డబ్బున్న వాళ్లు సొంత భద్రత ఏర్పాటుచేసుకోండి

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 25 Feb 2026 04:00 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, దిల్లీ: ‘మీరు డబ్బున్నవాళ్లు.. ప్రైవేటు భద్రత ఏర్పాటుచేసుకోండి’ అని వైకాపా మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. ఈ రోజుల్లో పోలీసుభద్రత అన్నది హోదాగా మారిందని, దానికోసం ప్రభుత్వధనం ఎందుకు ఖర్చుపెట్టాలని ప్రశ్నించింది. తనకు రాష్ట్రప్రభుత్వం 2+2 భద్రతను తొలగించడాన్ని సవాల్‌చేస్తూ కాటసాని దాఖలుచేసిన పిటిషన్‌పై మంగళవారం విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి ధర్మాసనం ఈ మేరకు పేర్కొంది. తొలుత పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది పరమేశ్వర్‌ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌ కుటుంబసభ్యుల్లో ఆరుగురు హత్యకు గురైన విషయాన్ని విస్మరించి.. రాష్ట్రప్రభుత్వం తన ప్రత్యర్థులకు భద్రత కల్పించి తనకు తీసేసిందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.

గత ఏప్రిల్‌లో కాటసాని ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి పోలీసులు గృహనిర్బంధం చేశారని, అందుకే రక్షణ కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు చెప్పారు. రెండు ఫ్యాక్షన్‌ గ్రూప్‌లు ఉన్నప్పుడు ఒకదానికే భద్రత కల్పించకూడదన్నారు. ఆ వాదనలతో న్యాయమూర్తులు ఏకీభవించలేదు. ‘‘ప్రస్తుత రోజుల్లో పోలీసుల కంటే ప్రైవేటు సెక్యూరిటీ ఏజెన్సీలే సమర్థ భద్రత కల్పిస్తున్నాయి. అందువల్ల ఖాకీ భద్రత ఉండాలన్న మత్తు నుంచి బయటపడండి. మీరు డబ్బు దృష్ట్యా శక్తిమంతులు. అందువల్ల భద్రత కోసం మీ డబ్బు శక్తిని ఉపయోగించండి. మీ బాధంతా మీకు భద్రత పోయిందని కాదు. మీ ప్రత్యర్థులకు ఇచ్చారన్నదే. ప్రత్యర్థులు నాలుక కోస్తామని బెదిరించినట్లు పిటిషన్‌లో పేర్కొన్నారు. అలాంటి వ్యాఖ్యలు సాధారణం. అంతమాత్రాన భౌతికంగా కోస్తారని అర్థం కాదు’’ అని జస్టిస్‌ జోయ్‌మల్య బాగ్చి పేర్కొన్నారు.

కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి పదాలను సాధారణంగా వాడుతుంటారని సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ అభిప్రాయపడ్డారు. ‘‘భద్రత అన్నది పాలసీకి సంబంధించింది కాదు. అది ముప్పును బట్టి కల్పించేది. ప్రతి పౌరుడి స్వేచ్ఛ, ప్రాణాలకు రక్షణ కల్పించడం రాజ్యం బాధ్యత. దానికి మీరైనా, ఇతర పౌరులైనా ఒక్కటే. మీరు ఎవరికీ ముప్పు తలపెట్టకపోతే, మీకెవ్వరూ ముప్పు కారు. భద్రత కోసం ప్రభుత్వధనం ఎందుకు ఖర్చుపెట్టాలి’’ అని ప్రశ్నించారు. మీరు దానికి సొంత డబ్బు పెట్టుకోవడానికి సిద్ధమైతే ప్రైవేటు సెక్యూరిటీని పెట్టుకోండి. మీ భద్రత కోసం ప్రైవేటు ఏజెన్సీని నియమించుకోవడానికి వచ్చిన అడ్డంకి ఏంటి’’ అని సీజేఐ ప్రశ్నించారు.

ముప్పుపేరుతో పోలీసులు పిటిషనర్‌ను గృహనిర్బంధం చేశారన్న వాదనలనూ జస్టిస్‌ బాగ్చి తోసిపుచ్చారు. మీరు ఆ రోజు కార్యక్రమానికి వెళితే అక్కడ మళ్లీ హింసను ప్రేరేపిస్తారన్న ఉద్దేశంతో పోలీసులు గృహనిర్బంధం చేశారని గుర్తుచేశారు. పిటిషనర్‌ ప్రతిపక్షపార్టీ సభ్యుడని న్యాయవాది పేర్కొనగా ‘‘మీరేమీ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాదు. 2024 ఎన్నికల్లో ఓడిపోయారు. గెలిచి ఉంటే భద్రత వచ్చేది’’ అని జస్టిస్‌ బాగ్చి పేర్కొన్నారు. తర్వాత సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ జోక్యం చేసుకుంటూ ‘‘రూ.500-1000 పెట్టి ఎవరైనా రాజకీయపార్టీ సభ్యత్వం తీసుకోవచ్చు. తర్వాత నేను ప్రతిపక్ష పార్టీ సభ్యుడిని కాబట్టి భద్రత కల్పించాలని అడగొచ్చు’’ అని అన్నారు. ముప్పును అంచనా వేయడానికి ప్రభుత్వంలో నిఘాసంస్థలు ఉంటాయని, అవి ఇచ్చిన సమాచారం ఆధారంగా ముప్పును శాస్త్రీయంగా నిర్ధారిస్తారని, అందుకు స్పష్టమైన విధివిధానాలు ఉన్నాయని గుర్తుచేస్తూ దానిపై అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకునే స్వేచ్ఛను రాష్ట్ర పోలీసు యంత్రాంగానికి వదిలిపెడుతూ ఉత్తర్వులు జారీచేశారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 03:47 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఆరోగ్యం కల్తీ ‘పాలు’...చిక్కదనం కోసం ప్రమాదకర పదార్థాలు పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు అందరూ ఎంచుకునే సంపూర్ణ ఆహారం పాలు. ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం, ఖనిజాలు అన్నీ పాలలో ఉండడమే ఇందుకు కారణం. టీ, కాఫీల నుంచి ఘీ, చీజ్, పన్నీర్, ఐస్‌క్రీంల వరకూ వివిధ రూపాల్లో పాలు, పాల ఉత్పత్తులు మన ఆహారంలో భాగమయ్యాయి.
  • కొండచిలువల కలకలం పరవాడ మండలం పెదముషిడివాడ గ్రామానికి చెందిన ఓ లేఔట్‌లో శుక్రవారం రాత్రి కొండచిలువలు కలకలం రేపాయి.
  • ఉద్దానంలో తొలి కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స విజయవంతం మూత్రపిండాల వ్యాధితో దినదినగండంగా బతుకుతున్న శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రజలకు ఊరటనిచ్చేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
  • ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా జగన్‌ కుట్రలు: యామినీ శర్మ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక, ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా జగన్‌ కుట్రలు పన్నుతున్నారని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి యామినీ శర్మ ధ్వజమెత్తారు.
  • ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు మరో ఆరు నెలల్లో స్థానికసంస్థల ఎన్నికలు వస్తాయని, ఏ ఎన్నికలైనా మనమే గెలవాలన్న లక్ష్యంతో పనిచేయాలని మంత్రులకు సీఎం చంద్రబాబు తెలిపారు.
  • హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాలులో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి(సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్‌ ఆమెతో ప్రమాణం చేయించారు.
  • హెచ్‌జే దొర కన్నుమూత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ డీజీపీ హనుమంతు జగన్నాథం దొర(83) కన్నుమూశారు. హెచ్‌జే దొరగా చిరపరిచితులైన ఆయన కొంతకాలంగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు.
  • రికార్డు స్థాయిలో రైతుల ఖాతాల్లో డబ్బులు గువాహటిలో ప్రధాని మోదీ, గన్నవరంలో తాను ఒకేసారి రాష్ట్రంలోని 46.85 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2,676 కోట్లను జమచేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం వెల్లడించారు.
