పేరులో అక్షరం తేడా.. 45 ఏళ్లుగా నో పెన్షన్‌..!

Eenadu icon
By National News Team Published : 26 Feb 2026 00:07 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్: తండ్రి మరణం తర్వాత వచ్చే పింఛను కోసం ఓ మహిళ నాలుగు దశాబ్దాలకుపైగా పోరాటం చేస్తున్నారు. పేరులో ఒక్క అక్షరం తేడా ఉందనే కారణంతో పింఛను ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు. దీంతో ఆమె అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. సంబంధిత పిటిషన్‌పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. అధికారుల తీరుపై మండిపడింది. సమస్య పరిష్కారానికి వారంలోగా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌కు చెందిన మంజు రాయ్‌ తండ్రి స్థానిక మున్సిపల్‌ కార్పొరేషన్‌లో పనిచేశారు. 1975లో పదవీ విరమణ చేశారు. 1980లో మృతి చెందగా.. అప్పటివరకు పింఛన్‌ సరిగ్గానే వచ్చేది. అనంతరం ఫ్యామిలీ పెన్షన్‌ కోసం కుటుంబ సభ్యులు దరఖాస్తు చేసుకోగా.. ఆయన పేరులో అక్షరం తేడా ఉందనే కారణంతో నిరాకరించారు. సర్వీసు రికార్డుల్లో ఆయన పేరు శిఖర్‌ నాథ్‌ శుక్లా (Shikhar Nath Shukla)గా నమోదై ఉండగా.. దరఖాస్తు, ఇతర పత్రాల్లో శేఖర్ నాథ్ శుక్లా (Shekhar Nath Shukla)గా ఉంది. ‘I’, ‘E’ తేడాతో ఫ్యామిలీ పెన్షన్‌ మంజూరు కావడం లేదు. 45 ఏళ్లుగా సమస్య అలాగే కొనసాగుతోంది.

దీంతో మంజు రాయ్‌.. అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. పేరులో ఒక్క అక్షరమే తేడా ఉందని, దీనిపై అఫిడవిట్ కూడా సమర్పించినట్లు పేర్కొన్నారు. వారసత్వ ధ్రువీకరణ పత్రం, ఇతర పత్రాలను కూడా జతచేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. వారం రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించింది. లేనిపక్షంలో తదుపరి విచారణకు మున్సిపల్ కమిషనర్ స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందని హెచ్చరించింది.

► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • జమాల్‌పుర్‌ రోటీ మార్కెట్‌.. రుమాలికి స్పెషల్‌ గుజరాత్‌ అహ్మదాబాద్‌లోని జమాల్‌పుర్‌ ప్రాంతం ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
  • సీఎం సీటు కోల్పోయి.. పార్టీ మారినా ‘పీఠం’ దక్కలేదు! దేశంలో వివిధ రాష్ట్రాల్లో పలువురు నేతలు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి పాలించారు. ఆ తర్వాత పలు కారణాలతో సొంత పార్టీని వీడి ఇతర పార్టీల్లో చేరారు.
  • కేజ్రీవాల్‌కు ఇదే నా సలహా..! అన్నాహజారే దిల్లీ మద్యం విధానం కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు న్యాయస్థానం క్లీన్‌ చిట్‌ ఇవ్వడాన్ని ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే స్వాగతించారు.
  • భాజపాకు 10 సీట్లు వస్తే రాజకీయాల నుంచి వైదొలుగుతా - కేజ్రీవాల్‌ మద్యం విధానంపై తప్పుడు కేసుతో ఆమ్‌ఆద్మీ పార్టీని అంతం చేయాలని ప్రధాని మోదీ, అమిత్‌ షాలు కుట్ర పన్నారని దిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.
  • కోపైలట్‌గా ద్రౌపదీముర్ము.. ‘ప్రచండ్‌’లో పర్యటించిన రాష్ట్రపతి ఇంటర్నెట్‌డెస్క్‌: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం రాజస్థాన్‌లో జైసల్మేర్‌లోని ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తేలికపాటి యుద్ధ హెలికాప్టర్‌ ‘ప్రచండ్‌’ (Prachand)లో ప్రయాణించారు. ఫ్లైయింగ్ సూట్ ధరించిన ఆమె.. 25 నిమిషాల పాటు కో పైలట్‌గా వ్యవహరించారు. ‘ప్రచండ్ దేశ స్వావలంబనకు చిహ్నం. జైహింద్, జై భారత్‌’ అని కాక్‌పిట్ నుంచి దేశ ప్రజలకు సందేశం పంపారు. ఎల్‌సీహెచ్‌ ‘ప్రచండ్‌’ అనేది స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ హెలికాప్టర్‌. అధునాతన ఏవియానిక్స్, స్టెల్త్ ఫీచర్లు, రాత్రి వేళల్లోనూ దాడులు చేయగల సామర్థ్యం దీని సొంతం. క్షిపణులు, రాకెట్లు, 20 ఎంఎం గన్‌ వంటి ఆయుధాలను ప్రయోగించవచ్చు. ఆ ఫొటోలు..
  • కోల్‌కతాలో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో భూకంపం సంభవించింది.
  • కౌంటింగ్‌ అయిన వారం వరకు ఈవీఎం-వీవీప్యాట్‌ వెరిఫై: సీఈసీ CEC Gyanesh Kumar: కౌటింగ్ పూర్తయిన ఏడు రోజుల వరకు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాల్లో (EVM) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల (VVPAT) స్లిప్పులను వెరిఫై చేసుకోవడానికి అభ్యర్థులకు అనుమతి ఇచ్చింది.
  • జీవిత ఖైదు విధించిన జడ్జికి బెదిరింపులు ఓ కేసులో జీవిత ఖైదు విధించినందుకు గాను న్యాయమూర్తిపై నిందితులు బెదిరింపులకు పాల్పడిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. 
  • దిల్లీ మద్యం కేసులో ఊరట.. కన్నీటిపర్యంతమైన కేజ్రీవాల్‌ Kejriwal: మద్యం కుంభకోణం కేసులో ఊరట లభించిన నేపథ్యంలో దిల్లీ మాజీ సీఎం, ఆప్‌ నేత కేజ్రీవాల్‌ కన్నీటి పర్యంతమయ్యారు. తాను నిజాయతీపరుడినని కోర్టు కూడా పేర్కొందన్నారు. 
  • దిల్లీ మద్యం కేసు.. కేజ్రీవాల్‌, కవితకు భారీ ఊరట దిల్లీ మద్యం కుంభకోణం కేసు (Delhi excise policy case)లో దిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ (Arvind Kejriwal), మాజీ ఉప ముఖ్యమంత్రి సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కవిత (kavita)కు భారీ ఊరట లభించింది.
  • అనూహ్యంగా భారత్‌కు అమెరికా మంత్రి.. ట్రేడ్‌ డీల్‌లో మార్పుల కోసమేనా..? ట్రంప్‌ టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేసిన నేపథ్యంలో.. ఆ దేశ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ భారత్‌ పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
  • డీఎంకేలో చేరిన పన్నీర్‌ సెల్వం.. TamilNadu: తమిళనాడు మాజీ సీఎం పన్నీర్‌ సెల్వం డీఎంకేలో చేరారు. 
  • ప్రధాని మోదీ ఇన్‌స్టా @ 10 కోట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రధాని మోదీ హవా కొనసాగుతోంది. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లను మించింది.
  • పది పరీక్షలకు హాజరవుతున్నా.. అమ్మ చంకలో బిడ్డనే! ఈ చిత్రంలో అమ్మ చంకలో ఉన్న బాలిక పేరు సుమిత. పుట్టుకతోనే మూగ, వినికిడి లోపంతో బాధపడుతోంది.
  • లొంగిపోతానన్న కమాండర్‌ను హత్య చేసిన మావోయిస్టు నాయకుడు పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధపడిన మావోయిస్టు కమాండర్‌ను అతడి నాయకుడు హత్య చేసినట్లు ఒడిశా అధికారులు తెలిపారు.
  • ఆదాయ పన్ను మినహాయింపునకు పుట్టగొడుగుల్లా పార్టీలు పుట్టుకొస్తున్నాయ్‌ ఆదాయ పన్ను మినహాయింపు పొందేందుకు పుట్టగొడుగుల్లా రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయని, కానీ.. ఎన్నికల్లో మాత్రం అవి పోటీ చేయడం లేదని మద్రాసు హైకోర్టు పేర్కొంది.
  • పూర్వీకులకు మోక్షం కోసం.. 4 రోజుల గిరిజన వేడుక ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ డివిజను పరిధిలో గల నారాయణ్‌పుర్‌ జిల్లా కేరళాపాల్‌ గ్రామంలో ఈ నెల 22 నుంచి 25 వరకు ‘గాయత పఖ్నా’ గిరిజన వేడుక ఘనంగా జరిగింది.
  • ఎన్సీఈఆర్టీ వివాదాస్పద పాఠ్యపుస్తకంపై సంపూర్ణ నిషేధం న్యాయవ్యవస్థ గౌరవ, మర్యాదలను దెబ్బతీసేలా పాఠ్యపుస్తకంలో అధ్యాయాన్ని చేర్చడం తమను తీవ్ర నిర్ఘాంతపరిచిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ పేర్కొన్నారు.
  • త్వరలో గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్సులు బాధ్యతాయుతమైన డ్రైవింగ్‌ను ప్రోత్సహించడానికి, రోడ్డు ప్రమాదాలను నివారించడానికి గ్రేడ్‌ ఆధారిత డ్రైవింగ్‌ లైసెన్సుల వ్యవస్థను ప్రవేశపెట్టాలని భావిస్తున్నామని రోడ్డు రవాణా, జాతీయ రహదారులశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు.
  • విమాన టికెట్‌ తీసుకున్న 48 గంటల్లో మార్పులు ఉచితం విమాన టికెట్లు తీసుకున్నవారు 48 గంటల్లోగా దానిని రద్దు చేసుకున్నా, కొన్ని మార్పులు చేసుకున్నా అదనపు రుసుములు లేకుండా విమానయాన సంస్థలు అనుమతించేలా ‘పౌర విమానయాన డైరెక్టరేట్‌ జనరల్‌’ (డీజీసీఏ) వెసులుబాటు కల్పించనుంది.