పెట్టుబడులకు రైట్ రైట్

- A
- A+
- A++

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చిన సంస్థలకు భూకేటాయింపులు, రాయితీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆమోదించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద లిథియం అయాన్ సెల్ గిగా పరిశ్రమ, నాయుడుపేట వద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ పరిశ్రమ, విశాఖ జిల్లా తర్లువాడలో అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ వంటి సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు, పెట్టుబడులకు సమ్మతి తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
2014-19 మధ్య చేసిన నీరు- చెట్టు పనులకు సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం సిఫారసుల మేరకు అటవీశాఖ అధికారులపై చేపట్టిన క్రమశిక్షణ చర్యలు, కొందరు జలవనరులశాఖ ఇంజినీర్లు, జన్మభూమి- మాఊరు కమిటీ సభ్యులు, సంస్థలపై వైకాపా ప్రభుత్వం పెట్టిన కక్షసాధింపు కేసులను ఉపసంహరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్తగా సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ రంగానికి చెందిన నిపుణుడిని కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖ పేరు ‘పర్యావరణం అటవీశాఖ’గా మార్పు చేసింది. ఆంధ్రప్రదేశ్ మోటారు వాహనాల పన్నుల (సవరణ) బిల్లు-2026ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది.
మోటార్ వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలో చెల్లించే లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం అదనపు పన్నును ‘రోడ్డు సేఫ్టీ సెస్’ పేరుతో విధించేందుకు వీలుగా చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. జాతీయ వన్యప్రాణి బోర్డు సిఫారసుల మేరకు కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య సరిహద్దుల్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర సాధికార కమిటీ అనుమతి కోరాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన బడ్జెట్ ప్రసంగానికి ఆమోదం తెలిపింది.
వారికీ ఐదు రకాల బస్సుల్లో ఉచితం
దివ్యాంగులకూ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు... ప్రస్తుతం స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్న ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులకు ప్రస్తుతం 50 శాతం రాయితీ ఇస్తుండగా... ఇకపై ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. స్త్రీశక్తి పథకం వర్తించని నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో దివ్యాంగులకు ఇస్తున్న 50 శాతం రాయితీ యథావిధిగా కొనసాగుతుంది. దీంతోపాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ..
రాంబిల్లిలో రూ.8,175 కోట్లతో లిథియం అయాన్ సెల్ గిగా ఫ్యాక్టరీ
ఇటీవల ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- విశాఖలో ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్‌ల ఏఐ డేటా సెంటర్‌కు సంబంధించి అదానీ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ను ఆథరైజ్డ్ నోటిఫైడ్ భాగస్వామిగా పరిగణించాలని గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చేసిన విజ్ఞప్తికి కేబినెట్ ఆమోదం. ఈ డేటా సెంటర్ ఏర్పాటుకు భూములు, ప్రోత్సాహకాల వంటి అంశాలపై ప్రభుత్వంతో ఇకపై అదానీ ఇన్‌ఫ్రా సంస్థ సంప్రదింపులు జరుపుతుంది. ఈ ప్రాజెక్టు కోసం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని మూడు చోట్ల 601.4 ఎకరాల్ని... వైజాగ్ హైపర్‌స్కేల్, వైజాగ్ మెగా, వైజాగ్ రాంబిల్లి డేటా సెంటర్ పార్క్ పేరుతో ఏర్పాటు చేసే మూడు ఎస్పీవీలకు ప్రభుత్వం బదలాయిస్తుంది.
- అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 16 గిగావాట్స్ పర్ హవర్ (జీడబ్ల్యూహెచ్‌ఆర్) సామర్థ్యంతో లిథియం అయాన్ సెల్ గిగాఫ్యాక్టరీ ఏర్పాటుకు.. వారీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 300 ఎకరాల కేటాయింపు. రూ.8,175 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ. 3 వేల మందికి ఉపాధి. ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేసేందుకు క్యాబినెట్ నిర్ణయం.
- నాయుడుపేట వద్ద లిథియం అయాన్ బ్యాటరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు.. ఎన్‌ఏఎన్ గ్రీన్‌మెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు 21.36 ఎకరాల కేటాయింపు. ప్రత్యేక ప్రోత్సాహకాలు. రూ.1,366 కోట్ల పెట్టుబడితో 340 మందికి ఉపాధి కల్పించనున్న సంస్థ.
- రాంబిల్లి ఇండస్ట్రియల్ పార్కులో ఎండీఎఫ్, పార్టికల్ బోర్డు ప్రొడక్షన్ లైన్ ఏర్పాటుకు బాలాజీ యాక్షన్ బిల్డ్ వెల్ (యాక్షన్ టెసా) సంస్థకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాల్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ఆ సంస్థ రూ.1,233 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పించనుంది.
- ఓర్వకల్లు మండలంతోని గుత్తపాడు క్లస్టర్‌లో సింథటిక్ ఆర్గానిక్ కెమికల్స్, ఏపీఐల తయారీ యూనిట్ ఏర్పాటుకు.. సిగాచి ఇండస్ట్రీస్ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదం.
- విశాఖ జిల్లా తర్లువాడలో అవుట్‌సోర్స్‌డ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ఫెసిలిటీ ఏర్పాటుకు అడ్వాన్స్‌డ్ సిస్టమ్ ఇన్ ప్యాకేజ్ టెక్నాలజీస్ సంస్థకు ఆమోదం. రూ.2,387.81 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన సంస్థ. వెయ్యి ఉద్యోగాల కల్పన. ఆ సంస్థకు 30 ఎకరాలు కేటాయిస్తూ, ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తూ నిర్ణయం.
- సిరిబయోనిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్, స్కై స్టోరేజ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలకు భూమి కేటాయిస్తూ నిర్ణయం.
తితిదేలో లడ్డూ తయారీ కేంద్రం (పోటు)లో 18 సూపర్‌వైజర్ పోస్టులకు అనుమతి. 18 పోర్టు వర్కర్ (సీనియర్) పోస్టుల్ని అప్‌గ్రేడ్ చేయడం ద్వారా ఈ పోస్టుల్ని సృష్టిస్తారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 03:49 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- ఏకసభ్య కమిషన్ ముందుకు సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ? శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ విచారణ ముమ్మరం చేసింది.
- ఐఆర్‌ఆర్ కేసులో ఆళ్ల వ్యాజ్యాలకువిచారణార్హత లేదు ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్) కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల (ఎంపీ, ఎమ్మెల్యేల) ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సీఐడీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు.
- ఈ చొక్కా మాయదు..తడవదు! నీరు పడినా తడవని.. దుమ్ములో వెళ్లినా మురికి పట్టని ఓ చొక్కా తిరుపతి రీజినల్ సైన్స్ సెంటర్‌లో నూతనంగా ప్రారంభించిన బయో మిమిక్రీ గ్యాలరీలో ఆకట్టుకుంటోంది.
- ఆ రోజు కస్టడీలో ఏం జరిగింది? ‘అప్పట్లో ఎంపీగా ఉన్న ప్రస్తుత స్పీకర్ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉంచినప్పుడు సీఐడీ కార్యాలయంలో ఏం జరిగింది? ఆ రోజు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏయే విధులు నిర్వర్తించారు? రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున 1.30 గంటల వరకు మీరేం చేశారు?..
- సర్పంచి భర్త వైకాపా నేత కావడంతో అక్రమాలపై చర్యలు తీసుకోని అధికారులు ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీలో రూ.1.21 కోట్ల నిధుల అవకతవకలకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
- విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల్లో మార్పులు విశాఖపట్నం, విజయవాడలో మెట్రోరైల్ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు సూచించింది. విశాఖలో స్టీల్‌ప్లాంట్ నుంచి కొమ్మాది మార్గంలో డబుల్ డెక్కర్ కంటే జాతీయ రహదారి మధ్యలో నుంచి కారిడార్ నిర్మించి మెట్రోరైల్ నడపడం మేలని రాష్ట్రానికి లేఖ రాసింది.