  • నిషేధిత జాబితా నుంచి 66,157 ఎకరాల తొలగింపు రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) పరిశ్రమలకు కేటాయించిన 66,157 ఎకరాలను రిజిస్ట్రేషన్‌ చట్టంలోని సెక్షన్‌ 22-ఎ కింద ‘నిషేధిత ఆస్తుల జాబితా’ నుంచి తొలగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
  • సహపంక్తి భో‘జనం’! కర్నూలు జిల్లా హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలోని గాదిలింగేశ్వరస్వామి జోడు రథోత్సవం మాస పూజ సందర్భంగా ఆలయ కమిటీ వేల మంది భక్తులకు సహపంక్తిగా అన్నప్రసాదాలు అందజేసింది.
  • క్లిష్టమైన కేసుల ఛేదనలో ఏపీ పోలీసుశాఖ ముందంజ: డీజీపీ ఎంతటి క్లిష్టమైన కేసులనైనా ఛేదించడంలో ఆంధ్రప్రదేశ్‌ పోలీసుశాఖ ముందుందని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా అన్నారు. నేరాల దర్యాప్తులో సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు చెప్పారు.
  • సివిల్‌ జడ్జిలకు శిక్షణ పూర్తి ఏపీ జ్యుడిషియల్‌ అకాడమీలో మూడో బ్యాచ్‌కు చెందిన 20 మంది సివిల్‌ జడ్జిలకు (జూనియర్‌ డివిజన్‌) ఏడాదిగా అందిస్తున్న శిక్షణ శుక్రవారంతో పూర్తయ్యింది.
  • ‘అప్పుడు వివేకా.. ఇప్పుడు కల్తీ నెయ్యి’ పాపాలు.. తప్పులు చేసి ఎవరూ వాటి గురించి మాట్లాడొద్దని కోర్టులకు వెళ్లి గ్యాగ్‌ ఆర్డర్లు తెస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎద్దేవా చేశారు.
  • జగన్‌కు ప్రజల కష్టాలు పట్టవు: షర్మిల భాజపాతో తెలుగుదేశం, జనసేన పార్టీలు జట్టుకట్టగా జగన్‌ అక్రమ పొత్తు పెట్టుకున్నారని.. అందువల్లే కేంద్రం అన్యాయం చేస్తున్నా ఆయన నోరు మెదపడం లేదని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు.
  • విజయనగర వైభవం.. గుత్తికోట! శతాబ్దాలనాటి చక్రవర్తుల పరాక్రమ వైభవానికి, తెలుగు శిల్ప సౌధ నిర్మాణ కౌశలానికి గుత్తికోట నిర్మాణం మచ్చుతునక.
  • బండి కనిపించింది.. బండ దొరికింది! పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో వంట గ్యాస్‌ దొరకదేమోనని ప్రజలు సిలిండర్ల కోసం పరుగులు తీస్తున్నారు. శుక్రవారం విజయవాడలోని గవర్నర్‌పేటలో ఓ ఏజెన్సీ పరిధిలో విచిత్ర పరిస్థితి కనిపించింది.
  • అమరావతి బిట్స్‌ క్యాంపస్‌ను త్వరగా పూర్తి చేయాలి అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(బిట్స్‌) ఏఐ ప్లస్‌ క్యాంపస్‌ను సాధ్యమైనంత తర్వగా పూర్తి చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ సూచించారు.
  • నెరవేరనున్న సొంతింటి కల పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. తిరుపతి జిల్లాలోని నాయుడుపేటకు సమీపంలో బిరదవాడ వద్ద 16వ నంబరు జాతీయ రహదారిని పక్కన 36 ఎకరాల విస్తీర్ణంలో రూ.168 కోట్లతో 2,064 ఇళ్లను సకల వసతులతో నిర్మించింది.
  • పార్లమెంటులో రాజ్యాంగం తెలుగు ప్రతి పార్లమెంటులో రాజ్యాంగం తెలుగు ప్రతిని అందుబాటులోకి తెచ్చారు. దీన్ని ఎంపీలకు ఉచితంగా, ఇతరులకు విక్రయించనున్నారు.
  • ఆహార భద్రతలో అట్టడుగు స్థానమా..? ‘గత ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ఆహార భద్రత శాఖ పనితీరు అధ్వానంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వం చివరిగా 2024లో ప్రకటించిన ర్యాంకింగ్‌ల్లో రాష్ట్రం 28వ స్థానానికి దిగజారింది. పరిస్థితుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవు’ అని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ హెచ్చరించారు.