Vikrant Massey: ‘రామాయణ’లో విక్రాంత్‌ మాస్సే?.. నటుడి రియాక్షన్‌ ఇదీ

Eenadu icon
By Entertainment Team Published : 08 Feb 2026 13:28 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌ డెస్క్‌: దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా ‘రామాయణ’ (Ramayana). ప్రధాన పాత్రల వివరాలను చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించగా.. ఇతర పాత్రలకు సంబంధించి రూమర్స్‌ వస్తూనే ఉన్నాయి. విభీషణుడిగా విజయ్‌ సేతుపతిని ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్‌ ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. మరో కీ రోల్‌ కోసం విక్రాంత్‌ మాస్సేను అనుకున్నారని, ఇప్పుడా ఆయన స్థానంలో రాఘవ్‌ జుయాల్‌ను తీసుకుంటున్నారంటూ ఓ మీడియా సంస్థ కథనం రాసింది. దానిపై విక్రాంత్‌  (Vikrant Massey) స్పందించారు. ఈ ప్రాజెక్టులో తానెప్పుడూ భాగం కాలేదన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఆపాలంటూ సదరు సంస్థకు విజ్ఞప్తి చేశారు. ‘రామాయణ’లో నటిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే విక్రాంత్‌ తొలగించడం గమనార్హం.

  • ‘రిటైర్మెంట్‌’ని తప్పుగా అర్థం చేసుకున్నారు: విక్రాంత్‌ మాస్సే

‘12th ఫెయిల్‌’తో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకున్న విక్రాంత్‌.. గతేడాది ‘ఆంఖోన్‌ కీ గుస్తాఖియాన్‌’తో ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నటించిన కొత్త సినిమాలు ‘ఓ రోమియో’, ‘ముసాఫిర్‌ కేఫ్‌’ (నేరుగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్‌) విడుదలకు సిద్ధమవుతున్నాయి. నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో రాముడి పాత్రలో రణ్‌బీర్‌ కపూర్‌ నటిస్తున్న విషయం విదితమే. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్‌, హనుమంతుడిగా సన్నీదేవోల్‌ నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్‌, లారాదత్తా తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.

► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :