Amit Shah: డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ.. ‘నక్సలిజం’పై అమిత్ షా కీలక భేటీ

- ABC MEDIUM
- ABC LARGE
- ABC EXTRA LARGE

ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది మార్చి 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని తుడిచిపెడతామని కేంద్రం ప్రకటిస్తూ వస్తోంది. ఈ డెడ్‌లైన్ సమీపిస్తున్న వేళ.. ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పుర్‌లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలను సమీక్షించారు. వామపక్ష తీవ్రవాదంపై పోరాటంలో భాగంగా చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
‘‘భద్రతా వ్యూహాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, మావోయిస్టుల ఆర్థిక నెట్‌వర్క్‌లను దెబ్బతీయడం, లొంగుబాటు పాలసీల వంటివి నక్సలిజంపై పోరాటంలో సత్ఫలితాలు ఇచ్చాయి’’ అని అమిత్ షా ( Amit Shah) తెలిపారు. నిర్దేశించుకున్న గడువులోపు నక్సలిజాన్ని నిర్మూలిస్తామని పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, ఝార్ఖండ్ రాష్ట్రాల అధికారులు, కేంద్ర సంస్థలు, భద్రతాబలగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మావోయిస్టులపై కేంద్రం కొన్నేళ్లుగా ఉక్కుపాదం మోపుతోంది. నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలు తీవ్రతరం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది జనవరి నుంచి ఛత్తీస్‌గఢ్‌లో ఆయా ఎన్‌కౌంటర్‌లలో నంబాల కేశవరావు వంటి అగ్ర నేతలు సహా 500 మందికిపైగా మావోయిస్టులు హతమయ్యారు. అదే వ్యవధిలో రాష్ట్రంలో దాదాపు 1,900 మంది నక్సలైట్లు అరెస్టయ్యారు. 2,500 మందికి పైగా లొంగిపోయారు.
► Read latest India Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- సామాన్యుల కోసమే ‘రిఫార్మ్ ఎక్స్‌ప్రెస్’ - ప్రధాని మోదీ గడిచిన దశాబ్ద కాలంగా రక్షణ రంగంలో తీసుకువస్తున్న సంస్కరణల ప్రయోజనాలు ఆపరేషన్ సిందూర్ సమయంలో స్పష్టంగా కనిపించాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
- తారిఖ్ ప్రమాణ స్వీకారానికి.. భారత్ తరఫున ఓం బిర్లా బంగ్లాదేశ్ నూతన ప్రధానిగా తారిఖ్ రెహమాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి భారత్ తరఫున లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరుకానున్నారు.
- రైతులకు ద్రోహం చేస్తున్నట్లే! - ట్రేడ్ డీల్‌పై ప్రధానికి రాహుల్ ప్రశ్నలు అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరుపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
- జమ్మూ కేంద్రంగా ‘డిజిటల్ హవాలా’.. 8వేల నకిలీ ఖాతాలు గుర్తింపు జమ్మూ కశ్మీర్ కేంద్రంగా సైబర్ నేరగాళ్లు నిర్వహిస్తోన్న ‘డిజిటల్ హవాలా’ వ్యవస్థను జాతీయ దర్యాప్తు సంస్థ చేధించింది.
- పేలుళ్ల కోసం ‘అన్సార్ ఇంటీరియం’: డాక్టర్ టెర్రర్‌లో మరో కోణం..! దిల్లీ ఉగ్రపేలుడు కేసులో తవ్వేకొద్దీ కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రడాక్టర్లు అందరూ కలిసి ఏకంగా ‘అన్సార్ ఇంటీరియం’ పేరిట కొత్త టెర్రరిస్టు సంస్థనే ఏర్పాటు చేసినట్లు గుర్తించారు.
- చదివింది బీఏ..చేసేవి శస్త్ర చికిత్సలు..! సర్జన్‌గా నటిస్తూ అనధికార క్లినిక్ నడుపుతున్న ఓ నకిలీ వైద్యుడిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
- సుదీర్ఘ న్యాయ పోరాటం చేయలేక.. నేరం మీదేసుకొన్నాడు: నిఖిల్ గుప్తా కుటుంబీకులు న్యాయపోరాటంలో నిఖిల్ గుప్తా అలసిపోయాడని అతడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. అందుకే అతడు ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు కుట్రపన్నినట్లు అంగీకరిస్తూ నేరాన్ని మీదేసుకొన్నట్లు అతడి కుటుంబీకులు ఓ ఆంగ్ల మీడియా సంస్థకు వెల్లడించారు.
