6జీ.. రేపటి నవలోకం!

- A
- A+
- A++

రేపటి సాంకేతికతగా 6జీ అభివృద్ధి చెందుతోంది. 6జీ అంటే వేగమైన ఇంటర్నెట్ మాత్రమే కాదు. మనిషి, యంత్రం, సమాజం మధ్య సంబంధాన్ని కొత్తగా నిర్వచించే ప్రయత్నం. ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, గణితం, కంప్యూటర్స్, మెటీరియల్ సైన్స్ అన్నీ కలిసి రూపొందించే భవిష్యత్తు చిత్రం. ఇది ఆరోగ్యం, రవాణా, పరిశ్రమలు, గ్రామీణ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానుంది. వాటికి సంసిద్ధమైతేనే రేపటి ప్రపంచంలో మన పాత్ర కీలకంగా మారుతుంది.
మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీ నాలుగు దశలు దాటింది. ప్రస్తుతం 5జీ (అయిదోతరం) యుగంలోకి అడుగు పెట్టాం. అయితే, ప్రపంచం ఇక్కడితో ఆగడం లేదు. రేపటి అవసరాలు 5జీ సాంకేతికత
సామర్థ్యానికి మించిపోతాయి. డ్రైవర్ లేని వాహనాలు, సుదూర శస్త్రచికిత్సలు, హోలోగ్రాఫిక్ సమావేశాలు, స్మార్ట్ నగరాలు వంటివన్నీ పని చేయాలంటే, కేవలం వేగం మాత్రమే సరిపోదు. నెట్‌వర్క్ అత్యంత వేగంగా ఆలోచిస్తూ, కచ్చితత్వంతో స్పందిస్తూ, పరిసరాలనూ గమనించగలగాలి. ఇలాంటి అవసరాల నుంచి పుట్టిందే 6జీ పరిజ్ఞానం. ఇది ఆరోతరం సెన్సింగ్, ఏఐ ఆధారిత వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. 2030 నాటికి, దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని లక్షిస్తున్నారు. 5జీలో మనం డేటానే పంపిస్తాం. 6జీలో నెట్‌వర్క్ ఆ డేటా ఎందుకు పంపుతున్నామో కూడా అర్థం చేసుకుంటుంది. ఉదాహరణకు, ఒక రోగి గుండె చప్పుళ్ల సమాచారం డాక్టర్‌కు పంపితే, అది కేవలం సంఖ్యలుగా కాకుండా, ప్రమాదం ఉంటే, ఆ అర్థంలోనే చేరుతుంది. ఈ మార్పు 6జీని విప్లవాత్మకంగా మార్చనుంది.
నాణ్యమైన వైద్యం... మెరుగైన విద్య


డిజిటల్ ప్రపంచంపై పట్టుకోసం...
తరంగాలు వేగంగా బలహీనపడటం ఈ సాంకేతికతలోని ఓ సమస్య. దూరం పెరిగే కొద్దీ సిగ్నల్ త్వరగా తగ్గిపోతుంది. గోడలు, భవనాలు అడ్డుపడతాయి. ఈ సమస్యల్ని అధిగమించే దిశగా కసరత్తు జరుగుతోంది. టెరాహెర్ట్జ్ తరంగాలపై పనిచేసే పరికరాల తయారీ కష్టం. కొత్త రకం సెమీకండక్టర్ చిప్‌లు, కొత్త మెటీరియల్స్ అవసరమవుతాయి. ఇవన్నీ ఖరీదైనవే కావడంతో భారీస్థాయిలో 6జీ హార్డ్‌వేర్ తయారీ కొంత కష్టమే. అధిక ఫ్రీక్వెన్సీలపై పనిచేసే వ్యవస్థలు ఎక్కువ విద్యుత్తును వాడటం వల్ల ప్రస్తుత ఫోన్ బ్యాటరీల సామర్థ్యం సరిపోదు. అందుకని, తక్కువ విద్యుత్తుతో పనిచేసే సర్క్యూట్లు, కొత్త బ్యాటరీ టెక్నాలజీలపైనా పరిశోధన జరుగుతోంది. నెట్‌వర్క్ స్మార్ట్‌గా మారినకొద్దీ సైబర్ దాడుల ముప్పూ పెరుగుతుంది. ఆరోగ్య సమాచారం, వాహనాల నియంత్రణ, పరిశ్రమల వ్యవస్థలు వంటివన్నీ నెట్‌వర్క్‌తో అనుసంధానమైతే, చిన్న లోపం కూడా పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు. ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారాలు గుర్తించడమే ప్రస్తుత 6జీ పరిశోధనల లక్ష్యం.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ టెలికాం కంపెనీలు ఇప్పటికే 6జీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త ల్యాబ్‌లు, టెస్ట్‌బెడ్‌లు, పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా దీన్ని కేవలం టెక్నాలజీగా కాకుండా వ్యూహాత్మక అంశంగా చూస్తున్నాయి. 6జీపై ఆధిపత్యం ఉండే దేశాలే రేపటి డిజిటల్ ప్రపంచాన్ని నియంత్రిస్తాయి. ఐరోపా, అమెరికా, చైనా, జపాన్ వంటి దేశాలు ప్రత్యేక 6జీ మిషన్లు ప్రారంభించాయి. భారత్ ఇప్పటికే 6జీపై స్పష్టమైన దృక్పథాన్ని ప్రకటించింది. మనకున్న అపార ఐటీ ప్రతిభ, ఇంజినీరింగ్ విద్య, స్టార్టప్ సంస్కృతి ఈ రంగంలో మనల్ని కచ్చితంగా ముందుకు తీసుకెళ్లగలవు. సరైన విధానాలు, పరిశోధనలు, పరిశ్రమల సహకారం ఉంటే, ఇండియా కేవలం వినియోగదారుడిగా కాకుండా, 6జీ టెక్నాలజీని రూపొందించే దేశంగా మారగలదు.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
English Translation
6G.. Tomorrow's Novel!

- A
- A+
- A++

6G is developing as the technology of tomorrow. 6G is not just about faster internet. An attempt to redefine the relationship between man, machine and society. Physics, Electronics, Mathematics, Computers, Material Science all come together to form a futuristic film. It will revolutionize health, transport, industries and rural services. Our role in tomorrow's world will become crucial only if we are ready for them.
Mobile network technology has crossed four stages. We have now entered the 5G (fifth generation) era. However, the world does not stop here. Tomorrow's needs will exceed the capabilities of 5G technology. For driverless vehicles, remote surgeries, holographic meetings, and smart cities to all work, speed alone is not enough. The network must be able to think very quickly, react with precision, and observe its surroundings. The knowledge of 6G was born from such needs. It is the sixth sensing, AI-based wireless communication technology. By 2030, it aims to be made available. In 5G we only send data. In 6G the network also understands why we are sending that data. For example, if a patient sends heart rate information to a doctor, it will not just be numbers, but if there is an accident, it will be added to the meaning. This change will revolutionize 6G.
Quality healthcare... Better education


For a grip on the digital world...
Rapid weakening of waves. A problem with this technique. As the distance increases the signal decreases rapidly. Walls and buildings get in the way. Efforts are being made to overcome these problems. Manufacturing devices that operate on terahertz waves is difficult. New types of semiconductor chips and new materials are needed. As all these are expensive, mass production of 6G hardware is somewhat difficult. Systems operating at higher frequencies use more electricity, making current phone batteries less efficient. Hence, research is being done on low power circuits and new battery technologies. As the network becomes smarter, the threat of cyber attacks increases. With health information, vehicle control, and industrial systems all connected to the network, even a small error can lead to a major risk. The aim of current 6G research is to find solutions to all such problems.
Globally leading telecom companies are already investing heavily in 6G. New labs, testbeds and research centers are being set up. Governments are also looking at it as a strategy rather than just a technology. Countries that dominate 6G will control tomorrow's digital world. Countries like Europe, America, China, Japan have started special 6G missions. India has already announced a clear vision on 6G. Our immense IT talent, engineering education and startup culture can definitely take us forward in this field. With the right policies, research and industry collaboration, India can become not just a consumer, but a creator of 6G technology.
► Read latest Editorial Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Note:Business advertisements appearing on Eenadu.net are different It comes from businessmen and organizations in countries. Some ads are sent with artificial intelligence based on the reader's preferences. Readers should exercise due care and make appropriate inquiries about products or services before purchasing. The respective products/ OWNER TODAY IS NOT RESPONSIBLE FOR THE QUALITY OR FAILURES OF THE SERVICES. There is no room for correspondence in this regard.