ENG vs NEP: T20 WC: పోరాడి ఓడిన నేపాల్‌.. చివరి బంతికి గట్టెక్కిన ఇంగ్లాండ్‌

Eenadu icon
By Sports News Team Updated : 08 Feb 2026 18:58 IST Ee Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ముంబయి: టీ20 ప్రపంచకప్‌లో పసికూన నేపాల్‌.. సంచలన విజయాన్ని త్రుటిలో చేజార్చుకుంది. ఆదివారం జరిగిన ఉత్కంఠభరిత గ్రూప్‌ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ చేతిలో 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్‌.. 20 ఓవర్లలో 180/6 పరుగులే చేయగలిగింది. ఆ జట్టులో దీపేంద్ర సింగ్‌ (44), రోహిత్‌ (39), లోకేశ్‌ బామ్‌ (39*), కుశాల్‌ (29) రాణించారు. ఆసిఫ్‌(7), ఆరిఫ్‌(10) గుల్సాన్‌(1), కరణ్‌ కేసీ(1*) పరుగులు చేశారు. మొదటి నుంచి మ్యాచ్‌ హోరాహోరీగా సాగింది. మూడో వికెట్‌కు దీపేంద్రసింగ్‌, రోహిత్‌ కలిసి 82 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి బంతికి ఆరు పరుగులు చేయాల్సిన పరిస్థితిలో నేపాల్‌ బ్యాటర్‌ ఒక పరుగే తీయగలిగాడు. దీంతో ఓటమి తప్పలేదు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో లియామ్‌ 2, జోఫ్రా, విల్‌ జాక్స్‌, సామ్‌ కరన్‌, ల్యూక్‌ ఒక్కో వికెట్‌ తీశారు. 

అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌ నిర్ణీత 20 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. జాకబ్‌(55), బ్రూక్‌(53) అర్ధశతకాలు చేశారు. విల్‌ జాక్స్‌(39*), బట్లర్‌(29) ఫర్వాలేదనిపించారు. ఫిలిప్‌ సాల్ట్‌(1), బాంటన్‌(2), సామ్‌ కరన్‌(2) విఫలమయ్యారు. నేపాల్‌ బౌలర్లలో దీపేంద్ర సింగ్‌, నందన్‌ యాదవ్‌ రెండేసి వికెట్లు.. షేర్‌ మల్ల, సందీప్‌ చెరో వికెట్‌ తీశారు.

► Read latest Sports Newsand Telugu News► Follow us on Facebook, Twitter, Instagram& Google News. Tags :Published : 08 Feb 2026 18:42 IST

గమనిక:ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

  • పది పరీక్షలకు వైభవ్‌ దూరం భారత అండర్‌-19 ప్రపంచకప్‌ స్టార్‌.. రాజస్థాన్‌ రాయల్స్‌ యువ బ్యాటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలకు దూరంగా ఉండనున్నాడు.
  • కోపం వదిలెయ్‌ సోదరా! పాకిస్థాన్‌తో ఆదివారం మ్యాచ్‌ అనంతరం భారత స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ చాలా కోపంగా కనిపించడం చర్చనీయాంశమైన సంగతి తెలిందే.
  • అక్కడ మెరుపుల్లేవ్‌ టీ20 అనగానే గుర్తొచ్చేది సిక్సర్లు, ఫోర్లే! ఎంత బాదితే అభిమానులకు అంత ఆనందం. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో చాలా మ్యాచ్‌ల్లో బ్యాటర్లు అదరగొడుతున్నారు.
  • కంగారూలు మళ్లీ పడ్డారు లంకేయులు అదరహో.. కంగారూలకు మళ్లీ షాక్‌! శ్రీలంక వరుసగా మూడో విజయంతో టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌ 8కు దూసుకెళ్లింది.
  • పెళ్లి పీటలెక్కనున్న ఇషాన్‌! భారత స్టార్‌ ఆటగాడు ఇషాన్‌ కిషన్‌ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నాడా? అంటే అవుననే అంటున్నాడు అతని తాత రామ్‌ అనుగ్రహ పాండే. మోడల్‌ అదితి హుండియాతో ఇషాన్‌ వివాహం జరగొచ్చని పాండే సూత్రప్రాయంగా చెప్పాడు.
  • అజ్మతుల్లా ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చిన్న జట్లలోకెల్లా బలమైన జట్టే అయినా, అదృష్టం కలిసిరాక తొలి రెండు మ్యాచ్‌ల్లో బోణీ కొట్టలేకపోయిన అఫ్గానిస్థాన్‌.. టీ20 ప్రపంచకప్‌లో తొలి విజయాన్ని సాధించింది.
  • ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌ సూపర్‌-8కు అర్హత సాధించింది. సోమవారం గ్రూప్‌-సి పోరులో ఆ జట్టు ఇటలీపై 24 పరుగుల తేడాతో గెలిచింది.
  • అతడో అసమర్థుడు టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ నఖ్వి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. పాక్‌ మంత్రి కూడా అయిన అతడు.. తన ఇష్టానుసారంగా బోర్డును నడిపించాడు.
  • పాక్‌తో మ్యాచ్‌లో కాస్త ఎక్కువ ఒత్తిడి: అక్షర్‌ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో మ్యాచ్‌ అంటే సహజంగానే ఒత్తిడి ఉంటుందని భారత ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అన్నాడు. అయితే మైదానంలోకి దిగాక తమ దృష్టంతా ఆటపైనే ఉంటుందని అతను చెప్పాడు.
  • బాబర్, షాహీన్‌లపై వేటు? టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్‌ పరాజయ ప్రభావం.. సీనియర్‌ ఆటగాళ్లు బాబర్‌ ఆజాం, షాహీన్‌ అఫ్రిదిలపై పడేలా ఉంది.
  • సంక్షిప్త వార్తలు (4) ఆస్ట్రేలియాకు షాకిచ్చిన జింబాబ్వే టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి సిద్ధమైంది. ఆ జట్టు.. మంగళవారం గ్రూప్‌-బి పోరులో ఐర్లాండ్‌ను ఢీకొంటుంది.
  • వరల్డ్‌ కప్‌ తర్వాత.. ఆ మోడల్‌తో మా మనవడి పెళ్లి: ఇషాన్‌ తాతయ్య ఇషాన్ కిషన్‌ పెళ్లిపై ఓ స్పష్టత వచ్చేసింది. ఎప్పుడు జరగబోతుందో కూడా ఇషాన్‌ తాతయ్య అనురాగ్‌ పాండే వెల్లడించారు. 
  • ఇషాన్‌ అద్భుతం.. రోహిత్‌ మాకు ఏం చెప్పాడంటే?: సంజనతో బుమ్రా చిట్‌చాట్‌ పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో జస్‌ప్రీత్‌ బుమ్రా అద్భుతమైన బౌలింగ్‌ ప్రదర్శన చేశాడు. మ్యాచ్‌ తర్వాత తన భార్య, క్రికెట్ వ్యాఖ్యాత సంజనా గణేశన్‌తో చిట్‌చాట్‌లో బుమ్రా మాట్లాడాడు.