భార్యకు వీలైనచోటే విడాకుల కేసు విచారణ

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 22 Feb 2026 05:16 IST Ee Font size
  • A
  • A+
  • A++
2 min read

ఈనాడు, అమరావతి: వివాహ సంబంధ వివాదాల కేసులను విచారించే ప్రదేశాలను నిర్ణయించే విషయంలో భర్తకు కలిగే అసౌకర్యం కన్నా.. భార్యకు కలిగే అసౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. వైవాహిక వివాదాల కేసులను ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు బదిలీ చేయాలనే అభ్యర్థనలు వచ్చినప్పుడు.. ఇరుపక్షాల సామాజిక, ఆర్థిక స్థితిగతులతోపాటు, వారి జీవన ప్రమాణాలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. భార్యకు అనుకూలత ఉన్న ప్రదేశానికే ప్రాధాన్యం ఇవ్వాలని  సూచించింది. విడాకుల కోసం తమ భర్తలు దాఖలు చేసిన పిటిషన్లను తాము నివసించే ప్రాంతంలోని కోర్టులకు బదిలీ చేయాలంటూ ఇద్దరు మహిళలు చేసిన అభ్యర్థనను హైకోర్టు అనుమతించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ వెణుతురుమల్లి గోపాలకృష్ణారావు ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. 

విడాకుల కోసం తన భర్త రేపల్లె కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తాను నివసిస్తున్న ఒంగోలు కోర్టుకు బదిలీ చేయాలంటూ ఎన్‌.రాజరాజేశ్వరి హైకోర్టులో పిటిషన్‌ వేశారు. తిరుపతి కోర్టులో తన భర్త దాఖలు చేసిన పిటిషన్‌ను ఆదోని కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ ఐశ్వర్య హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. భార్యలకు అసౌకర్యం కలిగించేందుకు దూరంగా ఉన్న ప్రాంతాల్లోని కోర్టుల్లో భర్తలు విడాకుల కేసులు దాఖలు చేశారన్నారు. దీంతో ఆ మహిళలు వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పిటిషనర్ల అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. ఆ విడాకుల కేసులను భార్యలు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. మరోవైపు క్రాస్‌ ఎగ్జామినేషన్‌ తదితర ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే పిటిషనర్ల భర్తలను హాజరుకు ఆదేశించవచ్చని, సాధారణ విచారణలకు వారి హాజరు అవసరం లేదని స్పష్టం చేశారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • తితిదే సేవలపై మీనాక్షి చౌదరి హర్షం శ్రీవారి భక్తులకు తితిదే అందిస్తున్న సౌకర్యాలపై సినీనటి మీనాక్షి చౌదరి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు  తితిదే అధికారులు, సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ సోమవారం వీడియో విడుదల చేశారు.
  • తిరుమల క్యూలైన్‌లో పాముకాటు అవాస్తవం తిరుమలలోని దర్శనం క్యూలైన్‌లో భక్తురాలికి పాముకాటు వేసినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె కుటుంబం ఓ వీడియోలో ఖండించింది. ఈ ఘటనపై తితిదే సైతం స్పందించింది. క్యూలైన్‌లో పాముకాటు అనేది పూర్తిగా అవాస్తవం అని సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది.
  • కొంపముంచిన కూలెంట్‌ లీకేజీ రాజమహేంద్రవరంలో ఒక్కసారిగా తీవ్రమైన కిడ్నీ సమస్యలు తలెత్తి ఐదుగురు మృత్యువాతపడటానికి పాల కల్తీనే కారణమని అధికారులు గుర్తించినట్టు విశ్వసనీయ సమాచారం.
  • రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసు..అప్పటి సీఐడీ డీఐజీ సునీల్‌ నాయక్‌ అరెస్ట్‌ శాసనసభ ఉపసభాపతి కె.రఘురామకృష్ణరాజు నరసాపురం ఎంపీగా ఉన్న సమయంలో ఆయన్ను సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురిచేసి.. హత్యాయత్నానికి పాల్పడ్డారనే ఫిర్యాదుపై నమోదైన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
  • కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రంలో వేడి తీవ్రత కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో సోమవారం గరిష్ఠ ఉష్ణోగ్రతలు 1 నుంచి 2 డిగ్రీలు పెరిగాయి. తుని, మచిలీపట్నం, నందిగామ, నంద్యాల, కర్నూలు, కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలు దాటాయి.
  • సజావుగా ఇంటర్మీడియట్‌ పరీక్షలు రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు సోమవారం ప్రారంభం అయ్యాయి. తొలిరోజు మొదటి సంవత్సరం విద్యార్థులకు పార్ట్‌-11: ద్వితీయ భాష పేపర్‌-1 నిర్వహించారు.
  • నాగావళి దాటడమే నిత్య పరీక్ష! పార్వతీపురం మన్యం జిల్లాలో ఇంటర్‌ పరీక్ష రాసే విద్యార్థుల అవస్థలివి. కొమరాడ-కొట్టు గ్రామానికి మధ్య నాగావళి నది ప్రవహిస్తోంది. ఏడాదంతా అందులో ప్రవాహం ఉంటుంది. నది అవతల కొట్టు, తొడుము, పొడుగువలస, తులసివలస గ్రామాలున్నాయి.
  • స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్ల పెంపు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ‘‘ఎన్డీయేపై ఎంతో నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ఆ నమ్మకాన్ని కాపాడుకోవాలి. వైకాపా హయాంలో బీసీ రిజర్వేషన్లు 33% నుంచి తగ్గించారు.
  • వైకాపా పాలనలో జగన్‌ కంపెనీలకు..రూ.వెయ్యి కోట్లకు పైగా అనుచిత లబ్ధి వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లలో సాక్షి పత్రిక, టీవీ ఛానల్, భారతి సిమెంట్స్‌ సహా జగన్‌ కంపెనీలు ప్రభుత్వం నుంచి రూ.వెయ్యి కోట్లకు పైగా అనుచిత లబ్ధి పొందాయని విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేశ్‌ పేర్కొన్నారు.
  • రూ. లక్ష కూపన్‌ నాకొద్దు.. వెనక్కి ఇచ్చేస్తున్నా! ‘ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వం రూ.లక్ష విలువైన కూపన్లు ఇచ్చింది. బడ్జెట్‌పై చర్చ జరగనప్పుడు, మా గొంతు నొక్కుతున్నప్పుడు ఈ రూ.లక్ష కూపన్‌ నాకెందుకు..? దీన్ని నేను తిరస్కరిస్తున్నాను.
  • రూ.500 కోట్ల సాస్కీ నిధులతో గురుకుల భవనాలు ‘రాష్ట్రంలో 20 బీసీ గురుకులాల్లో కొత్త భవనాల నిర్మాణానికి సాస్కీ పథకం కింద రూ.500 కోట్లు మంజూరు చేశాం. నూతనంగా 10 బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నాం.
  • జగన్‌ వదిలేసిన బకాయిలు మేమొచ్చాక కట్టాం వైకాపా ప్రభుత్వ హయాంలో పౌరసరఫరాల సంస్థ ద్వారా రూ.40,750 కోట్ల రుణాలు తీసుకుని, రూ.18,900 కోట్లే తిరిగి చెల్లించారని, మిగిలిన సొమ్మును మళ్లించారని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు.
  • 611 ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు రూ.595 కోట్లు వైకాపా ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన 611 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారని, ఆ మేరకు రూ.595 కోట్లతో ఆర్థికశాఖకు ప్రతిపాదనలు పంపామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
  • బాగా పనిచేసే ఉద్యోగులకు వెయిటేజ్‌ బాగా పనిచేసే ఉద్యోగులను గుర్తించి వారిని ప్రోత్సహించేలా అభినందన లేఖలు పంపేలా అన్నిశాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. అలాగే ఆయా ఉద్యోగుల వ్యక్తిగత రికార్డుల్లో వాటిని నమోదు చేయాలన్నారు.
  • 14 క్రీడాంశాలు.. 156 మంది ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మంగళవారం నుంచి మూడు రోజుల పాటు విజయవాడ వేదికగా ‘ఏపీ స్టేట్‌ లెజిస్లేటివ్‌ స్పోర్ట్స్‌ మీట్‌-2026’ జరగనుంది.
  • కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరిచేలా అనుమతించొద్దు వ్యాపార వ్యవహారాల్లో భాగంగా హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని ఎస్‌బీఐ బ్రాంచి నుంచి విదేశీ ఖాతాలకు సొమ్ము బదిలీ చేయడానికి గానీ, ఇతర బ్యాంకుల్లో కొత్త ఖాతాలను తెరవడానికి గానీ జగతి పబ్లికేషన్స్‌కు అనుమతి ఇవ్వరాదని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.
  • ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. అమరావతిలోని వీఐటీ-ఏపీ యూనివర్సిటీలో విటోపియా-2026 ఫెస్ట్‌ సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. గత మూడు రోజులుగా జరుగుతున్న వార్షిక క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఉర్రూతలూగిస్తున్నాయి.
  • ప్రముఖ రచయిత్రి పోలాప్రగడ రాజ్యలక్ష్మి కన్నుమూత ప్రముఖ తెలుగు రచయిత్రి, రమ్యకథా రచయిత్రిగా పేరుపొందిన పోలాప్రగడ రాజ్యలక్ష్మి (88) సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్‌లో మరణించారు. రా
  • వసతిగృహాల పేరును డాక్టర్‌ అంబేడ్కర్‌ రాజగృహాలుగా మార్చాలి సాంఘిక సంక్షేమ వసతిగృహాలకు సంబంధించిన సామాజిక నివేదికను రాష్ట్ర సామాజిక సంక్షేమ మండలి ఛైర్మన్‌ పోతుల బాలకోటయ్య ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.
  • ప్రతి ఆటా ఓ స్ఫూర్తి పాఠమే! వాళ్లు ఒక్క అడుగూ కదల్లేరు. అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో క్రికెట్‌ మైదానంలోకి దిగారు. బ్యాట్‌తో.. స్కోరును పరిగెత్తించారు. బాల్‌తో.. బెయిల్స్‌ ఎగరగొట్టారు. బౌండరీ వైపు దూసుకెళ్లే బంతిని మెరుపువేగంతో ఒడిసిపట్టారు.