Vikrant Massey: ‘రామాయణ’లో విక్రాంత్ మాస్సే?.. నటుడి రియాక్షన్ ఇదీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: దాదాపు రూ.4 వేల కోట్ల బడ్జెట్‌తో భారీ అంచనాల నడుమ రూపొందుతున్న సినిమా ‘రామాయణ’ (Ramayana). ప్రధాన పాత్రల వివరాలను చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించగా.. ఇతర పాత్రలకు సంబంధించి రూమర్స్ వస్తూనే ఉన్నాయి. విభీషణుడిగా విజయ్ సేతుపతిని ఎంపిక చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. మరో కీ రోల్ కోసం విక్రాంత్ మాస్సేను అనుకున్నారని, ఇప్పుడా ఆయన స్థానంలో రాఘవ్ జుయాల్‌ను తీసుకుంటున్నారంటూ ఓ మీడియా సంస్థ కథనం రాసింది. దానిపై విక్రాంత్ (Vikrant Massey) స్పందించారు. ఈ ప్రాజెక్టులో తానెప్పుడూ భాగం కాలేదన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలను ఆపాలంటూ సదరు సంస్థకు విజ్ఞప్తి చేశారు. ‘రామాయణ’లో నటిస్తున్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పోస్టు పెట్టిన కొద్దిసేపటికే విక్రాంత్ తొలగించడం గమనార్హం.
- ‘రిటైర్మెంట్’ని తప్పుగా అర్థం చేసుకున్నారు: విక్రాంత్ మాస్సే
‘12th ఫెయిల్’తో ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డు దక్కించుకున్న విక్రాంత్.. గతేడాది ‘ఆంఖోన్ కీ గుస్తాఖియాన్’తో ప్రేక్షకుల్ని అలరించారు. ఆయన నటించిన కొత్త సినిమాలు ‘ఓ రోమియో’, ‘ముసాఫిర్ కేఫ్’ (నేరుగా ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్) విడుదలకు సిద్ధమవుతున్నాయి. నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ‘రామాయణ’లో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తున్న విషయం విదితమే. సీతగా సాయి పల్లవి, రావణుడిగా యశ్, హనుమంతుడిగా సన్నీదేవోల్ నటిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌సింగ్, లారాదత్తా తదితరులు ఈ చిత్రంలో కనిపించనున్నారంటూ ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండో భాగం 2027 దీపావళికి విడుదల కానున్నాయి.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :English Translation
Vikrant Massey: Vikrant Massey in 'Ramayana'?.. This is the actor's reaction

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

Internet desk: about Rs.4 thousand crores The movie 'Ramayana' is being made amid huge expectations with a budget. While the film team has already announced the details of the main characters, rumors about other characters are still coming. It was recently rumored that the makers are thinking of casting Vijay Sethupathi as Vibhishan. A media company wrote an article saying that Vikrant Massey was considered for another key role and now Raghav Juyal is being replaced by him. Vikrant Massey responded to it. He said that he was never a part of this project. He appealed to the organization to stop such false propaganda. Best wishes to all those who are acting in 'Ramayana'. It is noteworthy that Vikrant was removed shortly after posting this post.
- 'Retirement' was misunderstood: Vikrant Massey
Vikrant, who won the National Award for Best Actor with '12th Fail', entertained the audience with 'Ankhon Ki Gustakhian' last year. His new movies 'O Romeo' and 'Musafir Cafe' (direct OTT release on Netflix) are getting ready for release. Ranbir Kapoor is playing the role of Rama in Nitesh Tiwari's 'Ramayana'. Sai Pallavi as Sita, Yash as Ravana and Sunny Dev as Hanuman. Rakulpreet Singh, Laura Dutta and others are being promoted in this film. The first part of this movie will be released on Diwali this year and the second part on Diwali 2027.
► Read latest Movies Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :