చెంతనే ఐటీ సంస్థలు.. అందుకోండి అవకాశాలు!

- A
- A+
- A++

విశాఖలో త్వరలో గూగుల్ డేటా సెంటర్ అందుబాటులోకి రానుంది. వివిధ దిగ్గజ ఐటీ సంస్థలు నగరంలో కార్యకలాపాలు ప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు భవిష్యత్తు అవకాశాలపై దృష్టి సారించాలని ‘ఈవై గ్లోబల్ డెలివరీ సర్వీసెస్’ సంస్థ ఎగ్జిక్యూటివ్ లీడర్ శాంతా మహేశ్వరి సూచించారు. గీతం విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి హాజరైన ఆమె ‘ఈనాడు’తో మాట్లాడారు.
నైపుణ్యాలపై..:విశాఖ కేంద్రంగా గూగుల్ పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించింది. భవిష్యత్తులో మరిన్ని సంస్థలు వచ్చే సూచనలు ఉన్నాయి. పెద్ద ఎత్తున డేటా నిర్వహణ జరగనుంది. విద్యార్థులకు డేటా నిర్వహణ, క్లౌడ్ స్టోరేజ్, డేటా అనలిటిక్స్ తదితర అంశాల్లో అవకాశాలు ఉన్నాయి. వీటికి సంబంధించి ఇప్పటి నుంచే నైపుణ్యాలపై దృష్టి పెడితే మేలు. విశాఖ ప్రాంత విద్యార్థులు ఆ అవకాశాలను అందిపుచ్చు కునేందుకు సన్నద్ధం కావాలి.
అనుభవపూర్వకంగా:విద్యార్థులు ఎక్కువ శాతం అనుభవపూర్వకంగా నేర్చుకుంటారు. వారు కేవలం పాఠ్య పుస్తకాలకే పరిమితం కాకుండా.. ప్రయోగాలు, ప్రాజెక్టులు రూపొందించేలా ప్రోత్సహించాలి. కళాశాల స్థాయి నుంచే దీనిపై అవగాహన కల్పించాలి. పరిశ్రమల సందర్శన ద్వారా అక్కడేం జరుగుతుందో ముందుగానే తెలుసుకుని, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా సన్నద్ధమయ్యేందుకు వీలుంటుంది.
ఆవిష్కరణలపై ఆసక్తి:కొన్ని కళాశాలలు ఇన్నోవేషన్ సెంటర్స్, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, ఇంక్యుబేషన్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తున్నాయి. వాటికి భారీగా నిధులు ఖర్చు చేస్తున్నాయి. ప్రతి కళాశాలలోనూ వీలైనంత త్వరగా అలాంటి ఏర్పాట్లు చేయాలి. తద్వారా విద్యార్థులకు ఆవిష్కరణలపై ఆసక్తి పెరుగుతుంది. వారిలో ఆంత్రప్రెన్యూర్లుగా మారాలనే కుతూహలం మొదలవుతుంది.
కృత్యాలతో నేర్పేలా:పాఠశాలకు వెళ్లకముందు నుంచే చిన్నారులు చరవాణులు ఆపరేట్ చేస్తున్నారు. ఫోన్‌లో తమకు నచ్చిన కార్టూన్ వీడియోలు చూస్తున్నారు. ప్రతి అంశంలోనూ సాంకేతికత దాగి ఉంది. వీలైనంత త్వరగా చిన్నారులకు సాంకేతికతపై అవగాహన కల్పించాలి. సరదాగా కృత్యాలతో వాటిని నేర్పించడంపై దృష్టి పెట్టాలి.
మరింత లోతుగా నేర్చుకుంటే:సాంకేతికతను సరైన విధానంలో వినియోగిస్తే ప్రయోజనం చేకూరుతుంది. ఇంజినీరింగ్ విద్యార్థులు ప్రాథమిక అంశాలతోపాటు సాంకేతికత గురించి మరింత లోతుగా నేర్చుకోవాలి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా స్వదేశీ పరిజ్ఞానంతో ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలి. వాటిని ప్రపంచ దేశాలకు ఎగుమతి చేసేలా ప్రణాళికలు చేసుకోవాలి.
పాఠ్య ప్రణాళికల్లో మార్పులు:విశాఖ టెక్ హబ్‌గా అవతరించబోతుంది. పరిశ్రమల్లో రియల్‌టైమ్‌లో అనేక మార్పులు జరుగుతున్నాయి. నగర పరిసరాల్లోని కళాశాలలు, విద్యా సంస్థలు భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పాఠ్య ప్రణాళికను పునఃపరిశీలించి సవరణ చేయాలి. పాఠ్య ప్రణాళికలో సాంకేతికత అంశాలు చేర్చడంతోపాటు సివిల్, మెకానికల్ ఇలా అన్ని విభాగాల విద్యార్థులకు సాంకేతికతపై అవగాహన కల్పించాలి.
