లోకం తెలియని జీవితం.. ఇంటికే పరిమితం

Eenadu icon
By Telangana Dist. Desk Updated : 22 Feb 2026 07:42 IST Ee Font size
  • A
  • A+
  • A++
1 min read

జఫర్‌గఢ్, న్యూస్‌టుడే: ఇద్దరు కుమారులు జన్మించారని సంతోషపడిన ఆ కుటుంబంలో తీరని శోకమే మిగిలింది. చిన్న కుమారుడికి మెదడు ఎదుగుదల లేక 25 ఏళ్లుగా ఇంటికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం షాపల్లికి చెందిన పెద్దూరి ప్రభాకర్, రజిత దంపతులు. 2001లో జన్మించిన చిన్న కుమారుడు తరుణ్‌కుమార్‌ ఆరు నెలల కాలంలో కాలు కదపడం, మాటలతో సైగలు చేయకపోవడంతో తల్లిదండ్రులు హనుమకొండలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి మెదడు ఎదుగుదల లేదని చెప్పారు. మెరుగుపడడం కోసం నెలకొక ఇంజక్షన్‌ ఇవ్వాలని.. రూ.30 వేలు ఖర్చు అవుతుందని తెలిపారు. వైద్యం చేయించే ఆర్థిక స్తోమత లేక మందులతో కాలం వెల్లదీస్తున్నారు. ప్రభాకర్, రజిత దంపతులు శనివారం న్యూస్‌టుడేతో మాట్లాడుతూ.. నెలకు రూ.3 వేలు మందులకు ఖర్చు అవుతుంది. ఇప్పటివరకు రూ.7.50 లక్షల వరకు ఖర్చు చేశాం. ఆపరేషన్‌ చేయాలంటే రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు అంటున్నారు. అంత ఖర్చు పెట్టి వైద్యం చేయించే స్థితిలో తాము లేమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాతలు, ప్రభుత్వం ముందుకు వచ్చి తమ కుమారుడికి వైద్యం చేయించాలని వేడుకుంటున్నారు. 

► Read latest Warangal Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 07:40 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష [ 15-04-2026] భూ తగాదా విషయంలో ఒకరిని హత్య చేసిన ముగ్గురికి యావజ్జీవ కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ. 25 వేల చొప్పున జరిమానా విధిస్తూ మహబూబాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి మహ్మద్ అబ్దుల్ రఫీ బుధవారం తీర్పునిచ్చారు.
  • జాతీయ రహదారిపై రైతుల రాస్తారోకో [ 15-04-2026] మొక్కజొన్న కొనుగోలులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపిస్తూ రైతులు బుధవారం రాస్తారోకో చేశారు.
  • భాజపా నాయకుల రాస్తారోకో [ 15-04-2026] మండలంలోని ఇల్లంద వ్యవసాయ మార్కెట్ మొక్కజొన్నల కొనుగోలు కేంద్రంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ జాతీయ రహదారిపై రైతులకు మద్దతుగా భాజపా నాయకులు రాస్తారోకోకి దిగారు.
  • నిఘా డొల్ల.. ఇళ్లు గుల్ల.. [ 15-04-2026] ఓ నిఘా నేత్రం వంద మంది పోలీసులతో సమానం. నేరాల కట్టడి, నిందితుల గుర్తింపు, దర్యాప్తులో అవి కీలక పాత్ర పోషిస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక పోలీసు శాఖ ప్రభుత్వ, ప్రైవేటు, సామూహికంగా కాలనీల్లో ఏర్పాటు చేసింది.
  • భూగర్భ జలం .. పాతాళం! [ 15-04-2026] వేసవి తీవ్రతతో ఎండలు మండుతున్నాయి. పెరిగిన ఉష్ణోగ్రతలతో భూగర్భ జలమట్టాలు అడుగంటిపోతున్నాయి. బావుల్లో ఇప్పటికే ఊట ఆగిపోయింది.
  • రూ.లక్షలు వెచ్చించినా.. నిరుపయోగమే! [ 15-04-2026] భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వీధి వ్యాపారుల కోసం ప్రత్యేకంగా షెడ్లు నిర్మించింది. చిరు వ్యాపారుల అభివృద్ధికి రూ.లక్షలు వెచ్చించింది. అయితే ప్రభుత్వం నిర్మించిన షెడ్లను వ్యాపారులు వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు.
  • తనిఖీలు చేస్తూ.. లైసెన్సులు సస్పెండ్‌ చేస్తూ! [ 15-04-2026] జిల్లాలోని ఔషధ దుకాణాల్లో గత కొద్ది నెలలుగా ఔషధ నియంత్రణ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు.
  • వనదేవతలకు పూజా మందిరాల నిర్మాణమెప్పుడో? [ 15-04-2026] మేడారం మహాజాతర.. దేశంలోనే పెద్ద జాతర. ఇక్కడికి వచ్చిన భక్తులు గద్దెల ప్రాంగణంలో సమ్మక్క, సారలమ్మలకు పూజలు చేయడం ఆనవాయితీ. మేడారంలో సమ్మక్కకు, కన్నెపల్లిలో సారలమ్మకు పూజా మందిరాలు కూడా ఉన్నాయి.
  • అటకెక్కిన ‘గిరి వికాసం’.. అడవి బిడ్డల విలాపం [ 15-04-2026] గిరిజనుల అభ్యున్నతికి ప్రభుత్వాలు అమలు చేస్తున్న సాగునీటి పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. పోడు భూముల్లో పంటల సాగుకు నీటి వనరులు లేక గిరిజన రైతులు ఆందోళన చెందుతున్నారు.
  • చెదిరిన చెక్‌డ్యాంలు [ 15-04-2026] రైతులకు సాగునీటి కష్టాలు తీర్చాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం నిర్మించిన చెక్‌డ్యాంలు ఆనవాళ్లు కోల్పోయాయి. దీంతో వాటిపై ఆధారపడ్డ పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
  • అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై ఘోర ప్రమాదం [ 15-04-2026] అవుటర్‌ రింగ్‌ రోడ్డులో నీటి ట్యాంకర్‌ను కారు ఢీకొట్టడంతో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సహా ఆయన రెండున్నరేళ్ల కుమారుడు మృత్యువాత పడగా.. భార్యతో పాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది.
  • నైపుణ్యం పెంపొందించి.. ఉద్యోగాలు కల్పిస్తూ.. [ 15-04-2026] యువతకు వృత్తిపరమైన నైపుణ్య శిక్షణ అందించి.. ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలనే లక్ష్యంతో.. కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్‌ పథకం (పీఎంఐఎస్‌)ను ప్రవేశపెట్టింది.
  • హస్తం నేతల హస్తిన బాట [ 15-04-2026] రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి గురువారం దిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా నుంచి హస్తం పార్టీ నేతలు.. ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో హాజరవ్వనున్నారు.
  • అర్హత లేని సహాయకులు [ 15-04-2026] కేంద్రం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన జనగణన కార్యక్రమంపై ఆరంభానికి ముందే పలు ఆరోపణలు వస్తున్నాయి.