పెట్టుబడులకు రైట్‌ రైట్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Feb 2026 06:32 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రతిపాదనలతో వచ్చిన సంస్థలకు భూకేటాయింపులు, రాయితీలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 18న రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలను ఆమోదించింది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద లిథియం అయాన్‌ సెల్‌ గిగా పరిశ్రమ, నాయుడుపేట వద్ద లిథియం అయాన్‌ బ్యాటరీ ప్రాసెసింగ్‌ పరిశ్రమ,  విశాఖ జిల్లా తర్లువాడలో అవుట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ వంటి సంస్థల ఏర్పాటుకు భూముల కేటాయింపు, పెట్టుబడులకు సమ్మతి తెలిపింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.

2014-19 మధ్య చేసిన నీరు- చెట్టు పనులకు సంబంధించి విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం సిఫారసుల మేరకు అటవీశాఖ అధికారులపై చేపట్టిన క్రమశిక్షణ చర్యలు, కొందరు జలవనరులశాఖ ఇంజినీర్లు, జన్మభూమి- మాఊరు కమిటీ సభ్యులు, సంస్థలపై వైకాపా ప్రభుత్వం పెట్టిన కక్షసాధింపు కేసులను ఉపసంహరిస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఉన్నతవిద్య, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖల పునర్వ్యవస్థీకరణ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. కొత్తగా సైన్స్, టెక్నాలజీ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆ రంగానికి చెందిన నిపుణుడిని కార్యదర్శిగా నియమించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న పర్యావరణం, అటవీ, శాస్త్ర, సాంకేతికశాఖ పేరు ‘పర్యావరణం అటవీశాఖ’గా మార్పు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ మోటారు వాహనాల పన్నుల (సవరణ) బిల్లు-2026ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది.

మోటార్‌ వాహనాల రిజిస్ట్రేషన్‌ సమయంలో చెల్లించే లైఫ్‌ ట్యాక్స్‌పై 10 శాతం అదనపు పన్నును ‘రోడ్డు సేఫ్టీ సెస్‌’ పేరుతో విధించేందుకు వీలుగా చట్ట సవరణకు బిల్లు ప్రవేశపెట్టనున్నారు. జాతీయ వన్యప్రాణి బోర్డు సిఫారసుల మేరకు కొల్లేరు వన్యప్రాణి అభయారణ్య సరిహద్దుల్ని క్రమబద్ధీకరించేందుకు కేంద్ర సాధికార కమిటీ అనుమతి కోరాలన్న ప్రతిపాదనను మంత్రివర్గం ఆమోదించింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ చేసిన బడ్జెట్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపింది. 

వారికీ ఐదు రకాల బస్సుల్లో ఉచితం

దివ్యాంగులకూ ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 40 శాతం, అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు... ప్రస్తుతం స్త్రీశక్తి పథకం అమలు చేస్తున్న ఐదు రకాల బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, అల్ట్రాపల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో దివ్యాంగులకు ప్రస్తుతం 50 శాతం రాయితీ ఇస్తుండగా... ఇకపై ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తారు. సిటీ ఆర్డినరీ బస్సుల్లో ఇప్పటికే ఉచిత ప్రయాణానికి అనుమతిస్తున్నారు. స్త్రీశక్తి పథకం వర్తించని నాన్‌స్టాప్, అంతర్రాష్ట్ర, సప్తగిరి ఎక్స్‌ప్రెస్, అల్ట్రా డీలక్స్‌ బస్సుల్లో దివ్యాంగులకు ఇస్తున్న 50 శాతం రాయితీ యథావిధిగా కొనసాగుతుంది. దీంతోపాటు మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలివీ..

రాంబిల్లిలో రూ.8,175 కోట్లతో లిథియం అయాన్‌ సెల్‌ గిగా ఫ్యాక్టరీ 

ఇటీవల ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న పలు నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

  • విశాఖలో ఏర్పాటు చేయనున్న 1000 మెగావాట్‌ల ఏఐ డేటా సెంటర్‌కు సంబంధించి అదానీ ఇన్‌ఫ్రా ఇండియా లిమిటెడ్‌ను ఆథరైజ్డ్‌ నోటిఫైడ్‌ భాగస్వామిగా పరిగణించాలని గూగుల్‌ అనుబంధ సంస్థ రైడెన్‌ ఇన్ఫోటెక్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ చేసిన విజ్ఞప్తికి కేబినెట్‌ ఆమోదం. ఈ డేటా సెంటర్‌ ఏర్పాటుకు భూములు, ప్రోత్సాహకాల వంటి అంశాలపై ప్రభుత్వంతో ఇకపై అదానీ ఇన్‌ఫ్రా సంస్థ సంప్రదింపులు జరుపుతుంది. ఈ ప్రాజెక్టు కోసం అనకాపల్లి, విశాఖ జిల్లాల్లోని మూడు చోట్ల 601.4 ఎకరాల్ని... వైజాగ్‌ హైపర్‌స్కేల్, వైజాగ్‌ మెగా, వైజాగ్‌ రాంబిల్లి డేటా సెంటర్‌ పార్క్‌ పేరుతో ఏర్పాటు చేసే మూడు ఎస్పీవీలకు ప్రభుత్వం బదలాయిస్తుంది. 
  • అనకాపల్లి జిల్లా రాంబిల్లి వద్ద 16 గిగావాట్స్‌ పర్‌ హవర్‌ (జీడబ్ల్యూహెచ్‌ఆర్‌) సామర్థ్యంతో లిథియం అయాన్‌ సెల్‌ గిగాఫ్యాక్టరీ ఏర్పాటుకు.. వారీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 300 ఎకరాల కేటాయింపు. రూ.8,175 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ. 3 వేల మందికి ఉపాధి. ప్రత్యేక ప్రోత్సాహకాలు అందజేసేందుకు క్యాబినెట్‌ నిర్ణయం.
  • నాయుడుపేట వద్ద లిథియం అయాన్‌ బ్యాటరీ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు.. ఎన్‌ఏఎన్‌ గ్రీన్‌మెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు 21.36 ఎకరాల కేటాయింపు. ప్రత్యేక ప్రోత్సాహకాలు. రూ.1,366 కోట్ల పెట్టుబడితో 340 మందికి ఉపాధి కల్పించనున్న సంస్థ. 
  • రాంబిల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో ఎండీఎఫ్, పార్టికల్‌ బోర్డు ప్రొడక్షన్‌ లైన్‌ ఏర్పాటుకు బాలాజీ యాక్షన్‌ బిల్డ్‌ వెల్‌ (యాక్షన్‌ టెసా) సంస్థకు గతంలో ఇచ్చిన ప్రోత్సాహకాల్ని పొడిగిస్తూ తీసుకున్న నిర్ణయానికి ఆమోదం. ఆ సంస్థ రూ.1,233 కోట్ల పెట్టుబడితో 1,500 మందికి ఉపాధి కల్పించనుంది. 
  • ఓర్వకల్లు మండలంతోని గుత్తపాడు క్లస్టర్‌లో సింథటిక్‌ ఆర్గానిక్‌ కెమికల్స్, ఏపీఐల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు.. సిగాచి ఇండస్ట్రీస్‌ సంస్థకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు ఆమోదం. 
  • విశాఖ జిల్లా తర్లువాడలో అవుట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌ ఫెసిలిటీ ఏర్పాటుకు అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్‌ ఇన్‌ ప్యాకేజ్‌ టెక్నాలజీస్‌ సంస్థకు ఆమోదం. రూ.2,387.81 కోట్లతో దీన్ని ఏర్పాటు చేస్తామని ప్రతిపాదించిన సంస్థ. వెయ్యి ఉద్యోగాల కల్పన. ఆ సంస్థకు 30 ఎకరాలు కేటాయిస్తూ, ప్రత్యేక ప్రోత్సాహకాలు కల్పిస్తూ నిర్ణయం. 
  • సిరిబయోనిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్, ప్రీమియర్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ లిమిటెడ్, స్కై స్టోరేజ్‌ సొల్యూషన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థలకు భూమి కేటాయిస్తూ నిర్ణయం.

తితిదేలో లడ్డూ తయారీ కేంద్రం (పోటు)లో 18 సూపర్‌వైజర్‌ పోస్టులకు అనుమతి. 18 పోర్టు వర్కర్‌ (సీనియర్‌) పోస్టుల్ని అప్‌గ్రేడ్‌ చేయడం ద్వారా ఈ పోస్టుల్ని సృష్టిస్తారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 03:49 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఏకసభ్య కమిషన్‌ ముందుకు సింఘాల్, ధర్మారెడ్డి, బాలాజీ? శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్‌ విచారణ ముమ్మరం చేసింది.
  • ఐఆర్‌ఆర్‌ కేసులో ఆళ్ల వ్యాజ్యాలకువిచారణార్హత లేదు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) కేసు విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు నుంచి ప్రజాప్రతినిధుల (ఎంపీ, ఎమ్మెల్యేల) ప్రత్యేక కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశాలు జారీ చేయాలని, ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ వైకాపా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాలకు విచారణార్హత లేదని సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ హైకోర్టుకు నివేదించారు.
  • ఈ చొక్కా మాయదు..తడవదు! నీరు పడినా తడవని.. దుమ్ములో వెళ్లినా మురికి పట్టని ఓ చొక్కా తిరుపతి రీజినల్‌ సైన్స్‌ సెంటర్‌లో నూతనంగా ప్రారంభించిన బయో మిమిక్రీ గ్యాలరీలో ఆకట్టుకుంటోంది.
  • ఆ రోజు కస్టడీలో ఏం జరిగింది? ‘అప్పట్లో ఎంపీగా ఉన్న ప్రస్తుత స్పీకర్‌ రఘురామకృష్ణరాజును కస్టడీలో ఉంచినప్పుడు సీఐడీ కార్యాలయంలో ఏం జరిగింది? ఆ రోజు ఎవరెవరు, ఎక్కడెక్కడ, ఏయే విధులు నిర్వర్తించారు? రాత్రి 10.30 నుంచి తెల్లవారుజామున 1.30 గంటల వరకు మీరేం చేశారు?..
  • సర్పంచి భర్త వైకాపా నేత కావడంతో అక్రమాలపై చర్యలు తీసుకోని అధికారులు ఎన్టీఆర్‌ జిల్లా పెనుగంచిప్రోలు గ్రామ పంచాయతీలో రూ.1.21 కోట్ల నిధుల అవకతవకలకు సంబంధించి బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అధికారులు తాత్సారం చేస్తున్నారని ప్రవీణ్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు.
  • విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌ ప్రాజెక్టుల్లో మార్పులు విశాఖపట్నం, విజయవాడలో మెట్రోరైల్‌ ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం పలు మార్పులు సూచించింది. విశాఖలో స్టీల్‌ప్లాంట్‌ నుంచి కొమ్మాది మార్గంలో డబుల్‌ డెక్కర్‌ కంటే జాతీయ రహదారి మధ్యలో నుంచి కారిడార్‌ నిర్మించి మెట్రోరైల్‌ నడపడం మేలని రాష్ట్రానికి లేఖ రాసింది.
  • యోగా, నేచురోపతి సలహాదారు మంతెనకు క్యాబినెట్‌ హోదా రాష్ట్ర ప్రభుత్వ యోగా, నేచురోపతి గౌరవ సలహాదారుగా నియమితులైన డాక్టర్‌ మంతెన సత్యనారాయణరాజుకు క్యాబినెట్‌ హోదా కల్పిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
  • సైకిల్‌పై సోగ్గాడు.. వందేళ్ల కుర్రాడు..! పేరు వంగా రామలింగారెడ్డి. వయసు 98 ఏళ్లు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం మున్నంగి స్వస్థలం. 17 జూన్‌ 1928లో జన్మించారు. వయసు వందేళ్లకు చేరువవుతున్నా కుర్రాడిలాగే ఉంటారు.
  • మదనపల్లె దస్త్రాల దహనం కేసులో మాజీమంత్రి పెద్దిరెడ్డి అనుచరులకు చుక్కెదురు మదనపల్లె రెవెన్యూ దస్త్రాల దహనం కేసులో  నిందితులుగా ఉన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రధాన అనుచరుడు వంకిరెడ్డి మాధవరెడ్డి (ఏ-3), వ్యక్తిగత సహాయకుడు బల్లాపురం మునితుకారాంలకు(ఏ-4) సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
  • ‘రాయలసీమ ఉద్యాన హబ్‌’పై ముందడుగు రాయలసీమ ఉద్యాన హబ్‌పై మరో మూడు రోజుల్లో కేంద్ర ఆర్థిక శాఖ వ్యయ విభాగం అధికారులతో భేటీ ఉంది.
  • హైకోర్టులో మహిళా దినోత్సవ వేడుకలు హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ దినోత్సవ వేడుకలు సోమవారం హైకోర్టులో ఘనంగా నిర్వహించారు.
  • రెవెన్యూ సమాచారమంతా ఆన్‌లైన్‌లోకి రెవెన్యూశాఖకు సంబంధించిన ప్రభుత్వ, ప్రైవేటు భూముల సమాచారమైనా.. ఇంటిస్థలాల మంజూరు పుస్తకాలైనా.. అసైన్డ్‌ భూముల రిజిస్టర్లు అయినా మొత్తం ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది.
  • ఐదేళ్ల ముందస్తు ప్రణాళికతో.. డీఎంఎఫ్‌ నిధులు వినియోగించాలి మైనింగ్‌ ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా ఖనిజ ఫౌండేషన్‌ ట్రస్ట్‌ (డీఎంఎఫ్‌) నిధులతో చేపట్టే పనులకు.. ఐదేళ్ల ముందస్తు ప్రణాళిక ఉండాలని, ఆ ప్రకారం వాటిని పూర్తి చేయాలని పేర్కొంటూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది.
  • బహుముఖ ప్రజ్ఞాశాలి సునీల్‌రెడ్డి కన్నుమూత బహుముఖ ప్రజ్ఞాశాలి, కేంద్ర ఇంటెలిజెన్స్‌ విశ్రాంత డీఎస్పీ సత్తి సునీల్‌రెడ్డి(73) సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు.
  • హైకోర్టు ఆదేశానుసారం ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వాలి పదోన్నతుల రిజర్వేషన్‌పై ఉమ్మడి ఏపీ హైకోర్టు 2018లో ఇచ్చిన ఆదేశాల్ని అనుసరించి ఓసీ, బీసీ, మైనారిటీ ఉద్యోగులకు ప్రమోషన్లు ఇవ్వాలని ఆల్‌ ఇండియా ఈక్వాలిటీ ఫోరం కోరింది.
  • తిరుపతిలో ‘క్లౌడ్‌’ భద్రత కేంద్రం పౌరుల ఆధార్‌ వివరాలు, ఆసుపత్రి రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్‌ పత్రాలు, మీసేవ కేంద్రాలు, ఇతర సేవల కోసం ఇచ్చే డేటా చౌర్యానికి గురికాకుండా పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
  • ఉదయం 11 తర్వాత.. మిక్సింగ్, ఫిల్లింగ్‌ బంద్‌ ‘దేశంలో బాణసంచా పరిశ్రమలకు పేరొందిన తమిళనాడు రాష్ట్రం శివకాశీలోని తయారీ కేంద్రాల్లో ఉదయం 11 గంటల తర్వాత రసాయనాలు కలపడం (మిక్సింగ్‌), నింపడం (ఫిల్లింగ్‌) వంటి పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయరు.
  • పంచాయతీల పునర్‌ వర్గీకరణకు పచ్చజెండా రాష్ట్రంలో గ్రామ పంచాయతీల పునర్‌ వర్గీకరణకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సంబంధిత ప్రతిపాదనలను ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులిచ్చింది.
  • రాష్ట్రంలో 10 కేజీబీవీల రద్దు ఏపీకి కేటాయించిన కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో 10 రద్దు/సరెండర్‌ చేసినట్లు కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి జయంత్‌ చౌధరి తెలిపారు.
  • వాగులు కాదు.. విశాలమైన కాలువలు రాజధాని అమరావతి ముంపు ప్రాంతమంటూ పదేపదే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నవారి నోళ్లకు తాళం పడేలా ప్రభుత్వం భారీ ప్రణాళిక అమలు చేస్తోంది.

English Translation

Right to invest

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Feb 2026 06:32 IST Ee Font size
  • A
  • A+
  • A++
5 min read

Today, Amaravati: For the companies that came with proposals for setting up industries and investments in the state The Cabinet has approved the land allotments and concessions. In this regard, the State Investment Promotion Board (SIPB) approved several decisions taken in its meeting on 18th of this month. It has given consent for allotment of land and investment for the establishment of organizations such as Lithium Ion Cell Giga Industry at Rambilli in Anakapalli District, Lithium Ion Battery Processing Industry at Naidupet, and Outsourced Semiconductor Assembly and Test Facility at Tharuwada in Visakha District. Several decisions were taken in the cabinet meeting held at the Secretariat on Tuesday under the chairmanship of Chief Minister Chandrababu.

The cabinet took a decision to withdraw the disciplinary action taken against the forest department officials, some water resources department engineers, members of the Janmabhoomi-Maur Committee and organizations on the recommendations of the Vigilance and Enforcement Department regarding the water-tree works done between 2014-19. The proposal for reorganization of higher education, skill development and training departments has been approved. Newly formed Science, Technology and Innovation department. It was decided to appoint an expert from that field as the secretary. The name of the existing Department of Environment, Forest, Science and Technology has been changed to 'Environment Forest Department'. Andhra Pradesh has approved the introduction of Motor Vehicle Taxes (Amendment) Bill-2026 in the Legislative Assembly.

A bill will be introduced to amend the law to levy an additional tax of 10 percent on the life tax paid at the time of registration of motor vehicles under the name of 'Road Safety Cess'. The Cabinet approved the proposal to seek permission from the Central Empowered Committee to regularize the boundaries of the Kolleru Wildlife Sanctuary as per the recommendations of the National Wildlife Board. Governor's budget speech addressed to both Houses was approved. 

Free for them in five types of buses

Ministry has decided to provide free bus travel facility to the disabled. Divyangs with 40 percent and above disabilities... will be provided free travel facility in the five types of bus services currently running under the Strisshakti scheme. While currently 50 percent discount is given to disabled persons in Metro Express, Pallevelugu, Ultrapallevelugu and express buses, free travel facility will be provided from now on. Free travel is already allowed in city ordinary buses. The 50 percent concession given to disabled persons in Non-stop, Interstate, Saptagiri Express and Ultra Deluxe buses, where the Strishakti scheme is not applicable, will continue as usual. Apart from this, the important decisions taken in the cabinet meeting..

Lithium ion cell giga factory at Rambilli at Rs.8,175 crore

The cabinet has approved many decisions taken in the recent SIPB meeting.

  • Regarding the 1000 MW AI data center to be set up in Visakhapatnam. The Cabinet approved the plea of Raiden Infotech India Pvt Ltd, a subsidiary of Google, to consider Adani Infra India Ltd as an Authorized Notified Partner. Adani Infra will now hold talks with the government on issues such as land and incentives for setting up this data center. For this project, the government will transfer 601.4 acres in three places in Anacapalli and Visakha districts to three SPVs to be set up in the name of Vizag Hyperscale, Vizag Mega and Vizag Rambilli Data Center Park. 
  • Allotment of 300 acres to Vari Energy Storage Systems Pvt Ltd for setting up of 16 gigawatts per hour (GWHR) capacity lithium ion cell gigafactory at Rambilli, Anakapalli district. The company will invest Rs.8,175 crores. Employment for 3 thousand people. Cabinet decision to provide special incentives.
  • Allotment of 21.36 acres to NAN Greenmet Pvt Ltd for setting up a lithium ion battery processing unit at Naidupet. Special incentives. The company will provide employment to 340 people with an investment of Rs.1,366 crore. 
  • Approval of the decision to extend the previous incentives given to Balaji Action Build Well (Action Tesa) for setting up MDF and particle board production line in Rambilli Industrial Park. The company will provide employment to 1,500 people with an investment of Rs.1,233 crore. 
  • Approved to give special incentives to Sigachi Industries for setting up a synthetic organic chemicals and APIs manufacturing unit in Guttapadu cluster in Orvakallu mandal. 
  • Approval for Advanced System in Package Technologies to set up outsourced Semiconductor Assembly and Test Facility at Tarluwada, Visakha District. The company proposed to set it up with Rs.2,387.81 crores. Creation of thousands of jobs. Decision allotting 30 acres to that organization and providing special incentives. 
  • Decision allotting land to Siribionics Pvt Ltd, Premier Explosives Ltd, Sky Storage Solutions Pvt Ltd.

Allotment of 18 supervisor posts in Tithidelo Laddu Manufacturing Center (Potu). These posts will be created by upgrading 18 Port Worker (Senior) posts.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 03:49 IST

Note:Advertisements appearing on enadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this matter.

More

  • Singhal, Dharma Reddy, Balaji before the single member commission? A one-member commission appointed by the state government has intensified the investigation into the case of adulterated ghee in Srivari Laddu Prasad. On behalf of the CID, Senior Advocate Mukul Rohatgi reported to the High Court that the lawsuits filed by former MLA Alla Ramakrishna Reddy, seeking an order to transfer the investigation of the Inner Ring Road (IRR) case from the Vijayawada ACB Court to the Special Court of People's Representatives (MP, MLAs) and to hand over the investigation of this case to the CBI, are not admissible.
  • This shirt Does not disappear..does not get wet! A shirt that does not get wet even if it falls in water. What happened in the CID office when the current Speaker Raghuramakrishna Raju, who was an MP at that time, was kept in custody? Who, where and what duties were performed that day? What did you do from 10.30 pm to 1.30 am?..
  • As Sarpanchi's husband is a Vaikapa leader, the officials did not take action against the irregularities. A person named Praveen Kumar has complained that the authorities are taking no action against those responsible for the misappropriation of funds of Rs.1.21 crore in Penuganchiprolu village panchayat of NTR district.
  • Changes in Visakhapatnam and Vijayawada Metrorail projects. The central government has suggested many changes in the metro rail projects in Visakhapatnam and Vijayawada. It has written to the state that it is better to build a corridor from the middle of the national highway and run a metrorail on the steel plant to Kommadi route in Visakha than a double-decker. The government issued an order on Monday giving Cabinet status to Dr. Manthena Satyanarayanaraj, who was appointed as the Honorary Adviser of Yoga and Naturopathy to the State Government. Name is Vanga Ramalinga Reddy. Aged 98 years. Kollipara mandal of Guntur district is Munnangi's hometown. Born on 17 June 1928. Even though he is approaching hundred years of age, he remains like a boy. Vankireddy Madhavareddy (A-3), the main follower of former minister Peddireddy Ramachandra Reddy, and his personal assistant Ballapuram Munitukaram (A-4), who are accused in the Madanapalle revenue documents burning case, have been charged in the Supreme Court. There is a meeting with the officers of the Expenditure Department of the Union Finance Department on the Rayalaseema Garden Hub in the next three days.
  • Women's Day celebrations at the High Court. International Women's Day celebrations were held in the High Court on Monday under the auspices of the High Court Bar Association.
  • All revenue information online. Government and private land information related to the revenue department, land grant books. The government has made it clear that even the registers of assigned lands should be uploaded online.
  • With a five-year advance plan.. DMF funds should be utilized. The government issued an order on Monday stating that the works undertaken with the funds of the District Mineral Foundation Trust (DMF) in the areas affected by mining should have a five-year advance plan and should be completed accordingly. Versatile, retired Central Intelligence DSP Satti Sunil Reddy (73) breathed his last on Monday afternoon. All India Equality Forum has requested to give promotions to OC, BC and minority employees following the orders given by the AP High Court in 2018 on reservation of promotions.
  • 'Cloud' security center in Tirupati. The state government is taking steps to ensure complete security of citizens' Aadhaar details, hospital records, land registration documents, data provided for Meseva Kendras and other services from being stolen.
  • After 11 am.. Mixing and filling band In manufacturing centers in Sivakasi, Tamil Nadu, which is famous for fireworks industries in the country, mixing and filling of chemicals will not be done under any circumstances after 11 am.
  • Green flag for reclassification of panchayats. The government has given the green flag for the re-classification of Gram Panchayats in the state. Ordered on Monday approving the relevant proposals.
  • Abolition of 10 KGBVs in the state Union Minister of State for Education Jayant Chaudhary said that 10 Kasturba Gandhi Girls' Vidyalayas allocated to AP have been cancelled/surrendered. The government is implementing a massive plan to shut the mouths of those who are spreading bad propaganda about the capital Amaravati as a flooded area.