ఆలస్యమే అమృత్‌మా!

Eenadu icon
By Telangana News Desk Published : 25 Feb 2026 05:25 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, కరీంనగర్, సూర్యాపేట, నిజామాబాద్, మహబూబ్‌నగర్, ఈటీవీ, ఆదిలాబాద్‌: పుర, నగరపాలికల్లో తాగునీటి, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు, మురుగునీటి శుద్ధి కోసం ప్లాంట్ల నిర్మాణానికి అమృత్‌ 2.0 నిధులతో రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల చేపట్టిన పనుల్లో ఎడతెగని జాప్యం జరుగుతోంది. దాదాపు రెండున్నరేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయగా రాష్ట్ర ప్రభుత్వ వాటాతో కలిపి పట్టణాల్లో ఈ పనులు చేపట్టారు. 2023లో ప్యాకేజీలుగా విభజించి పలు రకాల పనులను గుర్తించారు. పెరుగుతున్న జనాభా, విలీన గ్రామాల్లో తాగునీటి సరఫరా దృష్ట్యా కొత్తగా పైపులైన్లు, ట్యాంకుల నిర్మాణాన్ని చేపట్టాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చి నెలాఖరు నాటికి ఇవన్నీ పూర్తవ్వాలి. చాలాచోట్ల ఆశించిన పురోగతి లేదు. కొన్ని చోట్ల గుత్తేదారుల నిర్లక్ష్యం వల్ల ఆలస్యం జరుగుతుండగా.. ఇంకొన్ని చోట్ల స్థల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. అయితే కొన్ని చోట్ల పనుల టెండర్ల ఆలస్యం కారణంగా ఈ ఏడాది జూన్‌ నాటికి ఇవి పూర్తయ్యే వీలుంది. మొత్తం పనులన్నీ వర్షాకాలం నాటికి పూర్తి చేసే విధంగా పర్యవేక్షణ పెరగాల్సి ఉంది. పుర, నగరపాలికల్లో పాలకవర్గాలు కొలువుదీరడంతో ఇప్పుడు వీటిపై తగిన దృష్టిసారించాల్సిన అవసరముంది. 

నింపాదిగా ఇలా..

  • ఆదిలాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ కోసం నిధులు కేటాయించగా అతీగతీ లేని తీరున ఇక్కడి పనులున్నాయి. ఖానాపూర్, మహాలక్ష్మీ వాడ సహా మరో రెండు చోట్ల మురుగునీటి శుద్ధి ప్లాంట్ల(ఎస్టీపీల) నిర్మాణానికి రూ.225 కోట్లు మంజూరయ్యాయి. సరైన స్థలం లేకపోవడంతో ఈ పనులు ముందుకు సాగడం లేదు. పట్టణ పరిధిలో చాలా ప్రాంతాల్లో వర్షాకాలం వచ్చిందంటే ముంపు సమస్య ఎక్కువగా ఉంది. 
  • ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని మున్సిపాలిటీల్లో 48 శాతం పనులు పూర్తయ్యాయి. నెల రోజులే గడువు ఉండటంతో ఇటీవల వేగం పెంచారు. ఈ రెండు ఉమ్మడి జిల్లాల పరిధిలోని పనుల కోసం రూ.1,758 కోట్లు మంజూరు చేశారు. అయితే ఎస్టీపీల నిర్మాణాలకు స్థల సేకరణ సమస్య ఎదురవుతుండటంతో ఇబ్బంది నెలకొంది. ఖమ్మంలో రోజుకు 40 మిలియన్‌ లీటర్లు(ఎంఎల్‌డీ), నల్గొండలో 40 ఎంఎల్‌డీ సామర్థ్యంతో నిర్మించాల్సిన ఎస్టీపీలకు భూమి లభించక వీటి పనులు ఇంకా ప్రారంభమవడం లేదు.
  • ఉమ్మడి మహబూబ్‌నగర్‌లోని నారాయణపేట మున్సిపాలిటీకి రూ.15.38 కోట్లు వచ్చాయి. 65 కి.మీ.ల మేర నిర్మించాల్సిన పైపులైన్‌ 90 శాతం పూర్తయింది. టీచర్స్‌ కాలనీ, ఈద్గా వద్ద 400 కిలో లీటర్లు, సంత బజారు వద్ద 600 కిలోలీటర్ల పరిమాణమున్న ట్యాంకుల పనులు ఇంకా నత్తనడకన సాగుతున్నాయి. 
  • కరీంనగర్‌ కార్పొరేషన్‌కు రూ.132 కోట్లు వచ్చినా ఇంకా విలీన కాలనీల్లో పనులు చేపట్టాల్సి ఉంది. జగిత్యాల జిల్లాకు రూ.138 కోట్లు వచ్చినా చాలాచోట్ల పనులు కాలేదు. 

వరంగల్‌ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో పునాది దశలో ఉన్న ట్యాంక్‌ ఇది.  తాగునీటి పైపులైన్‌ పనుల కోసం పట్టణంలో అంతర్గత రోడ్లు తవ్వకాలు చేపట్టడంతో రాకపోకలకు ప్రజలు     ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు జనగామ పట్టణంలో ఓవర్‌హెడ్‌ ట్యాంకులు రెండింటికిగాను ఒకటి 50 శాతం పూర్తవగా.. ఇంకోటి స్థలం వెతుకులాట వద్దే ఉంది. నర్సంపేటలో 80 లక్షల లీటర్ల సామర్థ్యంతో కూడిన ఓవర్‌హెడ్‌ ట్యాంక్‌ పనులు 75 శాతం పూర్తవగా 20 కి.మీ. పైపులైన్‌కుగాను 9 నుంచి10 కి.మీ. పూర్తయ్యాయి.

జగిత్యాల జిల్లాలోని కోరుట్ల మున్సిపాలిటీలో అమృత్‌ నిధులతో చేపట్టిన ఏఖీన్‌పూర్‌ వెళ్లే మార్గంలో తాగునీటి పైపులైన్‌ పరిస్థితి ఇది. రెండు నెలలుగా ఇలానే ఉంది. మొత్తం 46 కి.మీ. మేర పైపులైన్‌ వేయాలని నిర్ణయించగా ఇప్పటి వరకు 10 కి.మీ. మాత్రమే పూర్తయింది. 

నిజామాబాద్‌ నగరంలో కంఠేశ్వర్‌ ఆలయ సమీపంలో రూ.2 కోట్లతో నిర్మిస్తున్న ట్యాంక్‌ ఇది. గడిచిన 6 నెలలుగా అసంపూర్తిగా ఉంది. ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో రూ.795 కోట్లతో చేపట్టే పనులన్నీ ఇలాగే దర్శనమిస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో 22 ట్యాంకులను నిర్మించాల్సి ఉండగా ఇందులో మూడు మాత్రమే పూర్తయ్యాయి. నిజామాబాద్‌ నగరపాలక సంస్థలో 10 వేల మ్యాన్‌హోళ్లకు మరమ్మతులు చేపట్టాల్సి ఉండగా 700కుపైగా మాత్రమే పూర్తయ్యాయి.

► Read latest Telangana Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • గ్రేహౌండ్స్‌.. ఎస్‌ఐబీ ఇక చరిత్ర గతిలోకి! దాదాపు నాలుగున్నర దశాబ్దాల పాటు హడలెత్తించిన వామపక్ష తీవ్రవాదం చివరి అంకానికి చేరడంతో పోలీసుశాఖలో వ్యవస్థాపరమైన మార్పులు జరగబోతున్నాయి.
  • ఫీజుల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు విశ్రాంత న్యాయమూర్తి లేదా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి కమిటీ ఏర్పాటుచేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
  • పది పరీక్షలకు హాజరవుతున్నా.. అమ్మ చంకలో బిడ్డనే! ఈ చిత్రంలో అమ్మ చంకలో ఉన్న బాలిక పేరు సుమిత. పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతోంది. ఎత్తు 1.5 అడుగులు మాత్రమే.
  • పసిపిల్లల హృదయాలయం కల్లాకపటం తెలియని పసి మనసులు.. హృద్రోగ సమస్యలతో తల్లడిల్లుతుంటే.. మేమున్నాం అంటూ అక్కున చేర్చుకుంటోంది సిద్దిపేట జిల్లా కొండపాకలోని శ్రీసత్యసాయి సంజీవని సెంటర్‌ ఫర్‌ చైల్డ్‌ హార్ట్‌కేర్‌ అండ్‌ రీసెర్చ్‌.
  • మీరే ప్రభుత్వానికి కళ్లు.. చెవులు సివిల్‌ సర్వీసెస్‌ అధికారులకు ఎగ్జిక్యూటివ్‌ ఎడ్యుకేషన్‌ అందించేందుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రానికి హార్వర్డ్‌ వర్సిటీ రానుందని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
  • అధికార గర్వంతో పేదల ఇళ్లు కూల్చారు భూదాన్‌ భూముల్లో నిర్మించిన ఇళ్లను కూల్చడంతో వీధినపడిన నిరుపేదల పక్షాన సుప్రీంకోర్టులో న్యాయపోరాటం చేస్తామని, అసెంబ్లీలోనూ గళం విప్పి ప్రభుత్వంతో కొట్లాడతామని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ అన్నారు.
  • ఎప్‌సెట్‌ రద్దు చేయాలి రాష్ట్రంలో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఈఏపీసెట్‌ (ఎప్‌సెట్‌)ను రద్దు చేయాలని తెలంగాణ విద్యా కమిషన్‌ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
  • నేరాలను ఆపేది చదువే! నేర ప్రవృత్తికి... అక్షరాస్యతకు మధ్య సంబంధం ఉందని చెబుతున్నాయి గణాంకాలు. రాష్ట్రంలో ఏటా సగటున 5 వేల మంది విచారణ ఖైదీలు, 2 వేల మంది శిక్ష పడ్డ ఖైదీలు జైళ్లకు వస్తున్నారు.
  • కాళేశ్వరంలో భారాస అవినీతికి భాజపా సహకారం ‘కాళేశ్వరం సహా నీటిపారుదల ప్రాజెక్టుల్లో దోచుకున్న సొమ్ములో కొంతైనా పాపపరిహారం కింద కేసీఆర్‌ పేదలకు పంచి ప్రజలను క్షమాపణ కోరాలి.
  • న్యుమోనియాకు బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యుల కొత్త టీకా! న్యుమోనియా నియంత్రణకు కొత్త టీకాను కనుగొన్నట్లు బిట్స్‌ హైదరాబాద్‌ ఆచార్యులు, పరిశోధకులు యోగేశ్వర్‌ దేవరకొండ, ఎం.వి.ఎన్‌. జనార్దన్‌రెడ్డి, అరుణిమ, కీర్తిమాన్‌ స్యాల్‌లు గురువారం తెలిపారు. ‘‘స్ట్రెప్టోకోకల్‌ న్యుమోనియా కట్టడికి ఏడాది నుంచి పరిశోధనలు చేస్తున్నా.
  • ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇం‘ధనం’! రోజువారీ వినియోగ వస్తువుల ప్యాకేజింగ్‌ వ్యర్థాలను ఇంధనంగా మార్చే సాంకేతికతను హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక పరిశోధన సంస్థ ్బఐఐసీట్శీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
  • కొండాపూర్‌ భూములపై స్టేటస్‌కో ఇవ్వం హైదరాబాద్‌ కొండాపూర్‌లోని సర్వే నం.59లో ఉన్న 57.09 ఎకరాల వివాదాస్పద భూమిపై స్టేటస్‌కో ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది.
  • 8.68 లక్షల భూభారతి దరఖాస్తులు ఏమయ్యాయి?: హరీశ్‌రావు ‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రెవెన్యూ సమస్యలతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు.. భూభారతి పేరిట రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 8.68 లక్షల దరఖాస్తులు వచ్చినా.. పరిష్కారం కాలేదు’ అని శాసనసభాపక్ష ఉపనేత హరీశ్‌రావు ఆరోపించారు.
  • ఖనిజాల పరిశోధనలకు ఎన్‌ఎండీసీ, ఐఐటీ-హెచ్‌ భాగస్వామ్యం ఖనిజాల పరిశోధనల కోసం హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ)తో జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ(ఎన్‌ఎండీసీ) పరిశోధన, అభివృద్ధి కేంద్రం ఒప్పందం చేసుకుంది.
  • ఇది పదాలు పలికించే ‘పలక’ తల్లి ఒడిని వదిలి అప్పుడప్పుడే బడిబాట పట్టే బాలలు భయం, బెరుకు లేకుండా... అలవోకగా అక్షరాలు, పదాలు నేర్చుకునేందుకు సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం నాగారం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు కేతావత్‌ తావుర్యానాయక్‌ ‘మైస్లేట్‌’ పేరుతో ప్రత్యేకంగా ఓ పలకను రూపొందించారు.
  • అరుదైన ఖనిజాలపై ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాలి: ఎన్‌సీఎంఎం నేటి ఆధునిక ప్రపంచంలో అరుదైన ఖనిజాలకు అధిక ప్రాధాన్యముందని, ఈ రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని నేషనల్‌ క్రిటికల్‌ మినరల్‌ మిషన్‌(ఎన్‌సీఎంఎం) కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
  • టీఎస్‌జీఆర్‌ఈఏ అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం(టీఎస్‌జీఆర్‌ఈఏ) అధ్యక్షుడిగా పేరి వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎంసీ లింగన్నలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • అగ్నిమాపక శాఖలోని సౌకర్యాలపై వివరణివ్వండి: హైకోర్టు విపత్తులను ఎదుర్కోవడానికి అగ్నిమాపక శాఖలో ఉన్న సౌకర్యాలు, వనరులు, పరికరాల స్థితిగతులపై వివరాలు సమర్పించాలంటూ ప్రభుత్వానికి గురువారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
  • సంక్షిప్త వార్తలు కాంగ్రెస్‌ పార్టీ కోసం నిరంతరం పనిచేస్తున్న పీసీసీ మాజీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జెట్టి కుసుమ కుమార్, మాజీ ఎంపీ వి.హనుమంతరావులకు రాజ్యసభ ఎన్నికల్లో అవకాశం కల్పించాలని పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.
  • వసతులు లేవు.. అధ్యాపకులు లేరు విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సగటున 72 శాతం అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 80 శాతం డిగ్రీ కళాశాలల్లో మౌలిక సౌకర్యాల కొరత వేధిస్తోంది.