ఇంటింటికీ డిజిటల్ సేవలు

- A
- A+
- A++

ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటింటికీ అత్యంత వేగవంతమైన డిజిటల్ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. టీ ఫైబర్ ఆధ్వర్యంలో అన్ని పల్లెల్లోనూ ప్రతి ఇంటికి స్వల్ప ఖర్చుతో ఇంటర్నెట్ కనెక్షన్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇప్పటికే 26 జిల్లాల్లోని సుమారు 9,000 గ్రామాలకు ఆప్టికల్ ఫైబర్ కేబుల్ రింగ్ కనెక్టివిటీని ఏర్పాటు చేయగా.. ఈ పరిధిలో ఇప్పటివరకు లేని రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలను కూడా చేర్చారు. ఈ కనెక్టివిటీ వల్ల వైరు తెగి ఎక్కడైనా అంతరాయం కలిగినా ఆ గ్రామంలో సేవలు నిలిచిపోవు. అన్ని గ్రామపంచాయతీలను ఇదే విధానంలో అనుసంధానం చేస్తారు. ఈ మూడు జిల్లాల్లో రింగ్ కనెక్టివిటీ కోసం కేంద్ర ప్రభుత్వానికి పలు సందర్భాల్లో సీఎం రేవంత్‌రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వినతి పత్రాలు అందజేశారు. తాజాగా భారత్ నెట్ సవరణ కార్యక్రమంలో భాగంగా రంగారెడ్డి, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో రింగ్ కనెక్టివిటీకి కేంద్రం రూ.432 కోట్లు మంజూరు చేసింది. వీటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆప్టికల్ ఫైబర్ కేబుళ్లను పదేళ్ల పాటు మెయింటెనెన్స్ చేసేందుకు మరో రూ.2,697 కోట్లను, పరిపాలన వ్యయం నిధులు కలిపి డిజిటల్ సేవల కోసం రాష్ట్రానికి రూ.3,185 కోట్లు కేంద్రం మంజూరుచేసింది. ప్రస్తుతం టీ ఫైబర్ ఆధ్వర్యంలో రింగ్ కనెక్టివిటీ ఉన్న జిల్లాల నుంచి నాలుగు గ్రామాలను ఎంపిక చేసుకొని అక్కడి అన్ని ఇళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్లను అందిస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం దీన్ని సక్సెస్ ఫుల్ మోడల్‌గా గుర్తించింది. రింగ్ కనెక్టివిటీ లేని జిల్లాలకు కూడా ఈ విధానాన్ని వర్తింప చేయడానికి ఆమోదం తెలిపింది.
మరో ప్రత్యేక సంస్థ ఏర్పాటు...!:భారత్‌నెట్ కార్యక్రమం (ఏబీపీ) అమలు కోసం రాష్ట్రంలో మరో సంస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ ప్రత్యేక సంస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాన వాటా ఉంటుంది. భారత్‌నెట్ ఫేజ్-2 (టీఫైబర్)లో పెండింగ్ పనులను డీబీఎన్, బీబీఎన్‌ఎల్, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం పరిధిలో పూర్తి చేయాల్సి ఉంటుంది. కేంద్రం అనుమతించిన నిధికన్నా చేసిన అదనపు ఖర్చును పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని సూచించింది.
- ఏబీపీ కార్యక్రమాన్ని 12,769 గ్రామాల్లో అమలు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందులో 1,946 గ్రామాల్లో రింగ్ కనెక్టివిటీ అప్‌గ్రేడ్, 36 గ్రామాల్లో కొత్తగా రింగ్ కనెక్టివిటీ అమలు చేయాలి. ప్రస్తుతం 10,787 గ్రామాల్లో రింగ్ కనెక్టివిటీ ఉంది.
- భారత్‌నెట్ ఆస్తులన్నీ జీఐఎస్ మ్యాపింగ్ చేయాలి. ఈ నిధులను కొత్తసంస్థకు డిజిటల్ భారత్‌నిధి (డీబీఎన్) నేరుగా విడుదల చేస్తుంది.
- గ్రామాల్లో ఇంటింటికీ ఎఫ్‌టీటీహెచ్ కనెక్షన్లు ఇచ్చేందుకు భారత్‌నెట్‌ఉద్యమీస్‌ను నియమించాలి. రానున్న ఐదేళ్లలో గ్రామాల్లో ఈ కనెక్షన్లు అందించాలి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, అంగన్వాడీలు, పంచాయతీ కార్యాలయాల్ని అనుసంధానం చేయాలి. ఏబీపీ కార్యక్రమం కింద సెట్‌అప్‌బాక్సు, ఇతర ఖర్చుల కింద 2,93,266 కనెక్షన్లకు కేంద్రం సబ్సిడీ అందిస్తుంది.
- తెలంగాణలోని ప్రతి ఇంటికి కనీసం 25 ఎంబీపీఎస్ డౌన్‌లోడ్ వేగంతో.. 691 బ్లాకులకు బీఎస్‌ఎన్‌ఎల్ ఇంటర్నెట్ లీజ్డ్‌లైన్స్ కనెక్టివిటీ అందించాలి.
గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నేనూ కులవివక్ష ఎదుర్కొన్నా: డిప్యూటీ సీఎం భట్టి కులం అనేది భారతదేశంలో ఒక వాస్తవమని, తాను కూడా కులవివక్ష ఎదుర్కొన్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పారు. ఈ సమాజంలో కులవివక్ష ఉంటుందన్న వాస్తవాన్ని మదిలో పెట్టుకుని బలమైన సంకల్పంతో లక్ష్యసాధనకు ముందుకు పోవాలని ఆయన సూచించారు.
- ‘గౌరవెల్లి’కి త్వరలో పర్యావరణ అనుమతులు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టుకు త్వరలో పర్యావరణ అనుమతులు రానున్నాయని నీటిపారుదల, రవాణా శాఖల మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
- ఆశా కార్యకర్తల ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) తమ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం చేపట్టిన ‘చలో హైదరాబాద్’ ఉద్రిక్తంగా మారింది.
- అవయవదాతకు.. జోత! గత పుష్కరకాలంలో దేశంలో అవయవదానం గణనీయంగా పెరిగిందని కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమశాఖ సోమవారం వెల్లడించిన నివేదికలో పేర్కొంది. 2013లో అవయవదాతల సంఖ్య 5వేల లోపే ఉండగా 2025లో నాలుగు రెట్లు పెరిగి 20వేలకు చేరిందని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
- గోవర్ధనగిరిధారిగా నరసింహస్వామి యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం స్వామివారు ‘గోవర్ధనగిరిధారి’ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు.
- కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచేలా అనుమతించొద్దు వ్యాపార వ్యవహారాల్లో భాగంగా హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఎస్‌బీఐ బ్రాంచి నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి గానీ, ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలను తెరవడానికి గానీ జగతి పబ్లికేషన్స్‌కు అనుమతి ఇవ్వరాదని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
- తెలంగాణలో ఆవిష్కరణలకు ఊతమిచ్చే సృజనాత్మక వ్యవస్థ ఐటీ మాత్రమే కాకుండా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, హెల్త్‌కేర్, ఏరోస్పేస్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫిన్‌టెక్, డీప్‌టెక్, రిటైల్ రంగాల్లోనూ హైదరాబాద్‌ను ‘గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్’గా మార్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పునరుద్ఘాటించారు.
- వైద్య విధాన పరిషత్తు ఇక.. ‘డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్’ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు(టీవీవీపీ)ను ఇక నుంచి డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్(డీఎస్‌హెచ్)గా మార్చేందుకు సోమవారం రాష్ట్ర మంత్రి మండలి నిర్ణయించింది. ఈ మేరకు డీఎస్‌హెచ్ బిల్లుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- ఈ పాఠశాలలో... రోజూ కొబ్బరి లడ్డూ ఘుమఘుమలు పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం ఎల్కలపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నిత్యం మధ్యాహ్న భోజనంతోపాటు ఒక కొబ్బరి లడ్డూను అందిస్తున్నారు.
- ప్రముఖ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి కన్నుమూత ప్రముఖ తెలుగు రచయిత్రి, రమ్యకథా రచయిత్రిగా పేరుపొందిన పోలాప్రగడ రాజ్యలక్ష్మి(88) సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు.
- ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్య సోదరుడికి.. జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం నిజామాబాద్ నగరం మాధవనగర్ వద్ద గత నెల 23న వాహన తనిఖీలు చేపడుతుండగా.. గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టడంతో ఎక్సైజ్ కానిస్టేబుల్ గాజుల సౌమ్య ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
- చేనేత మహిళకు ప్రతిభా ‘పురస్కారం’ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడేనికి చెందిన చేనేత మహిళ వర్కాల విజయలక్ష్మి అత్యున్నత ప్రతిభా పురస్కారాన్ని కేంద్ర టెక్స్‌టైల్ మంత్రి గిరిరాజ్‌సింగ్ చేతులమీదుగా సోమవారం దిల్లీలో అందుకున్నారు.
- అనాథ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతాం రాష్ట్రంలో అనాథ పిల్లలకు భరోసా కల్పిస్తూ ఉపాధి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిం చనున్నట్లు శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క తెలిపారు. ఎయిర్‌పోర్టు ఆపరేషన్లు, కార్గో గ్రౌండ్ హ్యాండ్లింగ్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలకు సిద్ధం చేయనున్నట్లు వెల్లడించారు.
- ప్రముఖ హృద్రోగ నిపుణులు, కార్డియో థొరాసిక్ సర్జన్ ముళ్లపూడి వెంకటరత్నం కన్నుమూత సుప్రసిద్ధ కార్డియో థొరాసిక్ సర్జన్, ఉషా ముళ్లపూడి ఆసుపత్రి వ్యవస్థాపకులు డా.ముళ్లపూడి వెంకటరత్నం(88) కన్నుమూశారు.
- కుమ్మెరలో చిన్నారి మృతిపై దర్యాప్తు జరపాలి నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లికార్జునస్వామి జాతరలో దర్శనం విషయంలో జరిగిన గొడవలో కిందపడి రెండు నెలల శిశువు మృతిచెందిన ఘటనను పలు బీసీ సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు ఖండించారు.
- ‘మన ఊరు-మన బడి’ పెండింగ్ బిల్లులు చెల్లించాలి మన ఊరు-మన బడి కాంట్రాక్టర్లకు రెండున్నరేళ్లుగా బిల్లులను చెల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని భారాస శాసన సభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు తెలిపారు.
- సాగరాన్ని శోధించి.. ధనలక్ష్మిని రప్పించి.. సముద్ర సంపదతో మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేయడమే లక్ష్యంగా ఇన్‌కాయిస్-ఎలీప్ సంస్థలు ముందుకుపోతున్నాయి.
- గచ్చిబౌలిలో చదరపు గజం రూ.1.76 లక్షలు నగరంలోని పలు ప్రాంతాల్లో హౌసింగ్ బోర్డు భూములు మరోసారి అధిక ధరలు పలికాయి.
- ‘భూభారతి’లో కనిపించని గిఫ్ట్‌డీడ్ ఐచ్ఛికం భూభారతి పోర్టల్‌లో గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్లు చేసే ఐచ్ఛికం కనిపించడం లేదు. వారం రోజులుగా జనగామ జిల్లావ్యాప్తంగా గిఫ్ట్‌డీడ్ కింద రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో కార్యాలయాలకు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
- ఆ విద్యార్థులకు హాల్‌టికెట్లు ఇవ్వండి కాలేజీలు చేసిన తప్పు కారణంగా సకాలంలో బోర్డుకు ఫీజు అందకపోవడంతో విద్యార్థులకు హాల్‌టికెట్లు జారీ చేయకపోవడం సరికాదని హైకోర్టు పేర్కొంది.