విజయవాడలో 14 కి.మీ. ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 22 Feb 2026 05:26 IST Ee Font size
  • A
  • A+
  • A++
3 min read

ఈనాడు, అమరావతి: హైదరాబాద్‌-మచిలీపట్నం జాతీయ రహదారి.. విజయవాడ నగర పరిధిలో ఉన్నంత మేరకు, ఆ మార్గంలో ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించే ప్రతిపాదనను అధికారులు పరిశీలిస్తున్నారు. పండిట్‌ నెహ్రూ బస్టాండ్‌ సమీపంలోని రాజీవ్‌ పార్క్‌ వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్‌ నుంచి మచిలీపట్నం వైపు వెళ్లే మార్గంలోని గంగూరు కూడలి వరకు దాదాపు 14 కి.మీ. మేర ఆరు వరుసలతో ఈ పైవంతెన నిర్మించాలని యోచిస్తున్నారు. దీనివల్ల హైవేలో ప్రయాణించే వారికి ఏ ఆటంకాలూ ఉండవని, విజయవాడ నగర ట్రాఫిక్‌ కష్టాలు కూడా తీరుతాయని అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఎలా చేపట్టవచ్చన్న భిన్న ప్రణాళికలపై దిల్లీ స్థాయిలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) అధికారులు చర్చిస్తున్నారు.

మొత్తంగా ఆరు వరుసలతో ఉండేలా..

  • హైదరాబాద్‌-విజయవాడ-మచిలీపట్నం హైవే-65.. విజయవాడ పరిధిలో ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, భవానీపురం, కనకదుర్గ ఫ్లైఓవర్, కృష్ణలంక, వారధి జంక్షన్, బెంజ్‌ సర్కిల్, ఆటోనగర్‌ గేట్, కానూరు, పోరంకి, పెనమలూరు మీదుగా వెళ్తుంది.
  • ప్రస్తుతం హైదరాబాద్‌-విజయవాడ మధ్య హైవేను ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌ చేపట్టారు. దీన్ని గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్‌ క్రాస్‌ అయ్యే పాయింట్‌ వరకే విస్తరించాలని తొలుత భావించారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి వల్ల భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్‌ దాకా విస్తరించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ సమ్మతించింది. ఈ మేరకు డీపీఆర్‌ సిద్ధమవుతోంది. 
  • మరోవైపు విజయవాడ-మచిలీపట్నం హైవేను ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌ కూడా చేపడుతున్నారు. దావులూరు టోల్‌ప్లాజా సమీపంలో ఔటర్‌ రింగ్‌రోడ్‌ క్రాస్‌ అయ్యే చోటు నుంచి మచిలీపట్నం వరకు ఆరు వరుసలుగా విస్తరించనున్నారు.
  • దీంతో విజయవాడ నగర పరిధిలో కనకదుర్గ ఫ్లైఓవర్‌ తర్వాతి నుంచి కృష్ణలంక, వారధి జంక్షన్, స్క్రూబ్రిడ్జి, బెంజ్‌ సర్కిల్‌ వరకు, అక్కడి నుంచి మచిలీపట్నం వైపు కానూరు, పోరంకి, పెనమలూరు, గంగూరు, కంకిపాడు మీదుగా దావులూరు టోల్‌ప్లాజా వరకు నాలుగు వరుసలుగానే ఈ హైవే మిగిలిపోనుంది.
  • ఇటీవల ఎన్‌హెచ్‌ఏఐ ఉన్నతాధికారుల సమావేశంలో ఈ అంశం చర్చకు వచ్చింది. విజయవాడకు ఇరువైపులా ఆరు వరుసలుగా విస్తరించి, వాహన రద్దీ ఎక్కువగా ఉండే నగరం మధ్యలో మాత్రం నాలుగు వరుసలుగా మిగిలిపోతే ఎలాగన్న ప్రశ్న తలెత్తింది. దీనికి నగరంలో ఆరు వరుసలతో ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిర్మించడమే పరిష్కారమన్న అంచనాకు వచ్చారు. తద్వారా కనకదుర్గ ఫ్లైఓవర్‌ నుంచి గంగూరు కూడలి వరకు ఆరు వరుసలతో ఎలివేటెడ్‌ వంతెన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

ఒకటా? రెండా?

  • ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి బెజవాడ నగర పరిధిలో పెద్దగా భూసేకరణ అవసరం ఉండదు. వివిధ కూడళ్ల వద్ద వంతెనపైకి వెళ్లేందుకు (ఎంట్రీ), బయటకు వచ్చేందుకు (ఎగ్జిట్‌) నిర్మించే అప్రోచ్‌లకు మాత్రం భూమిని సేకరించాల్సి ఉంటుంది.
  • అయితే మొత్తంగా 14 కి.మీ. పొడవునా ఒకే వంతెన నిర్మించాలా, లేక రెండు భాగాలుగా విభజించాలా అన్న చర్చ నడుస్తోంది. మొత్తం ఒకే వంతెన నిర్మించాలంటే మధ్యలో బెంజ్‌ సర్కిల్‌ వద్ద ఇప్పటికే రెండు వంతెనలు ఉండటంతో, వాటిపై నుంచి బందరు వైపు మలుపు తిరిగేలా ఎలివేటెడ్‌ ఫ్లైఓవర్‌ డిజైన్‌ చేయాల్సి ఉంటుంది.
  • దీనికి బదులు కనకదుర్గ వారధి నుంచి కృష్ణలంక, వారధి కూడలి మీదుగా బెంజ్‌ సర్కిల్‌ సమీపం వరకు 5 కి.మీ. ఒక ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్, బెంజ్‌ సర్కిల్‌ నుంచి గంగూరు కూడలి వరకు 9 కి.మీ. మరో ఫ్లై ఓవర్‌ నిర్మిస్తే ఎలా ఉంటుందనేది పరిశీలించనున్నారు. ఒకట్రెండు వారాల్లో దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు.
  • మొత్తంగా హైదరాబాద్‌-విజయవాడ మధ్య, విజయవాడ-మచిలీపట్నం మధ్య హైవే విస్తరణ పేరిట ఒకే హైవేపై రెండు ప్రాజెక్టులకు డీపీఆర్‌ తయారు చేస్తున్నారు. అందులోనే ఈ ఎలివేటెడ్‌ ఫ్లై ఓవర్‌ను కూడా చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు.
► Read latest Andhra pradesh Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పీఏసీఎస్‌ ఉద్యోగుల జీతాలు 20% పెంపు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌) ఉద్యోగులకు 20% మేర జీతాల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గ్రాట్యుటీ రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షలకు పెంచనుంది.
  • అఖిలభారత పోలీసు సౌత్‌జోన్‌ టీ-20 విజేత పుదుచ్చేరి అఖిలభారత పోలీసు సౌత్‌జోన్‌ టీ-20 క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతగా పుదుచ్చేరి పోలీసు జట్టు నిలిచింది. అండమాన్‌-నికోబార్‌ దీవుల జట్టు రన్నరప్‌గా మిగిలింది.
  • ప్రతిరోజూ పరీక్ష అన్నట్లు సిద్ధమవ్వాలి ప్రతిరోజూ పరీక్ష అనే స్పృహతో మంత్రులు, ఎమ్మెల్యేలు పూర్తిస్థాయిలో సన్నద్ధమై అసెంబ్లీకి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఏదైనా అంశాన్ని సభలో ఒకసారి సమర్థంగా ప్రజంట్‌ చేయగలిగితే అది ఏడాదిపాటు ఇంంటింటికీ తిరిగి చెప్పేదానికి సమానంగా ఉంటుందన్నారు.
  • నెయ్యి కల్తీతో ప్రజావిశ్వాసంపై ప్రతికూల ప్రభావం తిరుమల లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరా అయిన వ్యవహారంపై తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) దిద్దుబాటు చర్యలు ప్రారంభించిందని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు.
  • జగనన్న లేఔట్లలో రూ.7 వేల కోట్ల కుంభకోణం పేదలకు ఇళ్లస్థలాల పేరుతో వైకాపా ప్రభుత్వంలో చేపట్టిన జగనన్న లేఔట్లలో రూ.7వేల కోట్ల కుంభకోణం జరిగిందని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ వెల్లడించారు.
  • ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా విశాఖ విశాఖ తీరంలో పర్యాటక ప్రాజెక్టుల నిర్వహణకు అవరోధంగా ఉన్న సీఆర్‌జడ్‌ నిబంధనల్లో సడలింపుల కోసం కేంద్రాన్ని సంప్రదిస్తున్నామని పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు.
  • మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యం కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఈ మేరకు మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
  • బడ్జెట్‌ డిమాండ్లపై శాసనసభలో నేడు చర్చ పొరుగుసేవల ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, రాజీవ్‌ గృహకల్ప, వాంబే హౌసింగ్‌ కాలనీల్లోని ఇళ్లకు మరమ్మతులు, అనంతపురంలో టెక్ట్స్‌టైల్‌ పార్క్, యువత కోసం...
  • జగన్‌ను విచారిస్తే అసలు నిజాలు బయటకొస్తాయి కల్తీనెయ్యిపై సిట్‌ విచారణ పూర్తిస్థాయిలో జరగలేదని, దీనిపై సమగ్ర విచారణ జరగాలని, మాజీ సీఎం జగన్‌ను విచారిస్తేనే అసలు నిజాలు బయటికొస్తాయని తెదేపా ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.
  • వడగాలులు.. జనం బెంబేలు! వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు, వడగాలులు ప్రజలను ఆందోళనకు గురిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజారోగ్యంపై వడగాలులు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
  • చెవిరెడ్డి భాస్కరరెడ్డి, సువర్ణరాజు అనుబంధ పిటిషన్ల కొట్టివేత మద్యం కుంభకోణం కేసులో నిందితులు, ఏపీ బెవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ పూర్వ ఎండీ వాసుదేవరెడ్డి(ఏ-2), ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక అధికారి దొడ్డా వెంకట సత్యప్రసాద్‌(ఏ-3)లకు ముందస్తు బెయిలు..
  • పట్టిసీమ జలాలు ఎలా లెక్కలోకి తీసుకుంటారు? ‘పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా తీసుకున్న జలాలను కృష్ణాడెల్టా నీటి అవసరాలకు కలిపి లెక్కించడం సాధ్యం కాదు. అది కేవలం వరద జలాల ఆధారిత ఎత్తిపోతల పథకం.
  • నకిలీ పత్రాలతో భూ కబ్జా చేశారు ఫోర్జరీ డాక్యుమెంట్లతో తమ భూమి కబ్జా చేసినవారిపై అధికారులకు ఫిర్యాదుచేసినా చర్యలు తీసుకోలేదని నంద్యాల జిల్లా బండి ఆత్మకూరుకు చెందిన నూర్జహాన్‌ వాపోయారు.
  • జగన్‌ కంపెనీల్లా హెరిటేజ్‌ అక్రమంగా పుట్టింది కాదు: ఎంపీ కలిశెట్టి కల్తీ నెయ్యి వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన జగన్‌ అండ్‌ కో హెరిటేజ్‌ సంస్థపై ఆరోపణలు చేయడం వారి దిగజారుడుతనానికి నిదర్శనమని తెదేపా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆరోపించారు.
  • సునీల్‌నాయక్‌ను తీసుకొచ్చేవరకూ పట్నాలోనే.. బిహార్‌ క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి ఎం.సునీల్‌నాయక్‌ను మళ్లీ అరెస్టు చేసి, ఆంధ్రప్రదేశ్‌కు తరలించే వరకూ పట్నాలోనే ఉండాలని దర్యాప్తు అధికారి, విజయనగరం ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ నేతృత్వంలోని బృందం నిర్ణయించుకుంది.
  • 7.85 లక్షల ఎకరాలకు ఫ్రీహోల్డ్‌ ఫ్రీహోల్డ్‌ భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం (జీవోఎం) కీలక నిర్ణయం తీసుకుంది. రిజిస్ట్రేషన్లు నిలిపేసిన 13.59 లక్షల ఎకరాల్లో.. 7.85 లక్షల ఎకరాలకు విముక్తి కల్పించాలని నిర్ణయించింది.
  • చిట్టి బుర్రలు.. వినూత్న ఆవిష్కరణలు పిల్లల ఆలోచనలు మెరిశాయి. వినూత్న ఆవిష్కరణల్లో విరిశాయి. నిత్యజీవితంలో మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాల దిశగా ఆలోచనలకు పురికొల్పాయి.
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై హైకోర్టు ఆగ్రహం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) విజయానంద్‌పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
  • బాధితులకు చెన్నై, ముంబై నుంచి మందులు రాజమహేంద్రవరంలో కల్తీపాలు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధితుల కిడ్నీల పనితీరు త్వరగా మెరుగుపడేందుకు అవసరమైన మందులు చెన్నై, ముంబై నుంచి తెప్పిస్తున్నామని వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ వీరపాండియన్‌ తెలిపారు.
  • రాష్ట్రంలో శాంతిభద్రతలు గాడితప్పాయి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా గాడితప్పాయని కేంద్ర హోంశాఖ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు.