దేశీయంగా చిప్‌ల తయారీ ముఖ్యం

Eenadu icon
By Business News Desk Published : 22 Feb 2026 02:50 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

గ్రేటర్‌ నోయిడా: అభివృద్ధి చెందిన దేశంగా మారాలంటే దేశీయంగా చిప్‌లు తయారు చేయడం చాలా ముఖ్యమని ప్రధాని నరేంద్ర మోదీ శనివారం వెల్లడించారు. హెచ్‌సీఎల్‌ గ్రూప్, ఫాక్స్‌కాన్‌ల సంయుక్త సంస్థ (జేవీ) అయిన ఇండియా చిప్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ శంకుస్థాపనకు దృశ్య మాధ్యమ విధానంలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో చిప్‌ల సరఫరా వ్యవస్థలో అంతరాయాలు అనేక ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిని నిలిపివేసిందని, వివిధ ప్లాంట్లలో పనులు నిలిచిపోయాయని తెలిపారు. ‘మన దేశం స్వయం సమృద్ధిగా ఉన్నప్పుడే అభివృద్ధి చెందిన దేశంగా నిర్మితమవుతుంది. దీని కోసం మేడిన్‌ ఇండియా చిప్‌ చాలా ముఖ్యం. మన దేశం సాంకేతిక రంగంలో ఏం చేసినా, అది 21వ శతాబ్దంలో మన సామర్థ్యానికి పునాది అవుతుంద’ని మోదీ వెల్లడించారు. హెచ్‌సీఎల్‌ గ్రూప్, ఫాక్స్‌కాన్‌ జేవీ ఓశాట్‌ (ఔట్‌సోర్స్‌డ్‌ సెమీకండక్టర్‌ అసెంబ్లీ అండ్‌ టెస్ట్‌) ప్లాంట్‌ గ్రేటర్‌ నోయిడాలోని జెవార్‌ దగ్గరున్న యమునా ఎక్స్‌ప్రెస్‌వే పారిశ్రామిక అభివృద్ధి ప్రాధికారిక సంస్థ (వైఈఐడీఏ) వద్ద రాబోతోంది. ఇండియా చిప్‌ ప్రై.లి.లో హెచ్‌సీఎల్‌ గ్రూప్‌నకు 60 శాతం, ఫాక్స్‌కాన్‌కు 40 శాతం వాటా ఉంది. ఈ సంస్థ వచ్చే కొన్నేళ్లలో రూ.3,700 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టబోతోంది. 2028 నాటికి కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ప్లాంటులో డిస్‌ప్లే డ్రైవర్‌ చిప్‌లు తయారవుతాయి. ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 3,500 మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

