కోళ్ల దొంగల కోసం కాస్తే! కలప దొంగలు దొరికారు!!

- A
- A+
- A++

నర్సీపట్నం గ్రామీణం, న్యూస్‌టుడే: కోళ్లు, మేకల దొంగలను పట్టుకోవడానికి రాత్రివేళ వాహన తనిఖీలు నిర్వహిస్తున్న నాతవరం పోలీసులకు ఎలాంటి అనుమతులు లేకుండా వ్యాన్‌లో తరలిస్తున్న తునికి కలప పట్టుబడింది. శుక్రవారం రాత్రి కొయ్యూరు మండలం ఆడాకుల సమీపంలో పట్టుబడిన ఈ వ్యాన్‌ను నాతవరం ఎస్సై తారకేశ్వరరావు అటవీ అధికారులకు అప్పగించారు. ఇది కృష్ణదేవిపేట అటవీ రేంజ్ పరిధి కావడంతో కలపని శనివారం నర్సీపట్నం నుంచి గొలుగొండ కలప డిపోకి తరలించారు. పోలవరం జిల్లా రాజవొమ్మంగి అడవుల్లో తునికి చెట్లు నరికించి ఇలా తరలిస్తున్నారని ఎస్సై పరిశీలనలో వెల్లడైంది. తునిలో దాదాపు రూ. 50 వేల విలువ చేసే ఈ కలప.. తమిళనాడు చేరేసరికి దాదాపు రూ.2 లక్షలు వరకు పలుకుతుందని చెబుతున్నారు.
నకిలీ కరుంగలి మాలలు?
ఇటీవలి కాలంలో అనేకమంది కరుంగలి మాలలు ధరిస్తున్నారు. గట్టిగా నల్లగా ఉండే కరుంగలి కలప నుంచి చేసిన పూసలతో మాలలు వేల రూపాయలు ఖరీదు చేస్తుంటాయి. దాదాపు వీటిని పోలి ఉండేలా తునికి చెట్ల నుంచి పూసలు తయారు చేసి నకిలీ మాలలు మార్కెట్లలో విక్రయాలకు ఉంచుతున్నారని పోలీసు, అటవీ సిబ్బంది చెబుతున్నారు. దాదాపు మూడేళ్ల క్రితం యర్రవరం చెక్‌పోస్టు వద్ద కలపతో వస్తున్న వ్యాన్‌ను స్వాధీనం చేసుకుని పరిశీలించి నల్లతుమ్మగా గుర్తించి వదిలిపెట్టేశారు. అదే వ్యాన్‌ను కాకినాడ జిల్లా కోటనందూరు వద్ద తుని అటవీ అధికారులు స్వాధీనం చేసుకుని పరిశీలించినప్పుడు వ్యాన్‌లో కలప తుమ్మికగా నిర్ధారించారు. ఈ ప్రాంతంలోని గిరిజనులు బీడీ ఆకులు సేకరించుకోవడానికి తప్ప మరెందుకూ పనికి రావని భావించే ఈ చెట్లు రాష్ట్రాలు దాటి తరలించడం వెనుక కరుంగలి మాలలకు పెరుగుతున్న డిమాండే కారణమని చెబుతున్నారు.
తుమ్మిక చెట్లని నరికేసిన ఘటన 2023లో వెలుగుచూసినప్పుడు ఎక్కడెక్కడ చెట్లు నరికివేతకు గురయ్యాయో అధికారులు అడవుల్లోకి వెళ్లి గుర్తించారు. పట్టుబడ్డ వాటిలో కొన్ని చెట్లు అటవీ హక్కు చట్టం ప్రకారం గిరిజనులు పొందిన భూమిలోనివని విజిలెన్స్ అధికారులు అప్పట్లో గుర్తించారు. మళ్లీ ఇప్పుడు అనుకోకుండా నాతవరం పోలీసులకు తునికి కలప పట్టుబడింది. రాజవొమ్మంగి ప్రాంతం నుంచి ఈ చెట్ల అక్రమ రవాణా ఎక్కువగానే ఉందని ఆ ప్రాంతీయులు చెబుతున్నారు. తనిఖీలో 97 తునికి ముక్కలు పరిమాణం 1.2 సీఎంటీలని గొలుగొండ అటవీ సిబ్బంది తెలిపారు.
► Read latest Alluri sitharama raju Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- నిర్లక్ష్య రోగం.. నీరసం ఖాయం! [ 15-04-2026] జిల్లాలో గిరిజనులకు ఏ ప్రాంతంలో ఎలాంటి ఆరోగ్య సమస్య ఎదురైనా వెంటనే పాడేరు జిల్లా ఆసుపత్రికే వస్తారు.
- ఊరికి దారిలేక.. ఊరకుండలేక! [ 15-04-2026] అనంతగిరి మండలం వేంగడ పంచాయతీ బందవలస గ్రామ గిరిజనులు శ్రమదానంతో కాలిబాట వంతెన ఏర్పాటు చేసుకున్నారు.
- సాంకేతిక కోట..ఉపాధికి బాట [ 15-04-2026] పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయ్యాయి.
- వందేళ్ల బడి.. కొత్త సందడి [ 15-04-2026] కిలగాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గ్రామంలో వందేళ్ల వేడుకలు నిర్వహిస్తున్నారు.
- చందనోత్సవం ఆన్‌లైన్ టికెట్ల విక్రయాల్లో ఘోర వైఫల్యం [ 15-04-2026] చందనోత్సవం నిర్వహణ ముందు ప్రభుత్వ యంత్రాంగం అనవసర ప్రయోగాలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది.
- నడిపింది.. నారీ‘మణి’ [ 15-04-2026] జిల్లాలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా మద్దిల మణి రికార్డు నెలకొల్పారు.
- ఏఆర్‌సీలో కన్నుమూసిన సింహం [ 15-04-2026] విశాఖ ఏఆర్‌సీ (యానిమల్ రెస్క్యూ సెంటర్)లో ‘లియా’ అనే ఏడేళ్ల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు జూ క్యూరేటర్ జి.మంగమ్మ తెలిపారు.
- ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిపై కేసు [ 15-04-2026] పరవాడ పోలీస్‌స్టేషన్ పరిధి తాడి గ్రామ కాలనీలోని ఆన్‌లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకుడిపై మంగళవారం రాత్రి కేసు నమోదు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు.