఉందో రఫ్ఫాడించేస్తా’ అనే మాస్‌ డైలాగ్‌లతో అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ప్రేక్షకులను అలరించిన చిత్రం ‘గ్యాంగ్‌ లీడర్‌’ (Gang Leader). విజయ బాపినీడు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
  • ‘పోకిరి’కి 20ఏళ్లు.. తరానికో పండుగాడు.. అందుకే అంత ఫేమస్‌ అయ్యాడు! మహేశ్‌బాబు కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘పోకిరి’ విడుదలై 20ఏళ్లుపూర్తి చేసుకుంది.
  • పవన్‌కల్యాణ్‌ ‘జానీ’కి 23ఏళ్లు.. సినిమా హిట్‌ అయి ఉంటే.. తొలి ప్రేమ.. తమ్ముడు.. బద్రి.. ఖుషి.. చిరంజీవి సోదరుడిగా పవన్‌కల్యాణ్‌ వెండితెరకు పరిచయమైనా మిలీనియంలో వరుస హిట్‌లతో దూసుకుపోయారు.
  • అలా శింబు స్థానంలో జీవా... కెరీర్‌ను మార్చేసిన ‘రంగం’ వెనుక కథ ఇది.. ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉంటుందంటారు. సినిమా ఇండస్ట్రీలో ఇది తరచూ జరిగేదే. సినిమా మొదలై షూటింగ్‌ కొంత పూర్తయిన తర్వాత మారిపోయిన నటీనటులు ఎందరో. అలాంటి చిత్రమే ‘కో’.
  • ‘అంకుశం’లో చార్మినార్‌ వద్ద ఫైట్‌.. రెండు రోజులు కనిపించకుండా పోయిన రామిరెడ్డి అనుకోకుండా వచ్చే అవకాశాలే కొందరి దశను మార్చేస్తాయి. తమ నటనతో వెండితెరపై చెరగని ముద్రవేసిన వాళ్లలో నటుడు రామిరెడ్డి (Rami Reddy) ఒకరు.
  • నా షరతులతోనే ‘బద్రి’లో నటించా.. ‘జానీ’లో ఇలా: రేణూ దేశాయ్‌ తాను నటించిన ‘బద్రి’, ‘జానీ’ సినిమాల గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు నటి రేణూ దేశాయ్‌.
  • ‘జురాసిక్‌’ పార్క్‌ మూవీని రిజెక్ట్‌ చేసిన శ్రీదేవి.. కారణం అదే! హాలీవుడ్‌ సినిమాల్లో అవకాశం వస్తే ఎవరైనా వదులుకుంటారా? డబ్బుకు డబ్బు.. కావాల్సినంత ప్రచారం రెండూ ఒకేసారి వచ్చి పడతాయి. అందులోనూ స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ మూవీ అంటే కథేంటో కూడా అడగకుండా ఒప్పుకొంటారు.
  • క్లైమాక్స్‌ చెబితేనే చేస్తానన్న నాగార్జున.. 40వేల నుంచి 2 లక్షలకు పెరిగిన భక్తులు.. ‘శ్రీరామదాసు’కు 20ఏళ్లు తెలుగు సినీ చరిత్రలో భక్తిరస చిత్రాలకు కొదవేమీ లేదు. అయితే, కొన్ని చిత్రాలు ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌ అలాంటి వాటిలో ‘శ్రీరామదాసు’ (Sri Ramadasu) ఒకటి.
  • ఆ కథ వద్దని.. ‘ఆది’తో రికార్డులు నెలకొల్పిన ఎన్టీఆర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వినాయక్‌ తెరకెక్కించిన తొలి చిత్రం ‘ఆది’. ఈ సినిమా గురించి కొన్ని విశేషాలివీ..
  • అందుకే ‘జెంటిల్‌మేన్‌’లో నటించలేకపోయా: రాజశేఖర్‌ ‘జెంటిల్‌మేన్‌’ సినిమాలో తానెందుకు నటించలేకపోయారో రాజశేఖర్‌ తెలిపారు.
  • ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’.. ఆ రోల్‌ మిస్‌ అయిన రాజశేఖర్‌ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’లో ఓ పాత్ర మిస్‌ అయినట్లు రాజశేఖర్‌ తెలిపారు.
  • భారీ బడ్జెట్‌.. థియేటర్ల వద్ద 144 సెక్షన్‌.. ఫస్ట్‌ 70MM ‘సింహాసనం’ @ 40ఏళ్లు తొలి తెలుగు 70MM 6 ట్రాక్ స్టీరియో ఫోనిక్ సౌండ్‌తో కృష్ణ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘సింహాసనం’. 21, మార్చి 1986లో విడుదలైన ఈ మూవీ నేటితో నలభై వసంతాలు పూర్తి చేసుకుంది.
  • ఆ హీరోతో తీయాలనుకున్నారు.. NTR జీతం ₹250.. ‘పాతాళభైరవి’కి 75 వసంతాలు మళ్లీ మళ్లీ చూడాలనిపించే సినిమాలు కొన్ని ఉంటాయి.. ఎన్నిసార్లు చూసినా ప్రతిసారి కొత్తగా అనిపించే చిత్రాలు ఇంకొన్ని ఉంటాయి.. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ మళ్లీ తీయలేని సినిమాలు మరికొన్ని ఉంటాయి.. అలాంటిదే ‘పాతాళ భైరవి’.
  • ‘ఆస్కార్‌’ ఎంట్రీ.. నేషనల్‌ అవార్డు.. 40 ఏళ్ల ‘స్వాతిముత్యం’ విశేషాలివి..! కమల్‌ హాసన్‌, రాధిక ప్రధాన పాత్రల్లో దర్శకుడు కె.విశ్వనాథ్‌ తెరకెక్కించిన చిత్రం ‘స్వాతిముత్యం’. 40 ఏళ్ల ఈ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలివీ..
  • 50 ఏళ్ల ‘ఆరాధన’.. ఎన్టీఆర్‌ ఎవర్‌గ్రీన్‌ మూవీ విశేషాలు తెలుసా? ఎన్టీఆర్‌ నటించిన ‘ఆరాధన’ సినిమాకి 50 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి కొన్ని సంగతులివీ..
  • చిరంజీవి సినిమాకు పోటీగా ‘మనీ’ విడుదల చేసిన ఆర్జీవీ జేడీ చక్రవర్తి, చిన్నా, జయసుధ, పరేశ్‌ రావల్‌ కీలక పాత్రల్లో శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన కామెడీ థ్రిల్లర్‌ ‘మనీ’ (Money). దర్శకుడు రాంగోపాల్‌వర్మ (Ramgopal Varma) ఈ సినిమాను నిర్మించారు.