మద్యం స్కాంలో వాసుదేవరెడ్డి అరెస్టు

Eenadu icon
By Andhra Pradesh News Desk Updated : 22 Feb 2026 06:23 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, అమరావతి: జగన్‌ హయాంలో జరిగిన రూ.వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మొత్తం కుంభకోణంలో అన్నీ తానై ప్రధానపాత్ర పోషించిన రెండో నిందితుడు (ఏ-2), అప్పటి బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ డి.వాసుదేవరెడ్డిని సిట్‌ అధికారులు శనివారం మధ్యాహ్నం అరెస్టుచేశారు. ఈ కేసులో విచారణకు రావాలని ఈ నెల 9న సిట్‌ అధికారులు నోటీసులివ్వగా వాసుదేవరెడ్డి శనివారం ఉదయం హాజరయ్యారు. దర్యాప్తు బృందం ఎన్నిసార్లు ప్రశ్నించినా..  కుంభకోణంలోని కీలకాంశాలపై నోరు విప్పలేదు. విచారణకు సహకరించలేదు. దీంతో మధ్యాహ్నం 2 గంటల సమయంలో వాసుదేవరెడ్డిని అరెస్టు చేశారు. ఆయన వద్ద రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరుపరచగా న్యాయాధికారి భాస్కర్‌రావు ఈ నెల 27వ తేదీ వరకూ రిమాండ్‌ విధించారు. వాసుదేవరెడ్డిని గుంటూరు జిల్లా జైలుకు తరలించారు. వాసుదేవరెడ్డి ఈ కేసులో అప్రూవర్‌గా మారతారని మొదట్లో ప్రచారం జరిగింది. దర్యాప్తు అధికారులకు ఆయన సహకరించలేదు. పైగా ఆ ముసుగులో ముందస్తు బెయిల్‌ పొందేందుకు యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైకాపా మద్యం ముఠా తరఫున అన్నీ తానై కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన వాసుదేవరెడ్డిని  సిట్‌ ఎట్టకేలకు అరెస్టు చేసింది. 

వాళ్ల సహకారం లేనిదే ఇంత అవినీతి సాధ్యం కాదు:‘బ్యూరోక్రాట్లు, రాజకీయ పలుకుబడితో ఉన్నత హోదాలు అనుభవించేవారు, తుది నిర్ణయాలు తీసుకునేవారి మధ్య నేరపూరిత కుట్ర, సహకారం, కుమ్మక్కు లేకుండా మద్యం కుంభకోణంలో రూ.3,500 కోట్ల భారీ అవినీతి సాధ్యం. ఇదేమీ చిన్న కేసు కాదు. సంబంధమున్న బ్యూరోక్రాట్లను అరెస్టు చేయకపోవటం దురదృష్టకరం. వారి పాత్ర లోతుగా ఉన్నా తప్పించుకున్నారేమో! బ్యూరోక్రాట్ల నేరపూరిత కుట్ర, కుమ్మక్కు లేకుండా ఇంతటి భారీ అవినీతి ఎలా సాధ్యం? రాజకీయ పక్షపాతంతో ఉన్నత స్థానాలు అనుభవిస్తున్నవారే తుది నిర్ణయాలు తీసుకునేవారికి సహకరిస్తున్నారు’ అంటూ సుప్రీంకోర్టు ఇటీవల తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రధాన నిందితుడు రాజ్‌ కెసిరెడ్డికి బెయిల్‌ను తిరస్కరిస్తూ ఈ మాటలు చెప్పింది. వాసుదేవరెడ్డిని అరెస్టు చేయలేదనే ప్రస్తావన వచ్చినప్పుడు ఈ నెల 5న సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

‘మద్యం కుంభకోణం శరీరమైతే వాసుదేవరెడ్డి దానికి తలలాంటి వారు. తల తీసేస్తే శరీరం మొత్తం కుప్పకూలిపోతుంది. ట్రంకు పెట్టెల కొద్దీ సాక్ష్యాధారాలు ఉన్నప్పుడు అతన్ని అప్రూవర్‌గా మార్చాల్సిన అవసరం లేదు. ముందస్తు బెయిల్‌ ఇస్తే తప్ప అప్రూవర్‌గా మారబోమనేలా కోర్టుతో బేరమాడుతున్నట్లు వాసుదేవరెడ్డి వ్యవహారశైలి ఉంది. రూ.3,500 కోట్ల ముడుపులు చేతులు మారిన ఇలాంటి తీవ్రమైన కేసులో ఆయనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వలేము’ అంటూ కొన్ని నెలల కిందటే ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. దీంతో వాసుదేవరెడ్డి హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం ఆ పిటిషన్‌ అక్కడ పెండింగ్‌లో ఉంది.

గుంటూరు జైలుకు తరలింపు

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే: వాసుదేవరెడ్డిని పోలీసులు శనివారం రాత్రి 8.55 గంటలకు గుంటూరు జిల్లా జైలుకు తరలించారు.

► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 05:15 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పీఏసీఎస్‌ ఉద్యోగుల జీతాలు 20% పెంపు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఉద్యోగులకు 20% మేర జీతాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచనుంది.
  • అఖిలభారత పోలీసు సౌత్‌జోన్‌ టీ-20 విజేత పుదుచ్చేరి అఖిలభారత పోలీసు సౌత్‌జోన్‌ టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా పుదుచ్చేరి పోలీసు జట్టు నిలిచింది. అండమాన్‌-నికోబార్‌ దీవుల జట్టు రన్నరప్‌గా మిగిలింది.
  • ప్రతిరోజూ పరీక్ష అన్నట్లు సిద్ధమవ్వాలి ప్రతిరోజూ పరీక్ష అనే స్పృహతో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సన్నద్ధమై అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా అంశాన్ని సభలో ఒకసారి సమర్థంగా ప్రజంట్‌ చేయగలిగితే అది ఏడాదిపాటు ఇంంటింటికీ తిరిగి చెప్పేదానికి సమానంగా ఉంటుందన్నారు.
  • నెయ్యి కల్తీతో ప్రజావిశ్వాసంపై ప్రతికూల ప్రభావం తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
  • జగనన్న లేఔట్లలో రూ.7 వేల కోట్ల కుంభకోణం పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న లేఔట్లలో రూ.7వేల కోట్ల కుంభకోణం జరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు.
  • ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా విశాఖ విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సీఆర్‌జడ్‌ నిబంధనల్లో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు.
  • మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
  • బడ్జెట్‌ డిమాండ్లపై శాసనసభలో నేడు చర్చ పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాజీవ్‌ గృహకల్ప, వాంబే హౌసింగ్‌ కాలనీల్లోని ఇళ్లకు మరమ్మతులు, అనంతపురంలో టెక్ట్స్‌టైల్‌ పార్క్, యువత కోసం...
  • జగన్‌ను విచారిస్తే అసలు నిజాలు బయటకొస్తాయి కల్తీనెయ్యిపై సిట్‌ విచారణ పూర్తిస్థాయిలో జరగలేదని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని, మాజీ సీఎం జగన్‌ను విచారిస్తేనే అసలు నిజాలు బయటికొస్తాయని తెదేపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
  • వడగాలులు.. జనం బెంబేలు! వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
  • చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సువర్ణరాజు అనుబంధ పిటిషన్ల కొట్టివేత మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌(ఏ-3)లకు ముందస్తు బెయిలు..
  • పట్టిసీమ జలాలు ఎలా లెక్కలోకి తీసుకుంటారు? ‘పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తీసుకున్న జలాలను కృష్ణాడెల్టా నీటి అవసరాలకు కలిపి లెక్కించడం సాధ్యం కాదు. అది కేవలం వరద జలాల ఆధారిత ఎత్తిపోతల పథకం.
  • నకిలీ పత్రాలతో భూ కబ్జా చేశారు ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమ భూమి కబ్జా చేసినవారిపై అధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన నూర్జహాన్‌ వాపోయారు.
  • జగన్‌ కంపెనీల్లా హెరిటేజ్‌ అక్రమంగా పుట్టింది కాదు: ఎంపీ కలిశెట్టి కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన జగన్‌ అండ్‌ కో హెరిటేజ్‌ సంస్థపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు.
  • సునీల్‌నాయక్‌ను తీసుకొచ్చేవరకూ పట్నాలోనే.. బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి ఎం.సునీల్‌నాయక్‌ను మళ్లీ అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించే వరకూ పట్నాలోనే ఉండాలని దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నేతృత్వంలోని బృందం నిర్ణయించుకుంది.
  • 7.85 లక్షల ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ ఫ్రీహోల్డ్‌ భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం) కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు నిలిపేసిన 13.59 లక్షల ఎకరాల్లో.. 7.85 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది.
  • చిట్టి బుర్రలు.. వినూత్న ఆవిష్కరణలు పిల్లల ఆలోచనలు మెరిశాయి. వినూత్న ఆవిష్కరణల్లో విరిశాయి. నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాల దిశగా ఆలోచనలకు పురికొల్పాయి.
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • బాధితులకు చెన్నై, ముంబై నుంచి మందులు రాజమహేంద్రవరంలో కల్తీపాలు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల కిడ్నీల పనితీరు త్వరగా మెరుగుపడేందుకు అవసరమైన మందులు చెన్నై, ముంబై నుంచి తెప్పిస్తున్నామని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు.
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయని కేంద్ర హోంశాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.