- గవర్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు..డీఎంకే నేతకు మూడేళ్ల జైలు తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన డీఎంకే నేత శివాజీ కృష్ణమూర్తికి మూడేళ్ల జైలు శిక్ష పడింది.
- ప్యాసింజర్ రైలు బోగీలో మంటలు.. తప్పిన ప్రమాదం పశ్చిమబెంగాల్‌లోని పూర్వ బర్ధమాన్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున పెను ప్రమాదం తప్పింది.
- తారిఖ్ రెహమాన్ ప్రమాణం.. ప్రధాని మోదీకి బంగ్లాదేశ్ ఆహ్వానం! బంగ్లాదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన బీఎన్‌పీ ఛైర్మన్ తారిఖ్ రెహమాన్ (Tarique Rahman) దేశ ప్రధానికి ప్రమాణం చేసేందుకు సిద్ధమయ్యారు. ఫిబ్రవరి 17న జరగనున్న ఈ కార్యక్రమానికి హాజరుకావాలని భారత ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
- చమురు కొనుగోళ్లు.. రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవు: జైశంకర్ S Jaishankar: రష్యా చమురు కొనుగోళ్లును భారత్ నిలిపివేసిందంటూ అమెరికా ప్రకటించిన నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇంధన కొనుగోళ్ల విషయంలో రాజకీయ ఒత్తిళ్లు పనిచేయవని భారత విదేశాంగ మంత్రి జై శంకర్ పేర్కొన్నారు.
- ఈశాన్య భారతంలో చరిత్రాత్మక ఘట్టం దేశ రక్షణ వ్యూహంతో పాటు బహుళ ప్రయోజనాలు ఇమిడి ఉన్న ఒక చరిత్రాత్మక ఘట్టం శనివారం ఆవిష్కృతమైంది.
- ఇక జనరల్ బోగీల్లోనూ నిరంతరం శుభ్రత రైల్వే శాఖలో కొత్త సంస్కరణల్లో భాగంగా ఇకమీదట రిజర్వ్ బోగీలతోపాటు జనరల్ బోగీల్లోనూ ప్రతి గంటకోసారి శుభ్రత కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
- రూపాయి డాక్టర్‌శంకరం రూపాయి ఇస్తే చిన్నపిల్లలు కూడా తీసుకోని ఈ రోజుల్లో.. ఒడిశాకు చెందిన డాక్టర్ శంకర్ రామచందాని కేవలం ఒక్క రూపాయి ఫీజుతో పేదలకు ఆరోగ్య పరీక్షలతోపాటు వైద్యసేవలు అందిస్తున్నారు.
- పదినెలల ఈ చిన్నారి.. నలుగురికి జీవనదాత కేరళకు చెందిన ఈ చిన్నారి చిరుప్రాయంలోనే నలుగురికి జీవనదాతగా మారింది.
- రాహుల్‌కు ఆర్థికవ్యవస్థపై అవగాహన లేదు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీకి భారత ఆర్థికవ్యవస్థపై అవగాహన లేదని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఎద్దేవా చేశారు.
- ‘ఎన్సీపీ’ల విలీనం లేనట్లే వచ్చే రాజ్యసభ ఎన్నికల్లో ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్ పోటీచేసే యోచనలో ఉన్నట్లు శివసేన(యూబీటీ) నేత సంజయ్ రౌత్ వెల్లడించారు.
- నగరాలకు అభివృద్ధి కవచం నగరాలు, పట్టణాల్లో సదుపాయాల అభివృద్ధికి కేంద్రం ప్రకటించిన కొత్త పథకం కింద చేపట్టే ప్రాజెక్టుల వ్యయంలో కనీసం 50% మొత్తాన్ని మార్కెట్ నుంచి సేకరించాల్సి ఉంటుంది.
- మేడతో పోటీగా ఎదిగిన బెండ సాధారణంగా బెండ మొక్క నాలుగైదు అడుగుల ఎత్తు ఎదుగుతుంది. పశ్చిమబెంగాల్‌లో బీర్‌భూం జిల్లా బోల్‌పుర్‌లోని మహమ్మద్ జమీరుల్ హక్ అనే న్యాయవాది ఇంటి ఆవరణలో అనూహ్యంగా పెరిగింది.
- ఉద్యోగి అంటే కట్టుబానిస కాదు ఉద్యోగ నియామక ఒప్పందంలో ఏవైనా షరతులు ఉండి అడ్డుపడితే మినహా ఉద్యోగి రాజీనామా లేఖను యాజమాన్యం ఆమోదించాల్సిందేననీ కేరళ హైకోర్టు స్పష్టం చేసింది.