► Read latest Business Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • వెండి ధర తగ్గింది యుద్ధభయాలతో అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలు సోమవారం తొలుత బాగా పెరిగినా, రాత్రి సమయానికి మళ్లీ దిగివచ్చాయి.
  • యుద్ధమక్కడ.. నష్టమిక్కడ అమెరికా, ఇజ్రాయెల్‌ కలిసి ఇరాన్‌పై దాడి చేస్తోంటే.. ప్రతిగా ఇరాన్‌ సైతం అమెరికా స్థావరాలున్న గల్ఫ్‌ దేశాలపై విరుచుకుపడుతోంది.
  • బెంబేలెత్తించిన ముడి చమురు పశ్చిమాసియాలో యుద్ధం తీవ్రమై, ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరగడంతో మదుపర్ల సెంటిమెంటు తీవ్రంగా దెబ్బతింది. దీంతో అమ్మకాలకు దిగారు.
  • కరెంటు ఖాతా లోటు పెరిగింది దేశ కరెంటు ఖాతా లోటు డిసెంబరు త్రైమాసికంలో 13.2 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.1.19 లక్షల కోట్లు)గా నమోదైంది. ఇది జీడీపీలో 1.3 శాతానికి సమానం.
  • 3 నెలల కనిష్ఠానికి ఐఐపీ మన దేశ పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి ఈ ఏడాది జనవరిలో నెమ్మదించి, 3 నెలల కనిష్ఠమైన    4.8 శాతానికి పరిమితమైంది. తయారీ, గనుల రంగాల బలహీన పని తీరు ఐఐపీని ప్రభావితం చేసింది.
  • రూ.3.12 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులు ‘హైదరాబాద్‌ కేవలం టెక్నాలజీ సేవలు అందించే స్థాయి నుంచి, ప్రపంచస్థాయి ఆవిష్కరణలు సృష్టించే కేంద్రంగా (గ్లోబల్‌ ఇన్నోవేషన్‌ హబ్‌) మారుతోంది
  • బెట్టింగ్‌లను ప్రోత్సహించలేదు వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) ఎగవేత, బెట్టింగ్‌ కార్యకలాపాలను ప్రోత్సహించడం వంటి ఆరోపణలను ఫినో పేమెంట్స్‌ బ్యాంక్‌ ఖండించింది.
  • మెటాలిక్‌ బ్లాక్‌లో యమహా ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155 యమహా మోటార్‌ ఇండియా తన ఎక్స్‌ఎస్‌ఆర్‌ 155 మోటార్‌ సైకిల్‌ను మెటాలిక్‌ బ్లాక్‌ రంగులో విడుదల చేసింది. దీని ధరను రూ.1,58,990 (దిల్లీ ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది.
  • సంక్షిప్తవార్తలు (11) శ్రీరామ్‌ ట్విస్టెక్స్‌ షేరు సోమవారం స్టాక్‌ మార్కెట్‌లో నమోదైంది. ఇష్యూ ధర రూ.104తో పోలిస్తే, బీఎస్‌ఈలో 32.69% నష్టంతో రూ.70 వద్ద ఈషేరు ట్రేడంగ్‌ ప్రారంభమైంది.
  • ఐఫోన్‌ 17ఇ వచ్చేసింది యాపిల్‌ సంస్థ కొత్తగా ఐఫోన్‌ 17ఇ ని ఆవిష్కరించింది. సరికొత్త ఏ19 చిప్‌సెట్, 48 మెగాపిక్సెల్‌ ఫ్యూజన్‌ కెమెరా, మ్యాగ్‌సేఫ్‌ సపోర్ట్‌ కలిగిన ఈ ఫోన్‌కు 17 శ్రేణిలో తక్కువ ధర నిర్ణయించారు.
  • స్పామ్‌ మెసేజ్‌లు అరికట్టేందుకు ఎయిర్‌టెల్, గూగుల్‌ భాగస్వామ్యం సంక్షిప్త సందేశాల (ఎస్‌ఎంఎస్‌)లో స్పామ్‌ను అరికట్టేందుకు ఏఐ (కృత్రిమమేధ) ఆధారిత స్పామ్‌ ప్రొటెక్షన్‌ టూల్‌ను భారతీ ఎయిర్‌టెల్‌ వినియోగించనుంది.
  • మన దగ్గర సరిపడా నిల్వలు ఉన్నాయా? పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో.. మన దేశానికి సరఫరా అయ్యే చమురులో దాదాపు సగం మేర అంతరాయం కలిగే ప్రమాదం ఉంది. అయితే ఇరాన్‌- అమెరికా, ఇజ్రాయెల్‌ యుద్ధం దీర్ఘకాలం కొనసాగినా, మన వద్ద తగినన్ని చమురు నిల్వలు ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 
  • భారత్‌కు చమురు ముప్పు ఎంత? పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. అమెరికా, ఇజ్రాయెల్‌ మెరుపు దాడుల్లో ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతుల్లా ఖమేనీ మరణించడంతో, ఈ ప్రాంతంలో యుద్ధం తీవ్రమైంది. వెనెజువెలా అధ్యక్షుణ్ని అమెరికా బందీగా పట్టుకెళ్లినా, పరిస్థితులు విషమించలేదు.
  • ఫిబ్రవరిలో వాహన విలాసమే దేశీయ విపణిలో స్థిరమైన గిరాకీ లభిస్తున్నందున.. ఫిబ్రవరిలో అగ్రగామి వాహన కంపెనీలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, మహీంద్రా అండ్‌ మహీంద్రా తమ టోకు విక్రయాల్లో వృద్ధి నమోదుచేశాయి. దిగ్గజ సంస్థ మారుతీ సుజుకీ ఇండియా దేశీయ విపణిలో 1,61,000 వాహనాలు విక్రయించింది.
  • మార్కెట్‌కు ‘యుద్ధ’ నష్టాలే అమెరికా, ఇజ్రాయెల్‌ సంయుక్త దాడుల్లో ఇరాన్‌ సుప్రీం నాయకుడు సహా ముఖ్యనేతలు హతమవ్వడం, తదనంతర పరిణామాలు స్టాక్‌మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. ఇప్పటికే  బలహీనంగా ఉన్న మదుపర్ల సెంటిమెంటు మరింత దిగజారనుంది.
  • పసిడి, వెండి పెరుగుతాయ్‌ పసిడి ఏప్రిల్‌ కాంట్రాక్టు ఈవారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. అమెరికా-ఇజ్రాయెల్‌ దాడుల్లో ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ ఖమేనీ సహా పలువురు ముఖ్యనేతలు హతమవ్వడం, ఇరాన్‌ ప్రతిదాడుల నేపథ్యంలో.. అంతర్జాతీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
  • గెయిల్‌ ఛైర్మన్‌గా దీపక్‌ గుప్తా బాధ్యతల స్వీకరణ దేశీయ అతిపెద్ద గ్యాస్‌ సరఫరా సంస్థ గెయిల్‌ ఇండియా, ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టరుగా దీపక్‌ గుప్తా ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 2029 ఫిబ్రవరి 28 వరకు ఈయన ఈ పదవిలో ఉంటారు.
  • 28 స్థిరాస్తి సంస్థలు.. రూ.1.33 లక్షల కోట్ల అమ్మకాలు దేశంలోని 28 నమోదిత స్థిరాస్తి సంస్థలూ కలిసి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-డిసెంబరులో రూ.1.33 లక్షల కోట్ల విలువైన అమ్మకాలు జరిపాయి. ప్రీమియం, విలాసవంత ఇళ్లు/ఫ్లాట్లకు గిరాకీ లభించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.
  • ఐఐఎఫ్‌సీఎల్‌ పబ్లిక్‌ ఇష్యూ 2026-27లో ప్రభుత్వరంగ ఇండియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్‌ కంపెనీ (ఐఐఎఫ్‌సీఎల్‌) పబ్లిక్‌ ఇష్యూకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇందుకు ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ ఆమోదం తెలిపింది.
  • మహీంద్రా ఎక్స్‌ఈవీ 9ఇ సినీలక్స్‌.. ఫీచర్లివీ! మహీంద్రా అండ్‌ మహీంద్రా సంస్థ, విద్యుత్తు ఎస్‌యూవీ ఎక్స్‌ఈవీ 9ఇ సినీలక్స్‌ ఎడిషన్‌ను ఆదివారం ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.29.35 లక్షలు (ఎక్స్‌షోరూం) అని ప్రకటించింది.