► Read latest Visakhapatnam Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 07:49 ISTగమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- రౌడీమూకల భరతం పడతాం : అనిత [ 15-04-2026] గంజాయి రవాణాకు ఆరు నెలల్లో అడ్డుకట్ట వేస్తామని హోం మంత్రి వంగలపూడి అనిత చెప్పారు.
- నడిపింది.. నారీ‘మణి’ [ 15-04-2026] జిల్లాలో తొలి మహిళా బస్ డ్రైవర్‌గా మద్దిల మణి రికార్డు నెలకొల్పారు. భారీ వాహనాలు నడపడంలో శిక్షణ పొందిన ఆమె ఎలమంచిలిలో కలెక్టర్ విజయకృష్ణన్ చేతులమీదుగా మంగళవారం ధ్రువపత్రాన్ని పొందారు.
- వెంటనే లాభాలు.. అలా ప్రలోభాలు!! [ 15-04-2026] సైబర్ మోసాల్లో రాష్ట్రంలో అత్యధిక బాధితులు విశాఖ వాసులే. ప్రతి రోజూ భారీగా డబ్బులు పోగొట్టుకుని స్టేషన్‌ల చుట్టూ తిరుగుతున్నారు.
- కీలక సమయం.. అంతా అయోమయం!! [ 15-04-2026] చందనోత్సవం నిర్వహణ ముందు ప్రభుత్వ యంత్రాంగం అనవసర ప్రయోగాలు చేస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తోంది.
- అగ్గి రేగింది.. బుగ్గి మిగిలింది..! [ 15-04-2026] ప్రమాదవశాత్తు చెలరేగిన మంటల్లో రూ.9.85 లక్షల నగదు కాలిబూడిదవడంతో బాధితులు గగ్గోలు పెడుతున్నారు.
- చెరువే కదా.. చెరిపేద్దాం పద! [ 15-04-2026] జిల్లాలో సాగునీటి చెరువులు, గెడ్డలు, వాగులను అక్రమార్కులు కమ్మేస్తున్నారు.
- జనం గుండెల్లో పేలుళ్లు!! [ 15-04-2026] ‘మాది కృష్ణాపురం గ్రామం. ఇప్పటికే కొన్ని క్రషర్ యూనిట్లు ఉన్నాయి.
- చూసొద్దామా.. దుర్గాగిరి! [ 15-04-2026] గాజువాక 71వ వార్డు శ్రీనగర్ దరి దుర్గానగర్ కొండపై దుర్గాదేవి ఆలయం ఉంది.
- విశాఖ విద్యార్థినికి అరుదైన అవకాశం [ 15-04-2026] ‘నారీ శక్తి వందన్ సమ్మేళనం’కు మద్దతివ్వడానికి నిర్వహించిన మహిళా యువజన పార్లమెంట్‌లో విశాఖ విద్యార్థిని జి రిషిక అబ్బురపరిచారు.
- ‘ఆన్‌లైన్‌లో టికెట్లు రాని భక్తులకు సొమ్ము చెల్లిస్తాం’ [ 15-04-2026] ఆన్‌లైన్‌లో నిజరూప దర్శనం టికెట్లు బుక్ చేసుకుని నగదు చెల్లింపు ప్రక్రియ పూర్తయినా టికెట్లు రాని భక్తులకు సంబంధిత మొత్తాన్ని తిరిగి భక్తుల ఖాతాల్లో జమ చేస్తామని సింహాచలం దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు హామీ ఇచ్చారు.
- రుచించని బెల్లం! [ 15-04-2026] జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన అనకాపల్లి బెల్లం మార్కెట్ కళ తప్పుతోంది. వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న మార్కెట్‌లో ముగిసిన సీజన్‌లో ఎన్నడూ లేనంత తక్కువ సరకు యార్డుకు వచ్చింది.
- వందేళ్ల కిలగాడ బడి.. కొత్త సందడి [ 15-04-2026] కిలగాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల స్థాపించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా గురువారం గ్రామంలో వందేళ్ల వేడుకలు నిర్వహిస్తున్నారు.
- నూకాలమ్మకి పట్టువస్త్రాల సమర్పించిన ఎంపీ సీఎం రమేష్ [ 14-04-2026] అనకాపల్లి నూకాలమ్మను ఎంపీ సీఎం రమేష్, ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ మంగళవారం రాత్రి దర్శించుకున్నారు.
- ఏఆర్సీలో సింహం మృతి [ 14-04-2026] విశాఖ ఏఆర్సీలో ఉన్న ‘లియా’ అనే ఏడేళ్ల మగ ఆసియాటిక్ సింహం మంగళవారం అనారోగ్యంతో మృతి చెందినట్లు జూ క్యూరేటర్ జి. మంగమ్మ తెలిపారు.
- అంబేడ్కర్ జయంతి సందర్భంగా యువకుల రక్తదానం [ 14-04-2026] అనకాపల్లి డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకల్లో భాగంగా యువకులు రక్తదానం చేశారు.
- సౌర శక్తిని సద్వినియోగం చేసుకోండి: స్పీకర్ అయ్యన్నపాత్రుడు [ 14-04-2026] సౌర శక్తి ద్వారా విద్యుత్ సమస్యను పరిష్కరించుకోగలమని సభాపతి అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు.
- పరిశోధన గని ‘క్వాంటమ్’! [ 14-04-2026] ‘క్వాంటమ్’ పరిశోధన రంగంలో నోబెల్ బహుమతి సాధించిన వారికి రూ.100 కోట్ల నజరానా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో ఈ రంగంలో పరిశోధనలు ఊపందుకుంటున్నాయి. పలు రంగాల్లో ఈ టెక్నాలజీ వినియోగించాలని యువ శాస్త్రవేత్తలు ఆసక్తి చూపుతున్నారు.
- చిన్నారుల గొంతెండుతోంది! [ 14-04-2026] అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలకు సరఫరా అయ్యే తాగునీటిని 15 రోజులకోసారి పరీక్షించాలి. సురక్షిత తాగునీరు అందేలా చర్యలు చేపట్టాలని ఐదు నెలల కిందట కలెక్టర్ విజయకృష్ణన్ పారిశుద్ధ్య మిషన్ జిల్లా కమిటీ సమావేశంలో అధికారుల బృందానికి ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి.
- సామాన్యులు, ప్రముఖులకు ఒకే విధమైన దర్శనాలు [ 14-04-2026] ఈ నెల 20న సింహాచలంలో జరిగే చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి విచ్చేసే సామాన్య భక్తులతో పాటు ప్రముఖులకు ఒకే విధమైన దర్శనాలు లభిస్తాయని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
- యోగా చేద్దాం.. రీల్స్ చేసేద్దాం [ 14-04-2026] నేటి యువత రీల్స్ చేయడమంటే ఎంతో ఆసక్తి కనబరుస్తోంది. ఉదయం నుంచి రాత్రి వరకు రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ప్రతిభను చాటుతున్నారు. కేంద్ర ప్రభుత్వం రీల్స్ చేసే వారికి శుభవార్త అందించింది.
- అడ్డే లేదంటూ.. అనుమతులెందుకంటూ!! [ 14-04-2026] జీవీఎంసీ పరిధిలో కొన్ని వార్డుల్లో అనుమతుల్లేని ‘అంతస్తులు’ పెరిగిపోతున్నాయి. వీటిపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే జీవీఎంసీ సిబ్బంది వెళ్లి అదనపు అంతస్తును కాస్త పగలగొట్టి వస్తున్నారు. వీరు వెళ్లిన వెంటనే యజమానులు మళ్లీ పని కానిచ్చేస్తున్నారు.
- ఆన్‌లైన్‌లో టికెట్లు... అంతులేని ఇక్కట్లు!! [ 14-04-2026] అప్పన్న స్వామి నిజరూపాన్ని కనులారా దర్శించుకోవాలన్న భక్తుల ఆశలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత నాలుగేళ్లుగా నిజరూప దర్శనం టికెట్ల విషయంలో నెలకొంటున్న గందరగోళం ఈసారి కూడా పునరావృతమైంది.
- ఆ రోజు రాత్రి ఏం జరిగింది? [ 14-04-2026] అచ్యుతాపురం కేజీబీవీ పాఠశాలలో 7వ తరగతి విద్యార్థిని మైలపల్లి నవ్య మృతిపై ఏర్పాటైన విచారణ కమిటీ నిజాలను నిగ్గు తేల్చే పనిలో నిమగ్నమైంది. కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశాలతో డీఈవో అప్పారావునాయుడు, ఎంఈవోలు ప్రసాద్,
- సోదరుడి పరామర్శకొచ్చి..తిరిగిరాని లోకాలకు.. [ 14-04-2026] ఆర్టీసీ బస్సు ఢీకొని ఆచార్యురాలు దుర్మరణం చెందిన ఘటన సోమవారం రామాటాకీస్ వద్ద చోటుచేసుకుంది. మూడో పట్టణ ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి..
- డివైడర్‌పైకి దూసుకెళ్లిన లారీ [ 14-04-2026] జాతీయ రహదారిపై నాతయ్యపాలెం కూడలి సమీపంలో సోమవారం ఉదయం ప్రమాదం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మాకవరపాలెం నుంచి షీలానగర్‌లోని ఓ ప్రైవేటు గోదాముకు లోడుతో వెళ్తున్న ట్రాలర్ లారీ నాతయ్యపాలెం వద్దకు వచ్చేసరికి బస్సును తప్పించే ప్రయత్నంలో డివైడర్‌పైకి దూసుకుపోయింది.
- ‘జీవీఎంసీ’కి ప్రైవేటు సలహాదారు! [ 14-04-2026] మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ)కి ఆదాయం పెంచేలా సలహాలిచ్చేందుకు ఓ ప్రైవేటు కన్సల్టెంట్ నియామకానికి అడుగులు పడ్డాయి. జీవీఎంసీ పాలకవర్గం దిగిపోయిన రోజుల వ్యవధిలోనే ప్రైవేటుగా ఆసక్తి ఉన్నవారి నుంచి టెండర్లు ఆహ్వానించడం గమనార్హం.