వాళ్ల కోసం.. జనపనారతో శానిటరీ ప్యాడ్స్!
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఖాళీగా ఉన్న బెంచీల్ని చూసి.. పిల్లల సంఖ్య తక్కువగా ఉందేమో అనుకుంటాం.. ఓసారి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను సందర్శించిన సృష్టి బోస్ కూడా ఇలాగే అనుకుంది....

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

(Photos : Instagram)
సాధారణంగా ప్రభుత్వ పాఠశాలల్లోని తరగతి గదుల్లో ఖాళీగా ఉన్న బెంచీల్ని చూసి.. పిల్లల సంఖ్య తక్కువగా ఉందేమో అనుకుంటాం.. ఓసారి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లను సందర్శించిన సృష్టి బోస్ కూడా ఇలాగే అనుకుంది. అందులోనూ కొన్ని పాఠశాలల్లో బాలికల సంఖ్య మరీ తక్కువగా ఉండడం చూసి ఆశ్చర్యపోయింది. కానీ దీనంతటికీ కారణం నెలసరే అని ఆ తర్వాత తెలుసుకుందామె. పిరియడ్స్ వల్లే అక్కడి అమ్మాయిలు స్కూల్ మానేస్తున్నారన్న అసలు నిజం తెలుసుకున్నాక.. ఈ సమస్యకు ఎలాగైనా పరిష్కారం చూపాలనుకుంది. ఈ ఆలోచనతోనే ఓ ప్రత్యేక ప్రాజెక్ట్‌ని ప్రారంభించింది. ప్రస్తుతం దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని బాలికలు, మహిళలకు నెలసరిపై అవగాహన కల్పిస్తూనే.. వారి కోసం పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్లు తయారుచేస్తోంది. తన ప్రాజెక్ట్‌ని దేశవ్యాప్తంగా విస్తరించి.. ఈ సమాజం నుంచి నెలసరి అపోహల్ని పూర్తిగా తొలగించడమే తన లక్ష్యమంటోన్న సృష్టి స్ఫూర్తి కథ ఇది!

ఆ నిజం తెలిశాక..!
బెంగళూరుకు చెందిన 19 ఏళ్ల సృష్టి ప్రస్తుతం అక్కడి ‘మణిపాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. తనకు చిన్నతనం నుంచి సామాజిక సమస్యల గురించి తెలుసుకోవడం, వాటికి తగిన పరిష్కార మార్గాలు ఆలోచించడం అలవాటు. అంతేకాదు.. వివిధ వస్తువులు సేకరిస్తూ వాటిని తోటి పిల్లలకు పంచి పెట్టేది. అందుకోసం ఓసారి తాను స్కూల్లో ఉన్నప్పుడు అక్కడి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లింది సృష్టి. ఈ క్రమంలోనే కొన్ని తరగతుల్లో బాలికల సంఖ్య చాలా తక్కువగా ఉండడం గమనించింది.
‘తొలుత విద్యార్థుల సంఖ్యే తక్కువగా ఉందేమో అనుకున్నా. కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్‌ని కలిశాక అసలు విషయం తెలిసింది. బాలికలు తమ నెలసరి సమయంలో స్కూల్ మానేస్తున్నారని తెలుసుకున్నా. వారికి పిరియడ్స్‌పై పూర్తి అవగాహన లేకపోవడం వల్లే ఇలా చేస్తున్నట్లు గ్రహించా. అందుకే వీటిపై ఉన్న అపోహల్ని తొలగించి అవగాహన కల్పించాలనుకున్నా. ఈ ఆలోచనతోనే ‘ప్రాజెక్ట్ ఎకోశానిటేషన్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించా..’ అంటోంది సృష్టి.

11 నెలల్లో.. ఏడు రాష్ట్రాల్లో..!
గతేడాది మార్చిలో ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించిన సృష్టి.. ఈ వేదికగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, స్కూలుకెళ్లే బాలికల్లో నెలసరిపై పూర్తి అవగాహన పెంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం అక్కడి ప్రభుత్వ పాఠశాలలు, కమ్యూనిటీల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, వర్క్‌షాప్స్ నిర్వహిస్తోంది.
‘మాది ఉన్నత విద్యావంతుల కుటుంబం. అమ్మానాన్నలిద్దరూ ఉద్యోగాలు చేస్తున్నారు. నెలసరికి సంబంధించిన విషయాల గురించీ మా ఇంట్లో బహిరంగంగా మాట్లాడుకుంటాం. దాంతో ఇది సర్వసాధారణమైన అంశంగా అనిపిస్తుంటుంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు ఇందుకు భిన్నం. ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో నెలసరి గురించి బయటికి మాట్లాడడం పెద్ద తప్పుగా భావిస్తున్నారు. ఈ అపోహల్ని తొలగిస్తూనే పిరియడ్స్ మన జీవితంలో ఓ భాగం అని చెప్పడమే నా ప్రాజెక్ట్ ముఖ్యోద్దేశం. మొదట్లో నేనొక్కదాన్నే ఆయా స్కూళ్లకు వెళ్లి బాలికల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక తరగతులు నిర్వహించేదాన్ని. కానీ రోజులు గడిచే కొద్దీ నా తోటి విద్యార్థులు, స్నేహితులు కూడా నాతో చేతులు కలిపారు. ఇలా మేమంతా కొన్ని బృందాలుగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం.. ఈ 11 నెలల్లో కర్ణాటక వ్యాప్తంగానే కాదు.. బిహార్, జార్ఖండ్, రాజస్థాన్, తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమ బంగ.. మొత్తంగా ఏడు రాష్ట్రాల్లో మా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం..’ అని చెబుతోంది సృష్టి.

శ్యానిటరీ ప్యాడ్స్ కూడా..!
ఇందులో భాగంగా నెలసరి పరిశుభ్రత, ఈ సమయంలో పర్యావరణహిత శ్యానిటరీ ఉత్పత్తుల వినియోగం, శారీరక మార్పులు, ప్రత్యుత్పత్తి ఆరోగ్యం, పీసీఓఎస్.. వంటి ఎన్నో అంశాలపై బాలికలు, మహిళల్లో అవగాహన పెంచుతోంది సృష్టి. అంతేకాదు.. ఈ సెషన్స్‌లో అబ్బాయిల్నీ భాగం చేస్తూ నెలసరిని మరింత సర్వసాధారణం చేసేందుకు తన వంతుగా కృషి చేస్తోంది. తన ప్రాజెక్ట్‌లో భాగంగా పర్యావరణహిత శ్యానిటరీ న్యాప్‌కిన్ల తయారీని సైతం ప్రారంభించింది.
‘ప్రస్తుతం మా శ్యానిటరీ ప్యాడ్ నమూనా దశలో ఉంది. ప్యాడ్ పూర్తిగా తయారై.. ఆయా సర్టిఫికేషన్లు పొందాక తుది ఉత్పత్తిని త్వరలోనే మార్కెట్లోకి తీసుకొస్తాం. దీన్ని తక్కువ ధరకు విక్రయించడమే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, బాలికలకు ఉచితంగా అందించే ఏర్పాట్లూ చేస్తున్నా. ఆపై ఈ ప్రాజెక్ట్‌ని దేశవ్యాప్తం చేసి.. ఈ సమాజం నుంచి నెలసరి అపోహల్ని పూర్తిగా తొలగించడమే లక్ష్యంగా పెట్టుకున్నా..’ అంటోన్న సృష్టి.. తన ప్రాజెక్ట్ ద్వారా ఇప్పటి వరకు 350 మందికి పైగా అమ్మాయిల్లో స్ఫూర్తి నింపింది. తన ప్రాజెక్ట్‌కు ‘బీ విజనీర్స్ మెర్సిడెస్ బెంజ్ ఫెలోషిప్’ ద్వారా నిధులు అందుతున్నట్లు చెబుతోందీ యూత్ ఐకాన్.
English Translation
For them.. Jute sanitary pads!
Usually seeing the empty benches in the classrooms of government schools, we think that the number of children is less.. Srishti Bose, who once visited schools in rural areas, thought the same...

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

(Photos : Instagram)
Usually seeing the empty benches in the classrooms of government schools.. we think that the number of children is less.. Once Sri Bose visited schools in rural areas and thought the same. I was surprised to see that the number of girls in some schools was very less. But let's find out later if there is a reason for all this. After knowing the real truth that the girls there are dropping out of school because of periods, she wanted to find a solution to this problem. A special project was started with this idea. At present, while creating awareness about menstruation for girls and women in rural areas, environment-friendly sanitary napkins are being prepared for them. This is the story of a Srishti spirit whose aim is to spread his project all over the country.. to completely remove the monthly misconceptions from this society! Telishaka..!
19-year-old Srishti from Bangalore is currently studying in the second year of Computer Science Engineering at Manipal Institute of Technology. Since his childhood, he has a habit of knowing about social problems and thinking of suitable solutions for them. Not only that.. She used to collect various things and distribute them to fellow children. For that, Srishti once went to the government schools in the rural areas when she was in school. In this order, it was observed that the number of girls in some classes is very less.
'At first I thought the number of students was less. But after meeting the principal of that school, I got to know the truth. Knowing that girls are dropping out of school during their periods. Realize that they are doing this because they don't have full understanding of periods. That's why we want to remove the misconceptions about these and create awareness. It is with this idea that we started a special program called 'Project Ecosanitation'..' says Srishti.

In 11 months.. in seven states..!
Last year in March Srishti, who started the project, aims to raise full awareness of menstruation among women and school-going girls in rural areas through this platform. For this, special awareness programs and workshops are being organized in the government schools and communities there.
'We are a highly educated family. Both mother and father are working. We openly talk about monthly matters in our house. So it seems like a very common thing. But the situation in rural areas is different. It is still considered a big mistake in some areas to talk about monthly. The main aim of my project is to dispel these myths and tell that periods are a part of our life. Initially, I used to go to the respective schools and conduct special classes to raise awareness among girls. But as days went by my fellow students and friends also joined hands with me. In this way, we are all forming some groups and taking this program forward.. In these 11 months, not only in Karnataka.. Bihar, Jharkhand, Rajasthan, Telangana, Maharashtra, West Bengal.. in total we have organized our awareness programs in seven states..' says Srishti.

Sanitary pads too..!
As a part of this, awareness is being raised among girls and women about many issues such as monthly hygiene, use of eco-friendly sanitary products, physical changes, reproductive health, PCOS.. Moreover.. she is doing her best to make Nelasari more common by including boys in these sessions. As part of its project, it has also started manufacturing eco-friendly sanitary napkins.
'Currently our sanitary pad is in prototype stage. After the pad is completely made.. after getting the respective certifications, we will bring the final product to the market soon. Not only selling it at a low price, but also making arrangements to provide it free to women and girls in rural areas. And then this project will be made nationwide.. The aim is to completely remove the misconceptions of monthly from this society..' Antonna Srishti.. through her project till now she has inspired more than 350 girls. The youth icon says her project is being funded by 'Be Visionaries Mercedes-Benz Fellowship'.