అనంతబాబుతో అంటకాగిన ఖాకీలపై వేటు!

- A
- A+
- A++

ఈనాడు, కాకినాడ: కాకినాడకు చెందిన దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం హత్యకేసులో ప్రధాన నిందితుడు, వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు అనుకూలంగా వ్యవహరించిన నాటి పోలీసు అధికారులపై సస్పెన్షన్ వేటు పడింది. నాడు నిందితునితో పోలీసులు కుమ్మక్కైనట్లు కనిపిస్తోందని, వారిపై ఇప్పటి ప్రభుత్వమైనా చర్యలెందుకు తీసుకోలేదని సుప్రీంకోర్టు ఘాటువ్యాఖ్యలు చేయడంతో ఉన్నతాధికారులు స్పందించారు. ఈ కేసులో పరిపాలన, పర్యవేక్షణ లోపాలకు బాధ్యులుగా పేర్కొంటూ నాడు డీఎస్పీలుగా పనిచేసిన వి.భీమారావు, పి.మురళీకృష్ణారెడ్డి, సీఐ ఆకుల మురళీకృష్ణ, ఎస్.ఐ ఎన్.సతీష్‌బాబును సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీచేశారు. వీరిపై శాఖాపరమైన విచారణ చేపట్టాలని ఆదేశించారు.
నాటి కేసులో ఎవరి పాత్ర ఏమిటంటే..
రక్తపు మరకలున్నా అనుమానాస్పద మృతిగానే:సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినా, మృతుని కుటుంబసభ్యులు హత్యచేసి ఉంటారని ఫిర్యాదు చేసినా ఎస్.ఐ సతీష్‌బాబు (ఇప్పుడు కాకినాడ పోర్టుస్టేషన్ ఎస్.ఐ) పట్టించుకోలేదు. అనుమానాస్పద మృతి కింద ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.
నిందితుడిని స్వేచ్ఛగా తిరగనిచ్చారు:నాడు డీఎస్పీ వి.భీమారావు (ఇప్పుడు భీమవరం అదనపు ఎస్పీ).. నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకోకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి, సాక్షులను అనంతబాబు బెదిరించడానికి అవకాశం ఇచ్చారు. మూడురోజుల తర్వాత మృతుని బంధువులు, ఎస్సీ సంఘాల ఒత్తిళ్లతో అరెస్టు చూపించారు.
సీసీ కెమెరాల పుటేజీలు మాయం:సీఐ ఆకుల మురళీకృష్ణ (ప్రస్తుతం కోనసీమ జిల్లా డీసీఆర్బీలో సీఐ) నిందితునికి అనుకూలంగా సీసీ కెమెరాల్లో పుటేజీలు మాయం చేయడానికి సాయం చేశారనే ఆరోపణలున్నాయి. అనంతబాబు నివాస పరిసరాల్లో సేకరించిన చాలా పుటేజీలను తప్పించారు. కొన్ని డిలీట్ చేయించినట్లు సమాచారం.
ఆర్‌ఎఫ్‌ఏఎస్‌లో నివేదిక లోపభూయిష్టంగా:మరో డీఎస్పీ పి.మురళీకృష్ణారెడ్డి (ప్రస్తుతం వీఆర్‌లో ఉన్నారు) సీసీ కెమెరాల పుటేజీని రీజనల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో విశ్లేషించాక లోపభూయిష్టంగా నివేదిక వచ్చేలా చూశారన్న ఆరోపణలున్నాయి. నిందితుని భార్య ఉన్న పుటేజీలను పక్కనపెట్టించి ఈ కేసులో వేరొకరు లేరని రెడ్‌విత్ 34 సెక్షన్‌ను తొలగించినట్లు సమాచారం.
‘అనంతబాబు గారు’ అంటూ:సుబ్రహ్మణ్యం మృతదేహంపై ఎర్రమట్టి, ఇసుక కనిపించినా అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబుకు పట్టలేదు. అపార్ట్‌మెంట్ గేటు దగ్గర ‘అనంతబాబు గారు’ క్షణికావేశంలో తోయడం వల్ల పడిపోయి చనిపోయాడని చెప్పుకొచ్చారు. రిమాండ్ రిపోర్టు, కోర్టుకు సమర్పించిన అరెస్టు సమాచారంలో అనంతబాబుకు నేరచరిత్ర లేదని చూపించారు. అతనిపై రౌడీషీట్ ఉండగా వైకాపా ప్రభుత్వం వచ్చాక తొలగించుకున్నారు. మరో 17 కేసులూ ఉన్నాయి. కొన్ని రుజువు కాలేదు, మరికొన్ని కొట్టేశారు.
మొత్తం వారి దర్శకత్వంలోనే..
కేసు విచారణ అప్పటి ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు, ఏలూరు ఐజీగా పనిచేసిన పాలరాజు పర్యవేక్షణలోనే సాగింది. అనంతబాబు హత్య చేసినట్లు ఎస్పీకి తెలిసినా రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం, శవపంచనామాను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. ఈ లొసుగులపై నివేదికను డీజీపీ కార్యాలయానికి పంపించారు.
దిల్లీలో అనంతబాబు
కేసు విచారణను నవంబరు 30లోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో అనంతబాబు శుక్రవారమే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దిల్లీలో ఉన్నట్లు ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. కేసు విషయమై న్యాయనిపుణులు, నేతలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన భార్య లక్ష్మీదుర్గ కొన్నిరోజులుగా పరారీలోనే ఉన్నారు. ఆమె హైకోర్టులో ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేశారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- పీఏసీఎస్ ఉద్యోగుల జీతాలు 20% పెంపు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్) ఉద్యోగులకు 20% మేర జీతాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచనుంది.
- అఖిలభారత పోలీసు సౌత్‌జోన్ టీ-20 విజేత పుదుచ్చేరి అఖిలభారత పోలీసు సౌత్‌జోన్ టీ-20 క్రికెట్ టోర్నమెంట్ విజేతగా పుదుచ్చేరి పోలీసు జట్టు నిలిచింది. అండమాన్-నికోబార్ దీవుల జట్టు రన్నరప్‌గా మిగిలింది.
- ప్రతిరోజూ పరీక్ష అన్నట్లు సిద్ధమవ్వాలి ప్రతిరోజూ పరీక్ష అనే స్పృహతో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సన్నద్ధమై అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా అంశాన్ని సభలో ఒకసారి సమర్థంగా ప్రజంట్ చేయగలిగితే అది ఏడాదిపాటు ఇంంటింటికీ తిరిగి చెప్పేదానికి సమానంగా ఉంటుందన్నారు.
- నెయ్యి కల్తీతో ప్రజావిశ్వాసంపై ప్రతికూల ప్రభావం తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
- జగనన్న లేఔట్లలో రూ.7 వేల కోట్ల కుంభకోణం పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న లేఔట్లలో రూ.7వేల కోట్ల కుంభకోణం జరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
- ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా విశాఖ విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సీఆర్‌జడ్ నిబంధనల్లో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
- మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
- బడ్జెట్ డిమాండ్లపై శాసనసభలో నేడు చర్చ పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాజీవ్ గృహకల్ప, వాంబే హౌసింగ్ కాలనీల్లోని ఇళ్లకు మరమ్మతులు, అనంతపురంలో టెక్ట్స్‌టైల్ పార్క్, యువత కోసం...
- జగన్‌ను విచారిస్తే అసలు నిజాలు బయటకొస్తాయి కల్తీనెయ్యిపై సిట్ విచారణ పూర్తిస్థాయిలో జరగలేదని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని, మాజీ సీఎం జగన్‌ను విచారిస్తేనే అసలు నిజాలు బయటికొస్తాయని తెదేపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
- వడగాలులు.. జనం బెంబేలు! వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
- చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సువర్ణరాజు అనుబంధ పిటిషన్ల కొట్టివేత మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్(ఏ-3)లకు ముందస్తు బెయిలు..
- పట్టిసీమ జలాలు ఎలా లెక్కలోకి తీసుకుంటారు? ‘పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తీసుకున్న జలాలను కృష్ణాడెల్టా నీటి అవసరాలకు కలిపి లెక్కించడం సాధ్యం కాదు. అది కేవలం వరద జలాల ఆధారిత ఎత్తిపోతల పథకం.
- నకిలీ పత్రాలతో భూ కబ్జా చేశారు ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమ భూమి కబ్జా చేసినవారిపై అధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన నూర్జహాన్ వాపోయారు.
- జగన్ కంపెనీల్లా హెరిటేజ్ అక్రమంగా పుట్టింది కాదు: ఎంపీ కలిశెట్టి కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన జగన్ అండ్ కో హెరిటేజ్ సంస్థపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు.
- సునీల్‌నాయక్‌ను తీసుకొచ్చేవరకూ పట్నాలోనే.. బిహార్ క్యాడర్ ఐపీఎస్ అధికారి ఎం.సునీల్‌నాయక్‌ను మళ్లీ అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించే వరకూ పట్నాలోనే ఉండాలని దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ నేతృత్వంలోని బృందం నిర్ణయించుకుంది.
- 7.85 లక్షల ఎకరాలకు ఫ్రీహోల్డ్ ఫ్రీహోల్డ్ భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం) కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు నిలిపేసిన 13.59 లక్షల ఎకరాల్లో.. 7.85 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది.
- చిట్టి బుర్రలు.. వినూత్న ఆవిష్కరణలు పిల్లల ఆలోచనలు మెరిశాయి. వినూత్న ఆవిష్కరణల్లో విరిశాయి. నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాల దిశగా ఆలోచనలకు పురికొల్పాయి.
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
- బాధితులకు చెన్నై, ముంబై నుంచి మందులు రాజమహేంద్రవరంలో కల్తీపాలు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల కిడ్నీల పనితీరు త్వరగా మెరుగుపడేందుకు అవసరమైన మందులు చెన్నై, ముంబై నుంచి తెప్పిస్తున్నామని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వీరపాండియన్ తెలిపారు.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయని కేంద్ర హోంశాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.