అమెరికాలో హిందువులే విద్యాధికులు

Eenadu icon
By International News Desk Published : 22 Feb 2026 05:25 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

హ్యూస్టన్‌: అమెరికాలో అత్యంత విద్యాధిక మతవర్గం హిందువులేనని ప్యూ రీసెర్చ్‌ సెంటర్‌ విడుదల చేసిన ఒక సర్వే నివేదిక వెల్లడించింది. యూదులు అత్యంత విద్యాధికుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. వివిధ మతవర్గాల స్థితిగతులపై 2023-24లో నిర్వహించిన రిలిజియస్‌ ల్యాండ్‌స్కేప్‌ సమగ్ర సర్వే (ఆర్‌ఎల్‌ఎస్‌)లో వెలువడిన గణాంకాల ఆధారంగా ఈ అధ్యయన నివేదిక వెలువరించారు. అమెరికాలో నివసిస్తున్న ప్రతి పదిమంది హిందువుల్లో ఏడుగురు.. అంటే 70% మంది పట్టభద్రులు కాగా యూదుల్లో 65% మందికి బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉన్నట్టు గుర్తించారు. అమెరికా మొత్తం జనాభాలో పట్టభద్రులు సరాసరిన 35% మాత్రమే. జాతీయ సరాసరి కన్నా ఎక్కువ శాతం మంది ముస్లింలు, బౌద్ధులు, సనాతన క్రైస్తవులు, సాధారణ ప్రొటెస్టెంట్‌ క్రైస్తవులు పట్టభద్రులుగా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఇవాంజెలికల్‌ ప్రొటెస్టెంట్లు, కేథలిక్కులు జాతీయ సరాసరి కన్నా తక్కువ సంఖ్యలో పట్టభద్రులైనట్టు వెల్లడైంది. హిందువులు, ముస్లింలు, బౌద్ధుల్లో అత్యధికులు ఉన్నత విద్యాభ్యాసం కోసమే అమెరికాకు వస్తున్నందున వారిలో పట్టభద్రుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు సర్వే తెలియజేసింది. దీనికోసం 2023-24 మధ్య 36,908 మందిని ప్రశ్నించారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఇరాన్‌ దిగ్బంధనం! అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నంత పనీ చేశారు! ఇరాన్‌ ఓడరేవులు, తీర ప్రాంతాలను తమ నౌకాదళంతో దిగ్బంధించారు! ఆ దేశానికి నౌకల రాకపోకలను అడ్డుకునే ప్రక్రియను సోమవారం మొదలుపెట్టారు.
  • ఇలాంటి పోప్‌ నాకొద్దు: ట్రంప్‌ అమెరికాలో జన్మించిన తొలి పోప్‌ లియో-14, అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రరూపం దాల్చింది. పశ్చిమాసియా యుద్ధంపై పోప్‌ చేసిన వ్యాఖ్యలు, వాటిపై ట్రంప్‌ ఘాటు స్పందనతో వాతావరణం వేడెక్కింది.
  • డైనోసార్‌ అవశేషాలతో రూ.5 కోట్ల హ్యాండ్‌బ్యాగ్‌ డైనోసార్‌ల గురించి తెలుసుకోవాలంటే అందరికీ ఆసక్తే. మరి వాటి అవశేషాలు ప్రస్తుత ఫ్యాషన్‌ పోకడల్లో ఆవిష్కరణలైతే.. ఆశ్చర్యపోవడం ప్రపంచం వంతవుతుంది.
  • భారత్‌-ఫ్రాన్స్‌ ద్వైపాక్షిక చర్చలు భారత్, ఫ్రాన్స్‌ సీనియర్‌ అధికారులు సోమవారం లండన్‌లో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ, పౌర అణుఇంధనం, అంతరిక్షం, సైబర్‌ రంగ సహకారం, ఇతరత్రా కీలకమైన ప్రాంతీయ పరిణామాలు, ప్రపంచవ్యాప్త అంశాలపై చర్చలు కొనసాగాయి.
  • మళ్లీ ఘర్షణ రాకుండా చూద్దాం పశ్చిమాసియాలో మరోసారి ఘర్షణ రాకుండా అన్ని ప్రయత్నాలు చేయడం అత్యంత ప్రాధాన్య అంశమని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ పేర్కొన్నారు.
  • హంగరీలో ఓటమి పాలైన జాతీయవాద పార్టీ దాదాపు 16 సంవత్సరాలుగా హంగరీని పరిపాలించిన జాతీయవాద పార్టీ ఓటమిపాలైంది. 199 సీట్లున్న పార్లమెంటుకు ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష టిస్‌జా పార్టీకి 138 స్థానాలు దక్కాయి.