- యోగా, నేచురోపతి సలహాదారు మంతెనకు క్యాబినెట్ హోదా రాష్ట్ర ప్రభుత్వ యోగా, నేచురోపతి గౌరవ సలహాదారుగా నియమితులైన డాక్టర్ మంతెన సత్యనారాయణరాజుకు క్యాబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
- సైకిల్‌పై సోగ్గాడు.. వందేళ్ల కుర్రాడు..! పేరు వంగా రామలింగారెడ్డి. వయసు 98 ఏళ్లు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి స్వస్థలం. 17 జూన్ 1928లో జన్మించారు. వయసు వందేళ్లకు చేరువవుతున్నా కుర్రాడిలాగే ఉంటారు.
- మదనపల్లె దస్త్రాల దహనం కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు చుక్కెదురు మదనపల్లె రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి (ఏ-3), వ్యక్తిగత సహాయకుడు బల్లాపురం మునితుకారాంలకు(ఏ-4) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
- ‘రాయలసీమ ఉద్యాన హబ్’పై ముందడుగు రాయలసీమ ఉద్యాన హబ్‌పై మరో మూడు రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అధికారులతో భేటీ ఉంది.
- హైకోర్టులో మహిళా దినోత్సవ వేడుకలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు సోమవారం హైకోర్టులో ఘనంగా నిర్వహించారు.
- రెవెన్యూ సమాచారమంతా ఆన్‌లైన్‌లోకి రెవెన్యూశాఖకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు భూముల సమాచారమైనా.. ఇంటిస్థలాల మంజూరు పుస్తకాలైనా.. అసైన్డ్ భూముల రిజిస్టర్లు అయినా మొత్తం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
- ఐదేళ్ల ముందస్తు ప్రణాళికతో.. డీఎంఎఫ్ నిధులు వినియోగించాలి మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఖనిజ ఫౌండేషన్ ట్రస్ట్ (డీఎంఎఫ్) నిధులతో చేపట్టే పనులకు.. ఐదేళ్ల ముందస్తు ప్రణాళిక ఉండాలని, ఆ ప్రకారం వాటిని పూర్తి చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
- బహుముఖ ప్రజ్ఞాశాలి సునీల్‌రెడ్డి కన్నుమూత బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్ర ఇంటెలిజెన్స్ విశ్రాంత డీఎస్పీ సత్తి సునీల్‌రెడ్డి(73) సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
- హైకోర్టు ఆదేశానుసారం ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి పదోన్నతుల రిజర్వేషన్‌పై ఉమ్మడి ఏపీ హైకోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాల్ని అనుసరించి ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఆల్ ఇండియా ఈక్వాలిటీ ఫోరం కోరింది.
- తిరుపతిలో ‘క్లౌడ్’ భద్రత కేంద్రం పౌరుల ఆధార్ వివరాలు, ఆసుపత్రి రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్ పత్రాలు, మీసేవ కేంద్రాలు, ఇతర సేవల కోసం ఇచ్చే డేటా చౌర్యానికి గురికాకుండా పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
- ఉదయం 11 తర్వాత.. మిక్సింగ్, ఫిల్లింగ్ బంద్ ‘దేశంలో బాణసంచా పరిశ్రమలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రం శివకాశీలోని తయారీ కేంద్రాల్లో ఉదయం 11 గంటల తర్వాత రసాయనాలు కలపడం (మిక్సింగ్), నింపడం (ఫిల్లింగ్) వంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు.
- పంచాయతీల పునర్ వర్గీకరణకు పచ్చజెండా రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్ వర్గీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంబంధిత ప్రతిపాదనలను ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది.
- రాష్ట్రంలో 10 కేజీబీవీల రద్దు ఏపీకి కేటాయించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 10 రద్దు/సరెండర్ చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్ చౌధరి తెలిపారు.
- వాగులు కాదు.. విశాలమైన కాలువలు రాజధాని అమరావతి ముంపు ప్రాంతమంటూ పదేపదే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నవారి నోళ్లకు తాళం పడేలా ప్రభుత్వం భారీ ప్రణాళిక అమలు చేస్తోంది.