ధైర్యే.. సాహసే.. హరిత

Eenadu icon
By Andhra Pradesh Dist. Desk Published : 22 Feb 2026 07:33 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

బద్వేలు, బి.కోడూరు, న్యూస్‌టుడే: ఆమె పేరు హరిత. స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె. జీవనోపాధి నిమిత్తం బద్వేలు- పోరుమామిళ్ల ప్రధాన రహదారిపై బి.కోడూరు మండలం పాయలకుంట్ల గ్రామ సమీపంలో తోపుడు బండిపై అరటి పండ్లు విక్రయిస్తోంది. శనివారం మధ్యాహ్నం ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనంపై అక్కడికి వచ్చి డజను కావాలని అడిగారు. ఆమె వెనక్కి తిరగగానే మెడలోని బంగారు గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించారు. హరిత ప్రతిఘటించడంతో గొలుసు తెగి కింద పడింది. కేకలు వేస్తున్న ఆమెను కత్తితో బెదిరించినా భయపడలేదు. ఆమె కూడా తన వద్ద ఉన్న అరటి పండ్ల కత్తితో ప్రతి దాడి చేసింది. దీంతో దొంగలు భయపడి ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. సమాచారం అందుకున్న బద్వేలు పోలీసులు అప్రమత్తమై ద్విచక్ర వాహనంపై వస్తున్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులు నందలూరు గ్రామానికి చెందిన శివశంకర్, శంకరయ్యగా గుర్తించారు.

► Read latest Ysr kadapa Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పీలేరులో అన్న క్యాంటీన్‌ ఏర్పాటు [ 15-04-2026] అన్నమయ్య జిల్లా పీలేరు పట్టణంలో ఎమ్మెల్యే నల్లారి కిషోర్‌ కుమార్‌ రెడ్డి అన్న క్యాంటీన్లను ప్రారంభించారు.
  • ఫలితం.. కోల్పోవద్దు ఆత్మవిశ్వాసం [ 15-04-2026] పరీక్షలు.. ఫలితాలు.. కేవలం విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేసే ప్రక్రియ మాత్రమే. అది వ్యక్తిత్వాన్ని, భవిష్యత్తును నిర్ణయించేవి కాదు. ఆశించిన ఫలితం రానంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదు. మార్కుల వేటలో పడి మనసును గాయపరచుకోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
  • జనంలోకి గంజాయి.. వనంలోకి జులాయి! [ 15-04-2026] జిల్లాలో గంజాయి అడ్డాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.. పట్టణాల నుంచి పల్లెల వరకు ఎక్కడ చూసినా జులాయిలు తయారవుతున్నారు. వీరంతా శివారు ప్రాంతాలు, పాత భవనాలు, ముళ్ల పొదలు, ఖాళీ ప్రదేశాలను తమ మత్తు కార్యకలాపాలకు వినియోగిస్తుండగా పోలీసులు జనాన్ని వీడి వీరి అడ్డాల్లోకి వెళ్లడం లేదు.
  • ‘ఓపి’కుంటేనే ఆసుపత్రుల్లో మాత్ర [ 15-04-2026] మారిన వాతావరణ పరిస్థితులతో పలువురు అనారోగ్యం బారిన పడుతున్నారు. వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రుల బాట పడుతున్నారు. ఈ సంఖ్య ఇటీవల కాలంలో క్రమేపీ పెరుగుతోంది. కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి ఈ తాకిడి మరింత ఎక్కువగా ఉంటోంది.
  • ఆటలో విజేత.. బతుకులో పరాజిత! [ 15-04-2026] అతను దివ్యాంగుడు. అయితేనేం నిన్నటి వరకు మైదానంలో తన ప్రతిభతో చప్పట్లు అందుకున్నాడు. జట్టు గెలుపునకు శ్రమించి శభాష్‌ అనిపించుకున్నాడు. నేడు బతుకుదెరువుకు అవసరమైన ఉద్యోగ వేటలో శ్రమిస్తున్నాడు.
  • శ్రీహరీ.. వెనక్కి వచ్చేయి [ 15-04-2026] ఒంటిమిట్ట పోలీస్‌ సీఐగా వి.శ్రీహరి బాధ్యతలు చేపట్టిన 24 గంటల్లోనే తిరిగి వెనక్కి వచ్చేయాలని పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇక్కడ సీఐగా ఆయన సోమవారం విధుల్లో చేరారు.
  • చూస్తూ ఊరుకోం.. రౌడీలందరి తాట తీస్తాం [ 15-04-2026] ‘కడప జిల్లాలో రౌడీలు నేరం చేస్తే చూస్తూ ఊరుకోం.. వారికి ఎలాంటి ట్రీట్‌మెంట్‌ ఇవ్వాలో మాకు బాగా తెలుసు. మా వద్ద ఏ పరికరాలు ఉన్నాయో, ఎవరికి ఏం వాడాలో తెలుసు’ అని ఎస్పీ నచికేత్‌ విశ్వనాథ్‌ హెచ్చరించారు.
  • అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌ అరెస్ట్‌ [ 15-04-2026] వైఎస్‌ఆర్‌ కడప జిల్లా టి.సుండుపల్లి మండలం పింఛా ప్రాజెక్ట్‌ సమీపంలోని అటవీ ప్రాంతంలో మంగళవారం అటవీశాఖతో కలిసి టాస్క్‌ఫోర్స్‌ బలగాలు నిర్వహించిన దాడుల్లో రూ.20 లక్షల విలువచేసే 10 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను...
  • రహదారి ప్రమాదంలో యువకుడు దుర్మరణం [ 15-04-2026] పని నిమిత్తం పట్టణానికి వెళ్లిన వ్యక్తి అయిదు నిమిషాల్లో ఇంటికి చేరుకుంటారనే లోపు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన పులివెందుల మండల పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
  • హత్య కేసులో ముగ్గురి అరెస్టు [ 15-04-2026] రాజుపాళెం మండలం పర్లపాడులో ఈనెల 10 జరిగిన బంగి మహేష్‌బాబు (21) అనే యువకుడి హత్య కేసులో అదే గ్రామానికి చెందిన బాలుడు (17)తో పాటు అతని తల్లిదండ్రులు బంగి సురేష్‌ అలియాస్‌ ఏసురాజు, బంగి దేవమ్మ అలియాస్‌ బుజ్జిలను పోలీసులు అరెస్టు చేశారు.
  • చెరువులో పడిన తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ [ 15-04-2026] బద్వేలు నాగుల చెరువులో మంగళవారం ప్రమాదవశాత్తు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌ వాహనం అదుపుతప్పి పడిపోయింది. అందులో ప్రయాణిస్తున్న డ్రైవర్‌ రాజేశ్‌ ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డారు.
  • భార్యను హతమార్చిన భర్తకు రిమాండ్‌ [ 15-04-2026] మండలంలోని పుల్లారెడ్డిపల్లెకు చెందిన వివాహిత యంబడి శ్యామల (37) ఈ నెల 3వ తేదీన మృతి చెందింది. కుటుంబ సభ్యులు మరుసటి రోజు అంత్యక్రియలు నిర్వహించారు.