40 దేశాల కోళ్లు, గుడ్లపై సౌదీ నిషేధం.. జాబితాలో భారత్

- A
- A+
- A++

ఇంటర్నెట్ డెస్క్: అరబ్ దేశం సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. 40 దేశాల నుంచి కోళ్లు, గుడ్లు దిగుమతులపై పూర్తి నిషేధం విధించింది. ప్రజారోగ్యం, ఆహార భద్రత వంటి కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సౌదీ ( Saudi Arabia) వెల్లడించింది. నిషేధించిన దేశాల జాబితాలో భారత్ కూడా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలు, అంటువ్యాధులు వంటి అంశాలను సమీక్షించి ఈ నిషేధం విధించినట్లు సౌదీ ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ వెల్లడించింది. 40 దేశాల నుంచి పౌల్ట్రీ, గుడ్లపై సంపూర్ణ నిషేధం అమల్లో ఉంటుందని పేర్కొంది. ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గానిస్థాన్, చైనా, జర్మనీ, ఇండోనేసియా, యూకే, జపాన్, బంగ్లాదేశ్, నేపాల్ వంటి దేశాలు ఉన్నాయి. ఇక, మరో 16 దేశాల్లోని నిర్దిష్ట ప్రాంతాలపై పాక్షిక ఆంక్షలు విధించింది. ఆస్ట్రేలియా, అమెరికా, ఇటలీ, భూటాన్, ఫ్రాన్స్ వంటి దేశాలపై ఈ పాక్షిక ఆంక్షలు అమలవుతాయని తెలిపింది.
- బర్డ్‌ఫ్లూ కాదు.. కుక్కలకు సంబంధించిన వ్యాధే
అయితే, ఆహార భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా వేడి చేసిన పౌల్ట్రీ మాంసం, దాని సంబంధిత ఉత్పత్తులకు ఈ నిషేధం వర్తించబోదని సౌదీ అధికారులు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో బర్డ్‌ఫ్లూ, వైరస్ వంటి ఆందోళనల నేపథ్యంలోనే సౌదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 12:24 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పాఠశాలలో దారుణం.. విద్యార్థి కాల్పుల్లో 9 మంది మృతి తుర్కియేలోని ఓ పాఠశాలల దారుణం చోటుచేసుకుంది. రెండు తరగతి గదుల్లో ఓ విద్యార్థి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు.
- చమురు ధరలు భారీగా తగ్గుతాయ్: ట్రంప్ ఇరాన్ యుద్ధం ముగిసిన తర్వాత చమురు ధరలు భారీగా తగ్గుతాయని ట్రంప్ అన్నారు.
- అమెరికా దిగ్బంధనం.. ఇరాన్‌కు రోజుకు రూ.4వేల కోట్ల నష్టం! హర్మూజ్ జలసంధి వెంబడి రేవుల చుట్టూ అమెరికా ఉచ్చు బిగించడం వల్ల ఇరాన్‌కు ఆర్థికంగా భారీ నష్టాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
- హర్మూజ్‌లో కూలిన.. రూ.2,222 కోట్ల అమెరికా నిఘా డ్రోన్ US Surveillance Drone: వేలకోట్ల రూపాయల విలువైన డ్రోన్‌ను అమెరికా కోల్పోయింది.
- అప్పుల ఊబిలో పాక్.. ఆదుకున్న సౌదీ ఆర్థిక సమస్యలతో సతమతమవుతోన్న పాకిస్థాన్‌కు సౌదీ అరేబియా మరోసారి అండగా నిలిచింది.
- రూ.9.3 కోట్ల విలువైన పికాసో పెయింటింగ్.. రూ.11 వేలకే సొంతం! ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుల్లో స్పెయిన్‌కు చెందిన పాబ్లో పికాసో ఒకరు.
- సూయజ్ సీను.. హర్మూజ్ వద్ద రిపీటవుతోందా..? రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటన్ విజయగర్వంతో ఈజిప్ట్‌లోని సూయజ్ కెనాల్ విషయంలో చేసిన ఓ తప్పు.. దాని సూపర్‌పవర్ హోదాను ఒక్కసారిగా కూల్చింది.
- ఇరాన్‌తో యుద్ధం.. ఏమాత్రం ప్రయోజనం లేదు: అమెరికన్లు పశ్చిమాసియాలో జరుగుతోన్న యుద్ధం వల్ల అమెరికా సైన్యానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. దీంతో ఇరాన్‌పై దాడులను సొంత పౌరులు కూడా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.
- నాటో నుంచి అమెరికాకు ఎలాంటి మద్దతు లేదు: ట్రంప్ Trump: నాటో కూటమిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి విరుచుకుపడ్డారు. ఆ కూటమి ఎప్పుడూ తమకు మద్దతుగా లేదన్నారు.
- నా అత్తమామలంటే చాలా ఇష్టం: జేడీవాన్స్ కీలక వ్యాఖ్యలు JD Vance: వలసదారుల అంశంపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
- కాల్పుల విరమణ పొడిగింపు ఉండకపోవచ్చు: ట్రంప్ ఇరాన్‌తో కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన తనకు లేదని.. శాశ్వతమైన ఒప్పందం వైపే తాము మొగ్గుచూపుతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు.
- ఇరాన్‌తో మళ్లీ చర్చలు.. అమెరికా 2 షరతులు..! US-Iran Talks: పశ్చిమాసియాలో యుద్ధం ముగించే విషయమై అమెరికా-ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సిద్ధమవుతున్నాయి.
- హర్మూజ్ దిగ్బంధనానికి 10వేల మంది సిబ్బంది ఇరాన్ ఓడరేవులపై పూర్తి దిగ్బంధనాన్ని విజయవంతంగా అమలుచేసినట్టు అమెరికా(US) సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
- 24 గంటల్లో.. హర్మూజ్‌ను దాటిన 20 నౌకలు..! Strait of Hormuz: అమెరికా దిగ్బంధం కొనసాగుతుండగానే.. గత 24 గంటల్లో 20 వాణిజ్య నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు తెలుస్తోంది.
- ఇరాన్ చమురుపై ఆంక్షల సడలింపు పొడిగించేందుకు అమెరికా ‘నో’ Iranian oil: ఇరాన్ చమురు కొనుగోళ్లకు సంబంధించి ఇచ్చిన సడలింపులను పొడిగించే ప్రణాళిక లేదని అమెరికా ట్రెజరీ శాఖ తేల్చి చెప్పింది.
- ట్రంప్ తదుపరి గురి మలకా జలసంధి! హర్మూజ్ జల సంధిపై పట్టు సాధించేందుకు తంటాలు పడుతున్న అమెరికా మరో కీలక జల మార్గమైన మలాకా జల సంధిలోనూ తనకు ఎదురు లేకుండా చూసుకునేందుకు పావులు కదుపుతోంది.
- రెండ్రోజుల్లో మళ్లీ చర్చలు! పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా, ఇరాన్ మరోసారి శాంతి చర్చలకు సన్నద్ధమవుతున్నాయి. పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా రాబోయే రెండు రోజుల్లోనే ఈ సంప్రదింపులు జరగొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించారు.
- ఆస్ట్రేలియాకు తొలి మహిళా ఆర్మీ చీఫ్! ఆస్ట్రేలియా రక్షణ రంగంలో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది. ఈ దేశ సైనిక చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా ఓ మహిళా అధికారిణిని సైన్యాధిపతిగా నియమిస్తూ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
- స్వల్ప మెజారిటీ సాధించిన కార్నీ ప్రభుత్వం కెనడా పార్లమెంటులో ఖాళీగా ఉన్న మూడు స్థానాలకు సోమవారం జరిగిన ఉపఎన్నికలో ప్రధానమంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలోని లిబరల్ పార్టీ గెలుపొందింది.
- హర్మూజ్ పునరుద్ధరణపై మెక్రాన్, స్టార్మర్ సారథ్యంలో సదస్సు హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించే ప్రయత్నాల్లో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్‌ల నేతృత్వంలో ఈ నెల 14న పారిస్‌లో కీలక సదస్సు జరగనుంది.