మచిలీపట్నంలో పట్టపగలే భారీ చోరీ.. అరకిలో బంగారం అపహరణ!

- A
- A+
- A++

మచిలీపట్నం క్రైమ్ : కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పట్టపగలే భారీ చోరీ చోటుచేసుకుంది. చిలకలపూడి సర్కార్ తోట ప్రాంతంలో ఓ ఉపాధ్యాయురాలి ఇంట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. గుడ్లవల్లేరు మండలం కౌతరం ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మార్గరెట్ బుధవారం ఉదయం తన ఇంటికి తాళాలు వేసుకొని పాఠశాలకు వెళ్లారు. రంజాన్ మాసం కావడంతో పాఠశాలకు మధ్యాహ్నం సెలవు ప్రకటించడంతో ఆమె ఇంటికి వచ్చారు. తలుపులు పగలగొట్టి ఉండటంతో ఇంట్లో చోరీ జరిగిందని నిర్ధరించుకుని.. చిలకలపూడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు క్లూస్ టీంతో ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాదాపు 50 తులాల బంగారం, రూ.1,40,000 నగదు చోరీ జరిగినట్లు బాధితురాలు తెలిపారు.
► Read latest Crime Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 25 Feb 2026 18:35 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- కౌలు పొలం ఎండిపోవడంతో.. యువరైతు బలవన్మరణం కౌలుకు తీసుకున్న పొలం నీళ్లు లేక ఎండిపోవడంతో సాగు నిమిత్తం చేసిన అప్పు ఎలా తీర్చాలనే మనోవేదనతో యువరైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా మాసాయిపేట మండలం చెట్లతిమ్మాయిపల్లిలో చోటుచేసుకుంది.
- పోలీసు వాహనం ఢీకొని ఏఎస్సై దుర్మరణం అతివేగంగా వచ్చిన పోలీసు వాహనం ఢీకొనడంతో ఏఎస్సై దుర్మరణం చెందిన ఘటన సంగారెడ్డి జిల్లా మనూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట చోటుచేసుకుంది.
- భరత్ యాదవే పులివెందులలో గంజాయి కింగ్‌పిన్ పులివెందుల పోలీసులు కీలకమైన గంజాయి ముఠాను అరెస్టు చేశారు. విచ్చలవిడిగా సరఫరా చేస్తున్న భరత్ యాదవ్ సహా పది మందిని మంగళవారం అదుపులోకి తీసుకున్నారు.
- క్లోన్ చేసి కొట్టేస్తారు.. సైబర్ నేరగాళ్ల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండిలా AI voice cloning scams: సైబర్ నేరగాళ్లు ఏఐ క్లోన్ వాయిస్‌తో మోసాలకు పాల్పడుతున్నారు. వీటిపట్ల అప్రమత్తంగా ఉండాలని సైబర్ నిపుణులు సూచిస్తున్నారు.
- పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయాలు.. 18 మంది అరెస్టు కడప జిల్లా పులివెందులలో గంజాయి, నాటుసారా విక్రయిస్తున్న 18 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
- తల్లిని ఇంట్లోనే ఉంచి నిప్పు పెట్టిన కుమారుడు కన్నతల్లిని ఇంట్లో ఉంచి నిప్పు పెట్టి హత్య చేసిన కుమారుడి ఉదంతం ఇది. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
- జిమ్ ట్రైనర్‌కు వలపు వంచన జిమ్‌కు వస్తున్న వివాహిత (42) తనను వేధిస్తోందని, బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ దిలీప్ (28) అనే జిమ్ ట్రైనర్ ఆత్మహత్య చేసుకున్నారు.
- ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ద్వారా ఉగ్ర ఉచ్చులోకి! ఆన్‌లైన్ వీడియో గేమ్స్ ద్వారా విదేశీ హ్యాండ్లర్లు యువతను ఉగ్ర ఉచ్చులోకి లాగి, వారిలో జిహాదీ భావజాలాన్ని నూరిపోసినట్లు ఉగ్రమూలాల కేసు నిందితుల విచారణలో తేలినట్లు తెలిసింది.
- నలుగురు ఇంటర్ విద్యార్థుల బలవన్మరణం పరీక్షల్లో ఫెయిలైతే మళ్లీ రాయడానికి అవకాశం ఉంటుంది.. అసలు ఉత్తీర్ణత సాధించకపోయినా బతకడానికి ఏదో ఒక దారి కనపడుతుంది.
- శాంతికి రెండు రోజుల కస్టడీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయి రిమాండ్‌లో ఉన్న దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ శాంతిని... కోర్టు రెండు రోజుల కస్టడీకి ఇచ్చింది.
- జీడిగింజలు దొంగిలించారంటూ కత్తితో వీరంగం జీడిగింజలను దొంగిలించారనే అనుమానంతో ఓ వ్యక్తి ఉన్మాదిగా మారి కత్తితో ముగ్గురిపై దాడిచేసి తీవ్రంగా గాయపరిచాడు. చివరకు గ్రామస్థుల దాడిలో ప్రాణాలు కోల్పోయాడు.
- గడప కడగడానికి వెళ్లొస్తూ కడపటి ప్రయాణం! మరో రెండు వారాల్లో ఆ కుటుంబంలోని పెళ్లి పనుల్లో అక్కాబావలుగా తలమునకయ్యేవారు. మేనకోడలు, మేనల్లుడి అల్లరితో ఆ ఇంట సందడి నెలకొనేది. కానీ విధిరాత మరోలా ఉంది.
- బైక్‌తో సహా కాలువలో పడి తల్లీతనయుల మృతి ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి వెెళ్తుండగా అదుపుతప్పి మురుగు కాలువలో పడిన ఘటనలో సోమవారం తల్లీకుమారులు మృతిచెందారు.
- కాంకేర్‌లో ఎన్‌కౌంటర్.. కమాండర్ రూపిరెడ్డి మృతి ‘నక్సల్స్ మిషన్-2026’ గత నెల 31తో ముగిసినప్పటికీ మిగిలిన మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు ఛత్తీస్‌గఢ్‌లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి.