ప్రపంచంపై మళ్లీ పిడుగు

Eenadu icon
By International News Desk Updated : 22 Feb 2026 05:23 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

వాళ్లు మూర్ఖులు

‘సుప్రీం కోర్టు జడ్జీలు మూర్ఖులు.. పెంపుడు శునకాల్లాంటివారు. దేశానికి ఏది మంచో అది చేయలేని అసమర్థులు’

న్యూయార్క్, వాషింగ్టన్‌: సుంకాల విషయంలో సుప్రీం కోర్టు షాకిచ్చినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపై శుక్రవారం 10 శాతం సుంకాలను విధించిన ఆయన.. వాటిని 15 శాతానికి పెంచుతానని శనివారం ప్రకటించారు. భారత్‌కూ 15 శాతమే వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీం తీర్పు తర్వాత తనకున్న అధికారాలతో అన్ని దేశాలపై 10 శాతం సుంకాలను విధిస్తున్నట్లు శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి.. ఉత్తర్వులపై సంతకం చేశారు. ఈ నెల 24వ తేదీ నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒక రోజు తిరిగేసరికల్లా 10 శాతం కాదు.. 15 శాతం విధిస్తామని తన సోషల్‌ మీడియా వేదిక ట్రూత్‌ ద్వారా ఆయన ప్రకటించారు. ‘చట్టానికి నిలిచే విధంగానే 10 శాతం నుంచి 15 శాతానికి సుంకాలను పెంచుతాం. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా, పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా,  వివరంగా పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపై నిర్ణయానికి వచ్చాం’ అని ట్రంప్‌ ప్రకటించారు. 

‘అమెరికా అధ్యక్షుడు చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పడానికి అవకాశమివ్వండి. ప్రపంచ దేశాలపై విధించిన 10 శాతం సుంకాలను 15 శాతానికి పెంచుతాం. ప్రతీకార సుంకాల్లేకుండా ఎన్నో దశాబ్దాలుగా అమెరికాను దోచుకుంటున్న ఆయా దేశాలు ఇందులో ఉన్నాయి. చట్టానికి నిలిచేలా 15 శాతం స్థాయికి సుంకాలను తీసుకెళ్తాం’ అని ట్రంప్‌ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ప్రకటించారు. 

సుప్రీం తీర్పు తర్వాతా ఏమీ మారలేదని, భారతే తమకు సుంకాలను చెల్లిస్తుందని, తాము ఎటువంటి సుంకాలను ఆ దేశానికి చెల్లించబోమని ట్రంప్‌ స్పష్టం చేశారు. తొలుత 10 శాతం సుంకాలపై శ్వేత సౌధం విడుదల చేసిన ఫ్యాక్ట్‌షీట్‌లో.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే, భవిష్యత్తులో మరింత పకడ్బందీగా సుంకాలు విధించే అవకాశమున్న కొన్ని వస్తువులకు ఈ తాత్కాలిక సుంకాలు వర్తించబోవని పేర్కొంది. 

సుంకాలు వర్తించనివి..

  • కరెన్సీ, బులియన్, ఇంధనం, ఇంధన ఉత్పత్తుల్లో ఉపయోగించే కొన్ని ప్రత్యేక కీలక ఖనిజాలు, లోహాలు.
  • పెరిగే, తవ్వితీసే అవకాశం లేని సహజ వనరులు, ఎరువులు.
  • బీఫ్, టమాటా, నారింజ వంటి కొన్ని వ్యవసాయ ఉత్పత్తులు.
  • ఔషధాలు, వాటిలో వాడే దినుసులు.
  • కొన్ని ఎలక్ట్రానిక్‌ వస్తువులు.
  • వ్యక్తిగత వాహనాలు, తేలికపాటి ట్రక్కులు, మధ్య, భారీ శ్రేణి వాహనాలు, బస్సులు, వ్యక్తిగత వాహనాల విడి భాగాలు, కొన్ని విమాన విడిభాగాలు.

‘మోదీ తెలివైనవారు’

సుంకాలను విధిస్తానని హెచ్చరించి భారత్, పాకిస్థాన్‌ మధ్య యుద్ధాన్ని ఆపానని మరోసారి ట్రంప్‌ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో తనకు గొప్ప సంబంధాలున్నాయని తెలిపారు. ‘ఏమీ మారదు. భారత్‌ సుంకాలను చెల్లిస్తుంది. మేం చెల్లించం. భారత్‌ చేసుకున్న ఒప్పందమే అలాంటిది. ప్రధాని మోదీ గొప్ప జెంటిల్‌మన్‌. అమెరికా విషయంలో నేను వ్యతిరేకించే వారి కంటే ఆయన తెలివైనవారు. ఆయన మమ్మల్ని చీల్చి చెండాడుతున్నారు. దీంతో మేం ఒప్పందం చేసుకున్నాం. ఇది పారదర్శక ఒప్పందం. కానీ వారే సుంకాలు చెల్లించేలా ఒప్పందాన్ని కాస్త తిప్పాం. భారత్‌తో నా సంబంధాలు అద్భుతంగా ఉన్నాయి. మా విజ్ఞప్తితో రష్యా నుంచి చమురును ఆ దేశం నిలిపేస్తోంది’ అని ట్రంప్‌ పేర్కొన్నారు.

► Read latest World Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 22 Feb 2026 04:41 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • ఉగ్రవాదం ఎక్కడున్నా.. ప్రతిచోటా శాంతికి ముప్పే ఉగ్రభూతంపై ప్రపంచ దేశాలు ఉమ్మడిగా పోరాడాల్సిన ఆవశ్యకతను ప్రధాని మోదీ మరోసారి నొక్కిచెప్పారు. ఉగ్రవాదం ఎక్కడున్నా.. అది ప్రతిచోటా శాంతికి ముప్పుగా పరిణమిస్తుందన్నారు. గాజా శాంతి ప్రణాళికకు భారత్‌ తరఫున ఆయన విస్పష్ట మద్దతు ప్రకటించారు.
  • మళ్లీ గెలవబోతున్నాం ‘మనం గెలవబోతున్నాం.. మరింతగా గెలవబోతున్నాం.. ఎంతగా అంటే ప్రజలు ఇక చాలు.. ఇంత భారీ విజయాలను భరించలేకపోతున్నాం అధ్యక్షా అనేంతగా.. దీంతోపాటు ప్రపంచాన్ని కొత్త దారిలో పెట్టి దేశంలో ఉద్యోగ, తయారీ బూమ్‌ను తీసుకొచ్చాం’
  • తప్పే.. క్షమించండి ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై సిబ్బందితో బిల్‌ గేట్స్‌ సెక్స్‌ కుంభకోణంలో ప్రధాన నిందితుడైన జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో తన సంబంధాలపై సంస్థ సిబ్బందికి మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ క్షమాపణలు చెప్పారు.
  • చిన్నారి పేరుతో ట్రంప్‌ కొత్త బిల్లు అక్రమ చొరబాటుదారులకు వాణిజ్య డ్రైవింగ్‌ లైసెన్సులను ఏ రాష్ట్రమూ మంజూరు చేయకుండా నిరోధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కొత్త బిల్లును ప్రతిపాదించారు.
  • ఇరాన్‌పై తాజా ఆంక్షలు ఇరాన్‌పై మరోసారి అమెరికా ఆంక్షల కొరడా ఝళిపించింది. ఆ దేశ బాలిస్టిక్‌ క్షిపణుల కార్యక్రమానికి, డ్రోన్ల ఉత్పత్తికి సహకరిస్తున్న వ్యక్తులు, కంపెనీలపై ఈ ఆంక్షలను విధించింది.